EPISODE · Jul 31, 2019 · 11 MIN
"మసి గుడ్డ ". రచయిత్రి కుప్పిలి పద్మ
from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy
కథాభిమానులకి నమస్కారం.ఈ వారం మనం వినబోయే కథ "మసి గుడ్డ ". రచయిత్రి కుప్పిలి పద్మ. పద్మగారు వారి రచనల ద్వారానే కాదు , స్వభావ రీత్యా కూడా అనుభూతి వాది.అక్టోబర్ 17 విశాఖ జిల్లాలో జన్మించారు. 1989 లో తొలి కథ అచ్చయింది. ఆరు కథా సంపుటాలు , అయిదు నవలలు ప్రచురించారు.వివిధ పత్రికల లో రాసిన కాలమ్స్ తో రెండు సంపుటాలు ప్రచురించారు.హైద్రాబాద్ లో నివాసం.ప్రతియేటా మార్చ్ 8 వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటాము. మహిళలు వివిధ రంగాల్లో ముందంజ వేస్తున్నారు అని ప్రశంసలు కురిపిస్తూ ప్రసంగాలు వినిపిస్తాము. కానీ అమ్మతనానికి ప్రతీక అయిన స్త్రీ స్థానాన్ని పదిలంగా నిలబెడుతున్నామా లేదా అన్న ప్రశ్న వేసుకుంటే ....నూటికి నూరు మార్కులు రావు.ఇవాళ్టి కథ "మసి గుడ్డ " విషయానికి వస్తే.....తెలుగులో అమ్మ గొప్పదనాన్ని వివిధ రకాలుగా పొగుడుతూ ఎన్నో కథలు వచ్చి ఉండచ్చు.అవి మాతృమూర్తి మెడలో మందార మాలలు వేసి ఉండచ్చు.కానీ ఈ కథలో రచయిత్రి అందుకు భిన్నంగా ఒక మసిగుడ్డ ని ప్రతీకగా చేసుకుని అమ్మ కి మనం ఇచ్చే విలువ ఏమిటి ? తెలిసి కానీ తెలియక కానీ , తెలిసీ తెలియని వయసులో కానీ అమ్మని ఎలా వాడుకుంటున్నాము ? అమ్మకి ఏ విధమైన ప్రాముఖ్యతని పిల్లలు , తండ్రి ఆపాదిస్తున్నారు అనేది కథలో విస్పష్టంగా తేల్చి చెప్పారు.అమ్మగురించి వసి వాడని బాల్యపు జ్ఞాపకాలను, చదివిన చదువుల ఫలితాలను , సాధించిన ర్యాంకులు , పతకాలను గుర్తు చేసుకొని మన మనోఫలకాల మీద పేరుకున్న మసి పొరని తొలగించి చూసుకొమ్మని హెచ్చరిస్తారు.అమ్మ జ్ఞాపకాల కర్పూర ధూపం లేదా అగరు పొగ కమ్ముకునేలా మన మనసుల్ని పరిమళ భరితం చేసి....అమ్మ ఎప్పుడూ అమ్మే ! 15 ఏళ్ళ క్రితం ఆధునిక అమ్మ , 15 గడిచేసరికి పాతకాలపు అమ్మగా మారిపోతోంది....పిల్లలకోసం తన రూప లావణ్యాలను కోల్పోతోంది అని ....వేదన చెందేలా చెప్పిన కథ "మసి గుడ్డ" వినండి....ఈ వారం కథ.💐🙏మీ కొప్పర్తి రాంబాబు , విశాఖసాగరతీరం.
Embed this episode
NOW PLAYING
"మసి గుడ్డ ". రచయిత్రి కుప్పిలి పద్మ
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.