EPISODE · Feb 8, 2020 · 21 MIN
" పేరయ్య బావి " రచయిత కీ శే పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారు
from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy
💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ " పేరయ్య బావి " రచయిత కీ శే పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారు. సుబ్బరామయ్యగారు విజయవాడలోనే జీవించారు. పెద్ద ముత్తయిదువ వంటి తెలుగు కథానిక కు "పెద్ద బొట్టు " పెద్దిభొట్ల అనేవారు పలువురు సాహితీ మిత్రులు. ఆంధ్ర లయోలా కళాశాల తెలుగు శాఖ అధ్యక్షునిగా 1996 లో పదవీ విరమణ చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతితో పాటు అనేక ఇతర అవార్డులను అందుకున్నారు. వారి పేరున తానే స్వయంగా కథా రచయితలకు అవార్డులు ఇచ్చేవారు . మూడేళ్ళ క్రితం ఆయన ఇచ్చే అవార్డుల సభలో వారిని దూరంనించి చూసే అదృష్టం కలిగింది. మానవ జీవితంలోని విషాదాలను , అభ్యుదయ దృక్పథంతో , విమర్శనాత్మకంగా విశ్లేషించి శిల్పాత్మకంగా రూపుకట్టించిన కథా సంప్రదాయానికి వారసుడు. ప్రస్తుత కథ విషయానికి వస్తే....చరిత్ర పుస్తకాలలో చదువుకున్నాము. అశోకుడు దారి వెంట చెట్లు నాటించెను....బావులు తవ్వించెను అని. ప్రజాహితం కోరి పనులు చెయ్యాలి అంటే చక్రవర్తి , జమీందారు కానక్కరలేదు....అత్యంత సామాన్యుడు కూడా ఆ పని చేయగలడు ....కావాల్సిందల్లా సంకల్ప బలము , మనుషులపట్ల ప్రేమ అని మనకు తెలియచెప్పే కథ "పేరయ్య బావి "తన వృత్తిని నమ్ముకుని శాశ్వతంగా మనుషుల మనసుల్లో నిలిచిపోయే పని చేసిన వాడు కథలోని పేరయ్య. ఊరిబయట బాటల పక్క బావులు కనిపిస్తే....ఈ కథ చదివిన, విన్న తర్వాత పేరయ్య గుర్తుకు రావడం సహజం.అదే కథకు ఫల శృతి. వినండి కీ శే పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి "పేరయ్య బావి "కథ.💐💐🙏మీ కొప్పర్తి రాంబాబు Retd Asst General Manager Indian Bank Vijayawada. ఫోన్ 96770 15158 Mail rambabuk. indianbankwms@gmail. com
Embed this episode
NOW PLAYING
" పేరయ్య బావి " రచయిత కీ శే పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారు
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.