"పరిశుద్ధ వివాహము - మూడవ ప్రకటన "రచయిత శ్రీ P.V. సునీల్ కుమార్ IPS episode artwork

EPISODE · Jun 22, 2020 · 20 MIN

"పరిశుద్ధ వివాహము - మూడవ ప్రకటన "రచయిత శ్రీ P.V. సునీల్ కుమార్ IPS

from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy

💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం. 🙏 *ఈ వారం మనం వినబోయే కథ "పరిశుద్ధ వివాహము - మూడవ ప్రకటన "రచయిత శ్రీ P.V. సునీల్ కుమార్ IPS, Addl. DGP Chief of CID* సునీల్ కుమార్ గారి ఈ కథ వారి కథాసంకలనం " నీలవేణి " నుండి తీసుకున్నాను. ఆ కథాసంపుటిలో మొత్తం 15 కథలు ఉన్నాయి.కథాంశం పరంగా వేటికి అవే భిన్నమయినవి. అయితే ఆ కథలు అన్నింటిలోనూ అంతర్లీనంగా ఉండేది వ్యంగ్యం (satire). సునీల్ కుమార్ గారి రచనాశైలి ఆయన కథలు చదువుతుంటే మన కళ్ళని వాక్యాలు...పదాల వెంట పరుగులు తీయిస్తుంది. నీలవేణి కథాసంకలనానికి రచయిత నా మాట అంటూ...రాసిన చిన్నపాటి ఇంట్రోలో...రచనకు వినోదం , సామాజిక బాధ్యత రెండు అంచులు. వినోదం అందిస్తూనే విషయం చెప్పడం మంచిది అని తాను భావిస్తున్నట్లు చెప్పారు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని గురువుగా భావిస్తాను అని చెప్తూ...వారి కథ "ఇలాంటి తవ్వాయి వస్తే" కథను ప్రస్తావిస్తూ...కుల వివక్షను గుర్తించి ,ఆయన చిత్రించిన తీరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. సునీల్ కుమార్ గారినీలవేణి... కథాసంపుటానికి ప్రఖ్యాత కవి , రచయిత శ్రీ పాపినేని శివశంకర్ ముందు మాట రాశారు. మనం ఇప్పుడు వినబోయే కథ గురించి శ్రీ శివశంకర్ ప్రస్తావిస్తూ..."ఆదిలో వాక్యముండెను" అని కొంతమందికి తెలుసేమో. చర్చిలో ఏముండును చాలామందికి తెలియదు.ఆదివారం చర్చి వాతావరణం , అక్కడికి వచ్చే మనుషుల బాహ్యంతర వాతావరణం "పరిశుద్ధ వివాహము:మూడవ ప్రకటనలో " పాఠకులకి తెలుస్తుంది.శ్రమదినాలు, పుట్టు క్రైస్తవులు , దైవజనులు , మూడవ ప్రకటన , ప్రార్థనలో పెట్టడం ....ఇటువంటి సంగతులు అన్నీ తెలుస్తాయి. అంతకుమించి - క్రైస్తవులు అందరూ ఒకటే ...ఒకటే బైబిలు....ఒకటే దేవుడు...కానీ పెళ్లిదగ్గర కాదు గదా ! అంటాడు గోవులాంటి అబెదనగొ....దేవునిముందు అందరూ సమానులే అని తెలిసినవాడు. కానీ కూతురి పెళ్లి సంబంధం విషయానికి వచ్చేసరికి కమ్మ కన్వర్టెడ్ క్రిస్టియన్ గా తాను ఎక్కువ సమానుడినని , మాల మాదిగలు తక్కువ సమానులని తేల్చి చెప్పాడు. ఈ పుట్టు క్రైస్తవుల మధ్య పెట్టు క్రైస్తవుల లోగుట్టు బయటపెట్టి....వాళ్ళకి "సాహిత్య ప్రమాదం " తెచ్చిపెట్టాడు అంటారు. నా కొద్దిపాటి జీవితానుభవంలో నేను తెలుసుకున్నది ఒక్కటే....ప్రస్తుత సమాజంలో ఉన్నవి రెండే కులాలు...డబ్బు+అధికారం...ఉన్నవాడు- లేనివాడు." ఈ రెండూ అన్ని అంతరాలనూ... అభ్యంతరాలనూ తొలగిస్తాయి. ఇదే ప్రాతిపదికగా సమాజం నడుస్తోంది. వినండి ఈ వారం కథ P V సునీల్ కుమార్ గారి రచన "పరిశుద్ధ వివాహము:మూడవ ప్రకటన "💐💐🙏కొప్పర్తి రాంబాబు Retd AGM Indian Bank Vijayawada Phone 96770 15158 Mail [email protected]

Episode metadata supplied by the publisher feed · Published Jun 22, 2020

Embed this episode

NOW PLAYING

"పరిశుద్ధ వివాహము - మూడవ ప్రకటన "రచయిత శ్రీ P.V. సునీల్ కుమార్ IPS

0:00 20:00

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of "కొప్పర్తి కథావాహిని "?

This episode is 20 minutes long.

When was this "కొప్పర్తి కథావాహిని " episode published?

This episode was published on June 22, 2020.

Can I download this "కొప్పర్తి కథావాహిని " episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!