EPISODE · Nov 4, 2019 · 16 MIN
"సరస్వతీ లిపి " రచన శ్రీ ఆకెళ్ల శివప్రసాద్.
from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy
*కృష్ణాతీరం.... విజయవాడ నుంచి కథాభిమానులకి నమస్కారం . అందరికీ దీపావళి శుభాకాంక్షలు* ఈ వారం మనం వినబోయే కథ "సరస్వతీ లిపి " రచన శ్రీ ఆకెళ్ల శివప్రసాద్.ఒక భిన్నమైన కథాంశంతో , చక్కటి శైలితో రాసిన కథ "సరస్వతి లిపి " . రచయిత శివప్రసాద్ గారి చేతి రాత ఎలా ఉంటుందో నాకు తెలీదు కానీ , ఆయన మాత్రం చెయ్యి తిరిగిన రచయితగా పాఠక లోకానికి సుపరిచితులు. ఈ కథ 2008 లో నవ్య వారపత్రిక CP Brown అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీలో చివరిదాకా నిలబడిన కథ. కథ చదివిన తరువాత రచయిత ఈ సరస్వతీ లిపి అనేది ఒక ఊహా జనిత అంశంగా కథ రాశారా , నిజంగా ఉన్నదా అనే ఆసక్తి కలిగింది నాకు. *గూగుల్ తల్లీ నమస్తుభ్యం* అనుకుని వెతికాను....ఆశ్చర్యంగా... ఎంతో సమాచారం ఉన్నది.ప్రాచీన భారత చరిత్ర వ్యాసాలు సరస్వతి లిపి గురించి ప్రస్తావించాయి. సరస్వతి లిపి మరేదో కాదు , మన సింధు నాగరికత విలసిల్లిన రోజుల్లో...క్రీస్తు పూర్వం ....సరస్వతి లిపి ఉన్నది . పదాలు విడి విడి అక్షరాలు కలిపి రాయకుండా....గుర్తుల ద్వారా ...ఒక్కో పదానికి ఒకొక్క గుర్తు ఏర్పాటు చేసుకుని రాసే లిపి సరస్వతి లిపి అని నాకు కొద్దిగా అర్థం అయ్యింది....దానికి సంబంధించిన చిత్రం కూడా ఉంచుతున్నాను చూడండి. కథా పరంగా చూస్తే "అంతరించిపోతున్న జాతుల్లో " పక్షులూ...జంతువులూ ఉన్నట్లే అంతరించిపోతున్న సంస్కృతీ సంప్రదాయాల్లో భాష , లిపి ఉంటాయి . వాటిని పరిరక్షించుకోవలసిన అవసరం ఉంది అని చెప్తూ..."మనుష్యులు...లిపులు ఆదరణ కోరుకుంటాయి " అంటారు రచయిత.వినండి "సరస్వతి లిపి "....ఆకెళ్ల శివప్రసాద్ గారి కథ. 💐🙏మీ కొప్పర్తి రాంబాబు Retd Asst.General Manager Indian Bank Vijayawada.
Embed this episode
NOW PLAYING
"సరస్వతీ లిపి " రచన శ్రీ ఆకెళ్ల శివప్రసాద్.
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.