PODCAST · arts
TALRadio Telugu
by Touch A Life Foundation
This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope.TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio.Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond.Tune in for positivity, purpose, and the power of human stories.
-
958
వృద్ధుల హక్కులకు తోడుగా.. | Ramachandraiah | అంతరంగాలు - 5
ఒక మంచి ఆలోచన… ఎంతోమంది జీవితాల్లో మార్పు తీసుకురాగలదు!వృద్ధులకు అండగా నిలవాలి.. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలి.. సమాజానికి ఏదో ఒకటి తిరిగి ఇవ్వాలి.. అని ఎప్పుడూ ఆలోచిస్తూ.. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు… Telangana senior citizens confederation అధ్యక్షులు రామచంద్రయ్య గారు!సీనియర్ సిటిజన్ల కోసం ఆయన చేస్తున్న సేవలు ఎంతోమందికి అండగా నిలిచాయి. కరోనా సమయంలోనూ పేద కుటుంబాలకు సహాయం చేయడంతో పాటు.. ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు అందించారు.అలా సమాజానికి తన వంతు సహాయం చేయాలనే ఆలోచనతో ఆయన ప్రారంభించిన ‘జీవనాధార’ కార్యక్రమం.. పేదలకు ఉచిత మందులు, వైద్య సహాయం, విద్యకు అవసరమైన ఫీజులు, పుస్తకాలు అందించేందుకు ఉపయోగపడుతోంది. అలాగే ‘అన్నపూర్ణ ట్రస్ట్’ ద్వారా అవసరమైన వృద్ధులకు ఆహారం అందిస్తున్నారు.ఇవే కాకుండా.. తెలంగాణలోని సీనియర్ సిటిజన్ల కోసం ఆయన చేస్తున్న కార్యక్రమాలు, వారి హక్కులపై అవగాహన కల్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు.. ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను స్వయంగా ఆయనే ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు.ఒక వ్యక్తి అనుకుంటే.. తన చుట్టూ ఉన్న సమాజానికి ఎలా తోడుగా ఉండవచ్చో ఈ పాడ్కాస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు!కాబట్టి.. తప్పకుండా వినండి! మిస్ అవ్వకండి!One good thought… can bring a meaningful change to many lives!Standing by senior citizens, helping those in need, and giving something back to society… With these thoughts always in mind, Mr. Ramachandraiah, President of the Telangana Senior Citizens Confederation, has been involved in several service initiatives.His efforts for senior citizens have been a source of support for many. During the COVID-19 pandemic, he helped underprivileged families, organized free medical camps, and provided medicines to those who needed them.With the idea of doing his part for society, he started the ‘Jeevanadhara’ initiative, which supports people in need by providing free medicines, medical assistance, educational fees, and books. Through the ‘Annapurna Trust’, he also provides food to senior citizens who need support.But that’s not all…From working for the welfare of senior citizens across Telangana to creating awareness about their rights, Mr. Ramachandraiah shares many inspiring and interesting experiences in this podcast.This podcast shows how one person, with the right intention, can make a difference in the lives of people around them.So, make sure to listen and don’t miss it!Guest: Mr. P. Ramachandraiah, President of the Telangana Senior Citizens ConfederationHost: Dr. Gurajada Shobha Perindevi#TALRadio #SeniorCitizens #Antharangalu #SocialService #CommunityService #SeniorCitizenWelfare #Jeevanadhara #AnnapurnaTrust #Telangana #InspiringStories #TouchALifeFoundation
-
957
ఒక్క క్షణం ఆగి … ఎవరితో అయినా మాట్లాడండి! | Kolavennu Naga Gaytri | Suicide Prevention Month Special | Health Talk
మనసులో ఏదైనా బాధగా ఉన్నప్పుడు ఎవరితో చెప్పాలో అర్థం కావట్లేదా?ఎవరైనా తమ సమస్యలను మీతో పంచుకుంటున్నపుడు మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు?జీవితంలో ఎదురయ్యే సమస్యలు, ఒత్తిడి, నిరాశ, సంబంధాల్లో వచ్చే మార్పులు, చదువు లేదా ఉద్యోగానికి సంబంధించిన ఒత్తిళ్లు… ఇవన్నీ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతాయి. అయితే ఇలా రోజురోజుకీ మనలో నిండిపోతున్న భావాలను బయటకు చెప్పకుండా ఒంటరిగా ఉండటం అస్సలు మంచిది కాదు అంటున్నారు… ప్రముఖ సైకాలజిస్ట్ గాయత్రి గారు!మన చుట్టూ ఉన్నవారి ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పులు కనిపిస్తే వాటిని ఎలా గుర్తించాలి? వాళ్లు అందరికీ దూరంగా ఉంటే లేదా “నేను లేకపోతే మీరు బాగుంటారు”లాంటి మాటలు మాట్లాడితే ఎలా స్పందించాలి?.. ఇలాంటి ఎన్నో విషయాలను ఈ వారం Health Talk పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు... గాయత్రి గారు.అంతేకాదు… ఈ రోజుల్లో మన జీవితాల్లో భాగమైన Social Media మన భావోద్వేగాలపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? ఇతరులతో పోల్చుకోవడం, ఎప్పుడూ notifications చూస్తూ ఉండటం, perfect life చూపించాలనే ఒత్తిడి మనపై ఎలా ప్రభావం చూపుతున్నాయి? లాంటి ఎన్నో విషయాలు కూడా ఈ పాడ్కాస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు.తప్పకుండా వింటారు కదూ! మిస్ అవ్వకండి!When something is bothering you, do you find it difficult to know who to talk to?And when someone opens up to you about their problems, how do you respond?Problems in life, stress, disappointment, changes in relationships, pressure from studies or work… all of these can affect our mental well-being. But keeping all these emotions inside and dealing with them alone is not healthy, says renowned psychologist Gayathri.How can we notice sudden changes in the behaviour of people around us? What should we do if someone starts distancing themselves from everyone or says things like, “You’ll be better off without me”? Gayathri shares valuable insights on these and many more important topics in this week’s Health Talk episode.The episode also explores how Social Media, which has become a part of our daily lives, can affect our emotions. Comparing ourselves with others, constantly checking notifications, and feeling pressured to show a “perfect life” can all impact our mental well-being.Do give it a listen! Don’t miss this important conversation.Guest: Kolavennu Naga Gaytri, PsychologistHost: Adarsh KumarGayatri vijay psychologist https://share.google/2EY9VA32pqEYytMH4#TALRadio #HealthTalks #SuicidePreventionMonth #MentalHealthAwareness #MentalWellbeing #StressManagement #EmotionalWellbeing #psychology #mentalhealth #SocialMediaImpact #TalkAndListen #HealthTalk #Psychologist #TALRadioTelugu
-
956
కెరీర్ లో గ్రోత్ కోసం గోల్డెన్ రూల్స్! | Smart Money Mindset Telugu - 8
ఉద్యోగం ఉంది.. జీతం వస్తోంది.. అయినా మనం అనుకున్న స్థాయికి చేరగలుగుతున్నామా?చాలామంది తమ కెరీర్‌లో ఎదుగుదల రాకపోతే.. బాస్‌ను, కంపెనీని లేదా ఉద్యోగాన్ని కారణంగా చెబుతుంటారు. కానీ మన కెరీర్ దిశను మార్చేది ఎవరు? మనమే! మన స్కిల్స్, కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్, నెట్‌వర్క్.. వీటిపై మనం ఎంత పెట్టుబడి పెడుతున్నామన్నదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది.అంటూ.. కెరీర్‌లో మొదటి 5–7 ఏళ్లను ఎలా ఉపయోగించుకోవాలి, ఉద్యోగంతో పాటు మనపై మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అందరూ వెళ్తున్న Default Pathనే ఫాలో అవ్వకుండా మనకు మనం సరైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలి, జీతం కంటే మన అసలు Value ఏంటి, కంపెనీలోనూ.. బయటా మంచి Networkను ఎలా నిర్మించుకోవాలి, అవసరమైతే ఉద్యోగాన్ని మార్చగలిగే Confidence ఎలా సంపాదించుకోవాలి.. ఇలాంటి ఎన్నో విలువైన విషయాలను ఈ Smart Money Mindset - Telugu పాడ్కాస్ట్లో మనతో పంచుకున్నారు.. ప్రముఖ Financial Educator & Money Mindset Coach మాధవి లత గారు!మీ Career Growthకి నిజంగా ఉపయోగపడే విషయాలను తెలుసుకోవడానికి ఈ పాడ్కాస్ట్ను తప్పకుండా వినండి! మిస్ అవ్వకండి!You have a job.. you earn a salary.. but are you really moving towards the level you want to reach?Many of us blame our boss, company, or job when we don’t see growth in our careers. But who can actually change the direction of your career? You can! Your skills, communication, confidence, and network.. how much you invest in these things today can shape your future.In this Smart Money Mindset - Telugu podcast, renowned Financial Educator & Money Mindset Coach Madhavi Latha shares valuable insights on how to make the most of the first 5–7 years of your career, invest in yourself alongside your job, make the right decisions instead of simply following the default path, understand your real value beyond your salary, build a strong network both inside and outside your company, and develop the confidence to make a career move when needed.Want to take your career growth seriously? Tune in to this podcast to discover practical insights that can help you move forward with more clarity and confidence. Don’t miss it!Host: Madhavi LathaSource: https://www.youtube.com/@Smartmoneymindsettelugu#TALRadioTelugu #SmartMoneyMindset #MoneyMindset #CareerGrowth #CareerAdvice #PersonalGrowth #FinancialFreedom #FinancialWellness #SelfInvestment #SkillDevelopment #Networking #ProfessionalGrowth #MoneyManagement #WealthCreation #TouchALifeFoundation
-
955
పేదల కంటికి వెలుగు! | Retinova Foundation | స్ఫూర్తి కిరణాలు
కంటి చూపు తగ్గుతున్నా.. చాలామంది వెంటనే కంటి పరీక్ష చేయించుకోరు!అవగాహన లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఉండటం, సరైన అవకాశాలు ఉండకపోవడం.. ఇలా ఎన్నో కారణాలతో ఎంతో మంది సరైన సమయంలో చికిత్స పొందలేకపోతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తోంది.ఈ పరిస్థితిని మార్చాలనే ఆలోచనతో.. 2019లో కంటి పరీక్షలతో తమ సేవా కార్యక్రమాలను ప్రారంభించింది… Retinova Foundation!ఈ సంస్థ కంటి సమస్యలను ముందుగానే గుర్తించేందుకు ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తూ.. అవసరమైన వారికి ఉచిత కళ్లద్దాలు అందించడంతో పాటు, శస్త్రచికిత్సలు కూడా చేయిస్తోంది.కేవలం చికిత్స అందించడం మాత్రమే కాకుండా.. కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, సమస్యను ముందుగానే గుర్తించేలా చేయడం మీద కూడా దృష్టి పెడుతోంది.మరి అసలు కంటి సమస్యలపై ప్రజల్లో అవగాహన ఎందుకు తక్కువగా ఉంది? సమయానికి చికిత్స అందకపోవడానికి ఎదురవుతున్న ఇబ్బందులు ఏంటి? Retinova Foundation ఇప్పటివరకు ఎలాంటి సేవలు అందించింది? ఇలాంటి ఎన్నో విషయాలను ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు.. ఆ సంస్థ డైరెక్టర్ సునీల్ కుమార్ గారు!Even when their vision starts getting weaker, many people don’t get their eyes checked immediately.Lack of awareness, financial difficulties and limited access to proper healthcare are some of the reasons why many people miss timely treatment. The problem is even more common in rural areas.With an aim to change this situation, Retinova Foundation began its service journey in 2019 with eye screenings.The foundation conducts free eye camps to detect vision problems early, provides free spectacles to those who need them, and also supports patients with surgeries. Along with treatment, it focuses on creating awareness about eye health and encouraging people to identify problems at an early stage.So, why is awareness about eye health still low? What challenges prevent people from getting timely treatment? And what kind of services has Retinova Foundation provided so far?The Director of Retinova Foundation, Mr. Sunil Kumar, shared insights into these and many more important topics in this podcast.Do give it a listen!Guest: Mr. D. Sunil KumarHost: Adarsh#TALRadioTelugu #RetinovaFoundation #SunilKumar #EyeCare #EyeHealth #EyeAwareness #EyeCheckup #FreeEyeCamp #FreeEyeCare #VisionCare #EyeHealthAwareness #PreventBlindness #HealthyEyes #RuralHealthcare #RuralEyeCare #HealthcareForAll #HealthcareAwareness #SocialImpact #NGO #TALRadioTelugu #TALRadio #TouchALifeFoundation
-
954
మట్టి మనుషుల జీవితాలే ఈయన కథల్లో కనిపిస్తాయి! | Sheelam Bhadraiah | మన రచయితలు | Season - 2 | Episode - 12
చిన్నప్పటి నుంచే తెలుగు పుస్తకాల మధ్య పెరిగారు…ఆ పుస్తకాలే ఆయనలో సాహిత్యంపై ప్రేమను పెంచాయి!సూర్యాపేట జిల్లా, అన్నారం గ్రామానికి చెందిన శీలం భద్రయ్య గారు వృత్తిరీత్యా తెలుగు ఉపాధ్యాయులు. కానీ.. తెలుగు భాషపై ఉన్న ప్రేమతో కథలు, కవితలు, నవలలు రాస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.ఆయన తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు జరిగిన ఓ వ్యాసరచన పోటీ.. ఆయనలోని రచయితను బయటకు తీసుకొచ్చింది. అప్పటి నుంచి కథలు, కవితలు, నవలలు, నాటకాలతో తన రచనా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన రచనల్లో తెలుగు భాషతో పాటు.. మనుషుల జీవితాలు, గ్రామీణ నేపథ్యం, సమాజంలోని సమస్యలు కూడా కనిపిస్తాయి.‘లొట్టపీసు పూలు’, ‘ముస్తాదు’ వంటి రచనలతో పాఠకుల ప్రశంసలు అందుకున్న భద్రయ్య గారు.. సాహిత్యం సమాజాన్ని ఎలా ప్రతిబింబించాలి? తెలుగు భాషను యువతకు ఎలా చేరువ చెయ్యాలి? ఒక రచయితగా ఆయన ఎలా ఎదిగారు? తండ్రి నుంచి ఆయన పొందిన స్ఫూర్తి ఏంటి? సమాజం, మాతృభాష ఆయన రచనలపై ఎలాంటి ప్రభావం చూపాయి?ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాను ఈ వారం ‘మన రచయితలు’ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు..!తప్పకుండా వినండి… మిస్ అవ్వకండి!He grew up surrounded by Telugu books from a young age… and those books slowly turned into a deep love for literature.Sheelam Bhadraiah from Annaram village in Suryapet district is a Telugu teacher by profession. But his passion for the Telugu language led him to write stories, poems and novels, helping him create a unique identity as a writer. His journey as a writer began in the 9th grade with an essay-writing competition. Since then, he has continued his literary journey through stories, poems, novels and plays. His writings beautifully reflect the Telugu language, people’s lives, rural backgrounds and issues faced by society.Through works like Lottapeesu Poolu and Musthadu, Bhadrayya has earned appreciation from readers. What should literature reflect in society? How can Telugu be made more relatable to today’s youth? How did he grow as a writer? What inspiration did he receive from his father? And how have society and his mother tongue influenced his writing? He shared answers to these and many more interesting questions in this week’s ‘Mana Rachayithalu’ podcast.Do give it a listen… and don’t miss it!Guest: Sheelam BhadraiahHost: Renu Sree#TALRadioTelugu #ManRachayithalu #SheelamBhadraiah #TeluguWriter #TeluguPoetry #TeluguStories #TeluguLanguage #TeluguCulture #TeluguSahityam #TALRadio #TouchALifeFoundation
-
953
మన శరీరానికి సరిపడా ప్రోటీన్ తీసుకుంటున్నామా? | Nutrition Week Special
