Swara Madhuri podcast artwork

PODCAST · society

Swara Madhuri

ఎన్నో మాటలు, మరెన్నో స్ఫూర్తిదాయకమైన అనుభవాలు, ఆలోచనలు అన్ని మన అందరి కోసం.......... ప్రతీ వస్తువూ, ప్రతీ ప్రదేశం, ప్రతీ మనిషీ, ప్రతీ అనుభవం, ప్రతీ ఎమోషన్.. మన జీవితాన్ని తెలియచేస్తుంది .ఎవరైనా మీ లైఫ్ ఏంటని అడిగితే మిగిలినవి ఇవే. ఈరోజు అనుభవిస్తున్న డబ్బూ, హోదాలు కాదు మనమేంటన్నది చెప్పుకోవడానికి! అంతకన్నా గొప్ప లైఫ్, బ్యూటి‌ఫుల్ లైఫ్ మనం చూసొచ్చాం. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. గర్వంగా ఎంతో చెప్పుకోవచ్చు.. అదీ లైఫ్ అంటే!! మన జీవితాన్ని మరొక్కసారి పలకరిద్దాం .... రండి మరి ..

Publisher-supplied feed metadata · PodParley refreshed Apr 23, 2026 · Source feed

  1. 39

    యుద్ధంలో సామాన్యుడి ఓటమి

    బాంబులు వేసేవాడు, వేయించుకునేవాడు.. ఇద్దరూ మనుషులే అని మర్చిపోయిన రోజున మానవత్వం మరణిస్తుంది. ఇరాన్, అమెరికా యుద్ధం గురించి ఎవరైనా మాట్లాడితే, అక్కడ ఎవరు గెలుస్తారని కాదు, ఎంతమంది సామాన్యులు ఓడిపోతారని అడగండి. ఎందుకంటే, తుపాకీకి గుండె ఉండదు, కానీ అది పేలినప్పుడు ఆగిపోయేది మాత్రం ఒక నిండు గుండె చప్పడే.

  2. 38

    మీరు స్టారా? -5 స్టారా ?? ఇది వింటే మీకే తెలుస్తుంది....

    ఎన్నింటికో మనం 5 స్టార్ రేటింగ్ ఇస్తూ ఉంటాం. ఫుడ్ డెలివరీ బాయ్ కి ఇస్తాం , ఏదైనా ప్రోడక్ట్ కొంటె దానికి ఇస్తాం,లేదంటే ఎదో ఒక సర్వీస్ నచ్చితే ఇస్తూ ఉంటాం. మరి మీకు మీరుగా ,మీ జీవితానికి మీరిచ్చుకునే రేటింగ్ ఎంతా.... ఒక్కసారి ఆలోచించండి.

  3. 37

    ఎన్నికలు బాబోయ్ ఎన్నికలు

    ఓటరు అంతరంగం తెలుసుకునేందుకు అభ్యర్థులు పోటీపడుతున్నారు. విజయంపై ఎవరికి వారే ధీమాగా కనిపిస్తున్నా లోలోపల ఓటర్ల మనసు గుర్తించలేక అభ్యర్థులు మథనపడుతున్నారు. ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు, అనుచరులు గెలుపే లక్ష్యంగా ప్రచార కార్యక్రమాల్లో దూసుకెళ్తున్నారు. ఉదయాన్నే పల్లెలకు వెళ్లి ప్రచారం చేసినా రాత్రివేళ ఆ గ్రామంలోని తమ పార్టీ పరిస్థితులపై కూపీ లాగుతున్నారు. 

  4. 36

    అనుభవమే అన్ని నేర్పిస్తుంది.....

    ఒక వ్యక్తి తన జీవితంలో ఎదుర్కొన ఆటుపోటుల నుంచి లభించిన జ్ఞానమును అనుభవం అంటారు. ఒక వ్యక్తి పుస్తకాలను చదివి నేర్చుకున్న జ్ఞానం కన్నా తన అనుభవం ద్వారా లభించిన జ్ఞానంతో సమస్యలను సులభంగా పరిష్కరించుకోగలడు.

  5. 35

    ప్రశాంతత ఎప్పుడు మనకీ????

    మానసిక ప్రశాంతత కోసం ప్రతీ ఒక్కరం ప్రాకులాడుతోనే వుంటాం..కానీ మానసిక ప్రశాంతత ఎంతో విచిత్రమైనది.... ఒకసారి విందాం రండి...

