EPISODE · Jul 24, 2019 · 22 MIN
"మంచు పల్లకి " రచన శ్రీపతి గారు.
from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy
💐💐కధాభిమానులకు నమస్కారం. ఈ రోజు మనం వినబోయే కథ "మంచు పల్లకి " రచన శ్రీపతి గారు.శ్రీపతిగారి పరిచయ వాక్యాలు కథ తో కలిపి వినిపిస్తున్నాను కనుక....కథ గురించి నాలుగు మాటలు.ఈ కథ తల్లికోసం పసి హృదయం పడిన తపన.తల్లిప్రేమకు ఈ ప్రపంచంలో ఏదీ సాటి రాదని , తల్లి ప్రేమను పొందడం కన్నా జీవితానికి అపురూపమైన అదృష్టం ఇంకేది ఉండదని చెప్పిన కథ.రచయిత కథకు "మంచు పల్లకి " అని ప్రతీకాత్మక పేరు పెట్టారు.వాస్తవానికి ఆఖరి యాత్రకు వెళ్లే వెదురు కర్రల వాహిక ....మంచు పల్లకీగా చెప్పారు.రచయిత కథను కేవలం ఒకే విషయం మీద ....బుల్లెబ్బాయి తల్లి ఆరోగ్యం , అంతిమ ఘడియలు సూచిస్తూ చెప్పినా...అందులో ఎన్నో పద చిత్రాలు చిత్రించారు.ఒక గ్రామంలో ఒకటి రెండు గంటల్లో జరిగిన విషాదాన్ని , కథాస్థలం , వాతావరణం , మనుషుల స్వరూప స్వభావాలు ...ముఖ్యంగా తల్లి లేని జీవితంలో ఉన్న దుఃఖం , లోటు , ఆవేదన , ఆాక్రందన, ఇలా వివరిస్తూ ....ఒక్కరాత్రి అయినా ఆ పసివాడు తల్లి తిరిగి వస్తుంది అని ఆశతో నిద్రిస్తాడు అని బస్ డ్రైవర్ చేత అబద్ధం చెప్పిస్తాడు రచయిత.ఆ వెంటనే ...ఈ ప్రపంచంలో ఎవరూ నీకు సత్యం చెప్పరు, నువ్వు సత్యానికి దూరమైపోతావు, నీ పట్ల జాలితో చెప్పరు అని సమర్ధిస్తాడు. వర్ణనలు మూలంగా కథ నిడివి ఎక్కువ అనిపించినా , ఆలోచనాత్మకంగా , కవితాత్మకంగా సాగే వాక్యాలు మనసుని అలరిస్తాయి. 💐💐ఆమ్మకు జే జే చెప్తూ.....మన అందరి అమ్మలకూ నివాళిగా ఈ కథ సమర్పిస్తున్నాను. 💐💐వినండి...."మంచు పల్లకి " కథ......🙏మీ కొప్పర్తి రాంబాబు , ఇండియన్ బాంక్ ,విశాఖ సాగరతీరం.
Embed this episode
NOW PLAYING
"మంచు పల్లకి " రచన శ్రీపతి గారు.
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.