ప్రోటీన్ అంటే కేవలం జిమ్‌కి వెళ్లేవాళ్ల కోసం మాత్రమే అనుకుంటున్నారా? నిజానికి మన రోజువారీ ఆహారంలో ప్రోటీన్ చాలా ముఖ్యమైంది. శరీరానికి అవసరమైన ప్రోటీన్‌ను సరైన మోతాదులో తీసుకోవడం, మన వయసు, జీవనశైలికి అనుగుణంగా ఆహారాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం.ఈ విషయాలన్నింటి గురించి ప్రముఖ Nutritionist ఆశ్రిత గారు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు. ఆరోగ్యకరమైన Meal Plate ఎలా ఉండాలి? రోజువారీ ఆహారంలో ప్రోటీన్‌ను ఎలా చేర్చుకోవాలి? శాకాహారులకు అందుబాటులో ఉన్న మంచి Protein Sources ఏంటి? పిల్లలు, విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధుల ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? వంటి అంశాలను ఆమె వివరించారు.అంతేకాదు.. ప్రస్తుత జీవనశైలిలో పెరుగుతున్న ఊబకాయం, మధుమేహం వంటి సమస్యల నేపథ్యంలో మన ఆహారపు అలవాట్లలో ఎలాంటి చిన్న మార్పులు చేసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చో కూడా ఈ పాడ్‌కాస్ట్‌లో తెలుసుకోవచ్చు.ప్రోటీన్‌పై ఉన్న అపోహలను పక్కన పెట్టి, సరైన ఆహారం గురించి స్పష్టమైన అవగాహన పొందాలంటే ఈ పాడ్కాస్ట్ ను చివరి వరకు చూడండి. మీ రోజువారీ ఆహారంలో చేసుకునే కొన్ని చిన్న మార్పులు.. మీ ఆరోగ్యంపై పెద్ద ప్రభావాన్ని చూపించవచ్చు!Do you think protein is only for people who go to the gym?In reality, protein plays an important role in our everyday diet. Getting the right amount of protein and choosing foods based on our age and lifestyle are essential for maintaining a healthy body.In this special podcast, renowned Nutritionist Asritha shares valuable insights on protein and healthy eating. She explains how to build a healthy meal plate, how to include protein in our daily diet, good protein sources for vegetarians, and how children, students, working professionals, and senior citizens can make better food choices.She also talks about the importance of making simple changes to our eating habits, especially at a time when lifestyle-related concerns such as obesity and diabetes are becoming increasingly common.Want to separate the myths from the facts about protein and understand how to build healthier eating habits? Watch this podcast till the end. Small changes in your daily diet can make a big difference to your health!Host: BharathGuest: Asritha Vissapragada#TALRadio #NutritionWeek #Protein #ProteinIntake #HealthyEating #Nutrition #Nutritionist #HealthyDiet #ProteinSources #VegetarianProtein #MealPlate #BalancedDiet #HealthTips #HealthyLifestyle #NutritionTips #DietTips #Obesity #Diabetes #TouchALifeFoundation
-
952
ఓవర్ థింకింగ్, నెగెటివ్ ఆలోచనలు, భయం... ఇక లేనట్టే! | Sirisha Meda | Special Interview
మన మనసులో ఒక ఆలోచన మొదలవుతుంది…ఆ ఆలోచనకు మనమే భయాన్ని జోడిస్తాం…ఆ తర్వాత అదే ఆలోచనను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటూ… మనమే Overthinkingలోకి వెళ్లిపోతుంటాం!అయితే… ఆ ఆలోచన వచ్చిన ప్రతిసారీ భయపడాల్సిందేనా? Negative Thoughtsను ఎలా ఎదుర్కోవాలి? Overthinkingను తగ్గించుకోవడానికి ఏం చేయాలి? మన ఆలోచనలను మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవచ్చు? ఇందుకు ఉపయోగపడే ఒక ఆసక్తికరమైన విధానం NLP – Neuro-Linguistic Programming!అసలు NLP అంటే ఏమిటి? మన ఆలోచనలు, మాటలు, ప్రవర్తన మధ్య ఉన్న సంబంధం ఏమిటి? Negative Thinking, Fear, Overthinkingను ఎలా ఎదుర్కోవాలి? Confidenceను, Clarityను పెంచుకోవడానికి NLP ఎలా ఉపయోగపడుతుంది? మనసులో వచ్చే ప్రతి ఆలోచనకు వెంటనే స్పందించకుండా… దాన్ని ఎలా observe చేయాలి? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ podcast లో మనతో పంచుకున్నారు ప్రముఖ NLP Coach శిరీష గారు!మన ఆలోచనలు… మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో తెలుసుకోవడానికి.. ఈ podcast ను తప్పకుండా వినండి.. మిస్ అవ్వకండి!An idea starts in our mind…Then we add fear to that thought ourselves…And by thinking about the same thought again and again, we slowly find ourselves stuck in overthinking!But do we really need to be afraid every time a thought comes to our mind? How can we deal with negative thoughts? How can we reduce overthinking? And how can we turn our thoughts in a way that works in our favour?One interesting approach that can help is NLP – Neuro-Linguistic Programming!What exactly is NLP? What is the connection between our thoughts, words, and behaviour? How can we deal with negative thinking, fear, and overthinking? How can NLP help improve our confidence and clarity? And instead of immediately reacting to every thought that comes to our mind, how can we learn to simply observe it?In this podcast, renowned NLP Coach Shirisha shares insights on all these interesting topics and more.To understand how our thoughts can influence our lives, listen to this podcast and don’t miss it!Guest: Sirisha MedaHost: Adarsh#TALRadioTelugu #NeuroLinguisticProgramming #NegativeThoughts #Overthinking #PositiveThinking #Mindset #MentalWellness #SelfImprovement #Confidence #Clarity #FearManagement #MindPower #ThoughtsMatter #NLPCoach #PersonalGrowth #TouchALifeFoundation
-
951
బాహ్య ఆరోగ్యం - భాష ఆరోగ్యం | Dr. G. V. Poornachand | అంతరంగాలు - 4
మన ఆహారం… మన భాష… మన సంస్కృతి!వాటి వెనుక ఉన్న చరిత్రను తెలుసుకోవడం చాలా ముఖ్యం.అంటూ… ఈ వారం “అంతరంగాలు” కార్యక్రమంలో ప్రముఖ రచయిత, ఆహార చరిత్ర పరిశోధకుడు డా. జి.వి. పూర్ణచంద్ గారు మన ఆహార సంస్కృతి గురించి, మారుతున్న ఆహారపు అలవాట్ల గురించి, తెలుగు భాష ప్రాముఖ్యత గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మనతో పంచుకున్నారు.మన పూర్వీకుల ఆహారంలో ఉన్న ప్రత్యేకత ఏంటి? మన ఆహారపు అలవాట్లు ఎలా మారాయి? తెలుగు భాషను ఎందుకు కాపాడుకోవాలి? ఇలా ఆహారం, భాష, సంస్కృతికి సంబంధించిన ఎన్నో విషయాలను ఈ పాడ్కాస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు.150కి పైగా పుస్తకాలు రాసిన ఆయన సాహిత్య ప్రయాణం, ఆహార చరిత్రపై చేసిన పరిశోధనలు, తెలుగు భాష కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాల గురించి కూడా స్వయంగా ఆయన మనతో పంచుకున్నారు.మరి మన మూలాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి… ఈ ప్రత్యేక పాడ్కాస్ట్ ను తప్పకుండా వినండి! మిస్ అవ్వకండి!Our food… our language… our culture!It is important to understand the history and stories behind them.This week on “Antarangalu,” renowned writer and food historian Dr. G. V. Poornachand shared many interesting insights about our food culture, changing food habits, and the importance of the Telugu language.What was special about the food habits of our ancestors? How have our eating habits changed over the years? Why is it important to preserve the Telugu language? This podcast explores all these fascinating aspects of food, language, and culture.With more than 150 books to his name, Dr. Poornachand also spoke about his literary journey, his research into the history of food, and his efforts to promote and preserve the Telugu language.So, if you want to discover more about our roots and the stories behind our food, language, and culture, don’t miss this special podcast!Guest: Dr. G. V. PoornachandHost: Dr. Gurajada Shobha Perindevi#TALRadio #Antarangalu #GVPoornachand #TeluguLanguage #TeluguCulture #FoodCulture #FoodHistory #TeluguLiterature #IndianFoodCulture #OurRoots #CulturalHeritage #TeluguPride #FoodHistoryResearch #TeluguWriters #Podcast #TeluguPodcast
-
950
డబ్బును ఆకర్షించడానికి జపనీస్ టెక్నిక్స్! | Smart Money Mindset Telugu - 7
డబ్బు సంపాదించేటప్పుడు సంతోషంగా ఉండాలి… ఖర్చు చేసేటప్పుడు కృతజ్ఞతగా ఉండాలి! - ఇదే జపనీస్ Happy Money ఫిలాసఫీ!ఎంత సంపాదించినా సరిపోకపోవడం, డబ్బు ఖర్చు చేస్తున్నప్పుడు బాధపడటం, భవిష్యత్తు గురించి భయపడటం, మనీ విషయంలో ఎప్పుడూ ఒత్తిడికి గురవడం… ఇలా మన ఆలోచనలు, భావోద్వేగాలు కూడా మన ఆర్థిక జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అంటూ…డబ్బు మన దగ్గరకు వచ్చినప్పుడు ఆనందంగా స్వీకరించడం, ఖర్చు చేసేటప్పుడు కూడా కృతజ్ఞతతో ఖర్చు చేయడం, మన Money Personality ఏంటో తెలుసుకోవడం, డబ్బు విషయంలో భయాన్ని తగ్గించుకోవడం, డబ్బును వెంటాడటం కంటే మనం ఇతరులకు అందించే Valueపై దృష్టి పెట్టడం… వంటి ఎంతో విలువైన Happy Money ఫిలాసఫీ గురించి ఎన్నో విషయాలను ఈ పాడ్కాస్ట్లో మనతో పంచుకున్నారు… ప్రముఖ ఫైనాన్షియల్ అడ్వైజర్ మాధవి లత గారు!డబ్బుతో మన సంబంధాన్ని ఎలా ఏర్పర్చుకోవాలో తెలుసుకోవడానికి ఈ పాడ్కాస్ట్ను తప్పకుండా వినండి! మిస్ అవ్వకండి!Being happy while earning money and grateful while spending it… that’s the essence of the Happy Money philosophy.No matter how much we earn, constantly feeling that it’s not enough, feeling bad about spending money, worrying about the future, or always being stressed about finances… our thoughts and emotions can have a strong impact on our financial life.In this podcast, Madhavi Latha, a renowned Financial Advisor, shares valuable insights from the Happy Money philosophy — how to receive money with happiness, spend it with gratitude, understand your Money Personality, overcome the fear associated with money, and focus on the value we create for others instead of simply chasing money.Want to build a healthier and more positive relationship with money? Tune in to this podcast to discover the Happy Money philosophy. Don’t miss it!Host: Madhavi Latha Source: https://www.youtube.com/@Smartmoneymindsettelugu #TALRadioTelugu #MoneyMindset #KenHonda #MoneyMindset #MoneyPersonality #FinancialMindset #PersonalFinance #FinancialWellness #MoneyManagement #WealthCreation #TouchALifeFoundation
-
949
చదువుతో పాటు సేవ... క్యాన్సర్ బాధితులకు అండగా విద్యార్థులు! | Sreenidhi Cancer Foundation | స్ఫూర్తి కిరణాలు
చదువు, కాలేజ్, అసైన్‌మెంట్స్, పరీక్షలు… ఇలా విద్యార్థి జీవితంలో ఎన్నో బాధ్యతలు ఉన్నా, సమాజం కోసం కూడా ఏదైనా చేయాలని ఆలోచించారు కొంత మంది విద్యార్థులు.ఆ ఆలోచనే.. 2016లో Sreenidhi Cancer Foundationగా మారింది. అప్పటి నుంచి క్యాన్సర్ బాధితులకు అండగా నిలుస్తూ, యువతను సేవా కార్యక్రమాల్లో భాగం చేసేందుకు ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు…!బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, స్టెమ్ సెల్ డొనేషన్, క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్, అవేర్‌నెస్ వాక్స్‌తో పాటు… ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న చిన్నారుల కోసం Make-A-Wish అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, వారి కోరికలను నెరవేరుస్తూ, ఆనందాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు.చదువుతో పాటు సేవా కార్యక్రమాలకు కూడా సమయం కేటాయిస్తూ… “సమయం లేదు” అని ఆగిపోకుండా, ఒకసారి ముందుకొచ్చి చూస్తే మనం చేయగలిగింది ఎంతో ఉంటుంది అని యువతకు చెబుతున్నారు.ఒక చిన్న ఆలోచన ఎలా ఒక సేవా సంస్థగా మారింది? విద్యార్థులుగా ఉంటూనే ఈ సేవా ప్రయాణాన్ని ఎలా కొనసాగిస్తున్నారు? క్యాన్సర్ బాధితుల కోసం వారు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి? ఇలాంటి ఎన్నో విషయాలను ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు… Sreenidhi Cancer Foundation President చరణ్ గారు!తప్పకుండా వినండి… మిస్ అవ్వకండి!Student life comes with many responsibilities… studies, college, assignments, exams and more. Yet, a few students also wanted to do something meaningful for society.That thought eventually turned into the Sreenidhi Cancer Foundation in 2016. Since then, the foundation has been supporting cancer patients and encouraging young people to take part in social service through various initiatives.From blood donation and stem cell donation drives to cancer screening camps and awareness walks, they have been working to create greater awareness and support for those affected by cancer. They also started Make-A-Wish, an initiative to fulfil the wishes of children undergoing cancer treatment in hospitals and bring some happiness into their lives.While continuing their education, these young volunteers are also making time for social service and showing others that “I don’t have time” doesn’t have to stop us from making a difference.How did a small idea turn into a service organisation? How are these students continuing their journey of service while pursuing their education? What initiatives are they taking to support cancer patients?Sreenidhi Cancer Foundation President Charan Bodempudi shares the answers to these and many more questions in this podcast.Do listen and don’t miss it!Guest: Charan BodempudiHost: Kalyani#TALRadio #SreenidhiCancerFoundation #CancerAwareness #CancerSupport #BloodDonation #StemCellDonation #CancerScreening #MakeAWish #YouthForChange #SocialImpact #CommunityService #StudentVolunteers
-
948
చదువుకుంటే ఏదైనా సాధించవచ్చు! | Ramya Deepika | మా ఊరు - 81
మన ఊరు మారొచ్చు… మనం దూరంగా వెళ్లొచ్చు… కానీ చిన్ననాటి జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ మనతోనే ఉంటాయి!అలాంటి మధురమైన జ్ఞాపకాలతో పాటు… ఎన్నో విజయాలు, బాధ్యతలు, అనుభవాలతో సాగిన తన జీవిత ప్రయాణాన్ని ఈ వారం ‘మా ఊరు’ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు రమ్య దీపిక గారు.గుంటూరులో మొదలైన బాల్యం, స్నేహితులతో కలిసి పెరిగిన రోజులు, చదువుకు ఇచ్చిన ప్రాధాన్యత… మొదటిసారి తన కుటుంబంలో ఉద్యోగం చేయడం, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం, స్కూల్ టాపర్ గా, కాలేజ్ టాపర్‌గా నిలవడం వంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఆమె గుర్తుచేసుకున్నారు.2016లో అమెరికాలోని సియాటిల్‌కు వెళ్లిన తర్వాత… అక్కడ కుటుంబంతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఆమె, తల్లిగా, ఉద్యోగిగా, కమ్యూనిటీ వాలంటీర్‌గా, స్కూల్ ఈవెంట్ డైరెక్టర్‌గా ఎన్నో బాధ్యతలను నిర్వహిస్తున్నారు.కుటుంబం, కెరీర్, కమ్యూనిటీ సర్వీస్… ఈ మూడు ప్రపంచాలను బ్యాలెన్స్ చేస్తూ సాగుతున్న ఆమె ప్రయాణంలో ఎన్నో నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి.చిన్ననాటి జ్ఞాపకాల నుంచి… నేటి విజయాల వరకు రమ్య గారి అందమైన ప్రయాణాన్ని తెలుసుకోడానికి ఈ పాడ్కాస్ట్ ను తప్పకుండా వినండి… మిస్ అవ్వకండి!Our hometown may change… we may move far away… but childhood memories always stay with us!This week on the ‘Maa Ooru’ podcast, Ramya Deepika shares her life journey filled with beautiful memories, achievements, responsibilities, and experiences.She recalls her childhood in Guntur, growing up with friends, the importance she gave to education, becoming the first person in her family to take up a job, completing her post-graduation, and being a school and college topper.After moving to Seattle, USA, in 2016, she began a new chapter of life with her family. Today, she balances multiple roles as a mother, working professional, community volunteer, and school event director.Her journey of balancing family, career, and community service offers many valuable lessons.From childhood memories to her achievements today, discover Ramya’s inspiring journey on this week’s ‘Maa Ooru’ podcast. Don’t miss it!Guest: Ramya DeepikaHost: Usha#MaaOoru #TALRadioTelugu #RamyaDeepika #ChildhoodMemories #VillageMemories #Nostalgia #FamilyValues #CareerJourney #CommunityService #LifeJourney #TeluguPodcast #TALRadio
-
947
NGOs - కార్పొరేట్లు కలిస్తే... సామాజిక మార్పు సాధ్యం! | Priyanka | Special Interview
