The New City Church Podcast - Telugu podcast artwork

PODCAST · religion

The New City Church Podcast - Telugu

Welcome to the New City Church Podcast - Telugu with Ps. Benjamin Komanapalli. Join us each week as we seek to deepen our understanding in the Word of God, explore Biblical truths, grow in radical faith, and lead a victorious life in Christ.Website: https://www.newcity.in

  1. 100
  2. 99

    Faith for Breakthrough - విడుదల కలుగజేయు విశ్వాసము

    మీ జీవితములో అడ్డంకులను దాటి, దేవుని వంటి ఫలితాలను చూడటానికి, సహాయపడే ఆ ఒకే ఒక్క విషయం ఏమిటి? మీ సందిగ్ధాన్నంతా తీర్చే ఈ వర్తమానంలో, విశ్వాసులు దేవుని వాక్యంతో తమ జీవితాలను ఎలా నిర్మించుకొని, ఆరోగ్యం, ఆర్థిక స్థితి, సంబంధాలు లేదా జీవితంలోని ఏ ఇతర రంగంలోనైనా గొప్ప విడుదలను ఎలా పొందుకోవచ్చో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు ఈ సందేశములో బోధిస్తున్నారు. విశ్వాసులు పరిమితులను దాటి, దేవుని వాగ్దానాలతో ఏకీభవించి, వాటిని నిజంగా అనుభవించడానికి తమను తాము ఎలా సరైన స్థానంలో  ఉంచుకోవాలో వారు వెల్లడిస్తున్నారు. ఇది మీరు పొందుకొనే దినం. ఈ రోజే మీరు మీకు కావలసిన దానిని పొందుకునే రోజు. యేసు నామములో ఆకస్మిక మరియు శక్తివంతమైన విజయాలు మీవై ఉండును గాక. ఆమేన్!

  3. 98

    Wisdom for Godly Parenting - దైవికముగా పిల్లలను పెంచుటకు జ్ఞానము

    దైవికముగా పిల్లలను పెంచుటకు మీకు జ్ఞానము ఉన్నదా? మీ కుటుంబ నేపథ్యమేదైనా, ప్రతి తల్లి, తండ్రి, సంరక్షకులు ఖచ్చితముగా తెలుసుకోవాల్సిన 7 వాక్యాధారిత సూత్రాలతో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి గారు ఈ సందేశములో మనలను సిద్ధపరుస్తున్నారు. పిల్లల పెంపకానికి ప్రధానాంశాలను, ఒక బిడ్డను శిక్షణ చేయుటలో పలు విధానాలను వారు మనతో పంచుకుంటూ, మనము ఆలోచించి ఆచరణలో పెట్టాల్సిన కొన్ని ప్రశ్నలతో చివరిగా ముగిస్తారు.  మీరు తల్లిదండ్రులైనా, లేదా తల్లి, తండ్రి కాబోయే వారైనా దేవుని మహిమ కొరకు లోకంపై ప్రభావం చూపే పిల్లలను పెంచడానికి ఒక మార్గదర్శిగా ఈ వర్తమానాన్ని పరిగణించండి. దైవిక పెంపకంతో, మీ పిల్లలు జీవితంలో ఎన్నో పోరాటాలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదని గుర్తుంచుకోండి.

  4. 97

    The Precious Blood of Jesus - అమూల్యమైన యేసు రక్తము (మన స్వాస్థ్యమునకు మూలం)

    యేసు రక్తం ఎందుకు ఎంతో అమూల్యమైనది? అది మన స్వాస్థ్యమునకు ఎందుకు మూలం? ఈ వర్తమానంలో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు యేసు రక్తం యొక్క ప్రాముఖ్యతను మరియు ప్రతి విశ్వాసి జీవితంలో దాని ముఖ్య పాత్రను వివరిసున్నారు. యేసు రక్తం ఎందుకు అమూల్యమైనదో ఏడు శక్తివంతమైన కారణాలను పాస్టర్ గారు పంచుకుంటూ ఆ రక్తం మన కొరకు ఏమి సాధించింది, నూతన నిబంధనలో మన కొరకు ఏమి సంపాదించిందో వెల్లడిసున్నారు. ఈ సందేశం ద్వారా యేసు రక్తం ద్వారా మీరు పొందిన గొప్ప స్వాస్థ్యములో ధైర్యంగా నడచుటకు, మరియు మీరు కుమారునిగా, వారసునిగా, జయించిన వారిగా జీవించుటకు సహాయపడుతుంది!

  5. 96

    Our Inheritance in Christ - క్రీస్తులో మన స్వాస్థ్యము

    దేవుని నుంచి మీకొక స్వాస్థ్యము ఉందని మీకు తెలుసా? విశ్వాసులందరికీ కనువిప్పు కలిగించే ఈ వర్తమానంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు క్రీస్తులో, ప్రతి దేవుని బిడ్డకున్న స్వాస్థ్యము గురించి మాట్లాడుతున్నారు. మన కళ్ళు తెరువబడే అవసరతను గురించి, శతృవు చేత కొందరు అంధులుగానే ఎలా మిగిలిపోతున్నారో మరియు ఇప్పటికే మనదైయున్న ఈ గొప్ప, మహిమకర స్వాస్థ్యములో మనమెలా నడవాలో పాస్టర్ గారు వివరిస్తున్నారు.  మీరు బానిస మనస్తత్వాన్ని తిరస్కరించి, దేవుని బిడ్డగా మరియు నమ్మకమైన వారసులుగా మీకున్న గుర్తింపును మీరు పూర్తిగా స్వీకరించుటకు ఈ సందేశము మీలో ఒక అగ్ని రగిలించును గాక.

  6. 95
  7. 94

    [Bilingual] Forgiven & Healed - క్షమించబడుట మరియు స్వస్థపరచబడుట (Good Friday)

    మీరు క్షమించబడినవారైతే, మీరు స్వస్థత పొందినవారు కూడా. ఈ శుభ శుక్రవార స్వస్థతారాధన సందేశంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు క్షమాపణ మరియు స్వస్థత మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని స్పష్టంగా వివరిస్తున్నారు. యేసు ప్రభువు మీ కొరకు శాపముగా ఎందుకు మారాడో, మీకు బదులుగా సిలువపై ఆయన ఏమి భరించాడో మీరిక్కడ తెలుసుకుంటారు. మహా వైద్యుడైన యేసునకు అసాధ్యం అనేది ఏమీ లేదు. మీ సమస్యపై కాకుండా, ఆయనపై మీ దృష్టిని నిలపండి. అక్కడే మీరు స్వస్థతను మరియు సంపూర్ణతను పొందుతారు. యేసు నామములో, ఆమేన్.

  8. 93

    A New Commandment - ఒక కొత్త ఆజ్ఞ

    మీరు యేసు క్రీస్తునకు శిష్యులా? అయితే మీరు ప్రేమకు శిష్యులైయుండాలి. సంబంధాలు అనే అంశాన్ని కొనసాగిస్తూ, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు మనము క్రీస్తు శిష్యులుగా ఎలా గుర్తింపబడతామో, ప్రేమలో నడవడం ఎందుకు ముఖ్యమో, మరియు కుటుంబంలో, సంఘంలో, జీవితంలోని ప్రతి రంగములో ప్రేమలో నడచుటకు మనం ఉద్దేశపూర్వకంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి అనే విషయాలను ఈ సందేశములో మనతో పంచుకుంటున్నారు. ఈ రోజు నుంచి, మీ జీవితంలోని ప్రతి రంగములో మీరు ప్రేమ, క్షమా గుణము, కనికరము, దయ, యేసు క్రీస్తు మరియు జోయే జీవితమును ఎంచుకొని మీ ద్వారా అనేకులు దేవుని ప్రేమ వైపు ఆకర్షితులవుదురు గాక.