  6. 34

    చెరగని యశస్వి -కళా తపస్వి

    తెలుగు తెరపై కళాత్మక చిత్రాలకు సారథి కె.విశ్వనాథ్‌. సినీ మాధ్యమం ద్వారా భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని విశ్వవినువీధుల్లో రెపరెపలాడించిన కళాస్రష్ట. తెలుగు కథకు సంగీత, సాహిత్య, నృత్య సొబగుల్ని అద్ది నవ్యపథంలో నడిపించిన దార్శనికుడు. విశ్వనాథ్‌ సినిమాల గురించి మాట్లాడుకోవడం అంటే మన సంస్కృతి, కళల్ని పునశ్చరణ చేసుకోవడమే. కె.విశ్వనాథ్‌ సృజించిన చిత్రాలు మన ఘనమైన సంప్రదాయాలు, కళలకు నిలువెత్తు ప్రతిబింబాలుగా విరాజిల్లుతున్నాయి. చక్కటి సామాజిక స్పృహ, మూర్తీభవించిన మానవతా విలువలతో తెలుగు సినిమాకు ఓ ప్రబంధ గౌరవాన్ని తీసుకొచ్చిన దిగ్దర్శకుడు కె.విశ్వనాథ్‌. తెలుగు సినీ చరిత్రలో ఆయనది సువర్ణాధ్యాయం. సామాన్యుడు మాన్యుడిగా ఎదిగిన స్ఫూర్తిదాయక ప్రస్థానం. భౌతికంగా ఆయన మన నుంచి దూరమైనా కె. విశ్వనాథ్‌ సముపార్జించుకున్న కీర్తిప్రతిష్టలు ఆచంద్రతారార్కం ప్రభవిస్తూనే ఉంటాయి. ఆయన సినిమాల ద్వారా చాటిన విలువలు రాబోవు తరాల్ని కూడా ప్రభావితం చేస్తాయి

  7. 33

    ఎప్పటికీ అంతు పట్టని మోనాలిసా .... అసలు ఎవరబ్బా ...????

    ఈ రోజుకి కూడా మోనాలిసా ఎవరో తెలియదు? అంటే లియోనార్డో రూపొందించిన పెయింటింగ్ అమ్మాయి ఇప్పటికీ ఒక రహస్యం. మోనాలిసా లియోనార్డో తప్ప మరెవరో కాదని ఒక థియోరి చెబుతోంది.

  8. 32

    పాటల వెన్నెల సిరివెన్నెల

    తెలుగు సినీ సాహిత్యానికి కొత్త ఒరవడిని సృష్టించిన సిరివెన్నల కలం ఇంకిపోయింది బాలసుబ్రహ్మణ్యం గారి గళం చెంతకే కలం వెళ్ళిపోయింది.

  9. 31

    అద్భుతమైన లైఫ్ ఇలా సాధ్యం!!!!

    జీవితంలో ప్రతీ క్షణం ఏ సిట్యుయేషన్‌ని ఎలా లీడ్ చేయాలన్నది మన చేతిలోనే ఉంటుంది. సో ఎలాంటి ఛాయిస్ తీసుకుంటే లైఫ్ అలా ఉంటుంది..

  10. 30

    అబద్ధం విపరీతంగా భయపెడుతుంది..తప్పక వినాల్సిందే......

     జనాలు ముడుచుకుపోతున్నారు… లోపల్లోపలికి.. భయాల మధ్య, అభద్రతల మధ్యా!! అన్నీ తమకే జరిగిపోతాయేమో అనేసుకుంటున్నారు..

  11. 29

    జీవితానికి ఆశ - వెలుగు

    ఈరోజు మన మనస్సుల్లో ప్రశాంతత కావాలంటే తెలివైన బుర్రల కన్నా సుతిమెత్తని మనసులు చాలా అవసరం.

  12. 28
  13. 27

    బిర్యాని--జీవితం --మధ్యలో మసాలా

    మసాలా అంటే మనకు ఇష్టం.. ఇది ఫుడ్ అయినా లైఫ్ అయినా! ప్రశాంతంగా ఉన్న కడుపులోకీ, మనస్సులోకీ మసాలాలు నింపి పారేసి.. వాటిని కడుపులోనూ, బ్రెయిన్‌లోనూ డైజెస్ట్ చేసుకోవడానికి నానా తంటాలు పడడం మనకు ఇంకా ఇష్టం...

