"ఓ పువ్వు పూసింది " రచయిత చలం గారు episode artwork

EPISODE · Jun 6, 2020 · 18 MIN

"ఓ పువ్వు పూసింది " రచయిత చలం గారు

from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy

💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం 🙏ఈ వారం మనం వినబోయే కథ "ఓ పువ్వు పూసింది " రచయిత చలం గారు. తెలుగు సాహిత్యంలో ఒక ఉప్పెన. భావాలకు మాత్రమే కాదు...భాష విషయంలో కూడా ! ప్రత్యేకించి భాష గురించి ఎందుకు చెప్తున్నాను అంటే..."ఓ పువ్వు పూసింది " కథ కాదు....కథలాంటి కవిత. భాషలోను భావంలోను కూడా కవితాత్మకత నిండిన కథ. చలంగారి కథ చదివి వినిపించాలి అని ఉన్నా....దాపరికం లేకుండా చెప్తున్నాను....ధైర్యం చాల్లేదు. వరుసపెట్టి ఆయనవి ఒక యాభై కథలు తిరగేసాను. ఏదీ వినిపించలేను అనిపించింది...చదివి వినిపించడానికి స్వరంలో ఒదిగే శైలి, భాషా...భావాలు కావు ఆ కథల్లో ఉన్న విషయాలు.కానీ విస్మరించ వీలు లేని...వీలు కానీ రచయిత. ఆయన అత్యంత సుప్రసిద్ధమైన ఈ కథ ఎంచుకుంటే అన్ని రకాల ఇబ్బందులూ తొలిగిపోతాయి అనిపించింది. పైగా ఆయన పుట్టినది... మరణించింది మే మాసం.(జననం మే 19 వ తేదీ... మరణం మే 4 వ తేదీ ) కాబట్టి నివాళిగా ఉంటుంది అని నిర్ణయించుకున్నాను. ఓ పువ్వు పూసింది ప్రతీకాత్మక కథ. స్త్రీ ని ప్రకృతితో పోలుస్తూ.... తిరిగి ప్రకృతిలోని పుష్పాన్ని ఆమెకు ప్రతిరూపంగా చూపిస్తూ...స్త్రీ భావాలు...ఆలోచనలు....అనుభవాలు....అనుభూతులూ....మేళవించి రాసిన కథ. తనికెళ్ళ భరణి గారు అన్నట్టు...ఆడపిల్ల ఆవిర్భావం నుంచి అంతర్థానం వరకూ సంపూర్ణ స్త్రీత్వాన్ని పరిశీలించి , పరామర్శించి , వివరించి , విపులీకరించి , కళ్ళ ముందు సాక్షాత్కరింపజేస్తాడు చలం. ఓ పువ్వు పూసింది కథ చదివితే చదివినట్టుండదు. జీవన మాధుర్యం గుండెల్లో పూసినట్టుంటుంది. శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీ శ్రీ అయితే....గుడిపాటి వెంకట చలం స్త్రీ స్త్రీ.... వినండి ఈ వారం కథ "ఓ పువ్వు పూసింది "రచయిత చలం. 🙏కొప్పర్తి రాంబాబు , Retd Asst General Manager Indian Bank Vijayawada. Phone 96770 15158. Mail [email protected]

Episode metadata supplied by the publisher feed · Published Jun 6, 2020

Embed this episode

NOW PLAYING

"ఓ పువ్వు పూసింది " రచయిత చలం గారు

0:00 18:38

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of "కొప్పర్తి కథావాహిని "?

This episode is 18 minutes long.

When was this "కొప్పర్తి కథావాహిని " episode published?

This episode was published on June 6, 2020.

Can I download this "కొప్పర్తి కథావాహిని " episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!