EPISODE · Aug 1, 2019 · 13 MIN
"నాన్నకి రాయని ఉత్తరం " రచయిత్రి శ్రీమతి పింగళి బాలాదేవి
from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy
*కధాభిమానులకు నమస్కారం.కొప్పర్తి కథావాహిని లో.... *ఈ వారం కథ "నాన్నకి రాయని ఉత్తరం " రచయిత్రి శ్రీమతి పింగళి బాలాదేవి.తెలుగు సాహితీ ప్రక్రియల్లో లేఖా సాహిత్యం కూడా ఒకటి.లేఖాసాహిత్యం మళ్ళీ రెండురకాలు. ఒకటి లేఖల రూపంలో కథ , కవిత , నవల రాయటం. రెండోది ప్రముఖ రచయితలు తమ సమకాలీనులకి సాహిత్యం మరియూ ఇతర విషయాలమీద రాసిన ఉత్తరాలు. చలం ప్రేమలేఖలు లేఖాసాహిత్యానికి గొప్ప ఉదాహరణ. సంజీవదేవ్ గారు సాహిత్యం మరియూ అనేకానేక విషయాల మీద వేలకొద్ది లేఖలు చిన్నా పెద్దా అందరికీ రాసి ఉంటారు.ఇటీవల రచయిత , విమర్శకులు కీ శే ఆర్ ఎస్ సూదర్శనం గారి లేఖలు పుస్తక రూపంలో వెలువడ్డాయి.లేఖా సాహిత్యం ద్వారా వాస్తవమైన సంఘటనలు , సమాచారం ఆసక్తికరంగా వెలుగులోకి వస్తాయి. ఉత్తరం రాయడం ఒక ఆర్ట్.ఈ మధ్య వాఁట్సాప్ సందేశాలు ఉత్తరాల స్థానాన్ని ఆక్రమించాయి. కానీ స్వయంగా చేతి రాతతో మనకు కావలసిన వారు రాసిన ఉత్తరం పోస్ట్ ద్వారా అందుకునే ఆనందాన్ని వాట్సాప్ గానీ ఇ- మెయిల్ గానీ ఇవ్వలేవు అనేది నా అభిప్రాయం.చివరగా అసలు చెప్పొచ్చేదిమిటంటే ఉత్తరాలు రాసుకోడం దాదాపు ఆగిపోయింది.అందువల్ల ఆత్మీయతలు , ప్రేమలు వ్యక్తం కాక మనుషులమధ్య దూరాలు తగ్గిపోతున్నాయి.అదే అంశం మీద రాసిన కథ నాన్నకు రాయని ఉత్తరం. శ్రీమతి పింగళి బాలాదేవి భువనేశ్వర్ లో ఉంటారు.పొగమంచులో సూర్యోదయం వారు రాసిన మరొక నవల.*వినండి ఈ వారం కథ "నాన్నకు రాయని ఉత్తరం "* 💐🙏ఉగాది శుభాకాంక్షలతో మీ కొప్పర్తి రాంబాబు , ఇండియన్ బాంక్ విశాఖపట్నం.
Embed this episode
NOW PLAYING
"నాన్నకి రాయని ఉత్తరం " రచయిత్రి శ్రీమతి పింగళి బాలాదేవి
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.