  14. 26

    “ఏ పని చేస్తే ఎవరేమనుకుంటారో..” 

    మన లైఫ్ చచ్చేంత వరకూ మన చేతుల్లోనే ఉండాలి. మనమే డిసైడింగ్ ఫ్యాక్టర్. కర్త, కర్మ, క్రియా అన్నీ మనమే అవ్వాలి. నువ్వెలా ఉండాలో డిసైడ్ చేసే స్వేచ్ఛ ఇంకొకడికి ఇవ్వకు. ఆడేసుకుంటారు. 

  15. 25

    బాధలలోనే వుంటాం ఎప్పుడూ..ఎందుకో తెలుసా ?????

    జీవితం ఉన్నది సంతోషంగా గడపడానికి. మనం రోజూ చేసే ప్రతీ పనీ సంతోషంగా కూడుకున్నదీ.. సమస్యల్లా మనం ఆ పనుల్లో బాధని మాత్రమే ఐడెంటిఫై అవుతున్నాం.. అందుకే మనకిన్ని బాధలు. 

  16. 24

    నిజంగా మనం ముసలి వాళ్ళతో సమానమా??

    మనిషి సగం వయస్సు లోనే జీవశ్చవంలా మారిపోతున్న వైనం. ఎందుకు అలా జరుగుతోంది. ..ఆలోచించారా ???

  17. 23

    శ్రుష్టిలో అమ్మ ప్రేమ మాత్రం ఒకటే మనిషైనా -జంతువైనా

    ప్రపంచంలో అన్నింటికన్నా.. తల్లి ప్రేమ గొప్పదని ఎవరిని అడిగినా చెబుతున్నారు...ఈ శ్రుష్టి లో గొప్పది తల్లి ప్రేమ. ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ప్రేమను మించిన ప్రేమ మనకు దొరికే అవకాశం ఉండదు. అది జంతువు అయినా మనిషి అయినా సరే తల్లి ప్రేమ అంత గొప్పది

  18. 22

    పరుగులు పెట్టే జీవితాలు - నిశ్చలంగా వుండే జీవనాలు

    పరుగులు పెట్టే జీవితంలో మనం ఏమి పొందుతున్నమో లెక్కలు వేసుకుంటూ వున్నాం కానీ ఏమీ కోల్పోతున్నాం అనేది అర్థం చేసుకోలేకపోతున్నాం.... వినండి మరి..

  19. 21

    కాలం - ఖర్మ

    కాలం, ఖర్మఎంత గొప్పవి కదా...ఖర్మ నా బ్రతుకు ఇలా ఎందుకు అని ఆలోచిస్తూ నిస్సహాయ పడినప్పుడల్లా, కాలం మనకు ఏదో ఒక రూపంలో అవకాశాలు చూపిస్తూనే ఉంటుంది.

  20. 20

    అందరూ మన టైమ్ ని ఎలా వృధా చేస్తారంటే.........

    ఒక మనిషి జీవితంలో అతి ముఖ్యమైన సమయాన్ని హైజాక్ చేయడం కోసం ప్రతీ ఒక్కరూ ప్రయత్నిస్తూనే ఉన్నారు.

  21. 19

    పండుగలు -ప్రకృతి

    సంక్రాంతి అంటే పెద్ద పండుగ. పెద్దల పండుగ. పంటల పండుగ. పశువుల పండుగ. పుడమి పుస్తకంలో ప్రకృతి రాసుకున్న మధురమైన కవిత. గీసుకున్న అద్భుతమైన చిత్రిక. హరితవర్ణపు చీర ను కట్టుకుని, బంతి చేమంతులను జడలో తురుముకుని, రంగవల్లికల రంగుల దారిలో నడిచి వచ్చే సంక్రాంతి దేవతను చూసి మురిసిపోని మనిషి వుండడు. సంబరపడే కర్షకుడు వుండడు. మనిషికి తెలిసిన తొలి పండుగ సంక్రాంతే! బీడు నేలను దుక్కి దున్ని పంటసిరిగా మార్చిన మానవుడికి ఇదే తొలి పండుగ. ప్రకృతిని ఆరాదిద్దాం, గౌరవిద్దాం..........

