"సంచారిణీ దీపశిఖ " . రచయిత శ్రీ ఆవంత్స సోమసుందర్  episode artwork

EPISODE · Jul 31, 2019 · 33 MIN

"సంచారిణీ దీపశిఖ " . రచయిత శ్రీ ఆవంత్స సోమసుందర్

from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy

కథాభిమానులకి నమస్కారం.🙏ఈ వారం 2.6.2019 మనం వినబోయే కథ "సంచారిణీ దీపశిఖ " . రచయిత శ్రీ ఆవంత్స సోమసుందర్ . పెద్ద కథ. వినడానికి ఎక్కువ సమయం పడుతుంది.ఈ కథ ఎంచుకోవడానికి ప్రధాన కారణం, ప్రస్తుతం లుప్తమైపోతున్న మానవసంబంధాలు. కొంతకాలం క్రితం ఒక పెద్దావిడ మరుగున పడుతున్న మానవ సంబంధాలను డబ్బుతో ఏవిధంగా పెంచి పోషించిందో , ఆ డబ్బు ద్వారా ఆమె ప్రేమను , అభిమానాన్ని చూరగొన్న బంధుమిత్రులు కూడా ఆమె పట్ల ఎంత గౌరవంగా , అభిమానంగా , బాధ్యతగా వ్యవహరించారో తెలుసుకోవడం కోసం...ఈ కథ.ఎన్నో కుటుంబాలలో వెలుగు నింపిన పాత్ర కథలో జానికమ్మ. వయో వృద్ధురాలైన ఆమె ఔన్నత్యాన్ని ఆమెను సంచారిణీ దీపశిఖ గా అభివర్ణించారు రచయిత. డబ్బు అంతస్సూత్రంగా నడిచిన ఈ కథలో ప్రధాన పాత్రలు డబ్బుతో సంబంధం లేకుండా బాంధవ్యాలు మాత్రమే ముఖ్యం అనేరీతిలో ప్రవర్తించి....మార్క్స్ చెప్పిన మానవసంబంధాలు అన్నీ ఆర్ధిక సంబంధాలే అన్న మాటలను పూర్తిగా త్రోసిరాజనకపోయినా....ఆత్మీయత బంధం, కొంతలో కొంత డబ్బుతో ముడిపడకుండా కలిసి గడపడం వల్ల బలపడుతుంది అనే ఒక సదాలోచనను మన మనసుల్లోకి చొప్పించడానికి ప్రయత్నించిన కధ. ఈ కథలో జానకమ్మ పాత్ర కి ఒక తెలుగు సినిమా పాట చక్కగా అతికినట్టు సరిపోతుంది. "జగమంత కుటుంబం నాది , ఏకాకి జీవితం నాది " అని. రచయిత శ్రీ సోమసుందర్ తెలుగు సాహితీ రంగానికి దిశా నిర్దేశం చేసిన ప్రముఖుల్లో ఒకరు. వినండి "సంచారిణీ దీపశిఖ " కథ. 💐💐🙏కొప్పర్తి రాంబాబు , ఇండియన్ బాంక్ , విశాఖసాగరతీరం.

Episode metadata supplied by the publisher feed · Published Jul 31, 2019

Embed this episode

NOW PLAYING

"సంచారిణీ దీపశిఖ " . రచయిత శ్రీ ఆవంత్స సోమసుందర్

0:00 33:19

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of "కొప్పర్తి కథావాహిని "?

This episode is 33 minutes long.

When was this "కొప్పర్తి కథావాహిని " episode published?

This episode was published on July 31, 2019.

Can I download this "కొప్పర్తి కథావాహిని " episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!