EPISODE · Mar 30, 2020 · 13 MIN
"తరగతి గదిలో తల్లి " రచయిత శ్రీ సింగమనేని నారాయణ
from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy
💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం 🙏. అందరూ ఇళ్లకు పరిమితమయ్యి క్షేమంగా ఉన్నారని భావిస్తాను. ఈ వారం మనం వినబోయే కథ "తరగతి గదిలో తల్లి " రచయిత శ్రీ సింగమనేని నారాయణ. ఈ కథ నాకు జనవరి నెలలో జరిగిన విజయవాడ పుస్తక మహోత్సవంలో ఒక సాహిత్యాభిమాని చిన్న booklet గా వేసి పంచిపెడుతుండగా....నా చేతికి వచ్చింది. ఆయన పేరు శ్రీ దేవినేని మధుసూదన్ రావు గారు. వృత్తిరీత్యా ఆడిటర్. విజయవాడ సమీపంలోని తెన్నేరు గ్రామంలో దేవినేని సీతారావమ్మ ఫౌండేషన్ స్థాపించి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ.... మంచి సాహిత్యాన్ని , పిల్లలకు ఉపయోగ పడే పుస్తకాలను ప్రచురించి ఉచితంగా స్కూల్స్ కి అందచేస్తుంటారు. నేను కథలు చదివి వినిపించే క్రమంలో పిల్లలకు ఉపయోగపడే కథలు అందించవలసిందిగా కొందరు మిత్రులు అడిగారు.అయితే ఆ పని నేను ఇప్పటిదాకా చెయ్యలేకపోయాను. ఈ కథ పెద్దవాళ్ళు పిల్లలకు వినిపోయిస్తే వారికి కూడా నచ్చుతుంది అనిపించింది. కథా రచయిత సింగమనేని నారాయణ గారు విశ్రాంత ఉపాధ్యాయులు. ప్రముఖ రచయిత. అనంతపురంలో ఉంటారు.విశాలాంధ్ర సంపాదక వర్గ సభ్యులు. పిల్లలకు పాఠాలు నేర్పే గురువులు మంచి విషయాలు ఎలా నేర్పించాలో ఈ కథ చక్కగా చెప్తుంది. వినండి సింగమనేని నారాయణగారి కథ "తరగతి గదిలో తల్లి " కథ.🙏మీ కొప్పర్తి రాంబాబు Retd AGM Indian Bank విజయవాడ . Mail rambabuk. [email protected] phone 96770 15158.
Embed this episode
NOW PLAYING
"తరగతి గదిలో తల్లి " రచయిత శ్రీ సింగమనేని నారాయణ
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.