EPISODE · Oct 19, 2019 · 14 MIN
"నేను చూసిన నక్షత్రం " రచయిత డాక్టర్ కడియాల వివేకానంద మూర్తి
from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy
*విజయవాడ కృష్ణా తీరం నుండి ................................ కథాభిమానులకు నమస్కారం* 💐🙏ఈ వారం మనం వినబోయే కథ "నేను చూసిన నక్షత్రం " రచయిత డాక్టర్ కడియాల వివేకానంద మూర్తి. డాక్టర్ వివేకానంద మూర్తి గారు ఇంగ్లండ్ లో ఉంటారు. వృత్తిరీత్యా డాక్టర్. ప్రవృత్తి రీత్యా రచయిత , నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్.1970 -80 దశకంలో పత్రికా, సినీ , సాహిత్య రంగాలలో రచయితలు....నటులతో ఎంతో సన్నిహితంగా మెలిగిన సహృదయులు... UK లో స్థిరపడినప్పటికీ ఆంధ్రదేశంలో 1960-80 మధ్య కాలంలో పేరొందిన రచయితలు...కవులు...నటులు...కళాకారులు....అందరికి ఆయన ప్రేమాస్పదుడైన వ్యక్తి.ఇప్పటికీ ఎంతో మంది తెలుగు వారితో నిత్యం స్నేహ సంబంధాల్ని కొనసాగిస్తున్న వ్యక్తి. వారి ఈ కథ "నేను చూసిన నక్షత్రం రెండు మూడు దశాబ్దాల క్రితం " .....సినిమాల్లో చేరాలి అనే కోరికతో ఇంట్లో చెప్పకుండా మద్రాసు వెళ్లిపోయిన (పారిపోయిన ) ఎంతో మంది యువతీ యువకులకు కనువిప్పు కలిగించిన కథ. కథలో ఆయన చూసిన నక్షత్రం (సినీ తార ).....వేలుమణి.... సినీమా...యా....లోకంలో ....అడుగు పెట్టడం , నిలదొక్కుకోడం ఎంత కష్టమైన విషయమో.... సినీ రంగంతో అతి దగ్గర పరిచయం ఉన్న ఆయన ఈ కథ ద్వారా వ్యంగ్యంగా చెప్పి , మనసుని బాధతో మెలిపెడతారు.ఈ కథ శ్రోతలకు వినిపిస్తాను అని వారిని కోరినప్పుడు వెంటనే వారి అంగీకారం తెలిపారు. వారిని శ్రీ బాపు , ముళ్ళపూడి గార్లు ప్రేమగా "వివేకంగారూ" అని పిలిచేవారుట....ఆ పిలుపుని శ్రీ బాపు తనదైన హాస్య రీతిలో ఒక కేరికేచర్ గీశారు....దాన్ని వారు పంపించారు....చూడండి...
Embed this episode
NOW PLAYING
"నేను చూసిన నక్షత్రం " రచయిత డాక్టర్ కడియాల వివేకానంద మూర్తి
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.