EPISODE · Jul 23, 2019 · 24 MIN
తన మార్గం -రచన శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి
from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy
కథాభిమానులకి నమస్కారం. 🙏ఈ వారం మనం వినబోయే కథ *"తన మార్గం -రచన శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి* కొంచెం పెద్ద కథ.60 ఏళ్ళ వయసులో భర్త గతించిన తరువాత "ఒంటరి జీవితం " అనుకునే భావనే మనసులోకి రానీకూడదు అనే స్థిర నిశ్చయంతో , శేష జీవితం తనది, ఆ జీవితానికి స్వయం ప్రతిపత్తిని సాధించుకోడానికి నడుం బిగించి , అప్పటిదాకా తాను బందీ అయిన బంధాలు , బాంధవ్యాలు అనే మానసిక శృంఖలాలకు మళ్ళీ బందీ కాకుండా....ఉండాలి అని మనసుని గట్టి చేసుకున్న ఒక దిగువ మధ్యతరగతి ఇల్లాలి కథ.భర్త అడుగుజాడల్లో , నీడలో గడిచిన జీవితం అంతా తనది కాదనీ....ఆయన గతించిన తరువాత తనది ఒంటరి జీవితం కాదనీ.... కారాదు అనీ.....ఇప్పటికైనా స్వతంత్రంగా తన మార్గంలో ....సాగాలనీ ధైర్యంగా ఆలోచన చేసిన వయసుమళ్ళిన మహిళ కథ.ఉత్తమ ఇల్లాలుగా ముద్ర వేసుకుని... భర్త చాటున కొనసాగడం వల్ల అసలైన జీవితం తాను చవి చూడలేక పోయాననీ ....తన మనసులో కోరికగా మిగిలిపోయిన అసలైన జీవితం తనకు అందుబాటులోకి తెచ్చుకునే అవకాశం లభించిన ప్పుడు ఆ అవకాశం వదులుకోకూడదు అనీ , తనలోని "స్త్రీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోడానికి "అది గొప్ప అవకాశంగా భావించిన మహిళ కథ.అబ్బూరి ఛాయాదేవి గారు సాహిత్య సంస్కారం నేపధ్యంగా ఉన్న ఇంట మెట్టిన ఇల్లాలు. మామగారు అబ్బూరి రామకృష్ణారావు గారు, భర్త వరద రాజేశ్వరరావు గారు సాహితీవేత్తలు.వారి ఛాయలు పడకుండా సొంత గొంతుతో రచనలు చేశారు ఛాయాదేవి గారు. కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందిన కొద్ది మంది తెలుగు రచయిత్రుల్లో ఒకరు.ముందే మనవి చేసినట్టు కొంచెం పెద్ద కథ మాత్రమే కాదు.....జీవితపు విస్తృతి ఒంటరితనంలో కూడా ఎలా అనుభవంలోకి తెచ్చుకోవచ్చో.... కావాల్సినదల్లా.... ఆలోచనా దృక్పథంలో మార్పు మాత్రమే అని సూటిగా ప్రతిపాదించిన కథ. అందువల్ల పెద్ద కథ. ఓపికగా వినండి.💐🙏
Embed this episode
NOW PLAYING
తన మార్గం -రచన శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.