EPISODE · Jan 5, 2020 · 19 MIN
"ఓ పెళ్లి కథ " రచయిత్రి శ్రీమతి ఓల్గా
from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy
💐💐కృష్ణానదీ తీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం, నూతన సంవత్సర శుభాకాంక్షలు. 🙏ఈ నెల 3 వ తేదీ నుండి 12 వ తేదీ వరకు విజయవాడలో బుక్ ఫెస్టివల్ జరుగుతున్నది.సాహిత్యాభిమానులకు , పుస్తకప్రియులకు పది రోజుల పాటు వేడుక .💐💐ఈ వారం మనం వినబోయే కథ "ఓ పెళ్లి కథ " రచయిత్రి శ్రీమతి ఓల్గా. అసలు పేరు పోపూరి లలిత కుమారి. ఓల్గా గారు తెనాలి వి ఎస్ ఆర్ కళాశాలలో తెలుగు శాఖలో లెక్చరర్ గా పని చేస్తున్నప్పుడు 1974 నుండి 1979 వరకు అదే కాలేజీలో చదువుకున్న అదృష్టం నాది.ఆమె ప్రగతిశీల భావాలను విద్యార్థులతో అప్పటికే పంచుకుంటూ ఉండేవారు.ఆ తరువాత పూర్తి కాలపు రచయిత్రిగా...అస్మిత NGO నిర్వాహకురాలిగా ఉన్నారు. ప్రస్తుత కథ విషయానికి వస్తే....పెళ్లి స్త్రీ జీవితంలో సరయిన సమయంలో , నచ్చిన విధంగా జరగాలి తప్ప....పెళ్లి అయిపోతే జీవితానికి నిశ్చింత అని భావించకూడదు... ఆఖరికి కన్న తల్లుదండ్రులు కూడా అలా అనుకోడానికి వీల్లేదు అని ఖరాఖండిగా తేల్చి చెప్పిన కథ. అదే సమయంలో కూతురికి మంచి సంబంధం కాళ్ళదగ్గరకి వచ్చిందనీ.... ఈ అమెరికా వల్ల తమ సాంఘిక హోదా రాత్రికి రాత్రి పెరిగిపోతుందనీ సంబరపడే తల్లిదండ్రుల అమాయకత్వాన్ని ఎత్తి చూపిన కథ. చదువు పూర్తి కాకుండానే , చెల్లెలి ఇష్టాఇష్టాలతో పనిలేకుండా ఆమె చేసుకోబోయేవాడిని కనీసం చూడకుండానే పెళ్లికి మానసికంగా సిద్ధం చేసిన తల్లిదండ్రుల మీద కొత్త తరహాలో తిరుగుబాటు చేసిన నవ యువకుడి ఎత్తుగడ కథ...ఓ పెళ్ళి కథ....వినండి శ్రీమతి ఓల్గా రచన. 🙏 మీ కొప్పర్తి రాంబాబు , Retd Asst General Manager Indian Bank Vijayawada. Ph 9677015158 Mail rambabuk. indianbankwms@gmail. com
Embed this episode
NOW PLAYING
"ఓ పెళ్లి కథ " రచయిత్రి శ్రీమతి ఓల్గా
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.