సమాజంలో మార్పు రావాలంటే… మంచి ఆలోచనతో పాటు, దాన్ని ముందుకు తీసుకెళ్లే సహకారం కూడా అవసరం!ఒకవైపు సమాజంలోని సమస్యలకు పరిష్కారాలు చూపించే NGOs…మరోవైపు ఆ మార్పుకు అండగా నిలిచే Corporates…వీరిద్దరూ కలిసి పనిచేస్తే మార్పు మరింత వేగంగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే… ఈ రెండింటి మధ్య వారధిగా నిలుస్తుంది CSR!CSR అంటే కేవలం NGOలకు Funds ఇవ్వడం మాత్రమే కాదు… ఒక సమస్యను అర్థం చేసుకుని, దానికి సరైన పరిష్కారం కోసం అవసరమైన ప్రణాళిక, వనరులు, అవకాశాలను అందిస్తూ… మంచి మార్పును ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడుతుంది!మరి అసలు CSR Fundsను Corporates ఎలా ఉపయోగించాలి? NGOs CSR Funding పొందాలంటే ఎలాంటి Eligibility, Documentation అవసరం? Corporate ఒక NGOను ఎంపిక చేసేటప్పుడు ఎలాంటి అంశాలను పరిశీలిస్తుంది? చిన్న NGOs తమ Systems, Accounts, Governanceను ఎలా బలోపేతం చేసుకోవాలి? వంటి ఎన్నో విషయాలను ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు… ప్రముఖ Social Entrepreneur ప్రియాంక గారు!తప్పకుండా వినండి! మిస్ అవ్వకండి!For real change to happen in society, a good idea needs the right support to take it forward.On one side, NGOs work towards solving social problems. On the other, Corporates can provide the support needed to create that change. When both work together, the impact can be much greater. That’s where CSR acts as a bridge between the two.CSR is not just about providing funds to NGOs. It is about understanding a problem and supporting the right solutions with proper planning, resources, and opportunities.So, how should Corporates utilise CSR funds? What eligibility and documentation do NGOs need to receive CSR funding? What do Corporates look for when selecting an NGO? And how can small NGOs strengthen their systems, accounts, and governance?These are some of the many important questions discussed in this podcast with renowned Social Entrepreneur Priyanka.Do watch and listen to the full podcast. Don’t miss it!Guest: PriyankaHost: Bharath#TALRadioTelugu #CSR #SocialImpact #NGO #SocialEntrepreneurship #CSRFunding #SocialInnovation #Sustainability #SocialWork #CorporateSocialResponsibility
-
946
విజయం కోసం EAGLE మైండ్ సెట్! | Smart Money Mindset Telugu - 6
మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను చూసి భయపడుతున్నారా? లేదా వాటినే మీ ఎదుగుదలకు అవకాశాలుగా మార్చుకోవాలనుకుంటున్నారా?ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపారంలో నష్టాలు… జీవితంలో సమస్యలు రావడం సహజమే. కానీ ఆ సమస్యలకు మనం ఎలా స్పందిస్తున్నామన్నదే ముఖ్యం. పరిమితమైన ఆలోచనా విధానంతో సమస్యలను చూసి భయపడటం కంటే… Eagle Mindsetతో వాటిని ఎదుర్కొని, వాటి నుంచి నేర్చుకుని ముందుకు వెళ్లడం నేర్చుకోవాలి.సొంత నిర్ణయాలు తీసుకోవడం, ఓటమిని పాఠాలుగా మార్చుకోవడం, ఎదుటి వ్యక్తిని నమ్మే ముందు కాస్త సమయం తీసుకొని ఆలోచించడం, లక్ష్యం వైపు పూర్తి ఫోకస్ పెట్టడం, సరైన విజన్‌తో ముందుకు సాగడం… ఇలా Success, Wealth, Respect సాధించడానికి అవసరమైన ఎన్నో విలువైన విషయాలను ఈ పాడ్కాస్ట్లో మనతో పంచుకున్నారు… ప్రముఖ ఫైనాన్షియల్ అడ్వైజర్ మాధవి లత గారు!మన పరిస్థితులు మన విజయాన్ని నిర్ణయించవు… వాటిపై మన ఆలోచనా విధానం, మన స్పందన, మన నిర్ణయాలే మన ఎదుగుదలను నిర్ణయిస్తాయి.మీ ఆలోచనా విధానాన్ని మరింత బలంగా మార్చుకుని, సమస్యలను అవకాశాలుగా చూడటానికి… ఈ పాడ్కాస్ట్ ను తప్పకుండా వినండి. మిస్ అవ్వకండి!Are you afraid of the problems you face in life, or are you ready to turn them into opportunities for growth?Financial challenges, family problems, health issues, business losses… problems are a natural part of life. But what truly matters is how we respond to them. Instead of allowing problems to weaken us, developing an Eagle Mindset can help us learn from challenges, find solutions, and move forward with confidence.In this episode, discover valuable insights on making decisions independently, turning past failures into lessons, testing before trusting, seeing opportunities in challenges, staying focused on one goal, and developing a clear vision to achieve success, wealth, and respect.Our circumstances do not define our success. Our mindset, decisions, and response to challenges shape our growth.If you want to build a stronger mindset and learn to see problems as opportunities, don’t miss this inspiring episode!Host: Madhavi Latha Source: https://www.youtube.com/@Smartmoneymindsettelugu #TALRadioTelugu #EagleMindset #StrongMindset #GrowthMindset #SuccessMindset #MindsetMatters #PersonalGrowth #SelfDevelopment #Motivation #Success #WealthCreation #LifeLessons #PositiveThinking #Focus #TALRadio #TouchALifeFoundation
-
945
జీవితం నేర్పిన పాఠాలే... ఆమె కథలకు ప్రేరణ! | మన రచయితలు | Season - 2 | Episode - 11
ఒకవైపు కథలు… మరోవైపు కవితలు…!రచయిత్రిగా, కవయిత్రిగా, చిత్రకారిణిగా… ఎన్నో రంగాల్లో తన ప్రతిభను చూపిస్తూ ముందుకు సాగుతున్నారు సుమలత గారు!చిన్నప్పటి నుంచే తెలుగు అంటే చాలా ఇష్టం. పుస్తకాలు చదవడం, కవితలు రాయడం అలా అలవాటయ్యాయి. చిన్న వయసులోనే మొదలైన ఈ ఆసక్తి… తర్వాత కథలు రాసేలా చేసింది. మన చుట్టూ జరిగే సంఘటనలు, మనుషుల జీవితాలు ఆమె కథల్లో కనిపిస్తుంటాయి.అంతేకాదు... తెలుగు భాషపై ఉన్న ఇష్టంతో రేడియో కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. తెలుగు భాష, మన సంస్కృతి, సంప్రదాయాల గురించి తన మాటల ద్వారా అందరికీ చెబుతున్నారు.మరి సుమలత గారి రచనా ప్రయాణం ఎలా మొదలైంది? కథలు రాయడానికి ఆమెకు స్ఫూర్తి ఎవరు? నిజ జీవిత సంఘటనలు ఆమె కథల్లోకి ఎలా వచ్చాయి? తెలుగు భాషను పిల్లలకు ఎలా చేరువ చేయాలి?ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ పాడ్కాస్ట్ లో స్వయంగా సుమలత గారే మనతో పంచుకున్నారు.తప్పకుండా వినండి… మిస్ అవ్వకండి!Stories on one side… poetry on the other!As a writer, poet, and painter, Sumalatha Garu is showcasing her talent across many creative fields and moving forward with passion.From a young age, she developed a deep love for Telugu. Reading books and writing poems soon became a habit, and this childhood passion gradually led her into the world of storytelling. The people she observes and the incidents happening around her often find a place in her stories.Her love for the Telugu language has also led her to participate in radio programs, where she shares her thoughts about Telugu language, culture, and traditions.So, how did Sumalatha Garu's writing journey begin? Who inspired her to write stories? How do real-life incidents become part of her stories? And how can we help children connect more with the Telugu language?She shares many such interesting insights in this podcast.Do listen… Don’t miss it!Guest: SumalathaHost: Renusree#TALRadio #ManRachayithalu #TeluguLiterature #TeluguWriter #TeluguPoetry #TeluguStories #TeluguLanguage #TeluguCulture #TeluguSahityam
-
944
సేవకు చిరునామాగా రాధిక చారిటబుల్ ట్రస్ట్ | స్ఫూర్తి కిరణాలు
చిన్ననాటి నుంచే సమాజంలో కనిపించిన అసమానతలు, అవసరాలు ఆమె మనసులో ఎన్నో ఆలోచనలకు బీజం వేశాయి.ఆ ఆలోచనలే తర్వాత Radhika Charitable Trust రూపంలో ఒక సేవా ప్రయాణంగా మారాయి.మహిళలు, పిల్లలతో ప్రారంభమైన ఈ ప్రయాణం… కాలానుగుణంగా ఆరోగ్యం, విద్య, ఆహారం, ప్రాథమిక అవసరాలు, క్యాన్సర్ బాధితులు, లెప్రసీతో బాధపడుతున్నవారు, ట్రాన్స్‌జెండర్ సమాజం వరకు విస్తరించింది.కోవిడ్ సమయంలో ప్రాణాలను కాపాడే మందులను ఉచితంగా అందించడం నుంచి, అవసరమైన వారికి నిత్యావసరాలు అందించడం వరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు.తన సంపాదనతోనే సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ, మరెంతో మంది యువత సమాజానికి తిరిగి ఇవ్వాలని ప్రేరేపించాలన్నదే ఆమె లక్ష్యం.ఒక మంచి ఆలోచనను కార్యరూపంలో పెడితే… అది ఒకరి జీవితాన్నే కాదు, ఎంతోమంది జీవితాలను మార్చగలదని నిరూపిస్తున్న ఈ స్ఫూర్తిదాయక సేవా ప్రయాణం గురించి రాధిక టంగుటూరి గారితో జరిగిన ప్రత్యేక ఇంటర్వ్యూ.తప్పకుండా వినండి… మిస్ అవ్వకండి!Since childhood, the inequalities and needs she witnessed in society sparked countless thoughts in her mind. Those thoughts eventually took shape as a journey of service through the Radhika Charitable Trust.What began with supporting women and children gradually expanded to areas such as healthcare, education, food, basic necessities, cancer care, support for people affected by leprosy, and the transgender community.From providing life-saving medicines free of cost during the COVID-19 pandemic to distributing essential supplies to those in need, the Trust has undertaken numerous initiatives.Continuing these service activities with her own earnings, her goal is also to inspire more young people to give back to society.This inspiring journey proves that when a good idea is turned into action, it can transform not just one life, but many.Know more about this remarkable journey of service in our special interview with Radhika Tanguturi.Do listen and don’t miss it!Guest: Radhika TanguturiHost: Adarsh#TALRadioTelugu #RadhikaTanguturi #RadhikaCharitableTrust #SocialImpact #SocialService #WomenEmpowerment #ChildWelfare #Healthcare #Education #CancerCare #CommunitySupport #Inspiration #YouthForChange #GiveBackToSociety #Humanity #TouchALifeFoundation
-
943
సలాం సైనికా ! పరమవీర చక్ర వీరులకు మహిళా రచయితల కవితా నివాళి | అంతరంగాలు- 3
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల కథలను మనకు పరిచయం చేస్తూ… వారి త్యాగాలను ‘సలాం సైనికా’ పుస్తకం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారు ‘అక్షరయాన్’ సంస్థ వారు !సాహిత్యం అంటే కేవలం కథలు, కవితలు రాయడం కాదు… సమాజం కోసం కూడా రాయాలనే ఆలోచనతో 40 ఏళ్లుగా రచనలు చేస్తున్నారు. మహిళా రచయితలకు ఒక వేదిక కల్పించాలనే ఉద్దేశంతో ‘అక్షరయాన్’ సంస్థను ప్రారంభించి, ఎంతో మంది మహిళా రచయితలను ప్రోత్సహిస్తున్నారు.మహిళల సమస్యలు, హక్కులు, సమాజంలోని సమస్యలపై కథలు, కవితలు రాస్తూ… తన రచనల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇలా తన సాహితీ ప్రయాణం గురించి, ‘అక్షరయాన్’ ద్వారా చేస్తున్న కార్యక్రమాల గురించి, సైనికులపై రాసిన ‘సలాం సైనికా’ పుస్తకం గురించి స్వయంగా శ్రీలక్ష్మి గారే ఈ ‘అంతరంగాలు’ పాడ్కాస్ట్ మనతో పంచుకున్నారు.తప్పకుండా వినండి… మిస్ అవ్వకండి!Host : డా|| గురజాడ శోభా పేరిందేవిGuest : అయినంపూడి శ్రీలక్ష్మి వ్యవస్థాపకులు అక్షరయాన్ – తెలుగు మహిళా రచయితల ఫౌండేషన్ Website : https://aksharayan.org/#TALRadio #Antharangalu #Sreelakshmi #Aksharayan #SalamSainika #TeluguLiterature #WomenWriters #WomenEmpowerment #IndianArmy #KargilHeroes #SocialImpact
-
942
తిరుపతిలో మా కాలేజ్ యూనిఫామ్ సెలెక్ట్ చేసింది నేనే ! | మా ఊరు - 80
“చిన్ననాటి జ్ఞాపకాలు మనం ఎక్కడ ఉన్నా మనతోనే ఉంటాయి…మన ఊరిని వదిలి ఎంత దూరం వెళ్లినా, మనసు మాత్రం ఆ జ్ఞాపకాల చుట్టూనే తిరుగుతుంటుంది!”అంటూ... ఈ వారం ‘మా ఊరు’ పాడ్కాస్ట్ లో రేవతి గారు తన చిన్ననాటి జ్ఞాపకాలను, కుటుంబ అనుబంధాలను, జీవిత ప్రయాణాన్ని మనతో పంచుకున్నారు.తిరుపతిలో గడిపిన బాల్యం, అన్నాచెల్లెళ్లతో కలిసి పెరిగిన రోజులు, వేసవి సెలవుల్లో సరదాగా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్లి గడిపిన క్షణాలు… వంటి ఎన్నో మధురమైన జ్ఞాపకాలను ఎంతో ఆప్యాయంగా గుర్తుచేసుకున్నారు. చదువుకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన తాతయ్య, తల్లిదండ్రుల ప్రభావం తన జీవితంపై ఎలా ఉందో కూడా చెప్పారు.విద్యార్థి దశలోనే డిబేటర్‌గా, కాలేజ్ ప్రెసిడెంట్‌గా ఎన్నో విజయాలు సాధించిన రేవతి గారు... తర్వాత లెక్చరర్‌గా, HODగా విద్యారంగంలో తనదైన ముద్ర వేశారు. వివాహం తర్వాత సాఫ్ట్‌వేర్ రంగంలోకి అడుగుపెట్టి, ప్రస్తుతం అమెరికాలో Software Quality Engineerగా ఉద్యోగం చేస్తున్న ఆమె ప్రయాణాన్ని తప్పకుండా తెలుసుకోవాలి.మిస్ అవ్వకుండా వినండి మరి…!“Childhood memories stay with us, no matter where we are…Even if we move far away from our hometown, our hearts often find their way back to those memories!”This week on the ‘Maa Ooru’ podcast, Revathi takes us through her beautiful childhood memories, family bonds, and life journey.She fondly recalls her childhood in Tirupati, growing up with her siblings, and spending fun-filled summer vacations at her grandmother’s village. She also shares how her grandfather, who gave great importance to education, and her parents influenced her life and shaped her journey.From being a debater and college president during her student days to becoming a Lecturer and HOD, Revathi made her mark in the field of education. After marriage, she stepped into the software industry and eventually moved to the US, where she currently works as a Software Quality Engineer.Her journey is filled with memories, choices, challenges, and new beginnings.Tune in to ‘Maa Ooru’ and don’t miss this beautiful conversation!Guest: Revathi GuntiHost: Usha#TALRadioTelugu #MaaOoru #RevathiGunti #ChildhoodMemories #VillageMemories #Nostalgia #FamilyValues #CareerJourney #TeluguPodcast #LifeJourney #Tirupati #Chittoor #TALRadio
-
941
జ్ఞాపకశక్తిని పెంచుకోడానికి సింపుల్ టెక్నిక్స్! | Special Interview
కొత్తవారిని పరిచయం చేసుకున్న వెంటనే పేర్లు మర్చిపోవడం…బైక్ కీస్ ఎక్కడ పెట్టామో వెతుక్కోవడం…మాట్లాడుతుండగా చెప్పాల్సిన విషయం మర్చిపోవడం…ఇవన్నీ మనలో చాలామంది రోజూ ఎదుర్కొనే సమస్యలే.అందుకే మన మెమరీ పవర్ ను పెంచుకోవడానికి మెదడుకు ఇచ్చే ట్రైనింగ్ చాలా ముఖ్యం అంటున్నారు… ప్రముఖ Memory Coach & Trainer జాన్సీ రాణి గారు!ఈ ఎపిసోడ్ లో అసలు మన మెమరీ ఎలా పనిచేస్తుంది? మనం ఎందుకు మర్చిపోతాం? మెమరీని పెంచుకోవడానికి ఉపయోగపడే సింపుల్ టెక్నిక్స్ ఏంటి?… ఇలాంటి ఎన్నో విషయాలను మనతో పంచుకున్నారు.పేర్లు గుర్తుపెట్టుకోవడం నుంచి… చదివిన విషయాలను ఎక్కువకాలం గుర్తుంచుకోవడం వరకు… Images, Stories, Association, Attention వంటి టెక్నిక్స్ మన మెమరీకి ఎలా సహాయపడతాయో చెప్పారు.అంతేకాదు… పిల్లల్లో Focusను, Concentrationను పెంచడం గురించి, చదువులో మెమరీ టెక్నిక్స్‌ను ఉపయోగించడం గురించి, మెమరీని యాక్టివ్‌గా ఉంచుకోవడం గురించి, అలాగే.. రోజువారీ జీవితంలో చిన్న చిన్న అలవాట్లతో మన మెమొరీని ఎలా పెంచుకోవచ్చో, వీటితో మన బ్రెయిన్ కి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలో కూడా ఈ పాడ్కాస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు.కాబట్టి, తప్పకుండా వినండి! మిస్ అవ్వకండి!Forgetting names right after meeting someone new…Searching for where we left our bike keys…Forgetting what we were about to say while speaking…These are problems many of us face in our daily lives.That’s why training the brain to improve our memory is important, says Jansi Rani, a renowned Memory Coach & Trainer!In this episode, she explains how our memory actually works, why we forget things, and what simple techniques can help improve our memory.From remembering names to retaining what we study for longer, she shares how techniques like Images, Stories, Association, and Attention can strengthen our memory.She also talks about improving Focus and Concentration in children, using memory techniques for studies, keeping the brain active, and building simple everyday habits that can help improve memory. You’ll also learn how these techniques can help train your brain effectively.So, tune in and don’t miss this insightful episode!Guest: Jansi RaniHost: Adarsh#TALRadioTelugu #MemoryBoost #PowerOfMemory #BrainHealth #MentalFitness #BetterMemory #LearningSkills #FocusSkills #SmartLearning #SelfImprovement #MindPower
-
940
మెప్పు కోసం కాదు... సంతృప్తి కోసం రాయాలి! | మన రచయితలు | Season - 2 | Episode - 10
