EPISODE · Jul 23, 2019 · 21 MIN
"కొండఫలం " . రచయిత్రి శ్రీమతి వాడ్రేవు వీరలక్ష్మి దేవి.
from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy
💐🙏కధాభిమానులకు నమస్కారం. ఈ వారం మనం వినబోయే కధ "కొండఫలం " . రచయిత్రి శ్రీమతి వాడ్రేవు వీరలక్ష్మి దేవి. ఆలోచనతో పాటు అనుభూతి ప్రధానంగా రచనలు చేసే శ్రీమతి వీరలక్ష్మి దేవి "సాత్విక స్త్రీ వాద రచయిత్రి " . సమస్య మూలాలలోకి వెళ్లి గుర్తించి విశ్లేషించడంతో పాటు ఆచరణీయ పరిష్కారంకూడా సూచించడం ఆమె కథల్లో , రచనల్లో మనం చూడవచ్చు. కిటికీ బయటి వెన్నెల , కొండఫలం కథా సంకలనాలు , ఒక కవితా సంపుటి , వ్యాససంపుటి ప్రచురించారు. అనుభూతి వాది.వీరలక్ష్మి దేవిగారు ఆమె పుట్టి పెరిగిన తూర్పు గోదావరిజిల్లా ఏజెన్సీ ప్రాంతపు గిరిజన , గిరిననేతర అమాయక ప్రజల భూ యాజమాన్య సమస్యను అంశంగా తీసుకుని , విద్యావంతులు కాకపోవడం వల్ల ఏవిధంగా దగాకి , దోపిడీకి గురిఅవుతున్నారో , వారి చేతుల్లో వారే ఏవిధంగా మోసపు వలలో పడేలాగా చదువుకున్న హృదయం లేని భూతాలు వారిని తప్పుదోవ పట్టిస్తున్నాయో బట్టబయలు చేసిన కథ కొండఫలం.కథలో స్త్రీలు మోసాన్ని భరిస్తూ జీవించాల్సిన విషాద విషయాల్ని , మనసు బరువేక్కేలాగా చెప్పారు. ఉపాధ్యాయ వృత్తిలో గడిపిన రచయిత్రి , నిరక్షరాస్యత నిర్మూలన ఆవశ్యకత గురించి పాఠకుల మనసుల్లో ఆలోచనా బీజం నాటే విధంగా కథను నడుపుకొచ్చి ముగించారు. వినండి...."కొండఫలం "కథ. 💐🙏మీ కొప్పర్తి రాంబాబు , ఇండియన్ బాంక్ , విశాఖసాగరతీరం.
Embed this episode
NOW PLAYING
"కొండఫలం " . రచయిత్రి శ్రీమతి వాడ్రేవు వీరలక్ష్మి దేవి.
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.