EPISODE · Aug 13, 2026 · 49 MIN
నాలుగు ఇంగ్లీష్ పదాలు నేర్చుకొని వెళ్లి... ఇంగ్లీష్ నవలా రచయితగా! | Hema Macherla | మన రచయితలు | Season - 2 | Episode - 9
from TALRadio Telugu · host Touch A Life Foundation
ఇంగ్లీష్ ఏ మాత్రం రాని ఆమె... అదే భాషలో నవలలు రాసి అంతర్జాతీయ గుర్తింపు పొందారు!వరంగల్ జిల్లా ఆత్మకూరులో పుట్టి పెరిగిన హేమా మాచర్ల గారు... చిన్నప్పటి నుంచే తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతో రచన వైపు అడుగులు వేశారు. తెలుగులో కథలు రాస్తూ మొదలైన ఆమె రచనా ప్రయాణం... పెళ్లి తర్వాత లండన్‌కు వెళ్లడంతో పూర్తిగా మలుపు తిరిగింది.ఇంగ్లీష్ నేర్చుకోవాలనే పట్టుదలతో... పిల్లల పుస్తకాలు, నవలలు చదువుతూ, డిక్షనరీ సాయంతో భాషపై పట్టు సాధించారు. ఆ తర్వాత అదే ఇంగ్లీష్‌లో Breeze from the River Manjeera వంటి మొదలైన నవలలు రాసి... National Reading Hero Awardతో పాటు ఎన్నో అంతర్జాతీయ గుర్తింపులు పొందారు. ఆమె రాసిన మూడు నవలలు ఫ్రెంచ్‌లోకి అనువాదం అవ్వడమే కాకుండా... Letters in the Sand అనే రచనకు Franco-Indian Literary Award కూడా లభించింది.ఇంగ్లీష్ నేర్చుకుంటూ... రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకొని, అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన హేమ గారి ఈ ప్రయాణం వెనుక ఎన్నో ఆసక్తికరమైన అనుభవాలు ఉన్నాయి. మరి అసలు ఇంగ్లీష్ నేర్చుకోవడం నుంచి రచయితగా ఎదిగే వరకు ఆమె ప్రయాణం ఎలా సాగింది? ఈ ప్రయాణంలో ఆమెకు అండగా నిలిచిన వ్యక్తులు ఎవరు? నిజ జీవిత అనుభవాలను కథలుగా మలచడానికి ఆమెను ప్రేరేపించినది ఏమిటి? రచయితలకు చదవడం ఎందుకు ముఖ్యమని ఆమె భావిస్తున్నారు?ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను, తన రచనా ప్రయాణంలోని అనుభవాలను, కొత్త రచయితలకు అందించిన విలువైన సూచనలను ఈ వారం “మన రచయితలు” పాడ్కాస్ట్ లో స్వయంగా హేమా మాచర్ల గారు మనతో పంచుకున్నారు.She didn't know a word of English... yet she went on to write novels in that very language and achieve international acclaim!Born and raised in Atmakur, Warangal district, Hema Macherla took her first steps into writing during childhood, inspired by her mother's encouragement. Her literary journey began with writing short stories in Telugu, but it took a dramatic turn when she moved to London after her marriage.Driven by a fierce determination to learn English, she mastered the language by reading children's books and novels with the constant help of a dictionary. She then went on to pen acclaimed English novels like Breeze from the River Manjeera, winning prestigious honors including the National Reading Hero Award. Beyond her English audience, three of her novels were translated into French, and her work Letters in the Sand earned the Franco-Indian Literary Award.Behind Hema's journey from learning a new language to establishing herself as an author on the global stage lie many fascinating experiences. How did her transformation unfold from a beginner in English to an international author? Who supported her along the way? What inspired her to shape real-life experiences into stories? And why does she believe reading is essential for any writer?Hema Macherla herself shares these compelling insights, personal experiences from her writing career, and valuable advice for emerging writers in this week's episode of the "Mana Rachayithalu" podcast.Guest: Hema MacherlaHost: Renu Sree#TALRadio #HemaMacherla #ManRachayithalu #TeluguWriters #TeluguLiterature #TeluguWriter #FrancoIndianLiteraryAward #NationalReadingHero #WomenWriters #IndianWriters #TeluguLiterature #TouchALifeFoundation
Embed this episode
Ready to play
నాలుగు ఇంగ్లీష్ పదాలు నేర్చుకొని వెళ్లి... ఇంగ్లీష్ నవలా రచయితగా! | Hema Macherla | మన రచయితలు | Season - 2 | Episode - 9
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.