EPISODE · Apr 19, 2020 · 28 MIN
"వెండి కంచం " . రచయిత కీ. శే.మునిమాణిక్యం నరసింహారావు గారు
from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy
💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం.🙏ఈ వారం మనం వినబోయే కథ "వెండి కంచం " . రచయిత కీ. శే.మునిమాణిక్యం నరసింహారావు గారు.పాతరోజుల కథ. కథాకాలం ఇదమిద్దం గా తెలియదు.స్వాతంత్రం వచ్చిన తొలిరోజులుకావచ్చు. మునిమాణిక్యం వారు అనగానే గుర్తొచ్చే పాత్ర "కాంతం" . మధ్యతరగతి ఇల్లాలికి సజీవ రూపం. సంసారం నడుపుకోడానికి అవసరమైన ఒద్దికతనమూ... గడుసుదనం కలగలసిన ఆదర్శఇల్లాలు.భర్త మనసెరిగి మసలుకునే ఇల్లాలు కూడా ! తెలుగులో కాంతం కథలు , భానుమతిగారి అత్తగారి కథలు , అమరావతి కథలు , ఎగువ...దిగువ గోదావరి కథలు ఇలా వివిధ నేపధ్యాలలో రాసిన కథలు రచయితలు ఉన్నారు. మునిమాణిక్యం వారు కాంతం పాత్రను సజీవ పాత్రగా రూపుదిద్దారు. మధ్యతరగతి వారి ఆదాయ వ్యయాలు...ఆశలు , కోరికలు ఎంతో హృద్యంగా సున్నితమైన హాస్యంతో మేళవించి రాసిన కథ "వెండి కంచం " . కథలో మనసుకి తాకే అంశం భర్తకోరిక తీర్చడంలో ఆ ఇల్లాలు భర్త పట్ల అనురాగంతో అనుసరించిన ఆర్థిక క్రమశిక్షణ.పొదుపరితనం. ఆదాయానికి తగ్గట్టుగా....ఉన్నంతలో జాగ్రత్త చేసుకుంటూ కుటుంబాన్ని నడుపుకురావడంలో ఇల్లాలి పాత్ర నాటికి...ఈనాటికి...ఏనాటికి... తిరుగులేనిది అనే జీవన సత్యం విశదం చేసే కథ. ఆర్థిక క్రమశిక్షణ విషయంలో స్త్రీలు ఎప్పుడూ మగవారికన్నా మెరుగైన వారు అని అంగీకరించక తప్పని సత్యం. భర్త కోరిక తీరేలా వెండి కంచం కొని అందులో కడుపారా భోజనం పెట్టి....ఆ పై ఆ కంచంలోనే ఆకు, వక్కలు అందించిన ఆ ఇల్లాలు దాంపత్యంలోని మాధుర్యాన్ని భర్తకి పంచిన తీరు ప్రశంసనీయం.వినండి ఈ వారం కథ "వెండి కంచం " రచయిత కీ. శే.మునిమాణిక్యం నరసింహారావు గారు. 💐💐మీ కొప్పర్తి రాంబాబు , Retd AGM Indian Bank Vijayawada. Phone 96770 15158 Mail [email protected].
Embed this episode
NOW PLAYING
"వెండి కంచం " . రచయిత కీ. శే.మునిమాణిక్యం నరసింహారావు గారు
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.