  9. 92

    Jesus the Triumphant King - యేసు జయించిన రాజు

    యేసు ఎవరు? ఆయన విజయం ఏమి సాధించింది? ఈ మట్టలాదివార సందేశములో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు, యేసు క్రీస్తు ప్రవక్తగా, యాజకునిగా, రాజుగా నిర్వర్తించిన మూడు రకములైన పరిచర్యలను గురించి, ఆయన పూర్తి చేసిన కార్యము యొక్క సంపూర్ణతను గురించి మనకు వెల్లడిస్తున్నారు. మన కొరకు క్రీస్తు ఎలా నిత్య జీవాన్ని అందించుటకు మరియు పాప మరణాల మీద విజయాన్ని మనకై సంపాదించిపెట్టుటకు వచ్చాడో పాస్టర్ గారు వివరిస్తున్నారు.  తన మరణం ద్వారా, యేసు క్రీస్తు పాపాన్ని తొలగించి, దాని పూర్తి వెలను చెల్లించి, మనలను దేవునితో సమాధానపరచి, ప్రతి శాపము నుండి మనలను విముక్తులను చేసి, అంధకార శక్తులపై విజయాన్ని సాధించాడు.  ఈ వర్తమానము మీ విశ్వాసాన్ని బలపరచి, క్రీస్తులో మీరిప్పటికే కలిగియున్న విజయములో మిమ్మల్ని స్థిరపరుస్తుంది.  ఈ వాక్యాన్ని విని, విజేయుడైన యేసు రాజు మన కొరకు సాధించిన విజయములో జీవించండి.

  10. 91

    God's Wisdom for Relationships - సంబంధాలు ఎలా కట్టుకోవాలి?

    దేవుని ఙ్ఞానానుసారముగా సంబంధాలను కట్టుకోవడమంటే ఏమిటి? ఈ ప్రేరణాత్మకమైన వర్తమానములో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు లేఖనానుసార సూత్రాల ద్వారా విశ్వాసులు ఆరోగ్యకరమైన మరియు అర్థవంతమైన సంబంధాలను ఎలా కట్టుకోవాలో మనకు బోధిస్తున్నారు. ఇతరులతో మనము సంబంధాలను ఏర్పరచుకునే విషయంలో జ్ఞానం, వివేచన, మరియు దైవిక స్వభావం కలిగియుండుట ఎంత ముఖ్యమో పాస్టర్ గారు వివరంగా తెలియజేస్తున్నారు. ఈ సందేశము మీరు సంబంధాలను స్పష్టముగా చూడడంలో, మీ హృదయాన్ని కాపాడుకోవడంలో, మరియు దేవుని నుంచి వచ్చే జ్ఞానంలో మీరు నడుచుకొనులాగున మీకు సహాయపడుతుంది. ఈ వాక్యాన్ని విని, సంబంధాల విషయంలో దేవుడు ఇచ్చే జ్ఞానాన్ని కనుగొనండి.

  11. 90

    Are you a Friend of God? - దేవునితో స్నేహం

    దేవుడు కేవలం మీ రక్షకునిగా, స్వస్థపరచువానిగా లేదా సమకూర్చువానిగా మాత్రమే ఉండాలని కోరడం లేదు; ఆయన మీ స్నేహితునిగా ఉండాలని కోరుతున్నాడు. ఈ సందేశములో, పాస్టర్ అర్పిత కొమానపల్లి గారు  దేవునితో స్నేహాన్ని కలిగియుండే మనకున్న అద్భుతమైన ఆధిక్యతను మనకు పరిచయం చేస్తున్నారు. కేవలం దేవుని గురించి తెలుసుకోవడం నుండి ముందుకు సాగి, ఆయనతో నిజంగా ఎలా నడవాలో మనమిక్కడ నేర్చుకుంటాము. అబ్రాహాము, మోషే, మరియు యోహాను జీవితాల ద్వారా, దేవుని స్నేహితులుగా మారిన వారికి దేవుడు ఎలా స్పందిస్తాడో, అలాగే మీరు కూడా దేవునితో మరింత లోతైన సంబంధంలోనికి ఎలా ఎదగవచ్చో ఈ వర్తమానంలో తెలుసుకుంటారు. దేవుని స్నేహితునిగా/స్నేహితురాలిగా పిలవబడటం ఎంత గొప్ప ఘనత! మీరు కూడా అలాగే పేరుపొందుదురు గాక. 

  12. 89

    The Blessing of Godly Associations - దైవిక సహవాసములో ఉన్న ఆశీర్వాదము

    నీవెవరితో అయితే కలిసి నడుస్తావనేది, నీవు చేరుకునే గమ్యాన్ని నిర్ణయిస్తుంది.   సహవాసాలపై మనకు జ్ఞానోదయాన్ని కలిగించే ఈ ప్రసంగంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు, విశ్వాసి జీవితంలో దైవిక సహవాసాల ప్రాముఖ్యత మరియు ప్రభావం గురించి బోధిస్తున్నారు. సరైన సంబంధాలు నీ విశ్వాసాన్ని ఎలా బలోపేతం చేయగలవో, నీ స్వభావాన్ని ఎలా పదును పెట్టగలవో మరియు నీకై దేవునికున్న ఉద్దేశ్యంలో ఎదుగుటకు నిన్ను సరైన స్థితిలో ఎలా నిలపగలవో, వారు వివరిస్తున్నారు.   ఈ సందేశం నీ సహవాసాలను అంచనా వేయుటకు, దైవిక సంబంధాలకు విలువనిచ్చుటకు మరియు దేవుని చిత్త ప్రకారంగా నీ జీవితములో ఉండాల్సిన వారితో ఉద్దేశపూర్వకంగా సహవాసము కలిగిండుటకు నిన్ను సవాలు చేస్తుంది.   ఈ వాక్యాన్ని విని, దైవిక సహవాసములో ఉన్న ఆశీర్వాదాన్ని స్వీకరించండి. 

  13. 88

    Possessing the Promised Land - వాగ్దాన దేశమును స్వతంత్రించుకొనుట

    నేడు విశ్వాసిగా వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకొనుట అంటే ఏమిటి? న్యూ సిటీ సంఘ 9వ వార్షికోత్సవాన, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు బోధించిన జీవితాలను మార్చే ఈ సందేశములో, ‘వాగ్దాన దేశము’ అనేది ఒక భౌతిక స్థలం కంటే మించినదని, అది క్రీస్తులో దేవుని వాగ్దానాల పరిపూర్ణతను సూచిస్తుందని వారు మనకు వెల్లడిస్తున్నారు. విశ్వాసులు వాగ్దానాలను కేవలము తెలుసుకొనుట నుండి విశ్వాసముతో వాటిలో చురుకుగా నడచుటకు ఎలా చేరగలరో పాస్టర్ గారు వివరిస్తున్నారు. ఈ వర్తమానము మీ విశ్వాసాన్ని పురికొల్పి, భయాన్ని, పరిమితులను సవాలు చేసి, దేవుడు మీకిది వరకే సిద్ధపరచిన వాటన్నిటిలోనికి ధైర్యంగా అడుగు పెట్టుటకు మిమ్ములను ప్రోత్సహిస్తుంది.  ఈ వాక్యాన్ని విని, క్రీస్తులో ఇది వరకే మీవైయున్న వాటిని స్వాధీనపరచుకొనుట ఇక మొదలుపెట్టండి.

  14. 87

    Overcoming Mental Attacks - మానసిక దాడులను జయించుట

    ఆందోళన, నిరాశ, గుర్తింపు సంక్షోభం, ఆత్మన్యూనతాభావం, రెండు వ్యతిరేక వ్యక్తిత్వాలు కలిగియుండే రుగ్మత, ఆత్మహత్య ధోరణులు, విషాద ఘటనానంతరం కలిగే మానసిక ఒత్తిడి, ధ్యాన లోపము మరియు అతి చురుకుదనము అనే రుగ్మత - శతృవును గుర్తించి, దానిపై గురి పెట్టండి. దేవుడు తన సైనికులైన క్రైస్తవులు మంచి మనస్సు మరియు ఆధిపత్యమున్న స్థానం కలిగియుండాలని కోరుకుంటున్నాడు. 'మానసిక దాడులను జయించుట' అనే ఈ వర్తమానములో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు క్రైస్తవులకొక యుద్ధ ప్రణాళికను వెల్లడిస్తున్నారు: మానసిక సమస్యలు దయ్యముల యొక్క దాడులు, అవి ఒక రకమైన బంధకాలు; క్రైస్తవులుగా, క్రీస్తు మనస్సు అనే భారీ యుద్ధ సామాగ్రిని రంగంలోకి దింపాల్సిన సమయం ఆసన్నమైంది. మానసిక యుద్ధంలో ముఖ్యమైన రెండు కీలక అంశాలను తెలుసుకొని గెలుచుటకు సిద్ధ పడండి. మీ ఆయుధాన్ని పక్కన పెట్టకండి! మీ చింతను దేవునిపై వేసి, ముందుకు సాగి శతృవుపై ఎదురుదాడి చేయండి! దేవుని వాక్యంపై మీ దృష్టిని నిలిపి, శతృవు పట్టు నుండి విముక్తులుకండి! సైనికులారా, మీరు జయించినవారు!

