Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

PODCAST · fiction

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the worldమన తెలుగు కథలు - మంచి కథల సమాహారం

  1. 1146

    నామకరణం|Namakaranam|Telugu Short Story|Bhagavathula Bharathi|manatelugukathalu.com

    నామకరణం https://www.manatelugukathalu.com/post/namakaranam-telugu-story-485 రచన : భాగవతుల భారతి తన పేరంటే చెప్పలేనంత అసహ్యం పీతాంబరధార రావుకి. కానీ పెంటయ్య చెప్పిన మాటలు అతని మనసును మార్చాయి.పెద్దల ఆస్తులు కావాలిగానీ వాళ్ళ పేర్లు పనికిరావా? అన్న పెంటయ్య వాదనతో ఏకీభవించాడు. తన కొడుక్కి తండ్రి పేరు పెట్టాడు. భాగవతుల భారతి గారు రచించిన ఈ చక్కటి హాస్య కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

  2. 1145

    ప్రస్థానం | Prasthanam | Telugu Short Story | Gorthi Vanisrinivas | manatelugukathalu.com

    ప్రస్థానం https://www.manatelugukathalu.com/post/prasthanam-telugu-story-512 రచన : గొర్తి వాణిశ్రీనివాస్ (మనతెలుగుకథలు.కామ్ వారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన విజయదశమి కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ) ముసలి వయసులో భార్యను కోల్పోయాడతను. భార్య తనను కసురుకున్నా, విసుక్కున్నా తనను పట్టించుకునేదని సంతోషించే వాడు. ఇప్పుడు ఒంటరితనం ఫీల్ అవుతున్నాడు. అర్థం చేసుకున్న కొడుకు, తల్లి బాధ్యతను తను తీసుకున్నాడు. ఈ చక్కటి కథను ప్రముఖ రచయిత్రి గొర్తి వాణిశ్రీనివాస్ గారు రచించారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

  3. 1144

    మరణాన్ని జయించి బ్రతుకుదాం|Marananni Jayinchi Brathukudam|Telugu short Story|Manatelugukathalu.com|ramya Namuduri

    మరణాన్ని జయించి బ్రతుకుదాం https://www.manatelugukathalu.com/post/marananni-jayinchi-bratukudam-telugu-story-248 (మనతెలుగుకథలు.కామ్ వారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన విజయదశమి కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ) రచన : రమ్య నముడూరి మరణించాక ఈ దేహాన్ని ఎవరూ వుంచుకోరు. ఈ దేహం అగ్నికి ఆహుతి అయి, బూడిద అవుతుంది. లేదా మట్టిలో కలిసి పోతుంది. అదే అవయవ దానం చేస్తే మరొకరికి జీవితాన్ని ఇస్తుంది ఈ దేహం. పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు. మరణం అనివార్యమైనప్పుడు. మన మరణంతో, వేరొకరికి పునర్జన్మనిద్దాం.. అని తెలియజెప్పే ఈ కథను ప్రముఖ రచయిత్రి రమ్య నముడూరి గారు రచించారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది

  4. 1143

    నేను పిసినారోణ్ణి|Nenu Pisinaronni|Telugu Short Story|Dr. M. Rama Mohana Rao|manatelugukathalu.com

    నేను పిసినారోణ్ణి https://www.manatelugukathalu.com/post/nenu-pisinaronni-telugu-story-605-munaga-rama-mohana-rao రచన : Dr. M. రామ మోహన రావు అతనికి  పిసినారివాడు అనే ముద్ర వేశారు. అతను ఆ ఇమేజ్ కే కట్టుబడి ఉండేవాడు. కానీ అతను కూడా మంచి వ్యక్తి అని భావించిన వారితో మంచిగా వున్నాడు. 'నేను పిసినారోణ్ణి' అనే ఇమేజ్ నుండి బయట పడ్డాడు. ఒక వ్యక్తి లో మంచిని గుర్తిస్తే అతను అందుకు తగ్గట్లుగా ప్రవర్తిస్తాడు అని తెలియజెప్పే ఈ కథను  Dr. M. రామ మోహన రావు గారు రచించారు. ఈ కథ manatelugukathalu.com లో ప్రచురింప బడింది.