ఒకవైపు శాస్త్రం… మరోవైపు సాహిత్యం…!ఇలా వివిధ రంగాల్లో తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ, ప్రతి రంగంలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు పారానంది అరవింద రావు గారు!చిన్నప్పటి నుంచే కవిత్వంపై ఉన్న ఆసక్తితో… ఒకవైపు శాస్త్రవేత్తగా పరిశోధనలు చేస్తూనే, మరోవైపు తెలుగులో కవితలు, కథలు, గజల్స్ రాస్తూ తన సాహిత్య ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంగ్లాండ్‌లో ఉంటూనే సాహిత్యంతో తన అనుబంధాన్ని కొనసాగిస్తూ… ‘మనసు విప్పిన మడతలు’ అనే కవితా సంకలనాన్ని కూడా తీసుకొచ్చారు.మరి విదేశాల్లో ఉంటూ కూడా తెలుగు భాషతో తన అనుబంధాన్ని ఎలా కొనసాగిస్తున్నారు? కవితా రచన, సంగీతం ఆమె జీవితంలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయి? తన జీవిత ప్రయాణం, రచనా అనుభవాలు, సంగీతంతో ఉన్న అనుబంధం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ పాడ్కాస్ట్ లో స్వయంగా అరవింద రావు గారే మనతో పంచుకున్నారు.తప్పకుండా వినండి… మిస్ అవ్వకండి!On one side, science… and on the other, literature!Balancing her journey across different fields, Paranandi Aravind Rao has carved a unique identity in each of them.With a love for poetry from a young age, she has continued her journey as a scientist while also writing Telugu poems, stories, and ghazals. Even while living in England, she has maintained her connection with Telugu literature and has also published a poetry collection titled ‘Manasu Vippina Madathalu.’So, how does she stay connected to the Telugu language while living abroad? What role do poetry and music play in her life? In this podcast, Aravind Rao shares fascinating insights into her life journey, writing experiences, and connection with music.Tune in to the podcast and don’t miss this inspiring conversation!Guest: Paranandi Aravind RaoHost: Renu Sree#TALRadio #ParanandiAravindRao #TeluguLiterature #TeluguPoetry #TeluguWriters #ScienceAndLiterature #Poetry #Ghazals #TeluguLanguage #MusicAndLiterature #IndianLiterature #LiteraryJourney #Podcast #InspiringStories #TouchALifeFoundation
-
939
ప్రతి ఫోటో సామాజిక మార్పు కోసం! | World Photography Day Special | స్ఫూర్తి కిరణాలు
కొన్ని కథల్ని మాటల్లో చెప్పలేం… కానీ ఒక్క ఫోటోలో చూపించొచ్చు!అలాంటి వాటిలో కొన్ని ఫోటోలు మాత్రమే… ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసి, మంచి మార్పుకు దారితీస్తాయి!ఫోటోగ్రఫీకి ఉన్న ఈ ప్రత్యేకతను అర్థం చేసుకుని… తన కెమెరా ద్వారా సమాజంలోని ఎన్నో కథలను, సమస్యలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు ప్రముఖ ఫోటో జర్నలిస్ట్, ఫిల్మ్‌మేకర్, National Geographic Explorer హర్ష వడ్లమాని గారు!ఆరోగ్యం, వలసలు, వ్యవసాయం, పర్యావరణం, మహిళల హక్కులు, సామాజిక సమస్యలు… ఇలా ఎన్నో అంశాలకు సంబంధించిన కథలను తన కెమెరా ద్వారా ప్రపంచానికి పరిచయం చేశారు. ఒక తెలంగాణ రైతు కుటుంబం ఎదుర్కొన్న పరిస్థితిని తన కథనం ద్వారా చూపించగా… ఆ కుటుంబానికి ఉన్న అప్పును తీర్చేందుకు ఎంతో మంది ముందుకు రావడం విశేషం.అందుకే ప్రపంచ ఫొటోగ్రఫీ డే సందర్భంగా… ఫొటోల ద్వారా సమాజంలోని సమస్యలను ఎలా చూపించాలి? ఒక ఫొటో తీసేటప్పుడు వారి అనుమతిని ఎందుకు తీసుకోవాలి? ఫోటోగ్రఫీతో మంచి మార్పు తీసుకురావడం ఎలా సాధ్యం? ఇలాంటి ఫోటోగ్రఫీకి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను, తన అనుభవాలను మనతో పంచుకున్నారు హర్ష వడ్లమాని గారు!కెమెరా వెనుక ఉన్న కథను…ఫోటోగ్రఫీకి ఉన్న సామాజిక శక్తిని తెలుసుకోవడానికి ఈ ప్రత్యేక పాడ్కాస్ట్ ను తప్పకుండా వినండి!Some stories cannot be told in words… but they can be captured in a single photograph. Sometimes, a single image has the power to make us think, move us, and even inspire positive change. Renowned photojournalist, filmmaker, and National Geographic Explorer Harsha Vadlamani understands this power and has been using his camera to bring stories and social issues from different communities to the world.From healthcare, migration, agriculture, and the environment to women’s rights and other social issues, Harsha has documented countless stories through his lens. One such story highlighted the struggles of a Telangana farming family and inspired many people to come forward and help the family repay their debt.On the occasion of World Photography Day, Harsha Vadlamani shared his experiences on how photography can highlight social issues, why seeking people’s consent is important, and how a photograph can become a powerful tool for positive change. Discover the stories behind the camera and explore the social power of photography in this special podcast.Guest: Harsha Vadlamani Host: Adarsh#TALRadioTelugu #WorldPhotographyDay #HarshaVadlamani #Photography #Photojournalism #SocialImpact #DocumentaryPhotography #NationalGeographicExplorer #Filmmaker #Storytelling #VisualStorytelling #PhotographyForChange #SocialChange #PhotoStories #TouchALifeFoundation
-
938
కొన్ని త్యాగాలు చేస్తే కోటీశ్వరులు అవ్వొచ్చు! | Smart Money Mindset Telugu - 5
కోటీశ్వరులు అవ్వాలంటే కొన్ని త్యాగాలు చెయ్యాల్సిందే!మనలో చాలామంది ఎక్కువ డబ్బు సంపాదించి, ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. కానీ డబ్బు సంపాదించడం మాత్రమే కాదు… దాన్ని ఎలా ఖర్చు చేస్తున్నాం, ఎలా పొదుపు చేస్తున్నాం, ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాం అన్నది కూడా చాలా ముఖ్యం. ఈరోజు మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే… రేపటి మన ఆర్థిక పరిస్థితిని ప్రభావం చేస్తాయి.అందుకే… ఈ పాడ్‌కాస్ట్‌లో Wealth Creation కోసం అవసరమైన Discipline, Patience, Compounding, Financial Literacy గురించి ఈ Smart Money Mindset - Telugu పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు… ప్రముఖ ఫైనాన్షియల్ అడ్వైజర్ మాధవి లత గారు! మనం చేసే Quiet Sacrifices ఎందుకు ముఖ్యమైనవి? Lifestyle Upgrade కంటే Asset Upgradeకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలి? ఇతరులను అనుసరించడం కాకుండా మన ఆర్థిక లక్ష్యాల కోసం కొత్తగా ఎలా ఆలోచించాలి? అలాగే, మన టైమ్ ను సరిగ్గా ఉపయోగించుకోవడం, Financial Knowledge ను పెంచుకోవడం ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో కూడా ఈ పాడ్‌కాస్ట్‌లో తెలుసుకోవచ్చు.కాబట్టి. మిస్ అవ్వకండి.. తప్పకుండా వినండి!Earning money is one thing… but building lasting wealth requires discipline and sacrifice!Many of us want to become financially successful, but wealth creation requires more than just earning a salary. It demands discipline, patience, smart financial decisions, and the willingness to make sacrifices that may not be visible or appreciated by others.In this podcast, explore the importance of discipline, compounding, financial literacy, patience, and delayed gratification in building long-term wealth. Discover why correcting financial mistakes early, prioritising asset upgrades over lifestyle upgrades, avoiding unnecessary spending, investing time in financial knowledge, and being willing to take a different path can make a major difference to your financial future.If you want to understand the real price of financial freedom and build wealth for the long term, don't miss this insightful podcast!Host: Madhavi Latha#TALRadioTelugu #WealthCreation #FinancialFreedom #FinancialLiteracy #FinancialEducation #PersonalFinance #MoneyManagement #Investing #Compounding #WealthMindset #MoneyMindset #FinancialPlanning #SmartMoney #InvestmentTips #WealthBuilding #FinancialGrowth #MoneyHabits #Discipline #FinancialIndependence #TouchALifeFoundation
-
937
ఆత్మ విశ్వాసం, ధైర్యం, సంకల్పం ఉంటే చాలు... విజయం మీదే! | శ్రీమతి అభినందన భవాని | అంతరంగాలు - 2
తన జీవితాన్ని మార్చుకోవడమే కాదు… తనతో పాటు ఎంతోమంది జీవితాలను మార్చారు!పరిస్థితులు ఎలా ఉన్నా… ఆత్మవిశ్వాసంతో తన దారిని తానే నిర్మించుకున్నారు… శ్రీమతి అభినందన భవాని గారు!ఈ “అంతరంగాలు” కార్యక్రమంలో… తన జీవితంలో ఎదురైన సవాళ్లు, వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగిన తీరు, 40 ఏళ్లుగా కొనసాగిస్తున్న సేవా ప్రయాణం గురించి, అభినందన సంస్థ చేస్తున్న పనుల గురించి, అప్నా ఘర్ ద్వారా పిల్లలకు విద్య, వసతి అందించడం వంటి తన ప్రయాణంలోని ఎన్నో విశేషాలను స్వయంగా వారే మనతో పంచుకున్నారు.తాను ఎదగడమే కాదు… తనతో పాటు మరెందరో ఎదగాలనే ఆలోచనతో సాగిన భవాని గారి స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని తెలుసుకోవాలంటే ఈ ప్రత్యేక పాడ్కాస్ట్ ను తప్పక వినండి! మిస్ అవ్వకండి!She didn’t just transform her own life… she went on to transform the lives of many others too!No matter what the circumstances were, she built her own path with courage and confidence… Smt. Abhinandana Bhavani Garu!In this episode of “Antharangalu,” she shares her journey of overcoming challenges, her 40-year-long journey of service, the work being done through Abhinandana, and how Apna Ghar is providing education and accommodation to children.To know more about Bhavani Garu’s inspiring journey, one that is not just about her own growth, but also about helping many others grow along with her, don't miss this special podcast!Guest: Smt. Abhinandana Bhavani Host: Dr. Gurajada Shobha Perindevi#TALRadio #Antharangalu #AbhinandanaBhavani #Abhinandana #ApnaGhar #SocialService #WomenEmpowerment #InspiringJourney #SocialImpact #ServiceToSociety #EducationForAll #TouchALifeFoundation
-
936
అందమైన నవ్వుతో ఆత్మవిశ్వాసం... అందరికీ సాధ్యమే! | Dr. Srinivas Nayak | Health Talk
చిరునవ్వు… మన వ్యక్తిత్వానికి అందాన్ని మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసాన్ని కూడా ఇస్తుంది!అలాంటి చిరునవ్వుకు కారణమైన దంతాల ఆరోగ్యాన్ని మనలో చాలా మంది అంతగా పట్టించుకోరు. పంటి నొప్పి వచ్చినప్పుడే డెంటిస్ట్‌ను కలుస్తుంటారు. కానీ పళ్ల మధ్య ఆహారం ఇరుక్కోవడం, చల్లగా లేదా వేడిగా ఏదైనా తిన్నప్పుడు సెన్సిటివిటీ రావడం, బ్రష్ చేసేటప్పుడు చిగుళ్ల నుంచి రక్తం రావడం లాంటి చిన్న చిన్న లక్షణాలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు అంటున్నారు… ప్రముఖ డెంటిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ నాయక్ గారు!మరి అసలు దంతాల్లో క్యావిటీస్ ఎందుకు వస్తాయి? చిగుళ్ల నుంచి రక్తం రావడం దేనికి సంకేతం? పిల్లల దంతాల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సరైన టూత్ బ్రష్, టూత్‌పేస్ట్‌ను ఎలా ఎంచుకోవాలి? అలాగే Root Canal, Dental Implants, Aligners, Smile Designing, Laser Dentistry వంటి ఆధునిక చికిత్సల గురించి ఈ Health Talks కార్యక్రమంలో మనతో పంచుకున్నారు… శ్రీనివాస్ గారు!దంతాల ఆరోగ్యానికి సంబంధించిన అపోహలు–వాస్తవాలు, రోజూ పాటించాల్సిన జాగ్రత్తలు, ఆధునిక డెంటల్ టెక్నాలజీల గురించి తెలుసుకోడానికి… ఈ పాడ్కాస్ట్ ను తప్పక వినండి! మిస్ అవ్వకండి!A smile not only adds beauty to our personality but also boosts our confidence!Yet, many of us don’t pay enough attention to the dental health behind that smile. We often visit a dentist only when we experience severe tooth pain. But even small signs like food getting stuck between the teeth, sensitivity to hot or cold foods, or bleeding gums while brushing should not be ignored, says renowned dentist Dr. Srinivas Nayak.Why do cavities develop in our teeth? What does bleeding from the gums indicate? How should we take care of children’s dental health? How do we choose the right toothbrush and toothpaste? Dr. Srinivas Nayak shares valuable insights on these topics, along with modern treatments such as Root Canal Treatment, Dental Implants, Aligners, Smile Designing, and Laser Dentistry, in this Health Talks episode.From dental myths and facts to everyday oral care practices and the latest dental technologies, this podcast covers everything you need to know for a healthier smile. Tune in and don’t miss it!Guest: Dr. Srinivas NayakHost: Adarsh#TALRadioTelugu #DentalHealth #OralHealth #DentalCare #HealthySmile #Dentist #DrSrinivasNayak #HealthTalks #RootCanal #DentalImplants #LaserDentistry #Cavities #Toothbrush #Toothpaste #OralHygiene #TALRadio #TouchALifeFoundation
-
935
నాలుగు ఇంగ్లీష్ పదాలు నేర్చుకొని వెళ్లి... ఇంగ్లీష్ నవలా రచయితగా! | Hema Macherla | మన రచయితలు | Season - 2 | Episode - 9
ఇంగ్లీష్ ఏ మాత్రం రాని ఆమె... అదే భాషలో నవలలు రాసి అంతర్జాతీయ గుర్తింపు పొందారు!వరంగల్ జిల్లా ఆత్మకూరులో పుట్టి పెరిగిన హేమా మాచర్ల గారు... చిన్నప్పటి నుంచే తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతో రచన వైపు అడుగులు వేశారు. తెలుగులో కథలు రాస్తూ మొదలైన ఆమె రచనా ప్రయాణం... పెళ్లి తర్వాత లండన్‌కు వెళ్లడంతో పూర్తిగా మలుపు తిరిగింది.ఇంగ్లీష్ నేర్చుకోవాలనే పట్టుదలతో... పిల్లల పుస్తకాలు, నవలలు చదువుతూ, డిక్షనరీ సాయంతో భాషపై పట్టు సాధించారు. ఆ తర్వాత అదే ఇంగ్లీష్‌లో Breeze from the River Manjeera వంటి మొదలైన నవలలు రాసి... National Reading Hero Awardతో పాటు ఎన్నో అంతర్జాతీయ గుర్తింపులు పొందారు. ఆమె రాసిన మూడు నవలలు ఫ్రెంచ్‌లోకి అనువాదం అవ్వడమే కాకుండా... Letters in the Sand అనే రచనకు Franco-Indian Literary Award కూడా లభించింది.ఇంగ్లీష్ నేర్చుకుంటూ... రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకొని, అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన హేమ గారి ఈ ప్రయాణం వెనుక ఎన్నో ఆసక్తికరమైన అనుభవాలు ఉన్నాయి. మరి అసలు ఇంగ్లీష్ నేర్చుకోవడం నుంచి రచయితగా ఎదిగే వరకు ఆమె ప్రయాణం ఎలా సాగింది? ఈ ప్రయాణంలో ఆమెకు అండగా నిలిచిన వ్యక్తులు ఎవరు? నిజ జీవిత అనుభవాలను కథలుగా మలచడానికి ఆమెను ప్రేరేపించినది ఏమిటి? రచయితలకు చదవడం ఎందుకు ముఖ్యమని ఆమె భావిస్తున్నారు?ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను, తన రచనా ప్రయాణంలోని అనుభవాలను, కొత్త రచయితలకు అందించిన విలువైన సూచనలను ఈ వారం “మన రచయితలు” పాడ్కాస్ట్ లో స్వయంగా హేమా మాచర్ల గారు మనతో పంచుకున్నారు.She didn't know a word of English... yet she went on to write novels in that very language and achieve international acclaim!Born and raised in Atmakur, Warangal district, Hema Macherla took her first steps into writing during childhood, inspired by her mother's encouragement. Her literary journey began with writing short stories in Telugu, but it took a dramatic turn when she moved to London after her marriage.Driven by a fierce determination to learn English, she mastered the language by reading children's books and novels with the constant help of a dictionary. She then went on to pen acclaimed English novels like Breeze from the River Manjeera, winning prestigious honors including the National Reading Hero Award. Beyond her English audience, three of her novels were translated into French, and her work Letters in the Sand earned the Franco-Indian Literary Award.Behind Hema's journey from learning a new language to establishing herself as an author on the global stage lie many fascinating experiences. How did her transformation unfold from a beginner in English to an international author? Who supported her along the way? What inspired her to shape real-life experiences into stories? And why does she believe reading is essential for any writer?Hema Macherla herself shares these compelling insights, personal experiences from her writing career, and valuable advice for emerging writers in this week's episode of the "Mana Rachayithalu" podcast.Guest: Hema MacherlaHost: Renu Sree#TALRadio #HemaMacherla #ManRachayithalu #TeluguWriters #TeluguLiterature #TeluguWriter #FrancoIndianLiteraryAward #NationalReadingHero #WomenWriters #IndianWriters #TeluguLiterature #TouchALifeFoundation