  15. 86

    Waiting Without Answers - ప్రార్థనకు జవాబు రానప్పుడు

    వేచి ఉండటం భారంగా అనిపిస్తున్నదా? జవాబు ఆలస్యమైందని నిరుత్సాహంగా ఉన్నారా? ఈ సందేశం మీకు ధైర్యం ఇస్తుంది. ‘ప్రార్థనకు జవాబు రానప్పుడు’ అనే ఈ సందేశంలో పాస్టర్ అర్పిత కొమానపల్లి గారు, వేచిచూస్తున్న సమయంలో కూడా దేవుడు మనలోను మన చుట్టూను పనిచేస్తున్నాడని తెలియజేస్తారు.  యోసేపు, ఎలిజబెత్ మరియు ఇతరుల జీవితాల ద్వారా ఓర్పు మరియు విశ్వాసాన్ని నేర్పుతారు. “ఎంతకాలం ప్రభువా?” అన్నది “వందనాలు ప్రభువా!”గా మారినప్పుడు సాక్షం లో నడువగలుగుతాం.

  16. 85

    The Truth about Generational Curses - శాపముల గురించి మీరు తెలుసుకోవలసిన సత్యము

    తరతరాలుగా వచ్చే శాపాలు నిజమేనా అని మీరెప్పుడైనా ఆలోచించారా? విశ్వాసులు ఇప్పటికీ తమ పూర్వీకుల పాపాల ప్రభావానికి గురవుతున్నారా? మనలను దీర్ఘంగా ఆలోచింపజేసే ‘శాపముల గురించి మీరు తెలుసుకోవలసిన సత్యము’ అనే ఈ సందేశంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు తరతరాలుగా వస్తున్న శాపాలు మరియు క్రీస్తులో విశ్వాసుల తాము కలిగియున్న స్థానం గురించి మనకు తఱౘుగా కలిగే  ప్రశ్నలు మరియు సందేహాలను ప్రస్తావిస్తున్నారు. నూతన నిబంధన యొక్క కోణము నుంచి ఒక విశ్వాసి నిజంగా శాపము క్రింద ఉండగలడా అనే విషయము గురించి, క్రీస్తు సమాప్తి చేసిన కార్యము ఏమి నెరవేర్చిందనే విషయము గురించి పాస్టర్ గారు వాక్యానుసారమైన స్పష్టతను తీసుకు వస్తున్నారు.  ఈ వర్తమానము మీ సాంప్రదాయ ఆలోచనను సవాలు చేస్తుంది, మీ విశ్వాసాన్ని బలపరుస్తుంది మరియు క్రీస్తు మీకిచ్చిన స్వాతంత్ర్యములో నడచుటకు మీకు సహాయపడుతుంది. ఈ వాక్యాన్ని విని, సత్యములో స్థాపింపబడండి.

  17. 84

    How to study the Word of God - దేవుని వాక్యాన్ని ఎలా పఠించాలి

    మీ జీవితాన్ని పూర్తిగా మార్చవేయగల ఆ ఒక్క పుస్తకమేమిటి? ‘దేవుని వాక్యాన్ని ఎలా పఠించాలి?' అనే ఈ అత్యంత ముఖ్యమైన సందేశంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు మనల్ని కొన్ని ప్రాథమిక విషయాల గుండా తీసుకువెళ్లి, ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన పుస్తకమైన బైబిల్‌ను అధ్యయనం చేయవలసిన గొప్ప ఆవశ్యకతను అర్థం చేసుకోవడానికి మనకు సహాయం చేస్తున్నారు. ఈ వర్తమానములో, మీరు బైబిల్లోని విషయాలు, దానిని అధ్యయనం చేయడానికి గల కారణాలు, ప్రయోజనాలు మరియు ఆచరణాత్మకంగా దానిని పాటించుటకు గల మార్గాల గురించి తెలుసుకుంటారు. అంతే కాకుండా ఒక ఉపయోగకరమైన బైబిల్ అధ్యయన పద్ధతిని కూడా మీరిక్కడ నేర్చుకుంటారు. దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడానికి సమయం కేటాయించి, వాక్యము మిమ్మల్ని ఆదర్శప్రాయమైన పౌరులుగా, నాయకులుగా, మరియు ప్రపంచాన్నే ప్రభావితం చేసే ప్రభావశీలురుగా మార్చనివ్వండి. మీలో ఎంత వాక్యమైతే పనిచేస్తుందో అంత వేగంతో ముందుకు సాగండి!

  18. 83

    The Power of the Renewed Mind - నూతనపరచబడిన మనస్సు యొక్క ప్రభావము

    నూతన పరచబడిన మనస్సుతో నూతన నిబంధన కింద జీవించుట అంటే ఏమిటి? ‘నూతన పరచబడిన మనస్సు యొక్క ప్రభావము’ అనే ఈ శక్తివంతమైన వర్తమానంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు అంతరంగములో నుంచి వచ్చేదే నిజమైన మార్పు అని, ఈ మార్పు బాహ్య పరిస్థితులు, ఒత్తిడుల వలన కాక అంతరంగములో మనమేమైయున్నామో, దానిని బట్టి, మన ఆలోచనలు, ఎంపికలు, జీవనశైలి మారుట ద్వారా కలుగుతుందని వివరిస్తున్నారు.  ఈ సందేశములో పాస్టర్ గారు మనస్సును నూతన పరచుకునే విధానము గూర్చిన ముఖ్య విషయాలను పంచుకుంటూ, క్రీస్తులో తమకున్న నూతన గుర్తింపునకు అనుగుణంగా విశ్వాసులు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకొని, ఆత్మ నడిపింపుతో నిర్ణయాలు తీసుకోవాలని ప్రేరేపిస్తున్నారు.  ఈ వాక్యాన్ని విని, మీ మనస్సును నూతన పరచుకొని, క్రీస్తులో మీరిదివరకే ఏమైయున్నారో, ఆ శక్తిలో నడవండి!

  19. 82

    [Bilingual] New Year Service

    ఈ నూతన సంవత్సర వర్తమానంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు, దేవుని వాక్యాన్ని వినుటకు చెవులున్న ప్రతి ఒక్కరి జీవితంలో, వారి అభివృద్ధికి మరియు వారికి నిర్దేశించబడిన దాన్నంతా స్వాధీనపరచుకొనుటకు దేవుని వాక్యం పోషించే కీలక పాత్రను పునరుద్ఘాటిస్తున్నారు. వారు నూతన నిబంధనలో దేవుడు మనల్ని రాజులుగాను, యాజకులనుగాను చేసినందున అన్ని నిర్ణయాలు తీసుకొనుటకు మరియు దేవుని రాజ్యాన్ని ముందుకు నడిపించుటకు మనం సంపూర్ణంగా సిద్ధపడియున్న అధికారపు స్థాయిలో ఉన్నామని గుర్తు చేస్తున్నారు. ఈ సంవత్సరం, దేవుని వాక్యంపై నమ్మకంతో ముందుకు కదులుతూ, పరలోకమంతా మీకు అండగా ఉందనే నిశ్చయతతో, ముందుకు సాగుటకు ఉద్దేశపూర్వకమైన నిర్ణయాన్ని తీసుకోండి. 2026లో దేవుడు మీకై ఉంచిన ప్రతిదాన్నీ మీరు స్వాధీనపరచుకొని ముందుకు సాగుతుందురు గాక.

