EPISODE · Sep 7, 2019 · 17 MIN
"సద్దుకున్నారా ?" - రచయిత ప్రభాకర్ జైని
from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy
కధాభిమానులకు నమస్కారం. 🙏ఈ వారం మనం వినబోయే కథ "సద్దుకున్నారా ? ". రచయిత ఎవరో తెలీదు. పేరు తెలీని అజ్ఞాత రచయిత కథ చదవడం నాకు ఇబ్బందిగా అనిపించినా , కథ నచ్చడంతో , వినిపించకుండా ఉండలేకపోతున్నాను. ఈ కథ text వాట్సాప్ లో వచ్చింది, రచయిత పేరు లేకుండా ఫార్వర్డ్ కింద.ఆ వెంటనే రచయిత ఎవరో తెలుసుకోడానికి నేను ఉన్న గ్రూప్స్ లో మిత్రుల ద్వారా ప్రయత్నం చేశాను కానీ , రచయిత ఎవరో తెలుసుకోలేకపోయాను.ఈ మధ్య సాధారణంగా రచయిత అనుమతి తీసుకుని , లేదా రికార్డ్ చేసిన తరువాత రచయితకు కూడా కథ పంపిస్తూ , కథానికా పఠనం కొనసాగిస్తున్నాను.ఈ వారం కథ అందుకు మినహాయింపు.ఇక కథ విషయానికి వస్తే కథలో సహజంగా నాకు నచ్చిన విషయం , నన్ను ఆకర్షించిన విషయం , రిటైర్మెంట్ లైఫ్ ఎలా ఉండాలి , దాన్ని శేషజీవితం అనుకోకూడదు , "విశేష జీవితం " అనుకోవాలి అని ఒక బాంక్ ఉద్యోగి ద్వారా చెప్పించడం.రెండోది మనుషుల మధ్య సత్ సంబంధాలు నెరపవలసిన అవసరం, అది అయిన వాళ్ళు అయినా , బయటివాళ్ళు అయినా ఎంత ముఖ్యమో వివరంగా, కథలో , కథలాగా చెప్పడం జరిగింది. మనకి తెలిసిన మనిషి , మనకి తెలిసిన విషయాలే ఒక హితవాక్యం లాగా , మనసుకి హత్తుకునేలాగా రచయిత చెప్పారు.ఆ "అజ్ఞాత రచయిత"కు నా అభినందనలు.నమస్సులు తెలియచేస్తున్నాను. కథ విన్న ఎవరికి అయినా ఆ రచయిత తెలిస్తే నాకు నేరుగా తెలియచేయండి.వినండి ఈ వారం కథ "సద్దుకున్నారా ?" . 💐🙏మీ కొప్పర్తి రాంబాబు , విశ్రాంత ఉద్యోగి , ఇండియన్ బాంక్ , విశాఖ సాగర తీరం. ప్రముఖ రచయిత ప్రభాకర్ జైని 💐🙏
Embed this episode
NOW PLAYING
"సద్దుకున్నారా ?" - రచయిత ప్రభాకర్ జైని
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.