EPISODE · Oct 5, 2019 · 14 MIN
"టార్గెట్ " రచయిత డాక్టర్ నక్కా విజయరామ రాజు
from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy
*కృష్ణాతీరం.... విజయవాడ నుండి....కధాభిమానులకు నమస్కారం.*💐🙏ఈ వారం మనం వినబోయే కథ "టార్గెట్ " రచయిత డాక్టర్ నక్కా విజయరామ రాజు గారు. కొప్పర్తి కథా వాహినిలో ఇంతకు ముందు డాక్టర్ గారి భట్టిప్రోలు కథలు లోంచి , Highly Commendable Certificate అనే ఒక కథ వినిపించాను. వాస్తవానికి ఈ రెండు కథలూ ఒకే సారి రికార్డ్ చెయ్యడం జరిగింది.రెండు కథలూ బాగున్నాయి అనిపించి , రచయితని అడిగాను ఏ కథ ఉంచమంటారు అని....ఆయన నవ్వి....కథ రాయడం వరకే రచయిత పని , ఆ తరువాత రచనలో మంచి చెడులు నిర్ణయించడం పాఠకులకు వదిలెయ్యాలి అన్నారు. దాంతో మంచి కథ కనుక ఈ కథను కూడా భద్రపరిచాను. ఇక టార్గెట్ కథ విషయానికి వస్తే....నా బ్యాంక్ ఉద్యోగ జీవితం అంతా దాదాపు 40 ఏళ్ళు టార్గెట్స్ వెనుక పడి పరుగెత్తడం తోనే గడిచిపోయింది. టార్గెట్స్ రీచ్ అయిన , దాటిన సందర్భాల్లో ప్రశంసలు , ప్రమోషన్లు.....సాధించలేనప్పుడు....తిట్లు...దీవెనలు ...తప్పలేదు...టార్గెట్ అనేది ఉద్యోగంలో అయినా , వ్యక్తిగత జీవితంలో అయినా చేరవలసిన , సాధించవలసిన ఒక నిర్దేశిత గమ్యం అనుకుంటే ఒత్తిడి ఉండదు. లక్ష్య సాధనలో ఒత్తిడిని అధిగమించగలిగితే ప్రశాంతత లభిస్తుంది. ఈ కథలో కరుణమ్మ టార్గెట్ రీచ్ కావడం కోసం వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెడుతుందికుటుంబ నియంత్రణ , కుటుంబ సంక్షేమం ఈ రెండూ ప్రభుత్వ విధి విధానాలు ఒక పదేళ్ల క్రితం దాకా బాగా ఊపు మీద నడిచాయి. ఆ తరువాత ప్రజలు విద్యావంతులు వివేకవంతులు కావడంతో "స్వీయ నియంత్రణ " అలవరచుకొన్నారు. ప్రస్తుతం సంక్షేమం ప్రభుత్వం అమలు పరుస్తున్న అనేక పధకాల ద్వారా ప్రజలు లబ్ది పొందుతున్నారా ? లేదా అన్నది ఒక ప్రశ్నార్ధకం . ప్రజలకు సమ్... క్షేమం కలిగినా చాలు....వినండి ఈ వారం కథ "టార్గెట్ " రచన డాక్టర్ నక్కా విజయ రామరాజు.💐🙏మీ కొప్పర్తి రాంబాబు , విశ్రాంత AGM ఇండియన్ బ్యాంక్ , విజయవాడ.
Embed this episode
NOW PLAYING
"టార్గెట్ " రచయిత డాక్టర్ నక్కా విజయరామ రాజు
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.