EPISODE · Feb 2, 2020 · 13 MIN
"ఒక రైతు ఆత్మ కథ".రచయిత శ్రీ ఎమ్ వి రామిరెడ్డి
from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy
💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ "ఒక రైతు ఆత్మ కథ".రచయిత శ్రీ ఎమ్ వి రామిరెడ్డి.సాహిత్యాన్ని సేవాభావాన్ని విడి విడిగా చూడకుండా సంయుక్తంగా కొనసాగిస్తున్న రచయిత. కవిత్వం కన్నా కథారచన కష్టం అంటారు రామిరెడ్డి. స్వగ్రామం గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం పెద పరిమిలో ....మువ్వా చిన బాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ప్రారంభించి 1977 నుంచి సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.రాంకీ ఫౌండేషన్ ఆపరేషన్స్ హెడ్ గా హైద్రాబాద్ లో ఉద్యోగం చేస్తున్నారు.ప్రస్తుత కథాంశం పత్తి రైతుల ఆత్మహత్యల గురించి. వార్తా పత్రికలలో చడవవడమే కానీ ఆత్మహత్యకు ప్రేరేపించి , దారితీసే పరిస్థితులు సాయం సంధ్య తరువాత చీకటిలా ఎలా కమ్ముకొచ్చి మనిషిని కనిపించకుండా అంధకారంలోకి , నిరాశలోకి ఏ విధంగా నెట్టేస్తాయో ....ఈ లోకం నించి నిష్క్రమించేలా చేస్తాయో హృదయం ద్రవించేలా....ప్రతి పంక్తి పచ్చి వాస్తవం అని మన దృష్టికి తీసుకొచ్చి రాసిన కథ ఓ రైతు ఆత్మ కథ. రచయిత కావాలని హత్య అనే పదాన్ని కథ పేరులోంచి తీసేసి....ఆ రైతుని హత్య చేసినది ఎవరో మనల్ని తేల్చమని ప్రశ్నించినట్టు అనిపిస్తుంది కథ విన్నాక ....మట్టిలో కలిసిపోయాక కూడా రైతు ఆత్మ తన భూమి సారాన్ని తెలుసుకోవాలి అని తాపత్రయ పడడం కథ ముగింపులో రచయిత మనల్ని ఆడిగించడం హృదయవిదారకం. వినండి.... ఎమ్వీ రామిరెడ్డి గారి రైతు ఆత్మ (హత్య) కథ. 💐💐🙏మీ కొప్పర్తి రాంబాబు Retd Asst General Manager Indian Bank Vijayawada. Ph 96770 15158. Mail rambabuk. indianbank wms@gmail. com
Embed this episode
NOW PLAYING
"ఒక రైతు ఆత్మ కథ".రచయిత శ్రీ ఎమ్ వి రామిరెడ్డి
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.