  22. 18

    ఎన్ని ఉన్న మనిషి సంతోషం తన చుట్టూనే...

    పుష్కలంగా అన్నీ దొరుకుతూన్న రోజుల్లో, మనం, వాటిని అనుభవించడానికి , ప్రతీ రోజూ చిరాకు పడేవాళ్ళం. “ అబ్బ ప్రతీ రోజూ ఇవేనా.. “ అని. ఆరోజుల్లో ఉండీ అనుభవించలేదు, ఇప్పుడు అనుభవించాలన్న కోరిక ఉన్నా వీలు పడడం లేదు. అందుకేనేమో “ చేసికున్నవాడికి చేసుకున్నంతా.. “ అంటారు.

  23. 17

    మూడు తరాలు ఒక సందేశాత్మక కధ

    మనిషి ప్రయాణం ఎక్కడ మొదలైంది? ఇప్పుడది ఏ దిశగా సాగుతోంది? తెలుసుకోవడానికి మానవ పరిణామ చరిత్ర అంతా తవ్వక్కర్లేదు! ఓ మూడు తరాల అనుభూతులను, అనుభవాలనూ పరిశీలిస్తే చాలు. మనుషుల్ని ప్రేమించు, వస్తువుల్ని వాడుకో అని అంతర్లీనంగా సందేశమిచ్చే సమాజం అనేది ఒకతరం అయితే , మనుషుల్ని వాడుకుని.. వస్తువుల్ని ప్రేమించే సంస్కృతి అనేది ఇంకో తరం,  వస్తువుల్ని ప్రేమించి వస్తువుల్నే వాడుకోవటం మా తరం  పరిస్థితి.

  24. 16

    "విషం "ఒక మంచి కధ

    కధలంటే ఇష్టం లేనిది ఎవరికి ? మరి మీకోసం ఓ మంచికధ తెచ్చాను , వినేయ్యండి మరి.............

  25. 15

    భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

    శ్రోతలకు,స్నేహితులకు , శ్రేయోభిలాషులకు భారత స్వాతంత్రదినోత్సవ శుభాకాంక్షలు ...స్వాతంత్రం వచ్చి ఇప్పటికి 74 ఏళ్లు. మనదో గొప్ప నాగరికత, ఎన్నో ఆక్రమణలకు, దండయాత్రలకు గురయ్యి.. ఎంతో పోరాటం.. త్యాగంతో మనం 74 ఏళ్ళ క్రితం స్వాతంత్రాన్ని సాధించాం. ఈ 74 ఏళ్లలో ఎన్నో చెప్పుకోదగ్గ విషయాలు జరిగాయి. కానీ అదే సమయంలో ఎన్నో విషయాలను సరి చేయాలి. మనం Space Research లో ముందుకు దూసుకుపోతున్నాం.. వాణిజ్య వ్యాపారాలు కూడా అద్భుతాలు సృష్టించాయి. మన విద్యా విధానాలు మెరుగయ్యాయి..మౌళిక వసతులు మెరుగయ్యాయి..మనవాళ్ళు ప్రపంచమంతటా ఉన్నారు..ఇలా ఎన్నో విషయాలు జరిగాయి.. అన్నిట్లో విజయం సాధించాం.. కానీ దేశ పునాదులను కదిలిస్తున్న కొన్ని కీలకమైన విషయాల గురించి, ప్రతి పౌరుడు శ్రద్ధ చూపి.. తాము చేయగలిగిందేదో అది చేయాలి. భవ్య భారతం కోసం శ్రమిద్దాం.. జై హింద్..

  26. 14

    పంచామృతం వైజ్ణానిక విశ్లేషణ

    ఆరోగ్య ప్రదాయని పంచామృతాలు 

  27. 13

    వేదాలలో వైజ్ణానిక సంపద

    ఈరోజు మనం చదువుతున్న విజ్ణాన సంపద పరాయిదేశం నుంచి వచ్చింది అని అందరూ అనుకుంటూ వుంటారు.ఒక్కసారి ఇది విని మన పూర్వీకుల విజ్ణాన సంపద గురుంచి తెలుసుకుందాం..........

