"స్పృహ ". రచయిత క.వ.న.శర్మ  episode artwork

EPISODE · Jul 31, 2019 · 15 MIN

"స్పృహ ". రచయిత క.వ.న.శర్మ

from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy

కథాభిమానులకి నమస్కారం.ఈ వారం మనం వినబోయే కథ "స్పృహ ". రచయిత క.వ.న.శర్మ గారు.పూర్తి పేరు కందుల వరాహ నరసింహ శర్మ గారు. వృత్తిరీత్యా Civil Engineering ప్రొఫెసర్ గా ఇండియన్ Institute of Science , బెంగళూరులో పనిచేసి రిటైర్ అయ్యారు. అనేక కథలు రాశారు.అరడజనుకు పైగా నవలలు రాసారు.రచన మాసపత్రికకు సలహాదారుగా ఉండేవారు.1939 లో జన్మించిన కవన శర్మ గారు గడచిన అక్టోబర్ 2018 లో మృతి చెందారు.ఇక "స్పృహ "కథ విషయానికి వస్తే....ఒక వయసు వచ్చాక గుర్తు తెచ్చుకుంటే .... మరీ చిన్నప్పటి స్నేహాలు అంటే హై స్కూల్ లోకి వచ్చేలోపు బాల్యంలో ఏర్పడే స్నేహాలు , అమాయకత్వంతోను , తెలిసీ తెలియనితనం తో ఉంటాయి. వాస్తవానికి అప్పుడు తెలియనివి "మనసుకి కల్మషం "....వయసుకి భేదం .....కులం మకిలి , డబ్బు హోదాల్లోని అంతరం....ఇవి తెలీవు. ఆ సమయంలో తెలీని విషయాల్ని తెలియచెప్పే నెపంతో పూర్వకాలపు అమ్మలు ఏ రకంగా స్నేహానికి అడ్డుగోడలు ఏర్పాటు చేస్తారో.....ఒక స్కూల్ పిల్లవాడి పరంగా చెప్పినకథ "స్ప్రుహ " ప్రాథమిక పాఠశాల స్థాయిలో చదువులు , స్నేహాలు , ఎదిగే వయసులో ఆలోచనలు భావాలు ఏ విధంగా రూపుదిద్దుకుంటాయి , అందుకు అమ్మలు ఏ రకంగా పిల్లల మనసుల్ని ప్రభావితం చేస్తారు అనేది కథలో ప్రధాన అంశంగా నడిచినా , అంతిమంగా ఆ స్కూల్ పిల్లాడు సొంత ఆలోచనతో తన్ను తాను సమాధానపరుచుకున్నది.... గొప్ప విషయం " అన్న ఎంగిలి చెల్లెలికి ఎంగిలి కాదు "అనే విషయం నిర్ణయించేది కులం కాదు....గుణం.మంచి ఆలోచన పిల్లవాడి మనసులో నాటి కథ ముగిస్తారు రచయిత. ఈ కథలో చెప్పిన చేపల బజారు బడి....నేను చదువుకున్న బడి ఒక్కటే ! మా బడిని తడికెల బడి అనేవారు. వినండి ఈ వారం కథ కవన శర్మ గారి "స్పృహ" 💐🙏మీ కొప్పర్తి రాంబాబు , విశాఖసాగరతీరం.

Episode metadata supplied by the publisher feed · Published Jul 31, 2019

Embed this episode

NOW PLAYING

"స్పృహ ". రచయిత క.వ.న.శర్మ

0:00 15:10

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of "కొప్పర్తి కథావాహిని "?

This episode is 15 minutes long.

When was this "కొప్పర్తి కథావాహిని " episode published?

This episode was published on July 31, 2019.

Can I download this "కొప్పర్తి కథావాహిని " episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!