"మూలాధార చక్రం " రచయిత కీర్తి శేషులు.. శ్రీ వీరపల్లె వీణావాణి episode artwork

EPISODE · Jul 6, 2020 · 25 MIN

"మూలాధార చక్రం " రచయిత కీర్తి శేషులు.. శ్రీ వీరపల్లె వీణావాణి

from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy

💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకి నమస్కారం.🙏. ఈ వారం మనం వినబోయే కథ "మూలాధార చక్రం " రచయిత కీర్తి శేషులు.. శ్రీ వీరపల్లె వీణావాణి .ఆయన ఇంటిపేరు వీరపల్లె ....వీణావాణి ఆయన కలం పేరు. అసలు పేరు ఆంజనేయులు నాయుడు. 1981 లో నేను చిత్తూరు జిల్లాలో శ్రీ వేంకటేశ్వర గ్రామీణబ్యాంక్ లో పనిచేసినప్పుడు... నాకు నాలుగు దశాబ్దాలక్రితం మంచి స్నేహితుడు. నన్ను తెలుగు సాహిత్యంలో పి.జి. చెయ్యాలి అని ప్రోత్సహించి....లింగ్విస్టిక్స్ (భాషాశాస్త్రం) బోధించి , నోట్స్ రాసిపెట్టిన నేస్తం. ఉద్యోగ రీత్యా 1994 -98 మధ్య కాలంలో నేను ఆంధ్రదేశం విడిచిపెట్టిన సమయంలో మా స్నేహం కొనసాగించ లేకపోయాను. ఆయన కావలి ,జవహర్ భారతి కళాశాలలో తెలుగు లెక్చరర్ గా పనిచేశారు. డాక్టర్ పి.కేశవరెడ్డి నవలల పై ప్రొఫెసర్ గైడెన్స్ లేకుండా శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం నుండి డాక్టరేట్ సాధించిన ప్రతిభాశాలి. నాటక రచయిత. అకాల మరణం పాలయ్యారు. చిత్తూరు జిల్లా గ్రామీణ యాసలో సరదాగా మాట్లాడేవారు. ఈ కథ ఎంచుకోడాని రచయిత నా మిత్రుడు కావడం కారణం కానే కాదు. కథలో భూమి గురించి....నేల గురించి...మట్టి గురించి....గొప్ప వాక్యాలు ఉన్నాయి. మట్టితో మనిషికి గల అనుబంధాన్ని మనసు స్పందించేలా చెప్పారు. 25 నిముషాల కథలో ప్రతి అయిదు నిముషాలకు ఒక అద్బుతమైన పంక్తి చదివేటప్పుడు మనసుకి సోకి మనల్ని కదిలిస్తుంది. ఒక కుమ్మరి మట్టి పిసికినా....ఒక రైతు నేల దున్నినా....అది వట్టి మట్టి కాదు...వట్టి నేల కాదు....మట్టికి రూపు దిద్దే ప్రయత్నం ఒకరిది... నేల నించి ప్రాణాన్ని , జీవాన్ని పైకి తీసే ప్రయత్నం ఒకరిది. మట్టి మనిషికి జీవనాధారం.పొలం పట్ల ఉండే మమకారం , నేల మీద నమ్మకం కథలో గొప్పగా చిత్రించారు రచయిత.వినండి ఈ వారం కథ "మూలాధార చక్రం ". కీ. శే. వీరపల్లె వీణావాణి రచన. 💐💐🙏మీ కొప్పర్తి రాంబాబు , Retd AGM Indian Bank Vijayawada Ph 96770 15158 Mail ID [email protected]

Episode metadata supplied by the publisher feed · Published Jul 6, 2020

Embed this episode

Ready to play

"మూలాధార చక్రం " రచయిత కీర్తి శేషులు.. శ్రీ వీరపల్లె వీణావాణి

0:00 25:54

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of "కొప్పర్తి కథావాహిని "?

This episode is 25 minutes long.

When was this "కొప్పర్తి కథావాహిని " episode published?

This episode was published on July 6, 2020.

Can I download this "కొప్పర్తి కథావాహిని " episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!