EPISODE · Jun 28, 2020 · 22 MIN
మా బావమరిది పెళ్లి ...రచయిత శ్రీ మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు.
from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy
💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం.💐💐🙏ఈ వారం మనం వినబోయే కథ... *మా బావమరిది పెళ్లి ...రచయిత శ్రీ మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు.* ఏ రచయిత అయినా తన రచనల ద్వారా శాశ్వతత్వం పొందుతారు అనేది నిర్వివాదాంశం. అయితే కొందరు రచయితలు వారి రచనల్లో పాత్రలకు సజీవ రూపం కల్పించి ఆ పాత్రలకు కూడా శాశ్వతత్వం చేకూరుస్తారు. అటువంటి రచన శ్రీ మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి బారిష్టరు పార్వతీశం. తెలుగు సాహిత్యంతో అంతో ఇంతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికీ సుపరిచిత మైన వ్యక్తి బారిష్టరు పార్వతీశం. నేను వ్యక్తి అనే పేర్కొంటున్నాను.పాత్ర అనటం లేదు. ఎందుచేత అంటే బారిష్టరు పార్వతీశం అందరివాడు....ముళ్ళపూడి వారి బుడుగు లాగా ! బుడుగుది గడుసుదనం. పార్వతీశంది అమాయకత్వం. అన్నట్టు రేపు (28 జూన్) బుడుగు వాళ్ళ నాన్న (రవణ గారి) పుట్టినరోజు. సరే తిరిగి కథలోకి వస్తే....మా బావమరిది పెళ్లి... ఒక అరవై ఏళ్ల క్రితం తెలుగు కుటుంబాల్లో సంప్రదాయ పద్దతిలో ఐదురోజుల పెళ్లిళ్లు ఎలా జరిగేవో హాస్య భరితంగా రాసిన కథ. పెళ్లికి తరలి వెళ్లే హడావిడి......చుట్టాలు సందడి...మేజువాణీ వేడుకలు...అన్నీ ముగిశాక అలసి కొంపకు చేరుకోడం...తనదైన శైలిలో రాశారు మొక్కపాటి వారు. మొక్కపాటి వారిది సహజమైన హాస్యం. సంఘటనా ప్రధానంగా రచనలో హాస్యం తొణికిసలాడుతుంది...ఏడాది రెండేళ్ల క్రితం తెలుగులో అయిదు రోజుల పెళ్లి మీద ఒకటో రెండో సినిమాలు కూడా వచ్చిన గుర్తు. రెండేళ్లు గడిచేసరికి కాలం ఎలా మారిపోయిందో చూడండి పట్టుమని పాతికమంది కూడా లేకుండా పెళ్లిళ్లు చేసుకోవాల్సిన కరోనా కాలం వచ్చింది. గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్ అని నిట్టూరుస్తూ..... అయిదు రోజుల పెళ్లి అయిదు నిముషాల్లో ముగించాల్సి వస్తోంది. సరదాగా....వినండి ఈ వారం కథ..."మా బావమరిది పెళ్ళి " మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి రచన. 💐💐🙏మీ కొప్పర్తి రాంబాబు , Retd AGM Indian Bank Vijayawada PH 96770 15158 Mail [email protected]
Embed this episode
NOW PLAYING
మా బావమరిది పెళ్లి ...రచయిత శ్రీ మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు.
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.