EPISODE · Jul 25, 2020 · 31 MIN
"వెన్నెల నీడ " రచన శ్రీ భ.రా.గో.(భమిడిపాటి రామ గోపాలం )
from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy
💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం 🙏ఈ వారం మనం వినబోయే కథ *" వెన్నెల నీడ " రచన శ్రీ భ.రా.గో.(భమిడిపాటి రామ గోపాలం )* శ్రీ భరాగో హాస్య రచయిత గా గుర్తింపు పొందినా... మనసులోతుల్ని స్పృశించే కథలు ఎన్నో రాశారు. అటువంటి గొప్ప కథల్లో కథే "వెన్నెల నీడ". మానవ జీవితంలో అనేక సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా భార్యాభర్తల అనుబంధం అత్యంత సున్నితము...బలము అయినది. మొదలైన క్షణం నుంచి పరస్పర ప్రేమాభిమానాలు , అనురాగం నమ్మకం ప్రాతిపదికగా జీవిత పర్యంతమూ సాగేది. భరాగో గారి ఈ కథని ముళ్ళపూడి - బాపు గారు సినిమాగా తీద్దాము అనే కోరికతో ఉండేవారుట. వారు సినిమా తియ్యకపోయినా ఈ కథలో రచయిత వ్యక్తం చేసిన భావాల్ని వారి సినిమాలు ముత్యాల ముగ్గు మొదలుకుని ....పెళ్లి పుస్తకం దాకా చాలా వాటిలో భార్యా భర్తల అనుబంధానికి ఉండే విలువను ఎంత హృద్యంగా చెప్పవచ్చో అంత హృద్యంగానూ చెప్పారు. వారు సెల్యులాయిడ్ పై చూపిన విషయాన్ని భరాగో 1960 ప్రాంతాల్లోనే ఈ కథగా మలిచారు. ఈ కథకి పేరు ఉంచడంలోనే భరాగో గారి గొప్పదనం తెలుసుకోవచ్చు. మాములుగా వేరే ఏ రచయితో అయితే ఈ కథకి " తప్పిపోయిన పెళ్లి సంబంధం " అని ఒక పేలవమైన పేరు ఉంచేవాడు. భరాగో స్త్రీ మనో ఔన్నత్యానికి భంగం వాటిల్లకుండా "వెన్నెల నీడ " అన్నారు. కథలో శ్యామల ఆలోచనలు గతి తప్పడం రచయిత రాసారు, పాఠకులు చదువుతారు , ఆమె భర్త సూచన ప్రాయంగా గ్రహిస్తాడు , ఆమె తనని తాను నిందించుకుంటుంది. కానీ కథ ముగిసేసరికి ఆ భార్యా భర్తల మధ్య అనురాగ బంధం ఎంత బలీయమైనదో బయటినుంచి చూసిన మనకి స్పష్టమవుతుంది.... ఆ భార్యాభర్తలే కాదు ఏ భార్యాభర్తల మధ్య ఎటువంటి పొర పొచ్చాలు వచ్చిన "మనసు తెలుసుకుని " మసులుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన కథ..శ్రీ భరాగో గారి .."వెన్నెల నీడ ".వినండి ఈ వారం కథ....💐💐🙏మీ కొప్పర్తి రాంబాబు , Retd Asst General Manager Indian Bank Vijayawada. Ph 96770 15158 Mail [email protected]
Embed this episode
NOW PLAYING
"వెన్నెల నీడ " రచన శ్రీ భ.రా.గో.(భమిడిపాటి రామ గోపాలం )
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.