EPISODE · Aug 2, 2019 · 20 MIN
*మానాన్న -నేను-మా అబ్బాయి* రచయిత శ్రీ కల్లూరి భాస్కరం
from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy
కథాభిమానులకి నమస్కారం.🙏ఈ వారం మనం వినబోయే కథ.....*మానాన్న -నేను-మా అబ్బాయి* రచయిత శ్రీ కల్లూరి భాస్కరం.రచయిత శ్రీ భాస్కరం వృత్తిరీత్యా జర్నలిస్టు. మంచి అనువాదకులు.ప్రధానమంత్రి అయిన ఏకైక తెలుగు వ్యక్తి , మేధావి , బహుభాషా కోవిదుడు , పండితుడు రాజనీతిజ్ఞుడు కీ. శే. పీ. వి. నరసింహారావు గారి ఆత్మకథను తెలుగులోకి అనువదించారు.ఇక కథ విషయానికి వస్తే....జీన్స్ అనండి.... జీవ లక్షణం అనండి.... ఒక కుటుంబంలోని వ్యక్తులకి వంశపారంపర్యంగా ....ఒకరి పోలికలు వేరొకరికి ఉండడం సహజం.రూపంలో...స్వభావం లో....అలవాట్లలో...ఇలా ! కానీ ఆలోచనలు.....అభిప్రాయాలు కొంతకాలం స్వతంత్రంగా సాగినా.... సాంతంగా సొంతంగా కాకుండా "ముందు తరపు " భావావేశాలు, అనుభూతులూ ....కొనసాగింపుగా వస్తుంటే దాన్ని నిర్వచించడానికి దొరికే ఏకైక పదం "వారసత్వం ". ఆ వారసత్వ సంపద ఆర్థికపరమైన ఆస్తిపాస్తులకు సంబంధించినదే కానక్కరలేదు. సాంస్కృతిక వారసత్వం కూడా కావచ్చు.వాస్తవానికి నా దృష్టిలో మనం మన ముందు తరాలనించి స్వీకరించి తరువాతి తరాలకు అందించవలసిన మూలధనం అదే ! అటువంటి సాహితీ వారసత్వం...ఆలోచనా భావధార ....పై తరం నించి కింది తరానికి లేదా ముందు తరానికి అందాలి , అందించాలి అని తాపత్రయ పడే ఒక బుధ్ధి జీవి పడ్డ తాపత్రయం , మనసులో పడిన మథన ఈ వారం కధ "మా నాన్న-నేను-మా అబ్బాయి ".ఒక వ్యక్తి మినీ ఆత్మకథలాగా అనిపించే ఈ కథలో కధకుడి అభిప్రాయాలు,ఆలోచనల్లో నన్ను నేను చూసుకున్నాను.కథ ముగించాక మన తరువాతి తరం , మన పిల్లలు మన ఆలోచనల్ని అంది పుచ్చుకుని , వాటిని కాలానుగుణంగా మార్చుకుని , మెరుగైన సమాజ నిర్మాణంకోసం తాపత్రయ పడతారు అనే నమ్మకం కలిగింది.వినండి "మా నాన్న-నేను-మా అబ్బాయి" కథ.🙏కొప్పర్తి రాంబాబు , ఇండియన్ బ్యాంక్ , విశాఖసాగరతీరం.
Embed this episode
NOW PLAYING
*మానాన్న -నేను-మా అబ్బాయి* రచయిత శ్రీ కల్లూరి భాస్కరం
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.