  5. 1142

    అక్షయ పాత్ర | Akshaya Pathra | Telugu Short Story | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    అక్షయ పాత్ర https://www.manatelugukathalu.com/post/akshay-pathra-telugu-story-677-mallavarapu-seetharam-kumar రచన:  మల్లవరపు సీతారాం కుమార్ "కలియుగంలో కూడా అక్షయ పాత్రలు ఉన్నాయా? ఉంటే ఎన్ని ఉన్నాయి?" అనేది ప్రశ్న. ఆప్షన్ ఏ). ఒకటి       ఆప్షన్ డి). కోటి పైన. ఖచ్చితంగా ఆప్షన్ ఏ). ఒకటి అనుకున్నాడు సుబ్బారావు. ఆప్షన్ డి). కోటి పైన అంది అతని భార్య ఒక ఉద్దేశంతో. ఆప్షన్ డి). కోటి పైన అన్నాడు స్నేహితుడు మరో ఉద్దేశంతో. ఎవరు కరెక్టో తెలుసుకోవాలంటే మల్లవరపు సీతారాం కుమార్ గారు రచించిన అక్షయ పాత్ర కథ వినండి. ఈ కథ manatelugukathalu.com లో ప్రచురింప బడింది.

  6. 1141

    అత్తగారు ఆవకాయ|Atthagaru Avakaya|Telugu Short Story|Sita Mandalika

    అత్తగారు ఆవకాయ|Atthagaru Avakaya https://www.manatelugukathalu.com/post/atthagaru-avakaya-telugu-story-670-sita-mandalika ఆవకాయ సీజన్ వచ్చిందంటే అత్తగారు  రమణమ్మ గారి హడావిడి ఇంత అంత కాదు. ఇక కోడలు పద్మకు కలిగే టెన్షన్ కు అంతే ఉండదు. చక్కటి ఈ హాస్య కథను సీత మండలీక గారు రచించారు. ఈ కథ manatelugukathalu.com లో ప్రచురింప బడింది.

  7. 1140

    శంఖం లో పోస్తే గానీ తీర్థం కాదు|Sankhamlo Posthe Gani Tirtham Kadu|Telugu Short Story

    శంఖం లో పోస్తే గానీ తీర్థం కాదు|Sankhamlo Posthe Gani Tirtham Kadu https://www.manatelugukathalu.com/post/sankham-lo-posthe-gani-irtham-kadu-telugu-story-672 పాస్ పోర్ట్ కోసం వెళ్ళినప్పుడు చిన్న భంగపాటు కలిగింది సరోజకు. అక్కడ కలిగిన ఇబ్బంది కంటే భర్త నవ్వాడనే ఉక్రోషమే మరింత బాధించింది ఆమెను. సరదా సరదాగా సాగే ఈ  కథను ప్రముఖ రచయిత్రి నీరజ హరి ప్రభల గారు రచించారు. ఈ కథ manatelugukathalu.com లో ప్రచురింప బడింది.

  8. 1139

    డాక్టర్ సంధ్య|Doctor Sandhya|Telugu Short Story

    డాక్టర్ సంధ్య|Doctor Sandhya https://www.manatelugukathalu.com/post/doctor-sandhya-telugu-story-669-n-dhanalakshmi డాక్టర్ రూపంలో  దేవుళ్ళే కాదు, కామాంధులు కూడా ఉంటారు. గొప్ప వ్యక్తిత్వం గల మనిషి లాగ అందరి ముందు చలామణి అవుతున్న డాక్టర్ నిజ స్వరూపాన్ని ప్రపంచానికి తెలియచేసిన ఓ లేడీ డాక్టర్ కథ... ఈ తరం రచయిత్రి ధనలక్ష్మి గారు రచించిన డాక్టర్ సంధ్య అనే ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

  9. 1138

    అమ్మా! కాసేపు ఆగు|Amma Kasepu Agu|Telugu Short Story|N. Dhanalakshmi

    https://www.manatelugukathalu.com/post/amma-kasepu-agu-telugu-story-673 అమ్మా! కాసేపు ఆగు|Amma Kasepu Agu కాసేపు ఆగమన్నాడు విశ్వం మాస్టారు. కానీ అతని కూతురు లత ఆగలేదు. దాని ఫలితం ఎంతటి విషాదమో  ఈతరం రచయిత్రి ధనలక్ష్మి గారు రచించిన ఈ కథ వింటే తెలుస్తుంది. ఈ కథ manatelugukathalu.com లో ప్రచురింప బడింది.

