"స్పర్శ " . రచయిత్రి శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి episode artwork

EPISODE · Jul 23, 2019 · 6 MIN

"స్పర్శ " . రచయిత్రి శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి

from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy

 కధాభిమానులకు నమస్కారం ఈ వారం మనం వినబోయే కధ , "స్పర్శ " . రచయిత్రి శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి.ఇంతకుముందు ఛాయదేవిగారి కధ ,"తన మార్గం "వినిపించి ఉన్నాను. ఈసారి కథ , వృద్జాప్యంలో మనుషులు , ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలనించి ఏం కోరుకుంటారు అనేది , ఈ రెండు అక్షరాల కథలో....ఛాయాదేవిగారు మనకి మనసుకి హత్తుకునేలాగా , క్లుప్తంగా , సూటిగా చెప్పారు.కథ చాలా చిన్నది.సందేశం మాత్రం పెద్దది.ఆత్మీయ స్పర్శ మనిషికి మనుషుల మధ్య , మనసుల మధ్య ఎంతటి స్వాంతన చేకూరుస్తుంది అనేది కథ ప్రారంభం నించి చివరిదాకా , ఎంతో సాదా సీదా విషయాలు , శైలి కలగలిపి చెప్పిన కథ ఇది. గుక్కపట్టి ఏడ్చే పసిపాప తల్లి ఎత్తుకోగానే టక్కున ఏడుపు ఆపి చిరునవ్వు నవ్వుతుంది.చిన్నప్పుడు కలిసి పెరిగి చదువుకున్న , ఆడుకున్న తోబుట్టువులు, స్నేహితులు తిరిగి కలిసినప్పుడు చేసుకునే ఆత్మీయ కరచాలన స్పర్శ గొప్ప ఆనందాన్నిస్తుంది. జీవితంలో యౌవనారంభం నించి , అంతిమ దశ దాకా భార్యా భర్తలను అనురాగ బంధంతో కట్టిపడేసేది గాఢ ఆలింగనా "స్పర్శ ". ఎన్నో మాటలతో చెప్పలేని భావం ఒక్క ఆత్మీయ స్పర్శ ద్వారా వ్యక్తం అవుతుంది.స్పర్శ ఒక్క మనుషుల మధ్య మాత్రమే కాదు సమస్త జీవ జంతుజాలమూ అనుభవించే ఒకానొక భౌతిక , మానసిక ఆనందానుభూతి.అణుఆయుధాలతో పరస్పర వినాశనానికి సిద్ధమైన దేశాధినేతలు కూడా కలిసినప్పుడు చాలాసేపు విడవకుండా చేసుకునే ఆలింగన కరచాలన స్పర్శ వారి మనసుల్లో స్నేహాభావాన్ని పెంపొందించి , మానవాళిని కాపాడుతుంది అని ఆశపడచ్చు. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు , స్వామీజీలు చేసుకునే ఆలింగన చుంబనాలు ప్రజలకు శాంతి సౌఖ్యాలను పంచే దిశగా ఫలితాలను ఇస్తే అదృష్టవంతులం. మీ కొప్పర్తి రాంబాబు విశాఖ సాగరతీరం.

Episode metadata supplied by the publisher feed · Published Jul 23, 2019

Embed this episode

NOW PLAYING

"స్పర్శ " . రచయిత్రి శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి

0:00 6:14

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of "కొప్పర్తి కథావాహిని "?

This episode is 6 minutes long.

When was this "కొప్పర్తి కథావాహిని " episode published?

This episode was published on July 23, 2019.

Can I download this "కొప్పర్తి కథావాహిని " episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!