వేటూరి వారి వర్థంతి episode artwork

EPISODE · May 22, 2020 · 8 MIN

వేటూరి వారి వర్థంతి

from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy

💐💐ఈరోజు 22nd May 2020 వేటూరి వారి వర్థంతి.🙏 ఉదయం నించి ఏ వాట్సఆప్ గ్రూపు తెరిచినా వారి గురించిన విశేషాలు....జ్ఞాపకాలు....మాటలు....వారి పాటలు. వేటూరి వారిని ఎవరం అయినా సినిమా కవిగానే గుర్తుంచుకుంటాము.కాదనను. కానీ ఆయన సినీ గీతరచనకు గొప్పతనం చేకూర్చింది ....ఆయన పాండిత్యం. ఆయన పత్రికా రచనలో ....జర్నలిస్ట్ గా గడించిన అనుభవం ఆయన్ని ఏ సన్నివేశానికి అయినా (వార్తకు తక్షణం స్పందించడం పత్రికా రంగంలో ...మీడియాలో ఉన్నవాళ్ళకి అత్యవసర లక్షణం ) వెంటనే పాట రాయగలిగేలా చేశాయి అనిపిస్తుంది. ప్రతిఘటన చిత్రంలో ఆయన "దుర్యోధన దుశ్శాసన....లోకంలో " పాట ఆయనలోని జర్నలిస్ట్ కవి....మనకి కనిపించేలా చేస్తుంది.ఆయన పాండిత్యానికి ఉదాహరణగా చెప్పాలి అంటే పదులకొద్ది పాటలను ఉదహరించాలి . భక్త కన్నప్ప సినిమాలో కిరతార్జునీయం పాట విషయానికి వస్తే....శ్రీనాధుని హరవిలాసం కావ్యంలోని " వికట పాటల జటా మకుటికా భారంబు .....కరుకైన జుంజురు నెరులు గాగ...." పద్యపాదాన్ని గుర్తుకుతెచ్చేలా .....నెలవంక తలపాగ నెమలి ఈకగ మారే....తలపైన గంగమ్మ తలపులోనికి జారే.... అని రాసుకువచ్చారు. ఆయన మాటల్లో ఆయనే అన్నారు...".గతమంతా శ్రుతం నాది....ప్రస్తుతానికి అదే పునాది."...అని. భార్యాభర్తల అన్యోన్య దాంపత్యాన్ని సృజిస్తూ....మానస వీణా మధుగీతం వంటి గొప్ప పాటలు రాసారు. పంతులమ్మ చిత్రంలోని పాటల గురించి ప్రస్తావిస్తూ....1980 లో తెనాలిలో శంకరాభరణం సినిమా యూనిట్ అభినందన సభలో ఆయన ఒక ఉద్వేగపూరితమైన ప్రసంగం చేశారు. శంకరాభరణం సినిమాలోని పాటలను ప్రశంసిస్తూ తెనాలికి చెందిన ఒక ప్రముఖ వైద్యులు...పొరపాటున.... బూతు పాటలు రాసిన వేటూరి గారేనా ఈ పాటలు రాసినది అని ఆశ్చర్యం కలిగింది అని నోరు జారారు. వేదిక మీద ఉన్న వేటూరి...బెబ్బులి లాగా లేచి ఏది బూతు...ఏది నీతి.. ఏది కవిత్వం...ఏది సాహిత్యం...ఏది జనహితం....ఏది జానపదం అంటూ ఒక పదిహేను నిముషాలు అద్భుతంగా తన పాండిత్యాన్ని...లోకం ఏవిధంగా గుర్తించలేదో.... సినిమా కవిగా మారిన తరువాత తనకు ప్రజలు ఏ విధంగా నీరాజనాలు పడుతున్నారో చెప్తూ....పంతులమ్మ సినిమాకి పాటలు రాసిన దౌర్భగుడ్ని నేనే అని బాధపడ్డారు. ఎడారిలో కోయిల అన్న పదంలోని....భావాన్ని చెప్పమన్నారు. ఆతరువాత ఆయన మేఘసందేశంలో అటువంటి పద ప్రయోగాలు ఎన్నో చేశారు....ఒక పాటలో...వానకారు కోయిల....రాతి పూల తుమ్మెద వంటివి.వేటూరి వారి గురించి చెప్పాలి అంటే ఒక వాట్సాప్ మెసేజ్ ఒక వ్యాసం సరి పోవు.ఆయన కవి సమ్రాట్ విశ్వనాథ వారి శిష్యుడు.వారి పెదతండ్రిగారి నించి వారికి సంక్రమించిన పాండిత్యం....మహాకవి కాళిదాసు కుమారసంభవ కావ్యంలోని ...జగతః పితరౌ పార్వతీ పరమేశ్వరౌ....అనే శ్లోకాన్ని....పార్వతీప...రమేశ్వరౌ.....అని వాక్కుని అర్థాన్ని కొత్తప్రయోగంగా మార్చి.....లోకానికి తండ్రులు ఈశ్వరుడు...విష్ణువు అని చమత్కారంగా వాడే ధైర్యమున్న కవిగా మలిచాయి. వేటూరి...బాగా చదువుకున్న పండితులు.లోకాన్ని చదివిన విలేఖరి.... ఆ తదుపరి సినీ గేయ ప్రవాహం. 💐💐వారికి నివాళి 🙏కొప్పర్తి రాంబాబు , Retd AGM Indian Bank Vijayawada. Ph 96770 15158. వారిని గురించి..... శ్రీ తనికెళ్ళ భరణి ...నక్షత్ర దర్శనం ....పుస్తకంలో రాసిన పద చిత్రం ....సహస్ర శీర్ష బ్రహ్మ వేటూరి సుందర రామమూర్తి ....ఆడియో రూపంలో మీకు అందిస్తున్నాను.

Episode metadata supplied by the publisher feed · Published May 22, 2020

Embed this episode

NOW PLAYING

వేటూరి వారి వర్థంతి

0:00 8:09

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of "కొప్పర్తి కథావాహిని "?

This episode is 8 minutes long.

When was this "కొప్పర్తి కథావాహిని " episode published?

This episode was published on May 22, 2020.

Can I download this "కొప్పర్తి కథావాహిని " episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!