  20. 81

    [Bilingual] New Year's Eve Service

    ఈ వాచ్ నైట్ ఆరాధనలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు, గత సంవత్సరములో దేవుని విశ్వాస్యతను తలపోసుకుంటూ, దేవుని సహాయముతో ఈ నూతన సంవత్సరములో విశ్వాసులమైన మనము మన ప్రయాణాన్ని కొనసాగించాలని ప్రోత్సహించి, మరియు 2026వ సంవత్సరానికైన దేవుని వాక్యాన్ని విడుదల చేశారు. మన జీవితాల్లోనికి మనమనుమతించే స్వరాలను గురించి మనకు మనమే కొన్ని కీలకమైన ప్రశ్నలను వేసుకుంటూ, ఉద్దేశ్యపూర్వకంగా దేవుని స్వరాన్ని వినుట యొక్క ప్రాముఖ్యతను వారు నొక్కి చెబుతున్నారు. ఈ సంవత్సరంలో మనం తీసుకోవలసిన రెండు ముఖ్యమైన నిర్ణయాలను, ఈ నూతన సంవత్సరం తీసుకువచ్చే అవకాశాలను, మరియు చివరగా, ఈ నూతన కాలాన్ని వీలైనంత చక్కగా సద్వినియోగం చేసుకోవడానికి కొన్ని మార్గాలను కూడా వారు వివరిస్తున్నారు. ఈ సంవత్సరం, మీ జీవితం దేవుని వాక్యానుగుణంగా సాగుతూ, మీ జీవితంలో సమయమిక ఏ మాత్రము వృథా  కాకుండును గాక. గొప్ప బలమైన కార్యాలు మీ వంతు అవును గాక. యేసు నామములో, ఆమేన్!

  21. 80

    How to Receive Revelation Knowledge from the Word? - ప్రత్యక్ష జ్ఞానము ఎలా పొందుకోవాలి?

    మీ జీవితములో మీరు మీ వేగముతో ముందుకు సాగుతున్నారా లేక దేవుని వేగముతో ముందుకు సాగుతున్నారా? ఈ పాడ్‌కాస్ట్‌లో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు ముందుకు సాగి, దేవుడు మన కొరకు ఉంచిన వాటన్నిటినీ స్వాధీనపరచుకొనుటకు ప్రతి క్రైస్తవుడు ప్రత్యక్ష జ్ఞానాన్ని పొందుకోవాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నారు. వట్టి సమాచారం కంటే ప్రత్యక్ష జ్ఞానం పొందుకొనుట యొక్క శ్రేష్ఠతను, అది ఏ విధంగా మన జీవితములోనికి వస్తుందో, ఏ విధంగా  రాదో, మరియు అది స్వేచ్ఛగా మన జీవితాల్లో ప్రవహించడానికి సరి అయిన వాతావరణాన్ని గురించి వారు వివరిస్తున్నారు. దేవుని వాక్యంలోని అద్భుతాలను చూచుటకు మీ కళ్ళు తెరవబడి, ఈ రోజు మీరు ప్రత్యక్ష జ్ఞానము ద్వారా ముందుకు సాగుటకు ప్రారంభించే రోజుగా ఉండును గాక!

  22. 79

    Principles for Advancing & Possessing - ముందుకు సాగి స్వాధీనపరచుకొనుటకు సూత్రములు

    ఒక విశ్వాసి తన జీవితములో ముందుకు సాగి స్వాధీనపరచుకొనుట అంటే ఏమిటి? 2026లోని మొదటి బ్రేక్త్రూ ఆదివారాన బోధింపబడిన ఈ ప్రభావవంతమైన వర్తమానంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు దేవుడు విశ్వాసులమైన మనకొరకు ఉంచిన వాటన్నిటినీ మనము సొంతం చేసుకోవడానికి మనలను బలపరిచే ఆత్మీయ సూత్రాలను పంచుకుంటున్నారు. ఆత్మీయ ఎదుగుదల, స్పష్టత మరియు నిరంతర అభివృద్ధికి మూలమైన దేవుని వాక్యాన్ని ధ్యానించుట యొక్క కీలకమైన పాత్రను వారు ఇక్కడ నొక్కి చెబుతున్నారు.  ఈ సందేశము మీ ఆత్మీయ దర్శనాన్ని బలోపేతం చేసి, దేవుని వాక్యం పట్ల మీ నిబద్ధతను మరింత పెంచి, జీవితంలోని ప్రతి రంగంలోనూ ముందుకు సాగి, దేవుడు మీకై ఉంచిన వాటన్నిటినీ స్వాధీనపరచుకొనుటకు మిమ్మల్ని సన్నద్ధం చేస్తుంది. దేవుని వాగ్దానాలను విని, ధ్యానించి, వాటిలో ధైర్యంగా ముందుకు నడవండి.

  23. 78

    Receiving the Fullness of Christ - క్రీస్తు పరిపూర్ణతను పొందుట ఎలా?

    క్రీస్తు పరిపూర్ణతలో జీవించుట అంటే ఏమిటి? ‘క్రీస్తు పరిపూర్ణతను పొందుట ఎలా?’ అనే ఈ శక్తివంతమైన వర్తమానంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు క్రీస్తు పరిపూర్ణత అంటే సంపూర్ణ విమోచన అని వివరిస్తున్నారు. వారు ప్రతి విశ్వాసి జీవితములో పాపము నిర్మూలించబడిందని వెల్లడిస్తూ నూతన నిబంధన క్రింద మన రక్షణ నిమిత్తము శాశ్వతంగా పూర్తి వెల చెల్లించిన క్రీస్తు రక్తము యొక్క ప్రత్యేకతను నొక్కి చెబుతున్నారు.  విశ్వాసులు నూతన నిబంధన మనస్తత్వాన్ని అలవర్చుకోవాలని మరియు క్రీస్తు పూర్తి చేసిన కార్యము ప్రకారంగా మన మనసులను రూపాంతరపరచుకుంటూ ఉండాలని పాస్టర్ బెన్ గారు మనలను పురికొల్పుతున్నారు. ఈ సందేశము మీ గుర్తింపునకు స్పష్టతను తీసుకువస్తుంది, మీ నిశ్చయతను బలపరుస్తుంది మరియు మీ ఆలోచనా విధానాన్ని నూతన నిబంధన సత్యానికి అనుగుణంగా మారుస్తుంది.  ఈ వాక్యాన్ని విని, స్వీకరించి, ప్రతి రోజు క్రీస్తు యొక్క సంపూర్ణతలో నడవండి.

  24. 77

    [Bilingual] Grand Christmas Miracle Service

    అద్భుతాలకు మీ సమయమిదే. ఈ క్రిస్మస్ సందేశములో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు యేసు క్రీస్తు యొక్క అద్భుత జననాన్ని గుర్తు చేస్తూ, విశ్వాసులు అద్భుతాలలో నడచుటకున్న దీవెనను గురించి తెలుపుతున్నారు.  క్రీస్తు శతృవు యొక్క కార్యాల మీద విజయాన్నెలా పొందాడో తెలుసుకొని, మీ ఆరోగ్యము, కుటుంబము, ఆర్ధిక విషయాలు, వృత్తి, పరిచర్య ఇంకా మరిన్ని రంగాలలో అద్భుతాలను చూచుటకు విశ్వాసంతో వాక్యాన్ని స్వీకరించండి! మీ దృష్టిని దేవుని వాక్యము పై నిలిపి ఈ మసకబారిన లోకములో ప్రకాశమానమైన అద్భుతము వలె ఉంటూ, ప్రజలను క్రీస్తు వైపునకు నడుపుదురు గాక!

  25. 76

    Created for the Miraculous - అద్భుతములు

    అద్భుతాలు అరుదుగా జరుగుటకు ఉద్దేశించబడ్డాయా లేదా అవి విశ్వాసులకు రోజువారీ వాస్తవికతగా ఉండాలా? ‘అద్భుతములు’ అను ఈ శక్తివంతమైన సందేశంలో, దేవుని రాజ్యంలో అద్భుతాలు ఏదో అప్పుడప్పుడు జరిగే సంఘటనలుగా, మన జీవితాల్లోని కొన్ని రంగాలకు మాత్రమే పరిమితమైనవిగా ఉండకూడదు కానీ ప్రతి రోజూ విశ్వాసులు తమ జీవితాల్లోని ప్రతి రంగములో అనుభవిస్తూ ఉండాల్సినవైయుండాలని పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు వివరిస్తున్నారు. అద్భుతాల కొరకు మనమెందుకు పోరాడాలి అనేదానికి బలమైన వాక్యాధారిత కారణాలను, అద్భుతాలకు వ్యతిరేకంగా ఈ కాలములో ఉన్న అపోహలను మరియు దేవునిని నిజంగా విశ్వసించే ప్రతి ఒక్కరినీ అద్భుతాలు ఎందుకు అనుసరించాలో అనే విషయాన్ని గురించి పాస్టర్ గారు ఈ ప్రసంగము ద్వారా స్పష్టమైన లేఖనాత్మక అవగాహనను మనకు ఇస్తున్నారు.  ఈ వర్తమానము మీ ఆలోచనా విధానాన్ని సవాలు చేసి, మీ విశ్వాసాన్ని బలపరచి, దేవునికి మీకై అద్భుతాల కొరకు ఉన్న ప్రణాళికలోనికి మిమ్మల్ని త్రిప్పి నడిపిస్తుంది.  ఈ వాక్యాన్ని విని, ప్రేరేపింపబడి, మీరు దేని కోసమైతే సృష్టించబడ్డారో ఆ వాస్తవికతలో ప్రతిరోజూ నడవండి.