-
934
పిల్లలకి ప్రకృతి పాఠాలు... భవిష్యత్తుకు భరోసా! | Meghana Musunuri | స్ఫూర్తి కిరణాలు
పిల్లలకు పుస్తకాల్లోని పాఠాలు మాత్రమే కాదు…చుట్టూ ఉన్న ప్రకృతిని అర్థం చేసుకోవడం కూడా నేర్పాలి!అనే ఆలోచనతో… చదువుతో పాటు, పేరెంటింగ్, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో పని చేస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు… మేఘన ముసునూరి గారు!ఫౌంటెన్‌హెడ్ గ్లోబల్ స్కూల్ వ్యవస్థాపకురాలిగా, బోధివృక్ష ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్‌పర్సన్‌గా… అలాగే Save Water and Nature (SWAN) ద్వారా పిల్లల్లో పర్యావరణంపై అవగాహన పెంచుతూ, ప్రకృతి పరిరక్షణకు కృషి చేస్తున్నారు.పిల్లలతో కలిసి ప్రకృతి పరిరక్షణ కోసం ఎలాంటి పనులు చేయొచ్చు? పేరెంటింగ్‌ను ఒక స్కిల్‌గా ఎందుకు నేర్చుకోవాలి? పిల్లలకు పర్యావరణంపై అవగాహన కల్పించడం ఎందుకు ముఖ్యం? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు… మేఘన ముసునూరి గారు!విద్యతో పాటు జీవితాన్ని నేర్పించే ఈ స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని…అస్సలు మిస్ అవ్వకండి… తప్పకుండా వినండి!Children need more than just lessons from textbooks…They also need to learn how to understand and connect with the world around them!With this thought, Meghana Musunuri Garu has been inspiring many through her work in education, parenting, and environmental conservation.As the founder of Fountainhead Global School and Chairperson of Bodhi Vriksha Educational Society, she is also working through Save Water and Nature (SWAN) to create environmental awareness among children and encourage them to care for nature.How can children get involved in protecting nature? Why should parenting be learned as a skill? Why is it important to help children understand and care for the environment? Meghana Musunuri Garu shares her thoughts and experiences on these and many other interesting topics in this podcast.A truly inspiring journey that goes beyond education and teaches children about life…Don’t miss it… Give it a listen! Guest: Meghana Musunuri Host: Adarsh#TALRadio #SpurthiKiranalu #MeghanaMusunuri #SaveWaterAndNature #SWAN #Parenting #Education #EnvironmentalAwareness #TouchALifeFoundation
-
933
సంగీతం, సాహిత్యం, సామాజిక సేవ... ఇదే నా అంతరంగం! | శ్రీమతి హైమవతి భీమన్న | అంతరంగాలు - 1
గొప్ప రచయితను అందరూ గుర్తుంచుకుంటారు...కానీ వారి రచనలను తరతరాలకు చేరవేయడానికి జీవితాన్ని అంకితం చేసిన ఈ వ్యక్తి గురించి మీకు తెలుసా?వారే... పద్మశ్రీ బోయి భీమన్న గారి సతీమణి, రచయిత్రి, కవయిత్రి హైమావతి భీమన్న గారు!ఈ మన “అంతరంగాలు” కార్యక్రమంలో భాగంగా ఆమె తన సాహిత్య ప్రయాణం గురించి, ఆకాశవాణితో ఉన్న అనుబంధం గురించి, భీమన్న గారి సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు స్థాపించిన భీమన్న సాహిత్య ఫౌండేషన్ గురించి, గురువుగా గడిపిన అనుభవాలు, జీవితంలో నేర్చుకున్న విలువైన పాఠాల గురించి ఎన్నో విషయాలు ఆప్యాయంగా మనతో పంచుకున్నారు.సాహిత్యం, జీవిత విలువలు, స్ఫూర్తిదాయకమైన అనుభవాలను ఇష్టపడే ప్రతి ఒక్కరూ తప్పకుండా వినాల్సిన పాడ్కాస్ట్ ఇది!Everyone remembers a great writer...But do you know about the woman who dedicated her life to keeping his writings alive for future generations?She is Hymavathi Bheemanna, wife of Padma Shri Boyi Bheemanna, and a writer and poet herself.In our “Antharangalu” program, she shares her journey as a writer, her connection with All India Radio, the Bheemanna Sahithya Foundation she started to take Bheemanna’s works to more people, her experiences as a teacher, and the valuable lessons she learned in life.If you love literature, inspiring stories, and life lessons, this is a podcast you should not miss!Tune in and listen!Guest: Smt. Hymavathi Bheemanna Host: Dr. Gurajada Shobha Perindevi#TALRadio #Antharangalu #HymavathiBheemanna #BoyiBheemanna #TeluguLiterature #TeluguWriters #TeluguPoetry #Literature #IndianLiterature #WomenWriters #InspiringStories #LifeLessons #AllIndiaRadio #BheemannaSahithyaFoundation #TouchALifeFoundation
-
932
Breastfeeding కేవలం తల్లి బాధ్యత మాత్రమే కాదు! | Dr. Preethi Urandur | Health Talk
తల్లిపాలు శిశువు ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనవి. కానీ పాలు ఇవ్వడం అనేది ఒక్క తల్లి బాధ్యత మాత్రమే కాదు. కుటుంబ సహకారం, వైద్యుల సూచనలు, పబ్లిక్ ప్లేసెస్ లో ఉండే సౌకర్యాలు, సమాజం నుంచి లభించే మద్దతు... ఇవన్నీ తల్లి తన బిడ్డకు పాలివ్వడాన్ని సులభతరం చేస్తాయి.అందుకే ఈ Health Talk పాడ్కాస్ట్ లో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రీతి గారు తల్లిపాలపై ఉన్న అపోహల గురించి, తల్లులు ఎదుర్కొనే సవాళ్లు, శాస్త్రీయంగా నిర్ధారించబడిన విషయాలు, అలాగే ప్రతి కుటుంబం తప్పకుండా తెలుసుకోవాల్సిన అంశాల గురించి ఎన్నో విషయాలు మనతో పంచుకున్నారు.తప్పకుండా వినండి.. మిస్ అవ్వకండి!Breastfeeding is very important for a baby’s health. But breastfeeding is not the sole responsibility of the mother. Support from family, guidance from doctors, facilities in public places, and support from society can all make it easier for a mother to breastfeed her baby.That’s why, in this Health Talk podcast, renowned gynecologist Dr. Preethi shares valuable insights on common myths about breastfeeding, the challenges mothers face, scientifically backed facts, and important things every family should know.Do listen till the end… don’t miss it!Guest: Dr.Preethi Urandur Host: Adarsh#TALRadio #Breastfeeding #BreastfeedingAwareness #BreastfeedingSupport #MaternalHealth #NewbornHealth #MotherAndBaby #ParentingTips #HealthTalk #HealthPodcast #Gynecology #WomenHealth #BabyHealth #BreastfeedingMyths #touchalifefoundation
-
931
ఆటిజం పిల్లల కోసం ఓ అమ్మ చూపిన ప్రత్యేక ప్రపంచం! | స్ఫూర్తి కిరణాలు
తన బిడ్డ కోసం మొదలైన ప్రయాణం... ఇప్పుడు ఎంతో పిల్లల జీవితాల్లో మార్పు తీసుకొస్తోంది!ఒక తల్లిగా తన కుమారుడికి ఆటిజం ఉందని తెలుసుకున్న తర్వాత... ఎన్నో సవాళ్లు, ఒంటరితనం, కష్టాలను ఎదుర్కొన్నారు డాక్టర్ అనురాధ గారు. కానీ ఆ అనుభవాలనే ఆసరాగా మార్చుకొని... తనలాంటి కుటుంబాలకు తోడుగా ఉండాలనే సంకల్పంతో Bridging Brains సంస్థను ప్రారంభించారు.ఈ సంస్థ ద్వారా ఆటిజం, న్యూరోడైవర్జెంట్ పిల్లలకు ఆటలు, ఆర్ట్స్ & క్రాఫ్ట్స్, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు... తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు, వర్క్‌షాప్స్, యోగా, మెడిటేషన్, నిపుణులతో ప్రత్యేక సెషన్లు నిర్వహిస్తూ వారికి అవసరమైన మద్దతును అందిస్తున్నారు.ఒక తల్లి వ్యక్తిగత పోరాటంతో మొదలైన ఈ ప్రయాణం... ఇప్పుడు ఎన్నో కుటుంబాల్లో ఆశను, ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. మరి అసలు Bridging Brains సంస్థ ఎలా ప్రారంభమైంది? ఈ ప్రయాణంలో ఎదురైన సవాళ్లు ఏమిటి? తల్లిదండ్రులు, సమాజం కలిసి ఎలా మార్పు తీసుకురాగలరు? ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలను డాక్టర్ అనుపమ గారు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు.తప్పకుండా వినండి... మిస్ అవ్వకండి!A journey that began for her son... is now transforming the lives of many children.When Dr. Anuradha learned that her son was autistic, she faced many challenges, loneliness, and uncertainty. Instead of giving up, she turned her personal experience into a mission and founded Bridging Brains to support children with autism and neurodivergent conditions, along with their families.Through the organization, she provides play-based learning, arts & crafts, skill development programs for children, and awareness sessions, workshops, yoga, meditation, and expert guidance for parents.How did Bridging Brains begin? What challenges did she face along the way? How can parents and society work together to build a more inclusive world for neurodivergent children?In this inspiring podcast, Dr. Anuradha shares her journey, valuable insights, and practical guidance.Don't miss this meaningful conversation. Listen now!Guest: Dr. AnuradhaHost: Renu Sree#TALRadio #SpurthiKiranalu #BridgingBrains #AutismAwareness #Neurodiversity #ParentSupport #SpecialNeeds #InclusiveCommunity #SocialImpact #TouchALifeFoundation
-
930
రాయటం నా ఊపిరి - తెలుగు నా ప్రాణం | సత్యం మందపాటి | మన రచయితలు | Season - 2 | Episode - 8
చదివే అలవాటు... ఒక సాధారణ విద్యార్థిని సైతం ప్రముఖ రచయితగా మారుస్తుంది!ప్రముఖ రచయిత సత్యం మండపాటి గారి జీవితం ఇందుకు ఒక మంచి ఉదాహరణ. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో ఇంజినీర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి... అమెరికాలో ప్రముఖ సెమీకండక్టర్ సంస్థలో వైస్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు. అయితే... ఎంత బిజీ ఉద్యోగ జీవితంలో ఉన్నా, తెలుగు సాహిత్యంపై ఉన్న ప్రేమను మాత్రం ఎప్పుడూ వదల్లేదు. కథలు, నవలలు, వ్యాసాలు, నాటకాలు, పాటలు రచిస్తూ... అమెరికా తెలుగు సాహిత్యంలో తనదైన ముద్ర వేశారు.చదివే అలవాటు ఒక రచయితను ఎలా తీర్చిదిద్దుతుంది? నిజ జీవిత సంఘటనలనే కథలుగా ఎందుకు ఎంచుకున్నారు? అమెరికాలో స్థిరపడిన తర్వాత కూడా తెలుగులోనే ఎందుకు రచనలు కొనసాగించారు? విదేశాల్లోని తెలుగు వారి జీవితాన్ని పుస్తకాల రూపంలో ఎందుకు తీసుకువచ్చారు?ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను, తన రచనా ప్రయాణంలోని మధురమైన జ్ఞాపకాలను, యువతకు ఆయన అందించిన విలువైన సందేశాలను ఈ వారం "మన రచయితలు" పాడ్కాస్ట్ లో స్వయంగా సత్యం మందపాటి గారు మనతో పంచుకున్నారు.తప్పకుండా వినండి... మిస్ అవ్వకండి!A simple reading habit can transform an ordinary student into a celebrated writer!The life of renowned Telugu writer Satyam Mandapati is a perfect example. He began his career as an engineer at the Vikram Sarabhai Space Centre and later rose to the position of Vice President at a leading semiconductor company in the United States. Yet, despite his demanding career, his love for Telugu literature never faded. Through stories, novels, essays, plays, and songs, he has created a unique place for himself in Telugu literature, especially among the Telugu community in the US.How did the habit of reading shape him into a writer? Why does he prefer real-life incidents as the inspiration for his stories? Why did he continue writing in Telugu even after settling in the United States? What inspired him to document the lives of Telugu people living abroad through his books?In this week's "Mana Rachayithalu" podcast, Satyam Mandapati shares his inspiring literary journey, memorable experiences, and valuable advice for today's youth.Don't miss this inspiring conversation. Listen now!Guest: Satyam MandapatiHost: Renu Sree#TALRadioTelugu #ManaRachayithalu #SatyamMandapati #TeluguWriter #TeluguLiterature #NRITelugu #TeluguAuthors #Podcast #TALRadio #TeluguBooks
-
929
పిల్లల మంచి భవిష్యత్తు కోసం వారి మనసును తెలుసుకుందాం! | Learning Curve Foundation | Sumathi Swapna | స్ఫూర్తి కిరణాలు
పిల్లలకు మార్కులు మాత్రమే కాదు...మనసును అర్థం చేసుకోవడం కూడా చాలా అవసరం!అనే లక్ష్యంతో... పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తుంది… Learning Curve Foundation! ఈ సంస్థ చదువుతో పాటు భావోద్వేగాలను అర్థం చేసుకోవడం, ఇతరులతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడం వంటి జీవిత నైపుణ్యాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. Social & Emotional Learning ద్వారా వేలాది మంది విద్యార్థుల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్న ఆ సంస్థ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ సుమతి స్వప్న గారు ఈ వారం మన 'స్ఫూర్తి కిరణాలు' పాడ్కాస్ట్ లో!పిల్లల భావోద్వేగ వికాసం ఎందుకు అంత ముఖ్యమైనది? కోపం, ఒత్తిడి, ఆందోళన వంటి భావాలను పిల్లలు ఎలా ఎదుర్కోవాలి? తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు అండగా ఎలా నిలవాలి? సోషల్ & ఎమోషనల్ లర్నింగ్ పిల్లల జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకువస్తుంది?ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు...అస్సలు మిస్ అవ్వకండి... తప్పకుండా వినండి!It's not just about helping children score good marks...It's also about understanding their emotions!With this vision, Learning Curve Foundation is helping children build confidence and essential life skills. Along with academics, the organization focuses on Social & Emotional Learning (SEL), enabling children to understand their emotions, build healthy relationships, and grow into confident individuals.This week on "Sphoorthi Kiranalu", we are joined by Sumathi Swapna, Chief Operations Officer of Learning Curve Foundation.Why is emotional development so important for children? How can they cope with emotions like stress, anger, and anxiety? How can parents and teachers support them? And how does Social & Emotional Learning create a lasting impact in children's lives?She shares valuable insights on all these topics and much more in this inspiring conversation.Don't miss this episode tune in now!Guest: Sumathi SwapnaHost: Bharath#TALRadio #SpurthiKiranalu #LearningCurveFoundation #SumathiSwapna #SocialEmotionalLearning #SEL #ChildDevelopment #EmotionalWellbeing #EducationBeyondMarks #Parenting #Teachers #StudentLife #LifeSkills #MentalWellbeing TouchALifeFoundation
-
928
ఆలోచనలు మార్చుకుంటే ఆర్ధిక అభివృద్ధి సులభం! | Smart Money Mindset Telugu - 4
డబ్బు సంపాదించడం కంటే... డబ్బు గురించి ఎలా ఆలోచిస్తున్నామన్నదే ముఖ్యం!ఒకే ఉద్యోగం... ఒకే జీతం... అయినా కొందరు ఆర్థికంగా ముందుకు వెళ్తుంటే, మరికొందరు మాత్రం అదే స్థాయిలో ఉంటుంటారు. దీనికి కారణం కేవలం ఆదాయం కాదు... మనం ఎలా ఆలోచిస్తున్నాం అన్నది కూడా చాలా ముఖ్యం!అందుకే… ఈ Smart Money Mindset - Telugu పాడ్కాస్ట్‌లో… అసలు Wealth Mindset అంటే ఏమిటి? Scarcity Mindset నుంచి ఎలా బయటపడాలి? డబ్బు గురించి ఎలా ఆలోచించాలి? ఆర్థిక విద్య ఎందుకు అవసరం? చిన్న చిన్న అలవాట్లు ఎలా పెద్ద ఆర్థిక మార్పులకు దారి తీస్తాయి? ఇలాంటి ఎన్నో విషయాలను ఈ Smart Money Mindset - Telugu పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు… ప్రముఖ ఫైనాన్షియల్ అడ్వైజర్ మాధవి లత గారు!డబ్బు గురించి మీ ఆలోచనలను మార్చే ఈ పాడ్కాస్ట్ను తప్పకుండా వినండి!Making money is important...But the way you think about money matters even more!Two people may have the same job and earn the same salary, yet one builds wealth while the other stays in the same place. The difference isn't just income—it's their mindset toward money.In this Smart Money Mindset - Telugu podcast, renowned financial advisor Madhavi Latha explains what a Wealth Mindset really is, how to overcome a Scarcity Mindset, how to develop a healthy relationship with money, why financial education is essential, and how small daily habits can lead to long-term financial growth.If you want to transform the way you think about money and build a stronger financial future, don't miss this insightful podcast! Host: Madhavi Latha#TALRadioTelugu #SmartMoneyMindsetTelugu #MoneyMindset #WealthMindset #FinancialLiteracy #FinancialEducation #PersonalFinance #MoneyManagement #WealthCreation #FinancialFreedom #Investing #MoneyHabits #MindsetMatters #FinancialGrowth #SmartMoney #MadhaviLatha #TouchALifeFoundation
