"మధుపర్కాలు" రచయిత శ్రీ రావూరి సత్యనారాయణ రావు. episode artwork

EPISODE · Nov 23, 2019 · 24 MIN

"మధుపర్కాలు" రచయిత శ్రీ రావూరి సత్యనారాయణ రావు.

from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy

*గోదావరి తీరం నరసాపురం నుండి కథాభిమానులకు నమస్కారం* 💐🙏ఈ వారం మనం వినబోయే కథ "మధుపర్కాలు" రచయిత శ్రీ రావూరి సత్యనారాయణ రావు.ఈ కథ ఒక చేనేత కార్మిక జంట కథ. పడుగు , పేకల్లా కలిసిపోయిన వృద్ధ జంట కథ. వారి జీవితాశయం పదుగురికి మంచి చేయడం. అది వారు ప్రధానంగా వారి కుల వృత్తి ద్వారానే ఆచరిస్తూ వచ్చారు. ఈ కథలో మొదలు నుండి తుది దాకా "మంచి " చుట్టూ తిరిగిన కథ. పాత్రలు , స్వరూప స్వభావాలు , చేసే పనులు , ఆలోచనలు కథలో ప్రతి పాత్రా , ప్రతి సంఘటనా అన్నీ మంచి చుట్టూ పరిభ్రమించే విషయాలే ! కథ ఎప్పుడో రాసిన కథ అయినా నేత కార్మికుల స్థితి గతుల్లో అప్పుడూ, ఇప్పుడూ మార్పు లేదు అనేది సుస్పష్టం. త్యాగానికి అండగా నిలబడిన ఒక యువ జంట వృద్ధ జంటను ఆదుకోవడం తో కథ ముగుస్తుంది.రచయిత కథను కథ లాగా కాకుండా తన శైలి , వాక్య , పద నిర్మాణంతో ఒక దృశ్య రూపకంగా మలిచారు.రచయిత సత్యనారాయణ రావు గారు సినిమా రంగానికి , పత్రికా రంగానికి పనిచేశారు. కథలోని శైలి దృశ్య రూపకత సంతరించుకోడానికి బహుశా రచయిత ఆయారంగాల్లో పనిచేసిన అనుభవం ఈ కథకి ఆ లక్షణం కలిగేలా చేసి ఉండచ్చు.ఏది ఏమైనా మంచిని మనుషుల మనసుల్లో లోతుగా నాటే ఇటువంటి కథలు అరుదు అని చెప్పాలి. అటువంటి అరుదైన మంచి కథల్లో "మధు పర్కాలు "గొప్ప కథ. వినండి....శ్రీ రావూరి సత్యనారాయణ రావు గారి కథ. 💐💐🙏మీ కొప్పర్తి రాంబాబు , Retd Asst General Manager Indian Bank నరసాపురం నుండి.....

Episode metadata supplied by the publisher feed · Published Nov 23, 2019

Embed this episode

NOW PLAYING

"మధుపర్కాలు" రచయిత శ్రీ రావూరి సత్యనారాయణ రావు.

0:00 24:27

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of "కొప్పర్తి కథావాహిని "?

This episode is 24 minutes long.

When was this "కొప్పర్తి కథావాహిని " episode published?

This episode was published on November 23, 2019.

Can I download this "కొప్పర్తి కథావాహిని " episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!