EPISODE · Jan 5, 2020 · 20 MIN
రాజారాం గారి కథ "కమ్మ తెమ్మెర "
from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy
💐💐*కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం....విజయవాడలో నిన్న ఈ రోజు రేపు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరుగుతున్నాయి.షుమారు వెయ్యిమందికి పైగా రచయితలు ఈ సభల్లో పాల్గొంటున్నారు.వారందరూ తెలుగు భాష మరింతగా వర్ధిల్లాలి అనీ , తెలుగు సాహిత్య పరిమళాలు దశదిశలా వ్యాపించాలి అని ఆకాంక్షిస్తూ ఎంతో ఆశావహ దృక్పధంతో సభల్లో సందడిగా పాల్గొంటున్నారు. ......ఇక *ఈ వారం కథ కీర్తిశేషులు మధురాంతకం రాజారాం గారి "కమ్మ తెమ్మెర " నేను బ్యాంక్ లో చేరిన తొలి సంవత్సరం 1981 లో చిత్తూరులో వారితో పరిచయం కలిగింది. వారి కుమారులు నరేంద్ర , మహేంద్ర ఇద్దరితో పరిచయం. రాజారాం గారి ఈ కథ ఎంచుకోడానికి కారణం , ఈ కథ ముగింపు నా స్వానుభవం.పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయం అయినా , అవకపోయినా, భూమిమీద అనుకూలవతి అయిన , ప్రేమించే భార్య /భర్త లభించడం అదృష్టం.పాతకాలపు కథ. అయినా భార్యాభర్తల మధ్య అనురాగ భావనకు ఒక చిన్న చర్య ఎంతటి ప్రేమైక భావనను మిగులుస్తుందో ఈ కథ ముగింపు చెప్తుంది. కథలోని తెలుగు మాటలు , పదాలు , ముత్యాల మురిపాలు." "ముత్యాల మురిపాలు "అని ఎందుకు అంటున్నాను అంటే....రాజారాం గారు...మా తెలుగు తల్లికి మల్లె పూదండ గీతం రాసిన శంకరంబాడి సుందరాచారి గురించి "మా గురువుగారికి మల్లెపూదండ " అనే గొప్ప వ్యాసం రాసారు.ఇదివరకెప్పుడో ఆ వ్యాసం చదివాను.అనుకోకుండా రెండు రోజుల క్రితం ఈనాడు ఎఫ్ ఎమ్ రేడియో కోసం ఆ వ్యాసం రికార్డ్ చెయ్యడం జరిగింది.ఈ కథలో ఏరి మనసులో దాచుకోదగ్గ మధురమైన తెలుగు ముత్యాలు ఎన్నో దొరుకుతాయి. వినండి. *మధురాంతకం (వారి ఇంటిపేరులోనే మాధుర్యం ఉన్నది ) రాజారాం గారి కథ "కమ్మ తెమ్మెర " 🙏మీ కొప్పర్తి రాంబాబు* Retd Asst General Manager Indian Bank Vijayawada. Ph 96770 15158 Mail rambabuk. indianbankwms@gmail. com
Embed this episode
NOW PLAYING
రాజారాం గారి కథ "కమ్మ తెమ్మెర "
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.