EPISODE · Oct 18, 2020 · 19 MIN
రైలు బండిలో వైతాళికులు - రచయిత: శ్రీ రమణ గారు.
from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy
శ్రోతలకు నమస్కారం..... గిడుగు రామమూర్తి పంతులుగారి పుట్టినరోజు... తెలుగు భాషా దినోత్సవం సందర్బంగా తెలుగు భాషకి సంబంధించి ఏదన్నా కొత్తదనం ఉండేలా చెయ్యాలి అని ఆలోచన కలిగినప్పుడు , చప్పున స్ఫూరించింది శ్రీ రమణ గారి " రైలు పెట్టెలో వైతాళికులు " హాస్య రూపకం దానికి శబ్ద రూపం ఇస్తే , ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధులైన రచయితలు , వారి స్వరూప స్వభావాలు , వారి రచనా శైలులు , రీతులు హాస్య స్ఫోరకంగా చూపించే అవకాశం శ్రీ రమణ గారి ఈ రచన కల్పిస్తుంది , అనిపించింది. ఇందులోని కవుల రచయితల రచనా శైలుల్ని అనుకరిస్తూ శ్రీరమణ గారు ఇంతకుముందే ఎన్నో పేరడీలు రాశారు. అవన్నీ పాఠకుల్ని ఆనందపరిచాయి. ఇప్పుడు ఒక డజను మంది ప్రసిద్ధులైన ఆధునిక తెలుగు సాహిత్య నిర్మాతల్ని ఒక చోట చేర్చి ఒక పద చిత్రం రూపొందించారు శ్రీరమణ గారు. దాన్ని శబ్ద చిత్రంగా మార్చే ప్రయత్నం చేశాను. వినండి "రైలు బండిలో వైతాళికులు " శ్రీ రమణ గారి హాస్య రచనకు శబ్ద రూపం. 💐💐🙏 మీ కొప్పర్తి రాంబాబు , Retd Asst General Manager Indian Bank Vijayawada Mail [email protected]
Embed this episode
NOW PLAYING
రైలు బండిలో వైతాళికులు - రచయిత: శ్రీ రమణ గారు.
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.