  26. 75

    Created for Good Works - సత్కార్యముల కొరకు సృష్టింపబడితిమి

    మీరు క్రైస్తవులా? అయితే, మీ విశ్వాసాన్ని మీ జీవితములో ఎలా కనపరుస్తారు? ఇతరులను నిందించుటకు తొందరపడుతుంటారా?  ట్రాఫిక్లో తొందరగా చిరాకుపడిపోతుంటారా? ఎప్పుడూ స్వీయ జాలితో కుమిలిపోతుంటారా? మీ ఆర్ధిక విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారా? అలా అయితే, మీరు కలిగి ఉన్నారని చెప్పుకుంటున్న ఆ విశ్వాసాన్ని నిశితంగా పరిశీలించాల్సిన సమయమిదే. ఈ కనువిప్పు కలిగించే ప్రసంగములో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు మన పనులకు, మాటలకు, ఆలోచనలకు, డబ్బును వాడే విధానానికి పర్యవసానాలుంటాయని, మంచి కార్యాలకు మంచి ప్రతిఫలము, చెడు కార్యాలకు చెడు ప్రతిఫలము ఉంటుందని విశ్వాసులకు గుర్తుచేస్తున్నారు. మంచి కార్యాలు చేయుటకే కృప మనకు అనుగ్రహించబడింది.  మీ విశ్వాసానికి, మీ కార్యాలకు మధ్య పొంతన లేదని మీరు ఒప్పింపబడుతుంటే, ఈ రోజే దానిని మార్చుకొనుటకు ఈ సందేశము మిమ్మల్ని ప్రేరేపించనివ్వండి. మీ మంచి కార్యాలు విస్తరించి, లోకములోని అన్యులు క్రీస్తు వైపునకు త్రిప్పబడుదురు గాక. ఆమేన్!

  27. 74

    Faith, Works & Rewards - విశ్వాసము, క్రియలు, ప్రతిఫలములు

    స్పష్టమైన ఫలితాలను ఉత్పత్తి చేసే నిజమైన విశ్వాస జీవితాన్ని కలిగియుండుట అంటే ఏమిటి? విశ్వాసులను బలపరిచే ఈ సందేశములో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు విశ్వాసము, వాక్యాధారిత క్రియల మధ్య ఉన్న క్రియాశీలక సంబంధాన్ని గురించి తేటగా తెలియజేస్తున్నారు.  ప్రతీ విశ్వాసి తన విశ్వాసము మృతమైపోకుండా అది పరిపూర్ణమగునట్లు, తన విశ్వాసపు మంటను తప్పక ఎలా రగిలిస్తూ ఉండాలో ఇక్కడ కనుగొనండి. స్వచ్ఛమైన విశ్వాసము క్రియల ద్వారా ఎలా విశదమవుతుందో మరియు ఉద్దేశపూర్వకంగా చేసే క్రియలు దేవుని వాగ్దానాలను పొందుకునే స్థానములోనికి మిమ్ములను ఎలా తీసుకువచ్చి దేవుడు మీ కొరకు ఉంచిన ప్రతిఫలాలన్నిటినీ పొందుకొనుటకు ఎలా కారణమవుతాయో తెలుసుకోండి.  మీరీ వర్తమానాన్ని వింటూండగా, మీ హృదయం మీ విశ్వాసాన్ని మరింతగా పెంచుకోవడానికి, మీ కార్యాలను బలోపేతం చేయడానికి మరియు మీ జీవితానికై దేవుడు కోరుకునే ప్రతిఫలాల్లోనికి ధైర్యంగా మిమ్ములను నడపడానికి ప్రేరేపించబడును గాక!

  28. 73

    The Grace, The Race & The Reward - కృప, పందెము ప్రతిఫలము

    మీరు జీవితములో స్తంభించిపోయినట్లుగా అనిపిస్తుందా? మీ సామర్థ్యాన్నికనుగుణంగా నిజంగా మీరు జీవిస్తున్నారా లేదా అని ఆలోచిస్తున్నారా? కనువిప్పు కలిగించే ఈ సందేశములో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు దేవుడనుగ్రహించిన బహుమతులను సద్వినియోగం చేసుకొని, మీపైయున్న ప్రత్యేకమైన దైవిక ఉద్దేశ్యాన్ని నెరవేర్చుట ఎలాగో బోధిస్తూండగా వినండి. అలాగే, మీ స్వంత పందెముపై దృష్టి నిలిపి, ఇతర విషయాలచే మరల్చబడకుండా, మీ పనిని చక్కగా పూర్తి చేసినందుకై ఎలా ప్రతిఫలాలను పొందవచ్చో నేర్చుకొనండి.  ప్రతిఫలాలు, బహుమతుల మధ్య ఉన్న వాక్యానుసారమైన భేదాన్ని కనుగొని, మీ పందెమును శ్రద్ధతో ఉద్దేశ్యపూర్వకంగా పరుగెత్తుటకు సిద్దపడండి. లెక్క అప్పజెప్పాల్సిన వారిగా బాధ్యతాయుతులమై దేవుని కృపను సద్వినియోగం చేసుకుందాం.

  29. 72

    Lifestyle of Thanksgiving - కృతజ్ఞతతో కూడిన జీవనశై

    ఒక విశ్వాసిగా మీరు కృతజ్ఞత కలిగిన హృదయమనే వాస్తవికతలో నిజంగా నడుస్తున్నారా? గొప్ప పరివర్తన కలిగించే ఈ వర్తమానంలో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు కాలానుగుణమైన లేక పరిస్థితులాధారితమైనది కాక ప్రాథమికమైనదిగా మనము కలిగియుండాల్సిన కృతజ్ఞత జీవనశైలి యొక్క లోతు మరియు శక్తిని మన కొరకు వెలికితీస్తున్నారు.  ఈ సందేశములో ప్రతి విశ్వాసి జీవితంలో కృతజ్ఞత ఎందుకు ఆవశ్యకమో మరియు అది దేవునితో మీ నడకను ఎలా రూపుదిద్దుతుందో కనుగొనండి. కృతజ్ఞత యొక్క ముఖ్య అంశాలను నేర్చుకొని, నిరంతరం కృతజ్ఞత చెల్లిస్తూ ఉండుట దేవుని మంచితనాన్ని మరింత స్పష్టంగా చూడటానికి మిమ్మల్ని ఎలా సరి ఐన స్థానములో ఉంచుతుందో అర్థం చేసుకోండి. మీరు ఈ వాక్యాన్ని వింటూండగా, మీ హృదయము అనుదిన కృతజ్ఞతను అలవరచుకొనుటకు ప్రేరేపించబడి, ఈ సందేశములో దేవునికై కృతజ్ఞత కలిగిన జీవనశైలిని నిజముగా జీవించుటకు ఇవ్వబడిన ఆచరణాత్మక విధానాలను మీరు స్వీకరించుదురు గాక. 

  30. 71

    The Judgement Seat of Christ - క్రీస్తు న్యాయపీఠం

    క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడుటకు మీరు సంతోషంతో వేచి చూస్తున్నారా లేక ఆందోళనలో ఉన్నారా? పరిణితి చెందిన విశ్వాసుల కొరకైన ఈ కనువిప్పు కలిగించే సందేశములో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు నూతన నిబంధన విశ్వాసులు దేవుని బహుమానాలు మాత్రమే కాదు కానీ, క్రీస్తు న్యాయపీఠము వద్ద మన కొరకు వేచియున్న ప్రతిఫలాలను పొందుకొనే జీవితాన్ని జీవించే బాధ్యత మనకుందనే విషయాన్ని తెలియజేస్తున్నారు  మీ ప్రతి మంచి పనికి సమృద్ధిగా ప్రతిఫలం పొందుటకు క్రీస్తు ఎదుట సంతోషముతో నిలబడియుందురు గాక!

