EPISODE · Sep 14, 2026 · 24 MIN
ఒక్క క్షణం ఆగి … ఎవరితో అయినా మాట్లాడండి! | Kolavennu Naga Gaytri | Suicide Prevention Month Special | Health Talk
from TALRadio Telugu · host Touch A Life Foundation
మనసులో ఏదైనా బాధగా ఉన్నప్పుడు ఎవరితో చెప్పాలో అర్థం కావట్లేదా?ఎవరైనా తమ సమస్యలను మీతో పంచుకుంటున్నపుడు మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు?జీవితంలో ఎదురయ్యే సమస్యలు, ఒత్తిడి, నిరాశ, సంబంధాల్లో వచ్చే మార్పులు, చదువు లేదా ఉద్యోగానికి సంబంధించిన ఒత్తిళ్లు… ఇవన్నీ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతాయి. అయితే ఇలా రోజురోజుకీ మనలో నిండిపోతున్న భావాలను బయటకు చెప్పకుండా ఒంటరిగా ఉండటం అస్సలు మంచిది కాదు అంటున్నారు… ప్రముఖ సైకాలజిస్ట్ గాయత్రి గారు!మన చుట్టూ ఉన్నవారి ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పులు కనిపిస్తే వాటిని ఎలా గుర్తించాలి? వాళ్లు అందరికీ దూరంగా ఉంటే లేదా “నేను లేకపోతే మీరు బాగుంటారు”లాంటి మాటలు మాట్లాడితే ఎలా స్పందించాలి?.. ఇలాంటి ఎన్నో విషయాలను ఈ వారం Health Talk పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు... గాయత్రి గారు.అంతేకాదు… ఈ రోజుల్లో మన జీవితాల్లో భాగమైన Social Media మన భావోద్వేగాలపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? ఇతరులతో పోల్చుకోవడం, ఎప్పుడూ notifications చూస్తూ ఉండటం, perfect life చూపించాలనే ఒత్తిడి మనపై ఎలా ప్రభావం చూపుతున్నాయి? లాంటి ఎన్నో విషయాలు కూడా ఈ పాడ్కాస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు.తప్పకుండా వింటారు కదూ! మిస్ అవ్వకండి!When something is bothering you, do you find it difficult to know who to talk to?And when someone opens up to you about their problems, how do you respond?Problems in life, stress, disappointment, changes in relationships, pressure from studies or work… all of these can affect our mental well-being. But keeping all these emotions inside and dealing with them alone is not healthy, says renowned psychologist Gayathri.How can we notice sudden changes in the behaviour of people around us? What should we do if someone starts distancing themselves from everyone or says things like, “You’ll be better off without me”? Gayathri shares valuable insights on these and many more important topics in this week’s Health Talk episode.The episode also explores how Social Media, which has become a part of our daily lives, can affect our emotions. Comparing ourselves with others, constantly checking notifications, and feeling pressured to show a “perfect life” can all impact our mental well-being.Do give it a listen! Don’t miss this important conversation.Guest: Kolavennu Naga Gaytri, PsychologistHost: Adarsh KumarGayatri vijay psychologist https://share.google/2EY9VA32pqEYytMH4#TALRadio #HealthTalks #SuicidePreventionMonth #MentalHealthAwareness #MentalWellbeing #StressManagement #EmotionalWellbeing #psychology #mentalhealth #SocialMediaImpact #TalkAndListen #HealthTalk #Psychologist #TALRadioTelugu
Embed this episode
Ready to play
ఒక్క క్షణం ఆగి … ఎవరితో అయినా మాట్లాడండి! | Kolavennu Naga Gaytri | Suicide Prevention Month Special | Health Talk
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.