EPISODE · Oct 18, 2020 · 13 MIN
నా ఇల్లు ఎక్కడ?- రచయిత: శ్రీ ముకుంద రామారావు గారు.
from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy
💐💐సాహిత్యాభిమానులకు నమస్కారం 🙏"నా ఇల్లెక్కడ ?" కథ. రచయిత శ్రీ ముకుంద రామారావు గారు. కవి , కథకుడు , వ్యాసకర్త , అనువాదకుడు , మనసులోని భావుకత్వాన్ని మాటల్లోకి పొదగగల రచయిత శ్రీ ముకుంద రామారావుగారు.... 9 నవంబర్ 1944 న , ఖరగ్ పూర్ లో జన్మించారు. ప్రస్తుత నివాసం హైద్రాబాద్ . ఫోన్ నెంబర్ 99083 47273. మెయిల్ [email protected] కవిత్వము , కథలు , వ్యాసాలు రాసారు. అనువాదం చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం తో బాటు , అనేక ఇతర పురస్కారాలు అందుకున్నారు. సౌమ్యులు, మృదు స్వభావి , ఆలోచనా శీలి. ముకుంద రామారావు గారి ఈ కథ ఆరు నెలల క్రితం నాకు దొరికింది. చదివి భద్రంగా దాచుకున్నాను. ఆ కథ రికార్డ్ చెయ్యాలి అని మనసులో ఉన్నా ఎందువల్లో జత పడలేదు. క్రితం సెప్టెంబర్ నెల 21 ప్రపంచ అల్జీమర్స్ రోజు అని అనుకోకుండా తెలిసింది. ఆరోజు మా చెల్లెలు డాక్టర్ మణి తోలేటి ఆ సమస్యకు గురి అయిన వారికి కుటుంబ సభ్యులు సమాజము అందించవలసిన సహాయ సహకారాల గురించి హన్స్ ఇండియా లో ఒక వ్యాసం రాసింది. ఆ వ్యాసాన్ని తెలుగులోకి అనువదిస్తే బావుంటుంది అన్నది. ఆ క్షణంలో నా మనసులోకి ఈ కథ మెదిలింది. అనువాద రచనలో అందె వేసిన ముకుంద రామారావు గారి ఈ కథ అదే విషయానికి చెందినది . వ్యాసాన్ని అనువదించడం పని పక్కన పెట్టి , భద్రంగా దాచిన కథ బయటికి తీసి మరోసారి చదివాను. ఒకటి రెండు గంటల్లో సంభవించిన ఒక సంఘటనని , ఏ అలంకారాలూ , వర్ణనలు లేకుండా , ముఖాముఖి కూచుని , వినడానికి ఆసక్తి కలిగేలా చక్కటి తెలుగు భాషలో కథ రాయడం కష్టం.కానీ ఆ పని తేలిగ్గా సాధించారు ముకుందరామారావు గారు. మనలో ప్రతి ఒక్కరికి , జ్ఞాపకశక్తి ఎంత బలమైనదో , మతి మరుపు అంత బలహీనం చేసే అంశం. వయోభారం వల్ల అనుకుంటాము కానీ అది ఒక శారీరక రుగ్మత అని తెలుసుకునేలోగానే చాపకింద నీరులాగా వచ్చి చేరే సమస్య అల్జీమర్స్ . కథలో ఎక్కడా వ్యాధి పేరుకూడా చెప్పరు రచయిత.కానీ దానివల్ల ఎదురయ్యే సమస్యని కళ్ళకు కట్టి చూపిస్తారు. మన ఇంట్లో , మన మధ్య జరిగిన , జరిగేందుకు అవకాశం ఉన్న కథ అని అనడానికి వీలు లేని వాస్తవం ఈ కథ. వినండి. 🙏కొప్పర్తి రాంబాబు , విజయవాడ ఫోన్ 96770 15158.
Embed this episode
NOW PLAYING
నా ఇల్లు ఎక్కడ?- రచయిత: శ్రీ ముకుంద రామారావు గారు.
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.