EPISODE · May 18, 2020 · 12 MIN
"రావులయ్య " రచయిత కీ. శే. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు
from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy
💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం.🙏 *ఈ వారం మనం వినబోయే కథ "రావులయ్య " రచయిత కీ. శే. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు* శ్రీపాదవారు ఎన్నో ప్రసిద్ధమైన కథలు రాశారు. వాటిలో సుప్రసిద్ధమైన ఆరేడు కథల పేర్లు చెప్తాను.1.గులాబీ అత్తరు.2.తాపీ మేస్త్రి రామదీక్షితులు BA 3 కలుపు మొక్కలు 4 అరికాళ్ళ కింద మంటలు 5 ఇలాంటి తవ్వాయి వస్తే 6 పుల్లంపేట జరీ చీర. ఇవికాక వారి "అనుభవాలు...జ్ఞాపకాలునూ ప్రతి తెలుగు భాషాభిమాని చదివితీరాల్సిన పుస్తకం. వారి కథలు పెద్దవిగా ఉంటాయి.పాత్రలు సంభాషించుకుంటూ పోతాయి....పాత్రల నోటి నుండి అచ్చతెనుగు మాటలు మేలిమి ముత్యాల కుప్పలుకింద పోగుపడతాయి. "శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథలు చదవడం కోసం అయినా తెలుగువాడిగా పుట్టాలి " అని ఎవరో అన్న మాట అక్షరాలా నిజం. ఇక ప్రస్తుత కథ " రావులయ్య " విషయానికి వస్తే....కథ పేరు గమనించండి....ఆయన రాములయ్య అని పెట్టలేదు...."రావులయ్య " అన్నారు. వ్యావహారిక భాషా ఉద్యమానికి కృషి చేసిన గిడుగు, గురజాడలకు అండదండగా ఉండేలా కథల్లో పూర్తి వాడుక భాషను ఉపయోగిస్తూ రచనలు చేశారు. నామ వాచకాలను పలకడంలో కూడా స్థానికమైన పలుకుబడిని ప్రవేశపెట్టారు. పైన ముందుగా ఉదహరించిన వారి ప్రసిద్ధ కథలను వదిలేసి "రావులయ్య " ని ఎంచుకోవడానికి కారణం......ఇది ఒక కృషీవలుడి కథ.....జీతగాడుగా జీవితాన్ని ప్రారంభించి...కౌలుదారుడుగా....రైతుగా....భూస్వామిగా ఎదిగిన రావులయ్య కథ..... కృషి...పట్టుదల...ముందు చూపు మనిషి అన్ని విధాలా ఎదగడానికి ఎంత అవసరమో తెలియచెప్పే కథ.నిరాశలో మునిగిపోయి ఉన్న నేటి రైతాంగానికి కొద్దిపాటి ఓదార్పు ఇచ్చే గత కాలపు గాథ. కమత గాడు....సేద్యగాడుగా మారి విజయం సాధించిన కథ. సౌహార్థభివ్యక్తితో చేసిన రచన. వినండి *ఈ వారం కథ "రావులయ్య " శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రచన*.💐💐🙏మీ కొప్పర్తి రాంబాబు , Retd AGM Indian Bank Vijayawada. Phone 96770 15158. Mail kopparthykathavahini@gmail. com
Embed this episode
NOW PLAYING
"రావులయ్య " రచయిత కీ. శే. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.