EPISODE · Mar 14, 2020 · 14 MIN
"పరిష్వంగం" . రచన శ్రీ పి. రామకృష్ణ.
from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy
కృష్ణాతీరం విజయవాడ నుండి....కథాభిమానులకు నమస్కారం.🙏ఈ వారం మనం వినబోయే కథ "పరిష్వంగం" . రచన శ్రీ పి. రామకృష్ణ. ఈ కథలోనూ...ఈ కథ నేను మీకు చదివి వినిపించడంలోనూ ఒక మంచి విషయం ఉంది. నేను తెలుగు కథలు చదివి వినిపించడం మొదలుపెట్టినప్పటి నుంచి నా వద్దనున్న వివిధ కథానికా సంకలనాల్లోంచి ఎంచుకుని కథలు వినిపిస్తున్నాను. అయితే రెండు రోజుల క్రితం విజయవాడ మా ఇంటికి నా చిరకాల ఆత్మీయ మిత్రులు శ్రీ వంగల హర్షవర్ధన్ వచ్చారు.ఆయన వాణిజ్య పన్నుల శాఖలో జాయింట్ కమిషనర్ గా ఈ మధ్యే పదవీ విరమణ చేశారు. మంచి సాహిత్యాభిలాషి. రచయిత కూడా ! ఆయన రచనలు ఒక రెండు పుస్తకాలతో పాటు , వారి తండ్రిగారు కీ. శే. వంగల శ్రీరామమూర్తి గారికి నివాళిగా "తండ్రీ ! నిన్నుదలంచి..." అని ప్రచురించిన ఒక చిన్న పుస్తకం ఇచ్చారు. యాభై పేజీలకు మించని ఆ పుస్తకంలో వారి కుటుంబసభ్యులు ఏడెనిమిది మంది కీ. శే.శ్రీరామమూర్తి గారి గురించి ,వారి జ్ఞాపకాలు క్లుప్తంగా పంచుకున్నారు.ఆ జ్ఞాపకాలతో పాటు ఆ చిన్న పుస్తకంలో వారికి నివాళి అర్పించడానికి సందర్భానికి సరిపోయేవిధంగా ఉన్న ఒకటి రెండు కథలు , కవితలు , వ్యాసాలు చేర్చారు.అనుకోకుండా ఆ నివాళి పుస్తకంలోని ఒక కథ నన్ను ఆకర్షించింది. ఆ కథే "పరిష్వంగం " . నన్నయ భారతంలో దుష్యంతోపాఖ్యానంలో తండ్రీ కొడుకుల బాంధవ్యాన్ని గురించి శకుంతల చెప్పిన ఒక పద్యం మనసులో నిలుపుకున్న ఒక తండ్రికి , తన కుమారుని పట్ల గల ప్రేమని , ఇష్టాన్ని వెలికితీసిన ఈ కథ తండ్రి కొడుకుల బాంధవ్యానికి ఎనలేని విలువను చేకూర్చే కథ.వినండి శ్రీ పి.రామకృష్ణ గారి కథ "పరిష్వంగం ".💐💐మీ కొప్పర్తి రాంబాబు Retd Asst General Manager Indian Bank Vijayawada. Phone 96770 15158. Mail rambabuk. indianbankwms@gmail. com
Embed this episode
NOW PLAYING
"పరిష్వంగం" . రచన శ్రీ పి. రామకృష్ణ.
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.