  28. 12

    భారతంలో చిన్న కధలు --- 6

    భారతంలో చిన్న కధలకి స్వాగతం , ఈనాటి కధ విదురుడు 

  29. 11

    భారతంలో చిన్న కధలు --- 5

    భారతంలో చిన్న కధలకి స్వాగతం, ఈనాటి కధ అంబ 

  30. 10

    భారతంలో చిన్న కధలు --- 4

    భారతంలో చిన్న కధలకి స్వాగతం .  ఈనాటి కధ "దేవవ్రతుడు" మహాభారతంలో శంతన మహారాజు పుత్రుడు భీష్ముడు. పూర్వ నామం "దేవవ్రతుడు". భారతంలో ఒక ప్రధానమైన, శక్తివంతమైన పాత్ర భీష్ముడిది. సత్యవర్తనుడిగా, పరాక్రముడిగా భీష్ముని పాత్ర చెప్పుకోదగినది

  31. 9

    భారతంలో చిన్న కధలు --- 3

    ఈనాటి కధ భారత కధ 

  32. 8

    భారతంలో చిన్న కధలు --- 2

    వ్యాస గణేశులు 

  33. 7

    భారతంలో చిన్న కధలు --- 1

    భారతంలో చిన్న కధలకి స్వాగతం ... ఇతిహాసం సాంప్రదాయకంగా వ్యాసుడు అనే ఋషికి ఆపాదించబడింది. ఆయన ఇతిహాసంలో ప్రధాన పాత్ర కూడా వహించాడు. వ్యాసుడు దీనిని ఇతిహాసం (చరిత్ర) గా అభివర్ణించాడు. ఆయన గురువులందరిని గురించి వేద కాలంలోని వారి విద్యార్థులను గుర్తించే గురు-శిష్య పరంపరను గురించి కూడా వివరించాడు.మహాభారతం మొదటి విభాగం వ్యాసుడి పఠిస్తుండగా గణపతి (శివ పార్వతుల కుమారుడు) గ్రంధాన్ని లిఖించాడని పేర్కొనబడింది

  34. 6

    భవిష్యత్ గురించి భయమా.......??

    మనం గతాన్ని మార్చలేం. కాలప్రవాహాన్ని ఆపలేం. వెళ్లిపోయిన క్షణాన్ని వెనక్కి తీసుకురాలేం. ''ఒకే నదిలో రెండుసార్లు కాలిడలేవు'' అంటాడు గ్రీకు తత్త్వవేత్త జీనో. అదేమిటి, గట్టెక్కి మళ్లీ దిగవచ్చు కదా అనుకోవద్దు. నువ్వు గట్టెక్కి మళ్లీ దిగేలోగా పాత నీరు వెళ్లిపోయింది. పాత క్షణం వెళ్లిపోయింది. ఇది కొత్తనీరు. పొర్లిపోయిన పాల గురించి పొర్లిపొర్లి ఏడ్చినా ఒక్క చుక్క మళ్లా రాదు.  పరీక్ష సరిగ్గా రాయకపోతే, ఇంటర్వ్యూ సరిగ్గా చేయకపోతే, రైలు సమయానికి ఎక్కకపోతే.. జారిపోయిన అవకాశం మళ్లీ రానే రాదు. అయినా వాటి గురించి తలచుకుని బాధపడతాం. బాధపడకూడదా, గతం గురించి జ్ఞాపకం ఏమీ లేకుండా తుడిచివేసుకోవాలా?  సింపుల్‌గా చెప్పాలంటే - గతంలో జరిగిన సంఘటన చెప్పిన పాఠాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ సంఘటన గురించి మథన పడడం మానేయాలి.

  35. 5

    ధ్వజస్థంభం

    ఏ దేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి, ప్రదక్షిణచేసి ఆతర్వాతే లోపలికి వెళతాం. అసలీ ‘ధ్వజస్థంభం’ కధాకమామీషూ ఏంటో ఓసారి చూద్దాం..

  36. 4

    మనలో శక్తిని తెలుసుకుందాం

    ఏదైనా సాధించాలి అంటే దానిపై ప్రేమ ఉండాలి.. ఖచ్చితంగా సాధించాలి అని ఉండాలి. అలా కాదు అని చేసే పనిని ప్రేమించకుండా ఏదో చెయ్యాలి అంటే చెయ్యాలి అన్నట్టు ఉంటె ఎటువంటి విజయాన్ని సాధించలేరు. అందుకే ముందు మీరు చేసే పనిని ప్రేమించండి.. అప్పుడే విజయం సాధించగలరు

  37. 3

    మిస్సమ్మ " సినిమా గురించి...