-
927
మన్యం బిడ్డల కలలు వికసించే చోటు! | Bheem Children's Happiness Centre | స్ఫూర్తి కిరణాలు
చదువు తన జీవితాన్ని మార్చింది... ఇప్పుడు అతను వందల మంది గిరిజన పిల్లల జీవితాలను మారుస్తున్నాడు!ఒకప్పుడు గిరిజన గ్రామంలోని గుడిసె పాఠశాలలో చదువుకున్న సంతోష్ ఎస్రం గారు... తనలాంటి పిల్లలకు కూడా మంచి చదువు అందాలని కలలు కన్నారు. ఆ ఆలోచనే ఇప్పుడు Bheem Children's Happiness Centre రూపంలో వందలాది గిరిజన పిల్లలకు ఆశగా మారింది.ఈ కేంద్రం ద్వారా మారుమూల గిరిజన పిల్లలకు చదువు చెప్పడం, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం, వారి భాషా సంస్కృతులను కాపాడుతూ అవకాశాలను కల్పించడం.. తమ సంప్రదాయాలను మరువకుండా తర్వాతి తరాల వారిని ప్రోత్సహించడం… ఇలాంటి ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఒక చిన్న గిరిజన గ్రామం నుంచి మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు వందలాది మంది పిల్లల జీవితాల్లో మార్పు తీసుకొస్తోంది. మరి అసలు ఈ ఆలోచన ఎలా పుట్టింది? ఈ సంస్థ ఎలా ప్రారంభమైంది? ఈ ప్రయాణంలో ఎదురైన సవాళ్లు ఏమిటి? వంటి ఎన్నో ఆసక్తికర విషయాలను సంతోష్ ఎస్రం గారు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు.తప్పకుండా వినండి మిస్ అవ్వకండి!Education changed his life... Now, he's transforming the lives of hundreds of tribal children!Santosh Esram, who once studied in a small hut school in a tribal village, dreamed of ensuring that children like him would have access to quality education. That dream has now become a reality through the Bheem Children's Happiness Centre, bringing hope to hundreds of tribal children.The centre provides education to children in remote tribal communities, builds their confidence, creates opportunities while preserving their language and culture, and encourages the younger generation to stay connected to their rich traditions through various unique initiatives.What began as a small dream in a tribal village is now creating a lasting impact in the lives of hundreds of children.How did this idea begin? How was the organisation started? What challenges did Santosh Esram face along the way?He shares his inspiring journey and many more fascinating insights in this podcast.Don't miss it. Tune in now!Guest: Santosh EsramHost: Kalyani#TALRadio #SpurthiKiranalu #SantoshEswaram #BheemChildrensHappinessCentre #TribalEducation #GirijanaChildren #EducationForAll #SocialImpact #RuralEducation #InspiringStories #TouchALifeFoundation
-
926
మీ మనసు చెప్పేది వినండి! | Dr. Konganti Prashanth | Health Talk
మీరు చివరిసారి మనస్ఫూర్తిగా నవ్వి, ప్రశాంతంగా నిద్రపోయి ఎన్ని రోజులైంది?ఈరోజుల్లో ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ ప్రభావితం చేస్తున్నాయి. మరి ఇవి సాధారణ పరిస్థితులేనా? లేక మన మానసిక ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చిందనే అనుకోవాలా?ఈ TAL Health Talks ఎపిసోడ్‌లో రము సైకియాట్రిస్ట్ డా. కొంగంటి ప్రశాంత్ గారు మానసిక ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో ముఖ్యమైన విషయాలను మనతో పంచుకున్నారు.మానసిక అనారోగ్య లక్షణాలు, థెరపీపై ఉన్న అపోహలు, వాస్తవాలు, ఒత్తిడిని తగ్గించే సులభమైన పద్ధతులు, Box Breathing, Sleep Hygiene, మంచి నిద్ర, సరైన ఆహారం, వ్యాయామం ప్రాముఖ్యత వంటి ఎన్నో అంశాలపై విలువైన సమాచారం అందించారు.మానసిక ఆరోగ్యం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఉపయోగకరమైన సమాచారం ఇది. మీ కోసం మాత్రమే కాదు... మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, మీకు ఇష్టమైన వారి కోసం కూడా ఈ ఎపిసోడ్‌ను తప్పక వినండి.మనసు ఆరోగ్యంగా ఉంటేనే జీవితం ఆనందంగా ఉంటుంది.When was the last time you laughed wholeheartedly and enjoyed a truly peaceful night's sleep?These days, stress, anxiety, and sleep problems are affecting people of all ages. But are these just a normal part of modern life, or are they signs that it's time to pay closer attention to our mental health?In this episode of TAL Health Talks, renowned psychiatrist Dr. Konganti Prashanth shares valuable insights on various aspects of mental well-being.He discusses the common signs of poor mental health, when it is important to consult a psychiatrist, the myths and facts surrounding therapy, simple techniques to manage stress, and the benefits of practices like Box Breathing and Sleep Hygiene. The conversation also highlights the importance of quality sleep, a balanced diet, regular physical activity, and maintaining healthy relationships for overall mental wellness.This episode is packed with practical information that everyone should know about mental health. It's not just for you it's also for your family members, friends, and loved ones.Because a healthy mind is the foundation of a happy life.Guest: Dr. Konganti PrashanthHost: Kalyani#TALRadio #TALHealthTalks #MentalHealth #MentalWellness #DrPrashanth #Psychiatry #StressManagement #AnxietyAwareness #DepressionAwareness #SleepHealth #MentalHealthMatters #HealthyMind #EmotionalWellbeing #HealthAwareness #TouchALifeFoundation
-
925
ఒక్క పరీక్ష... పది తరాలకి రక్ష! | Minnum Reddy Sahithi | CHARCHA With Real Leader - 15
ప్రతి 15 రోజులకోసారి రక్తం ఎక్కించుకోవాల్సిన పరిస్థితి...ఒక కుటుంబం అనుభవించిన బాధ... మరెవ్వరికీ రాకూడదనే సంకల్పం...ఆ సంకల్పమే మినుమ్ రెడ్డి సాహితి గారిని తలసేమియాపై అందరికీ అవగాహన కల్పించేలా చేసింది. అంతేకాకుండా ప్రజారోగ్యం, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ వంటి ఎన్నో రంగాల్లో సేవలందిస్తూ, Real Impact Innovations ద్వారా సామాజిక మార్పు కోసం కృషి చేస్తున్నారు.అసలు తలసేమియా అంటే ఏమిటి? ఈ వ్యాధిని పూర్తిగా తగ్గించడం సాధ్యమేనా? పెళ్లికి ముందు లేదా గర్భధారణకు ముందు రక్త పరీక్ష చేసుకోవడం ఎందుకు అంత ముఖ్యమైంది? రక్తదానం ఎందుకు ప్రాణదానంతో సమానం? ఇలాంటి ఎన్నో విషయాలను ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు.South India’s CSR Summit వారి భాగస్వామ్యంతో TALRadio నిర్వహిస్తున్న ఈ "Charcha With Real Leaders" కార్యక్రమంలో...Real Impact Innovations ఫౌండర్ మినుమ్ రెడ్డి సాహితి గారి ప్రయాణం... వారి మాటల్లోనే మీకోసం!Having to undergo a blood transfusion every 15 days...The pain and challenges faced by one family became the driving force behind a mission to ensure that no one else has to go through the same struggle.That mission inspired Minum Reddy Sahithi to create awareness about Thalassemia and educate people on the importance of prevention and early screening. Beyond this cause, she has been actively working towards social impact through Real Impact Innovations, contributing to areas such as public health, rural development, and environmental sustainability.What exactly is Thalassemia? Is it possible to prevent this condition? Why are blood tests before marriage or pregnancy so important? And why is blood donation often described as a gift of life?In this podcast, she shares valuable insights on these important questions and much more.In association with South India’s CSR Summit, TALRadio presents another episode of "Charcha With Real Leaders" featuring the inspiring journey of Minum Reddy Sahithi, Founder of Real Impact Innovations.Watch now and hear her story in her own words.Guest: Minum Reddy Sahithi Host: Vinil Reddy#talkradio #charchawithrealleaders #SahithiMinumReddy #ThalassemiaAwareness #blooddonation #HealthAwarenessCampaign #realimpactinnovations #touchalifefoundation
-
924
పారిస్ లో పుట్టి... తెలుగు భాషను మెచ్చి... | మన రచయితలు | Season - 2 | Episode - 7
ఫ్రాన్స్‌లో పుట్టారు...కానీ తెలుగు భాషను ప్రేమించారు...తెలుగు నేర్చుకోవడమే కాదు, తెలుగు సాహిత్యాన్ని ఫ్రెంచ్ భాషలోకి అనువాదం చేస్తూ... ఫ్రాన్స్ విద్యార్థులకు తెలుగు బోధిస్తూ... రెండు దేశాల మధ్య భాషా, సాంస్కృతిక వారధిగా నిలిచారు ప్రముఖ ప్రొఫెసర్ డానియల్ నాజర్స్ గారు!బుర్రకథలపై పరిశోధనతో మొదలైన ఆయన ప్రయాణం... క్రమంగా తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతిపై అభిమానం పెంచుకున్నారు. స్వయంగా తెలుగు వారిని కలిసి, భాషను లోతుగా అధ్యయనం చేశారు. తెలుగు-ఫ్రెంచ్ డిక్షనరీ తయారు చేశారు, తెలుగు సాహిత్యాన్ని ఫ్రెంచ్ పాఠకులకు చేరవేయడంలో ఎంతో కృషి చేశారు. ప్రస్తుతం కూడా ఫ్రాన్స్‌లో విద్యార్థులకు తెలుగు బోధిస్తూ, తెలుగు భాషకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు.మరి అసలు… తెలుగు సాహిత్యాన్ని ఫ్రెంచ్‌లోకి ఎలా అనువదిస్తున్నారు? వేమన పద్యాలు, జానపద సాహిత్యం, తెలుగు సంస్కృతి గురించి ఆయన అభిప్రాయాలేమిటి? విదేశాల్లో తెలుగు భాష భవిష్యత్తుపై ఆయన ఏమంటున్నారు?ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలను ఈ వారం "మన రచయితలు" పాడ్కాస్ట్ లో స్వయంగా ప్రొఫెసర్ డానియల్ నాజర్స్ గారు మనతో పంచుకున్నారు.తప్పకుండా వినండి… మిస్ అవ్వకండి!Born in France...But fell in love with the Telugu language.Professor Daniel Najar, a renowned scholar, not only learned Telugu but also became a bridge between France and Telugu culture by translating Telugu literature into French and teaching Telugu to students in France.What began as a research interest in Burrakatha gradually grew into a deep admiration for Telugu language, literature, and culture. He interacted closely with Telugu-speaking communities, studied the language in depth, created a Telugu–French dictionary, and worked tirelessly to introduce Telugu literature to French readers.Even today, he continues to teach Telugu in France and remains committed to promoting the language and bringing it global recognition.How does he translate Telugu literature into French? What are his views on Vemana’s poetry, Telugu folklore, and Telugu culture? What does he think about the future of the Telugu language outside India?Professor Daniel Najar shares these fascinating insights and many more in this week's Mana Rachayitalu podcast.Don't miss this inspiring conversation. Listen now!Guest: Professor Daniel NajarHost: Renu Sree #TALRadioTelugu #ManaRachayithalu #DanielNeyers #DanielNazers #FrenchScholar #TeluguLanguage #TeluguLiterature #FrenchAndTelugu #TeluguLovers #ManaRachayithaluPodcast #TALRadio
-
923
మీ లైఫ్ ను మార్చగలిగే 12 అలవాట్లు! | Smart Money Mindset - Telugu | Episode - 3
మీ జీవితాన్ని మార్చే అవకాశాలు మీ ముందే ఉన్నా... వాటిని మీరు గుర్తించలేకపోతున్నారా?అవకాశాలు చేజారిపోవడం, ఇంటర్వ్యూలో ఫెయిల్ అవ్వడం, అనుకున్న పనులు చేయకపోవడం... వీటి వల్ల ఆ సమయంలో కొంచం బాధగా అనిపించినా, కొన్నిసార్లు అవే మన కోసం మంచి అవకాశాలను సృష్టిస్తాయి.పాజిటివ్‌గా ఆలోచించడం, మనల్ని మనం ప్రోత్సహించుకోవడం, స్పందించే ముందు కాసేపు ఆలోచించడం, మన ఎనర్జీని సరైన వాటిపై ఖర్చు చేయడం, గోల్స్ కంటే సిస్టమ్స్‌పైనే ఫోకస్ పెట్టడం... ఇలాంటి ఎన్నో విషయాలను ఈ Smart Money Mindset - Telugu పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు… ప్రముఖ ఫైనాన్షియల్ అడ్వైజర్ మాధవి లత గారు!మన ఎదుగుదల, మన విజయాలు, మన సంబంధాలు... ఇవన్నీ ఒక్కరోజులో ఏమీ మారవు. కానీ మన ఆలోచనల్లో, అలవాట్లలో వచ్చే చిన్న మార్పులే... మంచి మార్పుకు దారి తీస్తాయి. మీ ఆలోచనలను మరింత బలంగా, మీ జీవితాన్ని మరింత అర్థవంతంగా మార్చే ఈ ఎపిసోడ్‌ను తప్పకుండా వినండి… మిస్ అవ్వకండి!Are opportunities that could change your life right in front of you, yet going unnoticed?Missing out on opportunities, failing interviews, or not achieving the things you hoped for can feel disappointing at the time. But sometimes, those very setbacks create the path to something even better.In this episode of the Smart Money Mindset – Telugu podcast, renowned financial advisor Madhavi Latha shares valuable insights on the power of positive thinking, encouraging yourself, pausing before reacting, investing your energy in the right things, and focusing on systems rather than just goals.Our growth, success, and relationships do not transform overnight. However, small changes in our mindset and daily habits can lead to meaningful improvements over time.Don’t miss this inspiring conversation that can help you build a stronger mindset and create a more fulfilling life.Host: Madhavi LathaSource: https://www.youtube.com/@Smartmoneymindsettelugu#TALRadioTelugu #SmartMoneyMindsetTelugu #PositiveThinking #GrowthMindset #SuccessHabits #SelfDevelopment #PersonalGrowth #MindsetMatters #Motivation #Productivity #LifeLessons #FinancialWisdom #SmartMoneyMindset #TALRadio #TouchALifeFoundation
-
922
బతుకమ్మ పుట్టింది మా ఊరిలోనే! | Dr. Vangala Shanthi Krishna | మా ఊరు - 79
బతుకమ్మ పుట్టిన నేల...కాకతీయుల నాటి చరిత్ర...కోహినూర్ వజ్రంతో అనుబంధం ఉన్న గ్రామం... మాది!అంటూ… ఈ వారం ‘మా ఊరు’ పాడ్కాస్ట్ లో డా. వంగాల శాంతి కృష్ణ గారు తన స్వగ్రామం చౌటపల్లి గ్రామ విశేషాలను, చిన్ననాటి జ్ఞాపకాలను, జీవిత ప్రయాణాన్ని మనతో పంచుకున్నారు.వరంగల్ జిల్లాలోని చౌటపల్లి గ్రామంలో జన్మించిన ఆయన… చిన్ననాటి అనుభవాలు, అమ్మమ్మ - తాతయ్యల ప్రేమ, గ్రామీణ సంస్కృతి, కళల పట్ల ఉన్న ఆసక్తి తన జీవితాన్ని ఎలా ముందుకు నడిపించాయో చెప్తూ... తెలంగాణ జానపద కళలు, బతుకమ్మ, కూచిపూడి చరిత్రపై తాను చేసిన పరిశోధనల గురించి, 54 దేశాల్లో తెలుగువారి సంస్కృతిని ప్రచారం చేసిన అనుభవాలను గురించి కూడా మనతో పంచుకున్నారు.మన మూలాలను, మన ఊరి కథలను గుర్తు చేసే.. ఈ అందమైన పాడ్కాస్ట్ ను తప్పక వినండి… మిస్ అవ్వకండి!The land where Bathukamma was born...A village connected to the history of the Kakatiyas...And a place associated with the legendary Kohinoor diamond... that's my village!In this week's Maa Ooru podcast, Dr. Vangala Shanthi Krishna shares the unique history of her native village, Choutapalli, along with her childhood memories and inspiring life journey.Born in Choutapalli village of Warangal district, she speaks about how her early experiences, the love of her grandparents, the richness of rural culture, and her passion for the arts shaped her life. She also shares insights from her research on Telangana folk arts, Bathukamma, and the history of Kuchipudi, as well as her experiences promoting Telugu culture across 54 countries.A heartwarming conversation that reconnects us with our roots, our traditions, and the stories of our villages.Don't miss this beautiful podcast tune in now!Guest: Dr. Vangala Shanthi KrishnaHost: Ushaa#TALRadioTelugu #MaaOoruPodcast #DrVangalaShanthiKrishna #Choutapalli #Warangal #Telangana #Bathukamma #KakatiyaHistory #KohinoorDiamond #TeluguCulture #TeluguHeritage #FolkArts #TelanganaCulture #Kuchipudi #IndianCulture #VillageStories #RuralLife #TeluguPodcast #InspiringStories #CulturalHeritage #TALRadio #TouchALifeFoundation
-
921
నేను చదవాలనుకున్న వాటినే కథలుగా రాశాను! | Ramesh Karthik Naik | CHARCHA With Real Leader - 14