  31. 70

    Revelation of the Zoe Life - దేవుని జీవం (Pastor Arpitha Komanapalli)

    మీలో ఉన్న క్రీస్తు జీవము అనే సర్వ సత్యములో మీరు నడుస్తున్నారా? ఈ శక్తివంతమైన సందేశంలో, క్రీస్తు నుంచి మనము పొందుకున్న జోయే – దేవుని వంటి జీవము – అనే ప్రత్యక్షతను పాస్టర్ అర్పిత కొమానపల్లి గారు మనకు చూపిస్తున్నారు.  సమాచారము మరియు ప్రత్యక్షత మధ్య తేడాలను కనుగొని, సహజ ప్రపంచానికి మించిన సహజాతీతమైన ప్రపంచములోనికి ఎలా చూడగలమో ఈ వర్తమానంలో తెలుసుకొనండి. శతృవు మారువేషము ధరించి మిమ్మల్ని ఇక ఏ మాత్రమూ మోసపరచనివ్వకండి. సిలువపై ఆయన పూర్తిచేసిన కార్యము ద్వారా మీరు క్రీస్తు జీవాన్ని పొందారు.  మీరీ సందేశాన్ని వింటూండగా మీ మనోనేత్రములు వెలిగింపబడి, జీవానికే మూలమైన యేసు క్రీస్తు అనే దృఢమైన బండ మీద స్థిరంగా నిలబడియుందురు గాక!

  32. 69

    The Simplicity in Christ - క్రీస్తులోని సరళత

    మంచి ఆరోగ్యము, సఫలవంతమైన సంబంధాలు, తృప్తినిచ్చే ఉద్యోగము లేదా సేవా పరిచర్య కలిగియుండుట చాలా కష్టం అనిపిస్తుందా? ఈ సందేశంలో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు క్రీస్తులోని సరళత ద్వారా ఈ ఆశీర్వాదాలన్నిటినీ మనము సుళువుగా ఆస్వాదించే రహస్యాన్ని వెల్లడిస్తున్నారు. ఈ వర్తమానంలో నూతన నిబంధన పాత నిబంధనను ఎలా  అధిగమిస్తుందో, ఈ రెండింటినీ కలపడం వల్ల కలిగే ప్రమాదాలను మనము కనుగొంటాము మరియు దేనినైనా పొందుకొనుటకు దేవుని కృప, మన విశ్వాసమే కీలకమని  నేర్చుకుంటాము.  మీ పనులు సులభతరమవుతే, మీ విశ్వాసము హెచ్చవుతుంది. అప్పుడు ఆశీర్వాదాలు మెండవుతాయి. 

  33. 68

    Wealth Transfer - సంపద బదిలీ

    దేవుని రాజ్యములోనికి, విశ్వాసుల జీవితాల్లోనికి ధనము ఎలా ప్రవహించాలో అనే విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? సంపద బదిలీని గురించిన మర్మాన్ని, లోకస్థుల చేతుల్లో నుంచి, తన బిడ్డల చేతుల్లోనికి దేవుడు వనరులను వ్యూహాత్మకంగా ఎలా మారుస్తాడో  ఈ శక్తివంతమైన సందేశంలో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు వివరిస్తూండగా వినండి.  ఈ వర్తమానంలో, మీరు ఈ విషయాలను తెలుసుకుంటారు: •⁠  ⁠సంపద బదిలీ జరిగే 3 విధానాలు: వ్యూహము ద్వారా, విడుదల ద్వారా, బలవంతముగా. •⁠  ⁠దుష్టులు మరియు నీతిమంతుల మీద ఈ 3 విధానాల ప్రభావము. •⁠  ⁠విశ్వాసులు, దుష్టులు మరియు దేవుడు ఎలా ఈ సంపద బదిలీ జరిగే ప్రతి విధానాన్ని నిర్ణయిస్తారు? •⁠  ⁠దేవుని రాజ్య సంపదను బలోపేతం చేసే జ్ఞానపు 5 కోణాలు. •⁠  ⁠పాపాత్ముడు పోగు చేసినదానంతటితో సహా ఒక మంచి వ్యక్తి ఎలా ఙ్ఞానాన్ని, తెలివిని, ఆనందాన్ని పొందుకుంటాడు? మీరీ సందేశాన్ని వింటూండగా, దేవుని రాజ్యపు సంపదను గురించి మీకున్న జ్ఞానము పెరిగి, నమ్మకమైన గృహనిర్వాహకునిగా ఉండుటకు మీరు దైవిక జ్ఞానములో ఎదుగుతూ గొప్ప దేవుని రాజ్య పెట్టుబడిదారుగా ఉందురు గాక!

  34. 67

    The Parable of the Talents - తలాంతుల యొక్క ఉపమానము

    ఆర్థికంగా మరో మెట్టుకు ఎదగాలనుకుంటున్నారా? దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మరింతగా చేయాలని కోరుతున్నారా? అయితే, ఈ పాడ్కాస్లో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు తలాంతుల యొక్క ఉపమానము ద్వారా ఆర్థిక విషయాలను గురించిన కాలాతీతమైన వాక్య జ్ఞానాన్ని పంచుకుంటూండగా వినండి.  మీరీ సందేశాన్ని వింటూండగా మీ వనరులను జ్ఞానయుక్తంగా నిర్వహిస్తూ దేవుని రాజ్యంలో ధారాళంగా పెట్టుబడి పెట్టడానికి మీరు ప్రేరణ పొందాలని మా ప్రార్థన. మీరు అమితంగా ఆశీర్వదించబడి గొప్ప దేవుని రాజ్య పెట్టుబడిదారుగా ఉందురు గాక.

  35. 66

    The Parable of the Wheat and the Tares -గోధుమలు మరియు గురుగుల యొక్క ఉపమానము

    గురుగుల మధ్యలో కూడా గోధుమ వలె పెరగండి! రూపాంతరం చెందిన వ్యక్తులు లోకపు వ్యవస్థలను ఎలా ప్రభావితం చేస్తారో, దేవుని రాజ్యాన్ని ప్రతిబింబించే గోధుమలు గురుగులు అనే ఉపమానము ద్వారా పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు మనకు ఈ వర్తమానంలో చూపిస్తున్నారు.  మీరీ సందేశాన్ని వింటూండగా మీ కోరికలు, పనులు మరియు మీ జీవితము ఇతరులను ప్రభావితం చేసిన విధానాన్ని గురించి ఒక సారి ఆలోచించండి. మంచి మార్పును తీసుకువచ్చే గోధుమ వలె, చీకటిలో వెలుగుగా ప్రకాశించడానికి మీ జీవితములో మూడు తక్షణ చర్యలను ఇప్పుడే తీసుకోండి.  మీరు సరైన నేలలో ఇష్టపూర్వకంగా నాటబడిన విత్తనంగా ఉండి, దేవుని మహిమ కోసం శాశ్వత ప్రభావాన్ని చూపుదురు గాక!

  36. 65

    The Grace to Manifest the Glory of God! - దేవుని మహిమను ప్రత్యక్షపరచుటకు కృప

    అర్థవంతమైన విధానాల్లో, లోకము గమనించునట్లు దేవుని మహిమను ప్రతిబింబించగలిగే దైవికమైన కృపను ఎలా పొందుకోవాలో ఈ పాడ్కాస్ట్ ద్వారా పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి గారు విశ్వాసులను బలపరుస్తున్నారు.  మీరీ సందేశాన్ని వింటూండగా, దేవుని మహిమార్థమై మీరు అధికముగా ఫలించుటకున్న దైవిక క్రమాన్ని పాటించుటకు కట్టుబడియుండి, తద్వారా క్రీస్తు రక్షణ కృప వైపునకు ప్రజలను త్రిప్పుతారని మా ప్రార్థన.  దేవుని మహిమను కనపరచుటకు మీరు ఏర్పరచబడ్డారు. ఆ మహిమలో నడుస్తూ ఉండండి!

