EPISODE · Oct 13, 2019 · 13 MIN
"సముద్రం " రచయిత శ్రీ భమిడిపాటి జగన్నాథ రావు గారు
from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy
కథాభిమానులకి నమస్కారం 💐🙏 ఈ వారం మనం వినబోయే కథ "సముద్రం " రచయిత శ్రీ భమిడిపాటి జగన్నాథ రావు గారు. ఈ కథ ఎప్పుడో మార్చి 2019 లో రికార్డ్ చేసి ఉంచాను, అప్పుడే రచయిత శ్రీ జగన్నాథరావు గారితోను, వారి కుమార్తె శ్రీమతి పద్మ గారితోను ఫోన్ లో మాట్లాడి వారి అనుమతి తీసుకున్నాను. అయితే వెంటనే కథ శ్రోతలకు పంపలేకపోయాను. వేరే రచయితల కథలు చదివి వినిపించాను కానీ ఈ కథ నా దగ్గర భద్రంగా ఉండిపోయింది.....ఏ కారణం లేకుండా అలా ఎందుకు జరిగిందో నాకు నిన్న మొన్నటిదాకా అర్థం కాలేదు. కానీ ఈ రోజు (7.10.19)కారణం తెలిసింది ...అదేమిటి అంటే రచయిత భమిడిపాటి జగన్నాథరావు గారిని కలిసి మాట్లాడే గొప్ప అదృష్టం నాకు ఉంది కాబట్టి ఆ కథ అలా ఉండిపోయింది.విజయవాడ వచ్చిన వారంలో నాకు గుర్తుకొచ్చిన రచయిత ఆయన.దసరా పండుగ రోజు ఆయనను వారి ఇంటివద్ద కలిశాను .గొప్పవ్యక్తి.వయసులోనూ , అనుభవంలోను పెద్దవారు. ఓపికగా మాట్లాడారు.స్త్రీ జన పక్షపాతిని అని చెప్పుకొచ్చారు. సముద్రం కథ, కొంచెం డిఫరెంట్ స్టోరీ....కళాత్మకత ఉండి అనుభూతి తో కూడిన జీవితాన్ని అనుభవిస్తున్న ఒక ఆదర్శ దంపతుల మధ్యకి అదే మనస్తత్వం ఉన్న , వేరే వ్యక్తి తారసపడితే....అది కూడా భర్త ఊళ్ళో లేని సమయంలో స్నేహితురాలు, ఆమె భర్త వారింటికి వచ్చినపుడు అతడి పరిచయం , ....ఆమెలోని కళాత్మకతని సున్నితంగా మెచ్చుకొన్న అతడి ప్రశంసలు ఆమె మనసుని మల్లెల మాలలు ఊగించి , కన్నుల వెన్నెల డోలలూగిస్తాయి. అతడి సాన్నిధ్యంలో నిష్కల్మష స్నేహాభావంతో "శృతి చేయబడిన మనసుతో"....ఆ గృహిణి ఏ విధంగా ఒక కొత్త ఆనందాన్ని, అనుభూతిని సొంతం చేసుకుంది , open mind తో ఆ అనుభవాన్ని భర్తతో నిస్సంకోచంగా ఎలా పంచుకుని , మనసుని తేలిక పరచుకుందీ చెప్పే....రసైక భావనా జీవుల , ఆదర్శ దంపతుల కథ "సముద్రం". కథలో మనకు కానవచ్చే సముద్రం మనిషి మనసు. రచయిత అంటారు....జీవితం చాలా గొప్పది.అందుకే ప్రపంచంలోని మహా రచయితలు అందరూ వారి ఆదర్శాలకంటే జీవితపు గొప్పదనానికే తలవంచారు అని....ఈ కథలో భార్య తన ఆనందానుభూతిని చెప్పినప్పుడు భార్య పట్ల ఎంతో possessiveness ఉన్న ఆమె భర్త జీవితపు గొప్పదనానికి తలవంచుతాడు. అనుభూతి వాది అయిన , రచయిత జగన్నాథరావు గారు.లోతైన జీవన భావన ఉన్న కథ సముద్రం. వినండి.....💐🙏మీ కొప్పర్తి రాంబాబు Retd AGM ఇండియన్ బ్యాంక్ , విజయవాడ .
Embed this episode
NOW PLAYING
"సముద్రం " రచయిత శ్రీ భమిడిపాటి జగన్నాథ రావు గారు
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.