    ఎన్నో కొత్త సినిమాలు వచ్చి కనుమరుగు అయిపోతున్న తరుణంలో 65 సంవత్సరాల క్రితం నాటి సినిమా మిస్సమ్మ ఈరోజుకి సజీవంగా ప్రేక్షక హృదయాలలో నిలిచిపోయింది. అలాంటి ఆణిముత్యం "మిస్సమ్మ " సినిమా గురించి నా మాటల్లో మీకోసం ..........

  38. 2

    మనిషిలో ప్రవర్తనా లోపాలు

    బై పోలార్ డిసార్డర్ అనే వ్యాధి మనుషుల్లో ఏవిధంగా వుంటుంది అనే అంశం .

  39. 1

    ఒక్కసారి ఆలోచిద్దాం ....

    ఎన్నో ఒడదుడుకులను ఎదుర్కొంటున్న ఈ జీవితం లో ఏదన్నా సాధించాలి అంటే మనం ఏమి చెయ్యాలి ? ఎలా పోరాడాలి అని చెప్పే చిన్న ప్రయత్నం

Type above to search every episode's transcript for a word or phrase. Matches are scoped to this podcast.

Searching…

We're indexing this podcast's transcripts for the first time — this can take a minute or two. We'll show results as soon as they're ready.

No matches for "" in this podcast's transcripts.

Showing of matches

No topics indexed yet for this podcast.

Loading reviews...

ABOUT THIS SHOW

ఎన్నో మాటలు, మరెన్నో స్ఫూర్తిదాయకమైన అనుభవాలు, ఆలోచనలు అన్ని మన అందరి కోసం.......... ప్రతీ వస్తువూ, ప్రతీ ప్రదేశం, ప్రతీ మనిషీ, ప్రతీ అనుభవం, ప్రతీ ఎమోషన్.. మన జీవితాన్ని తెలియచేస్తుంది .ఎవరైనా మీ లైఫ్ ఏంటని అడిగితే మిగిలినవి ఇవే. ఈరోజు అనుభవిస్తున్న డబ్బూ, హోదాలు కాదు మనమేంటన్నది చెప్పుకోవడానికి! అంతకన్నా గొప్ప లైఫ్, బ్యూటి‌ఫుల్ లైఫ్ మనం చూసొచ్చాం. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. గర్వంగా ఎంతో చెప్పుకోవచ్చు.. అదీ లైఫ్ అంటే!! మన జీవితాన్ని మరొక్కసారి పలకరిద్దాం .... రండి మరి ..

HOSTED BY

తెలుగు సుస్వరాల రస ఝరి.........

CATEGORIES

Frequently Asked Questions

How many episodes does Swara Madhuri have?

Swara Madhuri currently has 39 episodes available on PodParley. New episodes are automatically indexed when they're published to the podcast feed.

What is Swara Madhuri about?

ఎన్నో మాటలు, మరెన్నో స్ఫూర్తిదాయకమైన అనుభవాలు, ఆలోచనలు అన్ని మన అందరి కోసం.......... ప్రతీ వస్తువూ, ప్రతీ ప్రదేశం, ప్రతీ మనిషీ, ప్రతీ అనుభవం, ప్రతీ ఎమోషన్.. మన జీవితాన్ని తెలియచేస్తుంది .ఎవరైనా మీ లైఫ్ ఏంటని అడిగితే మిగిలినవి ఇవే. ఈరోజు అనుభవిస్తున్న డబ్బూ, హోదాలు కాదు మనమేంటన్నది చెప్పుకోవడానికి!...

How often does Swara Madhuri release new episodes?

Swara Madhuri has 39 episodes. Check the episode list to see recent publication dates and frequency.

Where can I listen to Swara Madhuri?

You can listen to Swara Madhuri on PodParley by clicking any episode. We provide an embedded audio player for direct listening, and you can also subscribe via your preferred podcast app using the RSS feed.

Who hosts Swara Madhuri?

Swara Madhuri is created and hosted by తెలుగు సుస్వరాల రస ఝరి..........
URL copied to clipboard!