EPISODE · May 25, 2020 · 21 MIN
కవి అఫ్సర్ కథ "ముస్తఫామరణం "
from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy
💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం.💐💐🙏కాలాలు, ఋతువుల్ని బట్టి నిర్ణయం జరిగి , వాతావరణం లోని మార్పులకి అనుగుణంగా....వర్షాకాలం, శీతాకాలం , వేసవికాలం అని పిలుచుకుంటున్నట్టు....కొత్తగా కరోనా కాలం ...ఒక ఋతువు ఎంత కాలం ఉంటుందో అంతకాలమూ ఉండేలా ఉన్నది. గ్రీష్మతాపం ఎక్కువ అయ్యింది. అందరూ ఇళ్లకు పరిమితం అయి క్షేమంగా ఉండాలి అని కోరుకుంటున్నాను.తెలుగు సాహిత్యంలో ...ముఖ్యంగా కథా సాహిత్యంలో సమాజంలోని అన్ని మతాల, కులాల ప్రజల జీవితాల్ని స్పృశిస్తూ అనేక కథలు వచ్చాయి. స్త్రీవాద సాహిత్యం ,దళిత కథలు , ముస్లిం కథలు.... ఇలా వర్గీకరణ చేసి చెప్పచ్చు. కానీ ఈ వర్గీకరణలు కేవలం కథలలో చిత్రించిన జీవన నేపధ్యాలకే కానీ....అభిప్రాయ భేదాలు....వేర్పాటులు కాదు. *ఈ వారం మనం వినబోయే కథ "ముస్తఫామరణం"రచయిత కవి అఫ్సర్* ఈ కథలో కవి అఫ్సర్ ఆధ్యాత్మికత గురించి మంచి విశ్లేషణ చేశారు. జీవిత యుద్ధం చెయ్యలేని వాళ్ళకి ఆధ్యాత్మికత ఒక మారు గుమ్మం (Outlet ) అవుతుంది అనీ, అందులోని మార్మికత ఒక డొల్ల అని చెప్తుంది ఈ కథ (2012).కుటుంబ బరువు బాధ్యత వహించవలసిన కుటుంబ పెద్ద భక్తిలో మునిగి , వేదాంత ధోరణిలో పడిపోతే ఆ కుటుంబానికి ఎంత కష్టం. దేముడి పట్ల నమ్మకం , మతం పట్ల విశ్వాసం తప్పనిసరిగా అవసరం అని చెపుతూనే....అవే జీవితం అయితే తన మీద ఆధారపడి న మిగతా కుటుంబం మాట ఏమిటి? అని ప్రశ్నిస్తాడు రచయిత. తీవ్రమైన భక్తి మనిషికి మరణానికి అతీతమైన దైవత్వాన్ని , శాశ్వతత్వాన్ని, సిధింప చేస్తుందా అంటే కాదు...లేదు అని స్పష్టం చేస్తుంది ఈ కథ. కేవలం ముస్లిం మతానికే కాదు ఈ ఆలోచనా సూత్రం అన్ని మతాలకు సమంగా వర్తిస్తుంది. వినండి కవి అఫ్సర్ కథ "ముస్తఫామరణం "(రచయిత అమెరికాలోని ఫిలడేల్ఫీయా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ వారి వాట్సాప్ నెంబర్ +1 (512) 743-4593 ) 💐💐🙏మీ కొప్పర్తి రాంబాబు Retd Asst General Manager Indian Bank Vijayawada. Phone 96770 15158. Mail [email protected]
Embed this episode
NOW PLAYING
కవి అఫ్సర్ కథ "ముస్తఫామరణం "
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.