  37. 64

    Still I Rise - నిలిచెదను (Pastor Arpitha Komanapalli)

    గాయపు మచ్చలు ఎంత లోతున్నా - నిరీక్షణ అంత కంటే ఎక్కువగా ప్రకాశిస్తుంది.  బాధపరచబడ్డారా? తిరస్కరించబడ్డారా? అలక్ష్యం చేయబడ్డారా? స్వస్థత, నిరీక్షణ, ఓదార్పునిచ్చే పాస్టర్ అర్పిత కొమానపల్లి గారి ఈ వర్తమానాన్ని వినండి. మీ గాయాలను తన మహిమకు నిదర్శంగా మార్చుటకు దేవుడు ఒక వజ్రము వలె ఎలా మిమ్మల్ని ప్రేమతో రూపించి మలచి, మెరుగుపరుస్తాడో తెలుసుకోండి.  మీ బాధలను అధిగమించి, దేవుని ప్రియమైన బిడ్డగా మీకున్న గుర్తింపును స్వీకరించి, బలంగా నిలిచి, నూతన బలం మరియు ధైర్యంతో నడుస్తూ ఉందురు గాక. యేసు నామంలో, ఆమేన్!

  38. 63

    The Glory of God (Bilingual)

    The Glory of God, The Victory of All In this powerful sermon, Pastor Benjamin Komanapalli Jr. talks about the privilege and importance of manifesting God’s glory to see real change in the world around us.  As you listen, we pray that you position yourself on the rock of Jesus and take on the responsibility of showing God’s glory in and through your life. May your life be filled with the glory of God. In Jesus' name, Amen! దేవుని మహిమ, మనందరి విజయము మన చుట్టూ ఉన్న ప్రపంచంలో నిజమైన మార్పును చూచుటకు దేవుని మహిమను మనము కనబరచే ఆధిక్యత మరియు ప్రాముఖ్యతను గురించి ఈ శక్తివంతమైన వర్తమానంలో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు బోధిస్తున్నారు.  మీరీ సందేశాన్ని వింటూండగా, క్రీస్తు అనే బండ మీద మిమ్మల్ని మీరు సరియైన స్థానంలో ఉంచుకొని, మీ జీవితాలలో, జీవితాల ద్వారా దేవుని మహిమను చూపే బాధ్యతను తీసుకుంటారని మా ప్రార్థన.  మీ జీవితాలు దేవుని మహిమ చేత నింపబడును గాక. యేసు నామములో, ఆమేన్!

  39. 62

    The Path to Divine Destiny -

    మీకై ఉన్న దైవిక గమ్యాన్ని చేరుకొనుట: నిజమైన విజయానికి యాత్ర! ఈ పాడ్కాస్లో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు దైవిక గమ్యానికి అర్థం, దానిని చేరుకొనే మార్గాలు, మీకై ఉన్న దైవిక ఉద్దేశ్యాన్ని కనుగొన్న తరువాత చేయాల్సిన పనులను గురించి  ఎంతో స్ఫూర్తిదాయకమైన వర్తమానాన్ని అందిస్తున్నారు.  మీరీ సందేశాన్ని వింటూండగా దేవుడు మీకై ఉద్దేశించిన సంగతులు నిరీక్షణ, సమాధానం, మంచి భవిష్యత్తు గురించినవై ఉన్నాయనే సత్యంలో మీరు వేరుపారాలని మా ప్రార్థన! నిజమైన విజయాన్ని చేరుకొనులాగున దేవుని వాక్యానికి మీ జీవితమంతా విధేయత చూపుచు నడిపింపబడుదురు గాక. యేసు నామములో, ఆమేన్!

  40. 61

    How to fulfill God's Will for your Life? - మీ జీవితంలో దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాలి?

    విధేయతతో నడవడం: దేవుని పరిపూర్ణ చిత్తాన్ని నెరవేర్చడం ఈ వర్తమానంలో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు దేవుని వాక్యంతో ఎక్కువ సమయం గడుపుట ద్వారా మనమెలా దేవుని చిత్తాన్ని మన జీవితాల్లో నెరవేర్చగలమో తెలుపుతున్నారు.   మీరీ సందేశాన్ని వింటూండగా, దేవుని సూచనలు భారమైనవి కాదు కానీ, నీ మంచి కొరకే, నీ గమ్యానికి చేర్చే దారి అని నీవు గ్రహించాలని మా ప్రార్థన.  నీవు దేవుని సూచనలను పాటిస్తూ ఉండగా, ఆయన ఆశీర్వాదం నీతో పాటు వెళ్తూ, నీకు స్థిరమైన విజయాన్ని, దేవునికి మహిమను తెచ్చును గాక. యేసు నామములో, ఆమేన్!

  41. 60

    Discovering God's Plan for your Life - మీ జీవితములో దేవుని ప్రణాళికను కనుగొనుట

    దేవుని ప్రణాళికను తెలుసుకో - నీవెంతో గొప్ప సఫలతను చూస్తావు.  ఈ సందేశములో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు నీ జీవితములో దేవుని ప్రణాళికను కనుగొనుటకు వివిధ మార్గాలను తెలుపుతున్నారు.  మీరీ సందేశాన్ని వింటూండగా, మీకై దేవునికున్న  ప్రణాళికను నమ్ముటకు ప్రేరేపించబడి,  విశ్వాసముతో ముందుకు వెళ్ళుటకు ప్రోత్సాహపరచబడాలని మా ప్రార్థన. మిమ్మును మీరు సరైన స్థలములో, సరైన సమయములో కనుగొని, మీ దైవికమైన గమ్యాన్ని చేరుకొందురు గాక!

  42. 59

    God's Plan for your Life - మీ జీవితం కొరకు దేవుని ప్రణాళిక

    దేవుని ప్రణాళిక - శ్రేష్ఠమైన ప్రణాళిక  ప్రతి ఒక్కరి జీవితాలు ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో మన ప్రేమగల సృష్టికర్తచే రూపింపబడ్డాయని, ఆ ప్రణాళికను మనము కనుగొని దానిలో నడవాలని ఆయన ఆశిస్తున్నాడనే ప్రోత్సాహపూర్వక సత్యాన్ని పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు ఈ సందేశంలో బోధిస్తున్నారు. దేవుని ప్రణాళికను మనము గుర్తించకపోవుటకు గల కారణాలను పాస్టర్ గారు వివరిస్తుండగా, మీరింత వరకు గడిపిన జీవితాన్ని గురించి ఒక క్షణం ఆలోచించండి. తరువాత మీ పట్ల దేవునికున్న ప్రత్యేకమైన ప్రణాళికను మీకు తెలుపమని దేవునిని అడగండి.  దేవుని మహిమార్థమై, మీరు సరైన దిశలో నడుస్తూ, సరైన గమ్యాన్ని చేరుకొందురు గాక. యేసు నామములో, ఆమేన్!

  43. 58

    It's Time to Grow! - ఇది ఎదుగుటకు సమయం!

    ఇది ఎదుగుటకు సమయం! ఈ పాడ్కాస్ట్లో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు మన జీవితాల్లో ఆత్మీయ ఎదుగుదల యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, ఒక విశ్వాసి జీవితంలో ఎదుగుదల ఒక్కొక్కటిగా ఎలా దశలలో జరుగుతుందో వివరిస్తున్నారు. మీరీ సందేశాన్ని వింటూండగా, దేవుని మహిమ కోసం మీ విశ్వాస జీవితములో ఎవ్వరూ వివరించలేని ఎదుగుదలను చూడటానికి ఆయన సత్య వాక్యము ద్వారా దేవునితో కలిసి మీరు పని చేయడానికి నిర్ణయించుకోవాలని మా ప్రార్థన!

  44. 57

    The Key to Your Breakthrough - మీ విడుదలకు మూలము

    మీ నాలుక: మీ విడుదలకు మూలము ఎంతో దైవిక జ్ఞానము ఇమిడియున్న ఈ సందేశంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు మాటల యొక్క శక్తిని మనము ఎలా ఉపయోగించుకోవాలో తెలియజేస్తున్నారు. మీ జీవితాన్ని మరియు ఇతరులను ఆశీర్వదించుటకు ఎల్లప్పుడూ జీవమునే పలుకుతూ ఉండుటకు ఇప్పుడే నిర్ణయించుకోండి.  మీ మాటలు దేవుని వాక్యానికనుగుణంగా ఉంటూ, మీ జీవితములో మీకు సమృద్ధియైన పంటను ఇచ్చును గాక. యేసు నామములో, ఆమేన్!

