EPISODE · Apr 5, 2020 · 12 MIN
"నరసన్న పాపాయి " రచయిత ....కీ.శే.అడవి బాపిరాజు గారు
from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy
💐💐 కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం.🙏ఈ వారం కూడా అందరూ స్వహితం , లోకహితం కోసం ఇళ్లకు పరిమితం అయి క్షేమంగా ఉంటున్నారు అని భావిస్తాను. ఈ వారం మనం వినబోయే కథ "నరసన్న పాపాయి " రచయిత ....కీ.శే.అడవి బాపిరాజు గారు. బాపిరాజు గారు కవి , రచయిత , చిత్రకారుడు.... కళాతపస్వి. ఈ కథ ఎంచుకోవడానికి ప్రధానంగా రెండు కారణాలు . ఒకటి ఇది బాపిరాజు గారి వంటి సుప్రసిద్ధ సాహితీవేత్త రచయిత రచన కావడం. బాపిరాజు గారు ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు (యూనివర్సిటీ ) నిర్వహించిన నవలల పోటీలో వారి "నారాయణ రావు " నవల ద్వారా.....విశ్వనాథ సత్యనారాయణ గారి " వేయిపడగలు " నవలతో పోటీ పడి బహుమతి పంచుకున్న గొప్ప రచయిత. విశ్వనాథ వారు....మా బాపి బావతో కాబట్టి బహుమతి పంచుకోడానికి ఒప్పుకుంటున్నాను అని ప్రకటించారు అంటే అప్పటి సమకాలీన రచయితల్లో ఆయనకు ఉన్న విలువ , గౌరవం ఎటువంటిదో తేలికగా అర్థం చేసుకోవచ్చు. ఇక రెండో కారణం ఈ కథా రచన స్వాతంత్ర్యానికి పూర్వం 1946 లో జరిగింది. ఈ కథాకాలానికి ఇప్పటికీ సమాజం పూర్తిగా మారింది. రచయితలు తమ రచనల్లో సమకాలీన సమస్యలకు స్థానం కల్పిస్తూ , వారున్నప్పటి వర్తమాన సమాజ స్థితిగతులను ప్రతి బింబిస్తూ రచనలు చేస్తారని.... అంతే కాక సమాజంలో మంచి మార్పు రావాలి అని కోరుకుంటారనీ ఈ కథ మనకు తెలియచేస్తుంది.వినండి ఈవారం కథ "నరసన్న పాపాయి "అడవి బాపిరాజు గారి రచన. 💐💐🙏మీ కొప్పర్తి రాంబాబు, Retd AGM Indian Bank Vijayawada. Phone 96770 15158. Mail kopparthykathavahini@gmail. com
Embed this episode
NOW PLAYING
"నరసన్న పాపాయి " రచయిత ....కీ.శే.అడవి బాపిరాజు గారు
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.