"నేను చదవాలనుకున్న పుస్తకం ఎక్కడా కనిపించలేదు… అందుకే దాన్ని నేనే రాశాను…"అంటూ బంజారా సంస్కృతిని, జీవన విధానాన్ని తన రచనల ద్వారా అందరికీ తెలిసేలా చేశారు.. రమేశ్ కార్తీక్ నాయక్!తమ ప్రజల జీవితం, సంస్కృతి గురించి చెప్పే కథలు చాలా తక్కువగా కనిపించడంతో... వాటిని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో రచనలు చేయడం ప్రారంభించారు.తండాల్లోని జీవితం, అక్కడి మనుషులు, వారి అనుభవాలను తన కథల ద్వారా పాఠకులకు చేరవేస్తూ... తెలుగు సాహిత్యంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఆ ప్రయాణంలోనే యువ సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న తొలి బంజారా రచయితగా నిలిచారు..!తన బాల్యం గురించి, హాస్టల్ జీవితం గురించి, తెలంగాణ ఉద్యమం, సాహిత్య ప్రయాణం వెనుక ఉన్న కథలను గురించి ఈ పాడ్కాస్ట్ ఎన్నో విషయాలు మనతో పంచుకున్నారు.South India’s CSR Summit వారి భాగస్వామ్యంతో TALRadio నిర్వహిస్తున్న "Charcha With Real Leaders" కార్యక్రమంలో...రమేశ్ కార్తీక్ నాయక్ గారి స్ఫూర్తిదాయక ప్రయాణం... వారి మాటల్లోనే మీకోసం!“I couldn't find the book I wanted to read… so I wrote it myself.”With this thought, Ramesh Karthik Naik set out to bring the culture, traditions, and way of life of the Banjara community to a wider audience through his writings.Noticing that very few stories reflected the lives and experiences of his people, he began writing with the intention of documenting and sharing their rich heritage. Through his stories, he has introduced readers to life in the tandas, the people who live there, and their unique experiences, earning a distinct place in Telugu literature.In this journey, he became the first Banjara writer to receive the Yuva Sahitya Akademi Award.In this podcast, he shares fascinating insights into his childhood, hostel life, involvement in the Telangana movement, and the story behind his literary journey.In “Charcha With Real Leaders,” presented by TALRadio in partnership with South India’s CSR Summit, Ramesh Karthik Naik opens up about his inspiring journey in his own words.Guest: Ramesh Karthik NaikHost: Vinil Reddy#TALRadio #CharchaWithRealLeaders #RameshKarthikNayak #Banjara #BanjaraCulture #BanjaraLiterature #TeluguLiterature #TeluguWriter #SahityaAkademi #YuvaSahityaAkademi #AuthorJourney #Storyteller #TouchALifeFoundation
-
920
Rich Mindset Vs Poor Mindset | Smart Money Mindset Telugu - 2
ఒకే జీతం, ఒకే ఉద్యోగం... అయినా కొందరు ధనవంతులు అవుతారు, మరికొందరు అదే స్థాయిలో ఉండిపోతారు.. ఎందుకు?అదృష్టమా? తెలివితేటలా? లేక ఇంకేదైనా కారణమా?ఈ ప్రశ్నకు సమాధానం వారి ఆలోచనా విధానంలోనే ఉంటుందట!మనలో చాలామంది చేసే చిన్న చిన్న ఆర్థిక పొరపాట్లు ఏమిటి? కొందరు అవకాశాలను చూసి ముందుకు వెళ్తే, మరికొందరు వెనుకడుగు వేస్తుంటారు.. ఎందుకు? ఎక్కువ డబ్బు సంపాదించాలంటే ఎలాంటి అలవాట్లు చేసుకోవాలి? ఇలాంటి ఎన్నో విషయాలను ఈ Smart Money Mindset - Telugu పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు… ప్రముఖ ఫైనాన్షియల్ అడ్వైజర్ మాధవి లత గారు!అలాగే జీవితంలో ముందుకు వెళ్లాలంటే కొత్త విషయాలు నేర్చుకోవడం, తొందరపడకుండా ఓపికగా ఉండటం ఎంత ముఖ్యమో కూడా వివరించారు.డబ్బు గురించి మీ ఆలోచనా విధానాన్ని మార్చే వీరి మాటలను తప్పకుండా వినండి.. మిస్ అవ్వకండి!How is it that two people with the same job and the same salary can end up in completely different financial situations? While one becomes financially successful, the other remains stuck in the same place. Why does this happen?Is it luck? Intelligence? Or is there something else behind it?According to experts, the answer often lies in our mindset and the way we think about money.What are some of the common financial mistakes many of us make? Why do some people recognize opportunities and move forward while others hesitate and miss them? What habits can help us earn, manage, and grow our money more effectively?In this episode of the Smart Money Mindset – Telugu podcast, renowned financial advisor Madhavi Latha shares valuable insights on these topics and much more.She also explains why continuous learning, patience, and a long-term perspective are essential for personal and financial growth.Don’t miss this insightful conversation that could transform the way you think about money and success.Host: Madhavi LathaSource: https://www.youtube.com/@Smartmoneymindsettelugu#TALRadioTelugu #SmartMoneyMindsetTelugu #MoneyMindset #RichMindset #WealthBuilding #FinancialLiteracy #PersonalFinance #MoneyManagement #FinancialFreedom #WealthCreation #InvestmentMindset #PassiveIncome #SuccessHabits #FinancialPlanning #MindsetMatters #SelfGrowth #SmartMoney #TALRadio #TouchALifeFoundation
-
919
రచయిత రాసే ప్రతి పదం సమాజ శ్రేయస్సును ఆశించాలి! | మన రచయితలు | Dr. Vivekananda Murthy | Season - 2 | Episode - 6
వైద్యుడిగా ప్రాణాలు కాపాడుతున్నారు…రచయితగా మనసులను తాకుతున్నారు…విదేశాల్లో ఉంటూ కూడా తెలుగు భాషకు జీవితాన్నే అంకితం చేశారు… డా. వివేకానంద మూర్తి గారు!పశ్చిమ గోదావరి జిల్లా నుంచి యునైటెడ్ కింగ్‌డమ్ వరకు సాగిన ఆయన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. వైద్యుడిగా విజయవంతమైన కెరీర్‌ను నిర్మించుకుంటూనే, రచయితగా, నటుడిగా, మిమిక్రీ కళాకారుడిగా, సాంస్కృతిక కార్యకర్తగా అనేక రంగాల్లో తనదైన ముద్ర వేశారు.యూకేలో స్థిరపడిన తర్వాత కూడా తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతికి దూరం కాకుండా అక్కడి తెలుగు సమాజంలో సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాణం పోశారు.రచయితగా ఆయన ప్రయాణం ఎలా మొదలైంది? డాక్టర్‌గా ఉంటూనే సాహిత్యం, నటన రంగాల్లో ఎలా ముందుకు వెళ్తున్నారు? ప్రముఖ రచయితలతో వారికి ఉన్న అనుభవాలేమిటి? యూకేలో ఉంటూ తెలుగు కోసం ఆయన చేసిన సేవలేమిటి?ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలను ఈ వారం "మన రచయితలు" పాడ్కాస్ట్ లో స్వయంగా డా. వివేకానంద మూర్తి గారు మనతో పంచుకున్నారు...తప్పకుండా వినండి...మిస్ అవ్వకండి!As a doctor, he saves lives.As a writer, he touches hearts.Even while living abroad, he has dedicated his life to the promotion of the Telugu language and culture Dr. Vivekananda Murthy.His journey from West Godavari district in Andhra Pradesh to the United Kingdom is truly inspiring. While building a successful career as a medical professional, he has also made a remarkable mark as a writer, actor, mimicry artist, and cultural ambassador.Even after settling in the UK, he has remained deeply connected to Telugu language, literature, and culture, playing a vital role in organizing and promoting literary and cultural activities within the Telugu community there.How did his journey as a writer begin? How does he balance his medical profession with his passion for literature and acting? What memorable experiences has he had with renowned writers? And what contributions has he made toward preserving and promoting Telugu language and culture in the UK?Dr. Vivekananda Murthy shares these fascinating insights and many more in this week's episode of the Mana Rachayithalu podcast.Guest: Dr. Vivekananda MurthyHost: Renu Sree#TALRadioTelugu #ManaRachayithalu #DrKVivekanandaMoorthy #TeluguLiterature #PravasaTelugu #UKTelugu #TeluguWriter #TeluguCulture #MimicryArtist #TeluguLanguage #ManaRachayithaluPodcast #TALRadio
-
918
ముఖంపై తెల్లమచ్చలు - ఆయుర్వేద పరిష్కారాలు | ఆయుర్వేదం ఆరోగ్యం - 106
చర్మంపై తెల్ల మచ్చలు కనిపిస్తున్నాయా?ముఖం, మెడ, చేతులు వంటి భాగాల్లో ఏర్పడే ఈ మచ్చలు చాలామందిలో ఆందోళనను కలిగిస్తుంటాయి.అసలు ఇవి ఎందుకు వస్తాయి? ఫంగల్ ఇన్ఫెక్షన్లు, విటమిన్ లోపాలు, చర్మ గాయాలు, జన్యుపరమైన కారణాలు లేదా విటిలిగో వంటి సమస్యలతో వీటికి సంబంధం ఉందా?ఆయుర్వేదం ప్రకారం... మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, కోపం, భయం వంటి అంశాలు కూడా దీనికి కారణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు.మరి తెల్ల మచ్చలను తగ్గించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆహారం, నిద్ర, జీవనశైలిలో ఎలాంటి మార్పులు అవసరం? ఆయుర్వేదం ఈ సమస్యను ఎలా చూస్తుంది?ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలను ఈ వారం ఆయుర్వేదం ఆరోగ్యం పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు… ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ అనుపమ ఉప్పులూరి గారు.తప్పకుండా వినండి... మిస్ అవ్వకండి!Are white patches appearing on your skin?These patches, often seen on the face, neck, hands, and other parts of the body, can cause concern for many people.Why do they occur? Could they be linked to fungal infections, vitamin deficiencies, skin injuries, genetic factors, or conditions like vitiligo?According to Ayurveda, changing lifestyles, stress, anger, fear, and other emotional factors may also contribute to the problem.So, what precautions can help reduce white patches? What changes are needed in diet, sleep, and daily lifestyle? And how does Ayurveda view and manage this condition?In this week’s Ayurvedam Arogyam Podcast, renowned Ayurvedic physician Dr. Anupama Uppuluri shares valuable insights on these important topics.Don’t miss it... Tune in now!Host: Renu SreeGuest: Dr. Anupama UppuluriDr. Anupama Contact Details:Mobile / WhatsApp: 9100052961#TALRadioTelugu #Vitiligo #WhitePatches #WhiteSpots #SkinHealth #Ayurveda #AyurvedicTreatment #AlternativeMedicine #MindBodyHealth #StressAndHealth #NutritionAndHealth #TeluguHealth #HealthcarePodcast #WellnessPodcast #IndianPodcast #PodcastLife #ListenNow #NaturalHealing #HealthPodcast #TeluguPodcast #AyurvedamArogyam #TALRadio #TouchALifeFoundation
-
917
పేదరికం నుండి పేద విద్యార్థులకు తోడుగా... | Maheshwaram Lakesh | CHARCHA With Real Leader - 13
ఒకప్పుడు రోజూవారి కూలీ కోసం పనిచేసిన ఓ విద్యార్థి... ఇప్పుడు వేలాది మంది జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నారు!పేదరికం, కుటుంబ కష్టాలు, చదువుకోడానికి చేసిన పోరాటం... ఇలాంటి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ జీవితంలో ముందుకు సాగిన మహేశ్వరం లకేష్ గారు, ఇప్పుడు Manu's HHOC ఆర్గనైజేషన్ ద్వారా ఎంతో మందికి తోడుగా నిలుస్తున్నారు.తన చిన్ననాటి అనుభవాలు తనలోని సేవా గుణాన్ని ఎలా పెంచాయి? చదువు జీవితాన్ని ఎలా మార్చగలదు? అనాథ పిల్లలు, వృద్ధులు, విద్యార్థులు, అత్యవసర సహాయం అవసరమైన వారికి ఎలా తోడుగా నిలుస్తున్నారు? ఇలాంటి ఎన్నో విషయాలను ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు.ఒక వ్యక్తికి లభించిన అవకాశం... వేలాది మందికి ఆశగా ఎలా మారిందో తెలుసుకోవడానికి ఈ పాడ్కాస్ట్ ను తప్పక వినండి.South India’s CSR Summit వారి భాగస్వామ్యంతో TALRadio నిర్వహిస్తున్న "Charcha With Real Leaders" కార్యక్రమంలో...Manu's HHOC ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు లకేష్ మహేశ్వరం గారి స్ఫూర్తిదాయక సేవా ప్రయాణం... వారి మాటల్లోనే మీకోసం!A student who once worked as a daily wage laborer to support his education... is now transforming the lives of thousands!Despite facing poverty, family hardships, and constant struggles to continue his studies, Maheshwaram Lokesh never gave up on his dreams. Today, through the Manu's HHOC Organization, he is making a meaningful difference in the lives of many people.How did his childhood experiences shape his passion for service? How can education change a person's life? How is he supporting orphaned children, elderly people, students, and those in urgent need of help? He shares these inspiring experiences and many more in this podcast.Don't miss this powerful conversation to learn how one opportunity in a person's life can grow into a source of hope for thousands.As part of the "Charcha With Real Leaders" series presented by TALRadio in association with South India’s CSR Summit...Listen to the inspiring service journey of Maheshwaram Lokesh, Founder of Manu's HHOC Organization, in his own words.Guest: Maheshwaram LokeshHost: Vinil Reddy#TALRadio #CharchaWithRealLeaders #LakeshMaheswaram #ManusHHOC #SocialService #NGO #NGOIndia #CommunityService #HelpingHands #InspiringJourney #RealLeaders #SupportTheNeedy #OrphanCare
-
916
చిన్నప్పుడు చుట్టాలు వస్తే చాలా సంతోషంగా ఉండేది! | మా ఊరు - 78
అమ్మమ్మ ఊరి జ్ఞాపకాలు...వేసవి సెలవుల సందడి...చిన్నప్పుడు గడిపిన ఆ రోజులు ఎప్పటికీ ప్రత్యేకమే!అంటూ… ఈ వారం ‘మా ఊరు’ కార్యక్రమంలో స్వరూప గారు తన చిన్ననాటి జ్ఞాపకాలను, జీవిత ప్రయాణాన్ని మనతో పంచుకున్నారు.విశాఖపట్నంలో జన్మించి, మహారాష్ట్రలో పెరిగి, హైదరాబాద్‌లో చదువుకుని, తర్వాత అమెరికాలో స్థిరపడిన ఆమె... చిన్నప్పుడు తాతయ్య, అమ్మమ్మల ఊరిలో గడిపిన రోజులు, ఆ అనుభవాలు తన జీవితంపై చూపిన ప్రభావం, అప్పటి జీవన విధానం, నేటి తరాల్లో వస్తున్న మార్పుల గురించి ఎన్నో విషయాలు మనతో పంచుకున్నారు.మన చిన్ననాటి జ్ఞాపకాలను, మన ఊరిని, మన మూలాలను మరోసారి గుర్తు చేసే ఈ అందమైన podcast ను తప్పక వినండి… మిస్ అవ్వకండి!Memories of grandmother’s village...The joy of summer vacations...Those childhood days remain special forever!In this week’s Maa Ooru program, Swaroopa Garu shares her cherished childhood memories and life journey with us. Born in Visakhapatnam, raised in Maharashtra, educated in Hyderabad, and later settled in the United States, she reflects on the memorable days she spent in her grandparents’ village and the lasting impact those experiences had on her life.She also talks about the lifestyle of those days, the values she learned growing up, and the changes she sees in today’s generation. This heartwarming podcast takes us back to our roots, our hometowns, and the memories that shaped who we are.Don’t miss this beautiful episode that will make you relive your childhood and reconnect with your origins!Guest: Swaroopa Host: Usha#TALRadio #MaaOoru #Swarupa #ChildhoodMemories #VillageLife #TeluguCulture #LifeJourney #TeluguPodcast #Nostalgia #TeluguStories
-
915
తల్లిదండ్రులు - పిల్లలు... మధ్య దూరం ఎందుకు? | Shazia Parveen | Health Talk
ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రుల మాట ఎందుకు వినడం లేదు?కుటుంబాల మధ్య దూరాలు ఎందుకు పెరుగుతున్నాయి?Generation Gap నిజంగానే సమస్యా...లేక ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడమే కారణమా?ప్రముఖ Psychologist, Global Trainer, Researcher షాజియా పర్వీన్ గారు ఈ అంశాలపై ఎన్నో విషయాలు మనతో పంచుకున్నారు. పిల్లలకు సరైన మార్గదర్శకత్వం ఎంత ముఖ్యమో చెప్తూ… సమస్యల గురించి బాధపడటం కంటే వాటికి పరిష్కారాలు వెతకాలని, పిల్లలకు కేవలం లక్ష్యాలు మాత్రమే కాదు... మంచి Mentors, సరైన వాతావరణం కూడా అవసరమని చెప్పారు.కుటుంబ బంధాలు, పేరెంటింగ్, యువత భవిష్యత్తు గురించి ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే ఈ podcast ను తప్పక వినండి. మిస్ అవ్వకండి!Why are children today not listening to their parents?Why are distances growing within families?Is the generation gap really the problem, or is it simply a lack of understanding between one another?Renowned Psychologist, Global Trainer, and Researcher Shazia Parveen shares valuable insights on these important issues. She explains the importance of proper guidance for children and emphasizes that instead of worrying about problems, we should focus on finding solutions. She also highlights that children need not only goals but also good mentors and a supportive environment to thrive.This thought-provoking podcast explores family relationships, parenting, and the future of today’s youth. Don’t miss it!Guest: Shazia ParveenHost: Adarsh Kumar#TALRadio #SpecialInterview #ShaziaParveen #FamilyRelationships #Parenting #GenerationGap #YouthDevelopment #FamilyBonding #MentalHealth #TouchALifeFoundation
