EPISODE · Oct 18, 2020 · 29 MIN
"తిలదానం" - రచయిత కీ. శే. రెంటాల నాగేశ్వరరావు
from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy
💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకి నమస్కారం.💐💐🙏 ఈ వారం మనం వినబోయే కథ "తిలదానం" రచయిత కీ. శే. రెంటాల నాగేశ్వరరావు నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహాయంతో 2000 సంవత్సరంలో గంటా ముఫై నిముషాల చిత్రంగా రూపొందించబడిన సినిమాకు మూల కథ ఈ " తిలదానం." సినిమాకు సంభాషణలు కూడా మూల కథా రచయితే సమకూర్చారు. ఇక కథ విషయానికి వస్తే...వేద విద్యాధ్యయనం చేసి ఒకనాడు ఉచ్ఛస్థితిలో జీవించిన సద్ బ్రాహ్మణుడు పరిస్థితులు తారుమారు అయ్యి , స్వగ్రామాన్ని వదిలి హైద్రాబాద్ మహానగరం చేరుకుని , ఆయన విద్వత్తు అక్కరకు రాక , శవ వాహకునిగా...శని దానాలు స్వీకరించే స్థితికి దిగజారిన దురదృష్ట జీవి కథ. కమ్యూనిస్టు సిద్ధాంతాలు , మార్క్సిస్టు దృక్పధం ఏమేరకు సమ సమాజ స్థాపనకు దోహదం చేస్తుంది అని ఆచరణీయమైన ఆలోచన చెయ్యకుండా అర్థరహితమైన ఆదర్శాలు సిద్ధాంతాలు పట్టుకుని వేళ్ళాడుతూ....కుటుంబాన్ని జీవితాన్ని నాశనం చేసుకున్న యువకుని కథ. కర్మ కాండ మీద నమ్మకం విశ్వాసం కలిగిన శాస్త్రి మనవడికి గ్రహశాంతి జరిపించే క్రమంలో , తన శాస్త్ర పారంగతను లోకానికి ఏ విధంగా విదితమయ్యే లాగా చేశాడు , అదేసమయంలో రఘురాం తన సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి తన ప్రాణానికి వెల కట్టిన ప్రభుత్వానికి లొంగిపోయి , ఆ డబ్బు కుటుంబానికి తన స్నేహితుని ద్వారా అందుతుంది అనుకుని నమ్మక ద్రోహానికి గురి అయ్యిన విషాద కథ " తిలదానం ". ఈ కథ 1991 ఆంధ్రప్రభ కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి గెలుచుకుంది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది ఆంగ్లంలోకి , ఇతర భారతీయ భాషల్లోకి అనువదింపబడింది.చలన చిత్రం గా జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డ్ అందుకున్నది. వినండి. ఈ వారం కథ కీ. శే. రెంటాల నాగేశ్వరరావు గారి "తిలదానం" 🙏 మీ కొప్పర్తి రాంబాబు , Retd Asst General Manager Indian Bank Vijayawada. Mail [email protected]
Embed this episode
NOW PLAYING
"తిలదానం" - రచయిత కీ. శే. రెంటాల నాగేశ్వరరావు
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.