  45. 56

    The Principle of Sowing & Reaping - విత్తుట మరియు కోయుట అను సూత్రము

    విత్తుట మరియు కోయుటలోని శక్తి! ఈ సందేశంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు వెదకాలము, కోతకాలములు అను బైబిల్ సూత్రాన్ని వివరిస్తుండగా మీ జీవితంలో శాశ్వతమైన మార్పునకు సూత్రాన్ని కనుగొనండి.  మీరు చేస్తున్న పనులనొకసారి పరీక్షించుకొని, వాటిని దేవుని వాక్యానికనుగుణంగా మార్చుకొనడం ద్వారా మీ జీవితము ఎలా సంపూర్ణంగా మారిపోగలదో తెలుసుకోండి.

  46. 55

    Living the No Condemnation Life - శిక్షావిధి లేని జీవితము జీవించుట

    శిక్షావిధి - ఒక భయంకరమైన వేదన నీకు నేనంత మంచివాడను/మంచిదానను కాదు అనిపిస్తుంటుందా? ఏవైనా అంచనాలను చేరుకోవడానికి ప్రయత్నించి ప్రతి సారి ఓటమి పాలయ్యావా? సానుకూల ఒప్పుకోలు చేస్తూ, నిపుణతగల మార్గదర్శకత్వం ఉన్నప్పటికీ వాటితో ఏం ప్రయోజనం లేక చిక్కుకుపోయినట్లు అనిపిస్తుందా? లేఖనాధారంగా ఉన్న ఈ విడుదలనిచ్చే సందేశంలో పాస్టర్ బెంజమిన్ జూనియర్ గారు ఒక తుది పరిష్కారాన్నిస్తునారు: క్రీస్తుని అంగీకరించి, ఆయన రక్షణలో విశ్రమించుట. తగిన ఉదాహారణలనిస్తూ శిక్షావిధి నుంచి విడుదలై స్వేచ్ఛగా జీవించుట అనేది కేవలం సాధ్యమే గాక అది నిజమైన స్వాతంత్ర్యానికి మూలం అని ఆయన చెపుతున్నారు.  ఈ సందేశాన్ని విని, ఎటువంటి అపరాధ భావన, అవమాన భారము లేని ధైర్యము, శక్తితో కూడిన స్వేచ్చా జీవితాన్ని జీవించుటకు శక్తిని పొందండి. ఆమేన్!

  47. 54

    The Mystery of Christ in you - మీలో ఉన్న క్రీస్తుని గూర్చిన మర్మము

    మీలో ఉన్న క్రీస్తు, మహిమ నిరీక్షణయైయున్నాడను మర్మము ఈ వర్తమానంలో, పాస్టర్ బెంజమిన్ జూనియర్ గారు సిలువ తర్వాత జీవించుచున్న వారికి ప్రత్యేకంగా ఉన్న గొప్ప ఆధిక్యతను వెల్లడిస్తున్నారు: అది, క్రీస్తు మనలో నివసించుట, మనం ఆయనలో నివసించుట అనే మర్మము. మీరు వ్యాపారస్తులైనా, తల్లిదండ్రులైనా, వైద్య నిపుణులైనా, విద్యావేత్తలైనా, లేదా దేవుని సేవకులైనా, క్రీస్తును మరియు ఆయన సిలువ మరణాన్ని తెలుసుకొనుటపై మీ దృష్టిని కేంద్రీకరించి, దైవిక ఫలితాలను అనుభవించాలని మేము ప్రార్థిస్తున్నాము. మీరు క్రీస్తులో ఇది వరకే ఏమైయున్నారో, అలా అవుటకు ప్రయత్నించడం మానివేసి, దేవుని సంపూర్ణతలో నడుస్తూ, ఆయన శక్తిని ఇతరులకు చూపించుదురు గాక. యేసు నామంలో, ఆమేన్.

  48. 53

    Salvation - Our place of Rest - రక్షణ - మన విశ్రాంతి స్థలము

    నమ్ముటయే విశ్రమించుట! పాస్టర్ బెంజమిన్ జూనియర్ గారి ఈ సందేశము ఒక క్రైస్తవునికి ‘విశ్రాంతి’ యొక్క నిజ అర్థం ఏమిటో అనే సత్యానికి మన కళ్ళు తెరుస్తుంది. శత్రువు తీసుకు వచ్చే అబద్ధాలను గురించి ఆయన చర్చిస్తూ, క్రీస్తుతో సహవారసులమైన మనతో దేవుని వాక్యమే మాట్లాడుతుందనే సత్యాన్ని నొక్కి చెపుతున్నారు.  ఇదే మీ విశ్రాంతి దినము. మీరీ వర్తమానాన్ని వింటూండగా, దేవుని వాగ్దానాలను నమ్మి, వాటిలో నడుచుట ద్వారా ఇప్పుడే మీ విశ్రాంతిని మీరు పొందుకోవాలని మా ప్రార్థన.  మీరు మీ స్వంత క్రియల మీద ఆధారపడుట మాని, దేవుని కృప మీదనే సంపూర్ణముగా ఆధారపడి, మీ రక్షణ అనే విశ్రాంతి స్థలములోనికి ప్రవేశించుదురు గాక. యేసు నామములో, ఆమేన్!

  49. 52

    Life after the Cross - సిలువ తర్వాత జీవితము

    ఈ వర్తమానంలో పాస్టర్ బెంజమిన్ జూనియర్ గారు బైబిల్‌లోని గత మరియు ప్రస్తుత సత్యాలను అర్థం చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, వాటిని అర్థం చేసుకోవడంలో సందర్భం మరియు సమయాన్ని వివేచించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తున్నారు. మీరీ సందేశాన్ని వింటూండగా, దేవుడు మనకిచ్చిన సమృద్ధి జీవితాన్ని దోచుకునే సంప్రదాయాలను తిరస్కరించాలని మరియు సిలువ తర్వాత క్రీస్తు మనకిచ్చిన జీవితము మనము జీవించడము గొప్ప భాగ్యం, ఆధిక్యత అని మనము గ్రహించాలని మా ప్రార్థన. దేవుడు ఈ కాలములో చేస్తున్న దానంతటికీ మీ కళ్ళు, చెవులు, హృదయము ఎల్లప్పుడూ తెరచి ఉండును గాక. యేసు నామములో, ఆమేన్!

  50. 51

Type above to search every episode's transcript for a word or phrase. Matches are scoped to this podcast.

Searching…

We're indexing this podcast's transcripts for the first time — this can take a minute or two. We'll show results as soon as they're ready.

No matches for "" in this podcast's transcripts.

Showing of matches

No topics indexed yet for this podcast.

Loading reviews...

ABOUT THIS SHOW

Welcome to the New City Church Podcast - Telugu with Ps. Benjamin Komanapalli. Join us each week as we seek to deepen our understanding in the Word of God, explore Biblical truths, grow in radical faith, and lead a victorious life in Christ.Website: https://www.newcity.in

HOSTED BY

New City Church

Frequently Asked Questions

How many episodes does The New City Church Podcast - Telugu have?

The New City Church Podcast - Telugu currently has 50 episodes available on PodParley. New episodes are automatically indexed when they're published to the podcast feed.

What is The New City Church Podcast - Telugu about?

Welcome to the New City Church Podcast - Telugu with Ps. Benjamin Komanapalli. Join us each week as we seek to deepen our understanding in the Word of God, explore Biblical truths, grow in radical faith, and lead a victorious life in Christ.Website: https://www.newcity.in

How often does The New City Church Podcast - Telugu release new episodes?

The New City Church Podcast - Telugu has 50 episodes. Check the episode list to see recent publication dates and frequency.

Where can I listen to The New City Church Podcast - Telugu?

You can listen to The New City Church Podcast - Telugu on PodParley by clicking any episode. We provide an embedded audio player for direct listening, and you can also subscribe via your preferred podcast app using the RSS feed.

Who hosts The New City Church Podcast - Telugu?

The New City Church Podcast - Telugu is created and hosted by New City Church.
URL copied to clipboard!