-
914
సేవతోనే జీవితానికి సార్థకత | CHARCHA With Real Leader | Namratha Datta
కెరీర్ గ్రోత్‌తో పాటు మానసిక ప్రశాంతతను కూడా పొందాలంటే ఏం చెయ్యాలి?28 ఏళ్లకు పైగా కార్పొరేట్ రంగంలో పనిచేసిన నమ్రతా దత్తా గారు, ఉద్యోగ జీవితంలో వచ్చిన ఒత్తిడి, టెన్షన్ మధ్య ధ్యాన్ ఫౌండేషన్ ద్వారా యోగా, ఆధ్యాత్మికత, సేవా కార్యక్రమాల వైపు అడుగులు వేశారు. ఆ ప్రయాణం తన జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది, తన ఆలోచనలు మరియు జీవన విధానాన్ని ఎలా ప్రభావితం చేసింది అనే విషయాలను ఈ పాడ్కాస్ట్లో మనతో పంచుకున్నారు.యోగ అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదని, అది మన మనసును, శరీరాన్ని, ఆలోచనల మధ్య సమతుల్యతను తీసుకువచ్చే జీవన విధానమని ఆమె వివరించారు. అలాగే ధ్యాన్ ఫౌండేషన్ చేపడుతున్న జంతు సంరక్షణ, విద్య, పర్యావరణ పరిరక్షణ, ఆహార పంపిణీ వంటి ఎన్నో సేవా కార్యక్రమాల గురించి కూడా ఆసక్తికర విషయాలను మనతో పంచుకున్నారు.South India’s CSR Summit వారి భాగస్వామ్యంతో TALRadio నిర్వహిస్తున్న "Charcha With Real Leaders" కార్యక్రమంలో...ధ్యాన్ ఫౌండేషన్ వాలంటీర్, కార్పొరేట్ లీడర్ నమ్రతా దత్తా గారి స్ఫూర్తిదాయక ప్రయాణం... వారి మాటల్లోనే మీకోసం!How can we achieve mental peace along with career growth?With over 28 years of experience in the corporate world, Namratha Datta shares how she turned to yoga, spirituality, and selfless service through Dhyan Foundation while navigating the pressures and stress of professional life. In this podcast, she talks about the transformation this journey brought to her life, mindset, and overall approach to living.She explains that yoga is much more than physical exercise—it is a way of life that helps bring balance to the mind, body, and thoughts. She also shares insights into the impactful work of Dhyan Foundation, including animal welfare, education, environmental conservation, food distribution, and various humanitarian initiatives.As part of "Charcha With Real Leaders," presented by TALRadio in association with South India’s CSR Summit...Listen to the inspiring journey of Namratha Datta, Corporate Leader and Volunteer at Dhyan Foundation, in her own words.Guest: Namratha DattaHost: Vinil Reddy #TALRadio #CharchaWithRealLeaders #NamrathaDatta #DhyanFoundation #Yoga #Spirituality #Leadership #CorporateLeadership #SanatanaKriya #Mindfulness #PersonalGrowth #CSR #SouthIndiaCSRSummit #TeluguPodcast #InspiringLeaders #TALRadioTelugu
-
913
"ఆమె" కు అండగా సయోధ్య హోమ్ | CHARCHA With Real Leader - 12
"ఇక నా జీవితం ఇంతే" అని అనుకున్న ఎంతోమంది మహిళలకు..."ఇంకా జీవితం ఉంది" అనే నమ్మకాన్ని అందిస్తోంది ‘సయోధ్య హోమ్’…!గృహహింస, కుటుంబ సమస్యలు, అవమానాలు.. ఇలాంటి ఎన్నో కష్టాలతో జీవితంపై నమ్మకం కోల్పోతున్న మహిళలకు అండగా నిలుస్తూ... మళ్లీ ధైర్యంగా జీవించేలా చేస్తోంది…2010 నుంచి ఎంతో మంది మహిళలకు ఆశ్రయం కల్పిస్తూ… ఈ ప్రయాణంలో ఎదురైన అనుభవాలు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిని ఎదుర్కొనే తీరు.. ఇలాంటి ఎన్నో విషయాలను ఈ సంస్థ ఫౌండర్ మృదుల గారు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు.ప్రతి మహిళ గౌరవంగా జీవించే హక్కుల గురించి ఆమె చెప్పిన మాటలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తాయి.South India’s CSR Summit వారి భాగస్వామ్యంతో TALRadio నిర్వహిస్తున్న "Charcha With Real Leaders" కార్యక్రమంలో...Sayodhya Home for Women వ్యవస్థాపకురాలు మృదుల గారి స్ఫూర్తిదాయక సేవా ప్రయాణం... వారి మాటల్లోనే మీకోసం!For many women who felt, "This is the end of my life," Sayodhya Home has given a new hope... "There is still life ahead."Standing beside women facing domestic violence, family conflicts, emotional abuse, and difficult life situations, Sayodhya Home has been helping them rebuild their confidence and move forward with dignity.Since 2010, the organization has provided shelter and support to numerous women. In this podcast, Founder Ms. Mridula shares her journey, the experiences she has encountered, the challenges women face today, and the ways they can overcome them.Her thoughts on every woman's right to live with dignity and self-respect are truly thought-provoking.As part of "Charcha With Real Leaders", presented by TALRadio in association with South India’s CSR Summit, listen to the inspiring service journey of Ms. Mridula, Founder of Sayodhya Home for Women, in her own words.Guest: Mrudula VemulapatiHost: Vinil Reddy#TALRadio #CharchaWithRealLeaders #MrudulaVemulapati #SayodhyaHome #WomenEmpowerment #WomenRights #RealLeaders #WomenSupport #DomesticViolenceAwareness #WomenShelter #SocialImpact #SocialChange #WomenLeadership #InspiringWomen #WomenWithCourage #HopeAndHealing #TALRadioTelugu #TouchALifeFoundation
-
912
ఒక్క అడుగు... మీ ఆర్ధిక స్థితిని మార్చేస్తుంది! | Smart Money Mindset Telugu - 1
సంపాదన అంటే కేవలం డబ్బు చేతికి రావడం మాత్రమే కాదు... "నేను కూడా చేయగలను" అనే ధైర్యం రావడం, మన అవసరాలకు ఎవరిపైనా ఆధారపడకుండా ఉండగలగడం…!ఈరోజుల్లో చాలామంది మహిళలు, గృహిణులు, కుటుంబ బాధ్యతలు చూసుకునేవారు తమ సమయాన్ని, శ్రమను అందరి కోసం కేటాయిస్తుంటారు. కానీ తమ సొంత ఆదాయం గురించి ఆలోచించినప్పుడు మాత్రం ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో తెలియక ఆగిపోతారు.మీకు కూడా ఇలా ఎప్పుడైనా అనిపించిందా? అయితే ఈ Smart Money Mindset - Telugu పాడ్కాస్ట్ మీ కోసమే!డబ్బును ఎలా ఖర్చు చేయాలి? ఎలా సేవ్ చేసుకోవాలి? ఆర్థికంగా ఎలా ముందుకు వెళ్లాలి? ఇలాంటి ఎన్నో విషయాలపై ప్రముఖ ఫైనాన్షియల్ అడ్వైజర్ మాధవి లత గారు ఎన్నో ఉపయోగకరమైన సూచనలు అందించారు. అలాగే, తక్కువ పెట్టుబడితో ప్రారంభించగలిగే కొన్ని మంచి బిజినెస్ ఐడియాస్ ను కూడా మనతో పంచుకున్నారు.బహుశా మీరు వెతుకుతున్న ఆ అవకాశం ఈ పాడ్కాస్ట్ లోనే దొరకొచ్చు…మిస్ అవ్వకుండా వినండి మరి!Earning is not just about having money in your hands... it's about gaining the confidence to say, “I can do this too,” and being able to meet your own needs without depending on others.Today, many women, homemakers, and caregivers dedicate most of their time and effort to their families. But when it comes to earning their own income, they often don’t know where or how to begin.Have you ever felt the same way? Then this Smart Money Mindset - Telugu podcast is for you!In this episode, renowned financial advisor Madhavi Latha shares practical insights on managing money, spending wisely, building savings, and becoming financially independent. She also discusses several business ideas that can be started with a small investment.Who knows? The opportunity you’ve been looking for might be hidden in this conversation.Don’t miss this inspiring and informative podcast!Host: Madhavi LathaSource: https://www.youtube.com/@Smartmoneymindsettelugu #TALRadioTelugu #SmartMoneyMindsetTelugu #MadhaviLatha #FinancialAdvisor #WomenEmpowerment #FinancialFreedom #FinancialLiteracy #MoneyManagement #SavingsTips #PersonalFinance #WomenInBusiness #BusinessIdeas #SmallBusinessIdeas #FinancialPlanning #WomenEntrepreneurs #Entrepreneurship #IncomeGeneration #TALRadio #TouchALifeFoundation
-
911
సమాజ సేవతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది! | స్ఫూర్తి కిరణాలు | Arun Daniel | Youngistaan Foundation
యువతలో సేవాభావం పెరిగితే…సమాజంలో ఎంతో మార్పు తీసుకురావచ్చని నమ్మిన వ్యక్తి...అరుణ్ డేనియల్ గారు!ఆ ఆలోచనతోనే Youngistaan Foundationను ప్రారంభించి, వేలాది మంది యువతను సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తున్నారు. విద్య, మహిళా సాధికారత, ఆకలి నివారణ, పర్యావరణ పరిరక్షణ, విపత్తుల సహాయక చర్యలు వంటి అనేక రంగాల్లో ఆయన టీం సేవలందిస్తోంది.అసలు ఈ సేవా ప్రయాణం ఎలా మొదలైంది? Youngistaan అనే పేరు వెనుక ఉన్న కథ ఏమిటి? యువతలో మార్పు తీసుకురావాలంటే ఏం చేయాలి? సమాజ సేవలో ఆయన నేర్చుకున్న పాఠాలు ఏమిటి?ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ వారం "స్ఫూర్తి కిరణాలు" పాడ్కాస్ట్ లో అరుణ్ డేనియల్ గారు మనతో పంచుకున్నారు.తప్పకుండా వినండి!Arun Daniel is a firm believer that when young people embrace the spirit of service, they can create meaningful and lasting change in society.Driven by this vision, he founded Youngistaan Foundation, an organization that has inspired and engaged thousands of youth in social impact initiatives. Through its work in education, women’s empowerment, hunger relief, environmental conservation, and disaster response, the foundation has been making a difference in the lives of many communities.How did this journey of service begin? What is the story behind the name Youngistaan? What does it take to inspire young people to become changemakers? And what are some of the most valuable lessons Arun Daniel has learned through his years of social service?In this week’s episode of "Sphoorthi Kiranalu" Podcast, Arun Daniel shares his inspiring journey, experiences, and insights on youth leadership, volunteerism, and creating social impact.Tune in and don't miss this inspiring conversation!Guest: Arun DanielHost: Adarsh Kumar#TALRadioTelugu #ArunDaniel #YoungistaanFoundation #SphoorthiKiranalu #YouthLeadership #YouthForChange #SocialImpact #Volunteerism #CommunityService #SocialWork #YouthEmpowerment #WomenEmpowerment #DisasterRelief #Changemakers #TALRadio #TouchALifeFoundation
-
910
మనసుని తాకే రోజూవారీ కథలు... దీప్తి ముచ్చట్లు | మన రచయితలు | Season - 2 | Episode - 5
మధురవాణి...విదేశాల్లో ఉంటున్న తెలుగు రచయితలకు ఒక వేదిక...ఆ వేదిక వెనుక ఉన్న రచయిత్రి...దీప్తి పెండ్యాల గారు!ఐటీ రంగంలో పనిచేస్తూనే రచనా రంగంలో తన ఆసక్తిని కొనసాగిస్తూ, మనోవైరి, బతుకుతోవలు, నడిచే దారుల్లో, ముసుగు వంటి రచనలతో ఎంతో మంది పాఠకులను ఆలోచింపజేస్తున్నారు.ప్రవాస జీవితాన్ని, వ్యక్తిగత అనుభవాలను, తన చుట్టూ ఉన్న మనుషుల కథలను రచనలుగా మలుచుకుంటూ 'దీప్తి ముచ్చట్లు' పేరుతో ఆమె సాగించిన సాహిత్య ప్రయాణం ఎంతో ప్రత్యేకమైనది. అదే సమయంలో "మధురవాణి" అనే ఆన్లైన్ మ్యాగజైన్ ద్వారా తెలుగు రచయితలకు, పాఠకులకు ఒక వేదికను అందిస్తూ సాహిత్య సేవ చేస్తున్నారు.మరి... చిన్నప్పటి నుంచి చదువుపై, సాహిత్యంపై ఆమెకు ఆసక్తి ఎలా పెరిగింది? అమెరికా ప్రయాణం ఎలా మొదలైంది? మధురవాణి పత్రికను ఎలా ప్రారంభించింది? ఉద్యోగం, కుటుంబ బాధ్యతల మధ్య రచనకు సమయం ఎలా కేటాయిస్తున్నారు? ప్రవాస జీవితంలో ఎదురైన అనుభవాలు ఆమె రచనల్లో ఎలా ప్రతిబింబించాయి?ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ వారం "మన రచయితలు" పాడ్కాస్ట్ లో దీప్తి పెండ్యాల గారు మనతో పంచుకున్నారు.తప్పకుండా వినండి...మిస్ అవ్వకండి!Madhuravani...A platform for Telugu writers living across the world...And the woman behind that platformDeepthi Pendyala!While working in the IT industry, Deepthi has continued to nurture her passion for literature and writing. Through works such as Manovairi, Batukuthovalu, Nadiche Daarullo, and Musugu, she has inspired readers to reflect on life, relationships, and society.Drawing from her experiences as an immigrant, her personal journey, and the stories of people around her, she has built a unique literary path through her writings and her popular series, "Deepthi Muchatlu." At the same time, she has been serving the Telugu literary community through "Madhuravani," an online magazine that provides a platform for Telugu writers and readers across the globe.How did her love for reading and literature begin in childhood? How did her journey to the United States start? What inspired her to launch Madhuravani? How does she balance writing with her professional career and family responsibilities? And how have her experiences as a Telugu woman living abroad influenced her writing?In this week’s episode of "Mana Rachayitalu" Podcast, Deepthi Pendyala shares her inspiring journey, literary experiences, and thoughts on writing, culture, and life.Tune in and don't miss this insightful conversation! Guest: Deepthi PendyalaHost: Renu Sree#TALRadioTelugu #DeepthiPendyala #Madhuravani #ManaRachayitalu #TeluguWriter #TeluguLiterature #TeluguBooks #TeluguMagazine #MadhuravaniMagazine #WriterInterview #TeluguStories #TeluguCulture #LiteraryTalks #DeepthiMuchatlu #PodcastInterview #TALRadio #TouchALifeFoundation
-
909
మంగు మచ్చలను మాయం చేసే ఆయుర్వేద సలహాలు | ఆయుర్వేదం ఆరోగ్యం - 105
ముఖంపై నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్ తగ్గడం లేదా?ఎన్ని క్రీములు వాడినా, ఎన్ని ట్రీట్‌మెంట్లు చేయించుకున్నా కొందరిలో ఈ సమస్య మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ముఖంపై వచ్చే పిగ్మెంటేషన్ వల్ల అందంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటుంది.అసలు పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుంది? ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, ఎండలో ఎక్కువగా తిరగడం, ఆహారపు అలవాట్లు దీనిపై ఎంత ప్రభావం చూపుతాయి? పిగ్మెంటేషన్‌ను తగ్గించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీనికి అసలు ఆయుర్వేదం ఏం చెబుతుంది? ఇంట్లోనే పాటించగల చిట్కాలు ఏమైనా ఉన్నాయా?ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఈ వారం ఆయుర్వేదం ఆరోగ్యం పాడ్కాస్ట్ లో సమాధానాలు అందించారు... ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ అనుపమ ఉప్పులూరి గారు!తప్పకుండా వినండి... మిస్ అవ్వకండి!Are dark spots and pigmentation on your face not fading away?For many people, pigmentation keeps coming back even after trying numerous creams and treatments. These dark patches not only affect appearance but can also impact self-confidence.What actually causes pigmentation? How much do stress, hormonal changes, sun exposure, and dietary habits contribute to the problem? What precautions can help reduce pigmentation? What does Ayurveda say about treating it? Are there any simple remedies that can be followed at home?In this week’s Ayurvedam Arogya Podcast, renowned Ayurvedic physician Dr. Anupama Uppuluri answers these questions and shares valuable insights on understanding and managing pigmentation naturally.Tune in and don’t miss it!Host: Renu SreeGuest: Dr. Anupama UppuluriDr. Anupama Contact Details:Mobile / WhatsApp: 9100052961#AyurvedamArogyam #Pigmentation #Melasma #SkinCare #Ayurveda #NaturalSkinCare #TeluguHealthPodcast #TALRadioTelugu
We're indexing this podcast's transcripts for the first time — this can take a minute or two. We'll show results as soon as they're ready.
No matches for "" in this podcast's transcripts.
No topics indexed yet for this podcast.
Loading reviews...
ABOUT THIS SHOW
This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope.TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio.Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond.Tune in for positivity, purpose, and the power of human stories.
HOSTED BY
Touch A Life Foundation
CATEGORIES
Loading similar podcasts...