EPISODE · Oct 18, 2020 · 24 MIN
వల్లూరు శివప్రసాద్ గారి కథ - " ఇస్ మిట్టిసే తిలక్ కరో " 🙇🏾♂️ 🇮🇳 💐
from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy
💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం. 💐💐🙏 ఈ వారం మనం వినబోయే కథ "ఇస్ మిట్టిసే తిలక్ కరో !" రచయిత శ్రీ వల్లూరు శివప్రసాద్. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్న శ్రీ శివప్రసాద్ కేవలం కథా రచయిత మాత్రమే కాదు , నాటక రచయిత , పుస్తక ప్రచురణ కర్త , సాహిత్య కార్యక్రమాల నిర్వహకునిగా ....సాహిత్యమే జీవితంగా ప్రయాణం సాగిస్తున్న వ్యక్తి. సాహిత్యం పట్ల వారికి ఉన్న ఉద్యమ స్పూర్తి సరిపోల్చలేనిది. ఉత్తమ నాటక రచయితగా ఆరు సార్లు నంది అవార్డు పొందారు. హింసధ్వని , వానప్రస్థం , ధ్వంసరచన నాటికలు బంగారు నంది అవార్డు పొందాయి. పిల్లలకోసం అనేక నాటికలు రచించారు. విద్యార్థులు వారి రచనల పై చేసిన పరిశోధనలకు రెండు విశ్వ విద్యాలయాలు డాక్టరేట్ పట్టా , ఎంఫిల్ డిగ్రీలు ప్రదానం చేశాయి. ప్రస్తుత కథ " ఇస్ మిట్టిసే తిలక్ కరో " దేశభక్తిని చాటే సందేశాత్మక కథ.మనదేశం నుండి గత 50 ఏళ్లలో ఎందరో ప్రతిభావంతులు విదేశాలకు వెళ్లి అక్కడ రాణించారు , రాణిస్తున్నారు. తిరిగి రామంటున్నారు. మనం కూడా రమ్మని , రావద్దనీ రెండురకాల సలహాలు చెప్తున్నాము. కానీ అక్కడ ఉన్న వారిలో అధిక శాతం మంది ప్రాణాలు , మమకారం మాతృదేశం పై నిలువుకున్న వారే ! ఏదేశమేగినా ఎందుకాలిడినా , ఏ పీఠ మెక్కినా ....మాతృ భూమిని మరువని వారే. అటువంటి ఐశ్వర్య వంతులైన ఒక నాలుగు కుటుంబాల్లో...ఉన్న వ్యక్తులతో స్నేహం కలిగిన ఒకానొక సామాన్య పేద కుటుంబానికి చెందిన వ్యక్తి , భారతదేశం నుండి కానుకగా , తల్లి తండ్రి భార్యా పిల్లలు కానుకగా అమెరికా ఏం పంపించారు....ఆ కానుక ఆ వ్యక్తి మనసులోనే కాకుండా వలస బాట పట్టిన ఆ మేధావి వర్గానికి ఏ విధమైన ఉద్వేగ భరితమైన సందేశాన్ని అందించింది కథలో చూడవచ్చు. "వినండి వల్లూరు శివప్రసాద్ గారి కథ " ఇస్ మిట్టిసే తిలక్ కరో " 💐💐🙏 మీ కొప్పర్తి రాంబాబు , Retd Asst General Manager Indian Bank Vijayawada Mail [email protected]
Embed this episode
NOW PLAYING
వల్లూరు శివప్రసాద్ గారి కథ - " ఇస్ మిట్టిసే తిలక్ కరో " 🙇🏾♂️ 🇮🇳 💐
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.