"మురళీ వాళ్ళ అమ్మ " రచయిత్రి రంగనాయకమ్మ episode artwork

EPISODE · Jan 25, 2020 · 40 MIN

"మురళీ వాళ్ళ అమ్మ " రచయిత్రి రంగనాయకమ్మ

from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy

💐💐కృష్ణాతీరం , విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ "మురళీ వాళ్ళ అమ్మ " రచయిత్రి రంగనాయకమ్మ . తెలుగు సాహిత్యంలో రచయిత్రుల్లో అత్యుత్తమ రచయిత్రుల్లో ఒకరు రంగనాయకమ్మ.సాధారణ కథా నవలా రచయిత్రిగా ఆమె తన రచనా వ్యాసంగాన్ని ప్రారంభించి, ఆయేటికాయేడు ఎదుగుతూ...ప్రారంభంలో ఉన్న ఆలోచనల్ని , దృక్పధాన్ని మార్చుకోడానికి ఏమాత్రం సంశయించకుండా.... అంతకుముందు తన ఆలోచనలు కొంత అపరిపక్వమైనవి అనీ , మార్క్సిస్టు సిద్ధాంతం వంట బట్టించుకున్నాక....వంటింటి పరిధి దాటి ప్రతి స్త్రీ ఆలోచించాలి అనీ....స్త్రీలను వేరెవరో వచ్చి ఉద్ధరించడం కాదు....ప్రతి స్త్రీ తనకు తానే చైతన్యవంతురాలు కావాలి అని బలంగా నమ్మి...తన గత రచనలు కొన్నిటిని పాఠకులు చదవనవసరం లేదనీ....మరికొన్నిటిని తానే మార్చి తిరగరాసిన నిజాయితీ గలిగిన ఏకైక రచయిత్రి. "బలిపీఠం" స్వీట్ హోమ్ ఆవిడ గొప్పరచనలు. రామాయణ విష వృక్షం రచన ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నారు.మధ్య మార్క్సిస్టు అనే విమర్శను ఎదుర్కొన్నారు. ప్రస్తుత కథ "మురళీ వాళ్ళమ్మ " స్త్రీ పురుష సంబంధాలలో నైతికత ఎంత ముఖ్యమో చెప్తూ....స్త్రీ....భర్త ఎంత గొప్పవాడు అయినా , భార్యను కించిత్ నిర్లక్ష్యం చేస్తే , పరాయి స్త్రీతో సాన్నిహిత్యం నెరపితే...బుద్ది చెప్పడానికి....కొడుకు.... తల్లి ఎవరైనా భయపడాల్సిన పనిలేదు అని తేటతెల్లం చేసిన కథ. పాతికేళ్ళు గడిచేసరికి అబ్బ గుణాలు కొడుక్కి అబ్బితే.... తల్లి నిలబెట్టి , ప్రశ్నించి, కోడలికి చేతకాకపోతే... తనకు అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం ఉంది....అని నిరూపించిన కథ. తెలియని వయసులోనే కాదు , తెలిసిన వయసులో కూడా కొడుకుని కాలర్ పట్టుకుని అడిగి కోడలి కాపురం సరిదిద్దిన అత్తమ్మ....మురళీ వాళ్ళమ్మ. ....వినండి రంగనాయకమ్మగారి రచన. 💐💐🙏కొప్పర్తి రాంబాబు , Retd Asst General Manager Indian Bank Vijayawada. Phone 96770 15158. Mail rambabuk. indianbankwms@gmail. com.

Episode metadata supplied by the publisher feed · Published Jan 25, 2020

Embed this episode

NOW PLAYING

"మురళీ వాళ్ళ అమ్మ " రచయిత్రి రంగనాయకమ్మ

0:00 40:19

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of "కొప్పర్తి కథావాహిని "?

This episode is 40 minutes long.

When was this "కొప్పర్తి కథావాహిని " episode published?

This episode was published on January 25, 2020.

Can I download this "కొప్పర్తి కథావాహిని " episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!