  10. 1137

    సుక్కి|Sukki|Telugu Short Story|Bhagavathula Bharathi

    సుక్కి|Sukki https://www.manatelugukathalu.com/post/sukki-telugu-story-671-bhagavathula-bharathi చనిపోయిన కూతురు సుక్కి ఇంకా తనతో ఉన్నట్లే భ్రమిస్తూ ఉంటుంది సీతాలు. ఆ భ్రమ తొలిగితే ఆమె దక్కదేమోనని అలానే ఉంచుతాడు భర్త రాములయ్య. ప్రముఖ రచయిత్రి భాగవతుల భారతి గారు రచించిన ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

  11. 1136

    మేలుకొలుపు|Melukolupu|Telugu Short Story|N Sivanageswara Rao

    https://www.manatelugukathalu.com/post/melukolupu-telugu-story-668-n-siva-nageswara-rao మేలుకొలుపు రచన : ఎన్. శివ నాగేశ్వర రావు వ్యక్తిత్వం కలవారు మన జీవితంలో మార్పు తీసుకొని రాగలరు. వారు సామాన్యులైనా సరే, మనల్ని ప్రభావితం చేయగలరు. ఈ విషయాన్నిమేలుకొలుపు కథలో చక్కగా వివరించారు శివనాగేశ్వర రావు గారు. మీకు చదివి వినిపిస్తున్నది సీతాలక్ష్మి

  12. 1135

    ఐతే ఓకే అను తారాబలం కథ|Aithe Ok Anu Tharabalam Katha|Written By Vasundhara

    https://www.manatelugukathalu.com/post/aithe-ok-anu-tharabalam-katha-telugu-story-666-vasundhara ఐతే ఓకే అను తారాబలం కథ|Aithe Ok Anu Tharabalam Katha రచన : వసుంధర చేసేది తప్పా ఒప్పా అన్న మీమాంస వచ్చినప్పుడు- మనసెప్పుడూ తప్పు వైపే మొగ్గుతుంది. అది తప్పు కాదనీ, ఒప్పనీ నిర్థారించడానికి- సంజాయిషీలు వెదుకుతుంది.  కానీ మనకి మనం ఇచ్చుకునే సంజాయిషీలు మనసుకి తృప్తినివ్వవు. ఆ సంజాయిషీ విని, ‘ఐతే ఓకే’ అనే ఓ పెద్దమనిషిని గురువుగా స్వీకరించాలి. ఆ పెద్దమనిషి నిజంగా పెద్దమనిషి కానక్కర్లేదు. పెద్దమనిషని మనం నమ్మితే చాలు. ఈ విషయాన్ని చక్కటి కథగా మలిచారు తెలుగు వారి అభిమాన రచయిత్రి వసుంధర గారు. ఈ కథ manatelugukathalu.com లో ప్రచురింపబడింది. మీకు చదివి వినిపిస్తున్నది సీతాలక్ష్మి.

  13. 1134

    స్వర్ణ తాంబూలం|Swarna Thambulam|Telugu Short Story By M. R. V. Sathyanarayana Murthy

    https://www.manatelugukathalu.com/post/swarna-thambulam-telugu-story-662 స్వర్ణ తాంబూలం|Swarna Thambulam ఆమె ఒకనాడు మనసు దోచుకున్న నెచ్చెలి. అతని సందిగ్ధం ముగిసేలోగానే ఆమె దూరం అయ్యింది. ఆమెతో పాటు ఆమె పేరునుకూడా జ్ఞాపకంలా మిగిల్చుకున్నాడు అతను. మనల్ని కథలో లీనం చేసే ఈ కథను ఎం.ఆర్.వి.సత్యనారాయణ మూర్తి గారు రచించారు. ఈ కథ manatelgukathalu.com లో ప్రచురింప బడింది. ఇక కథ ప్రారంభిద్దాం.

  14. 1133

    కాకమ్మ కబుర్లు|Kakamma Kaburlu|Telugu Short Story By Kiran Vibhavari

    https://www.manatelugukathalu.com/post/kakamma-kaburlu-telugu-story-660 కాకమ్మ కబుర్లు|Kakamma Kaburlu|Telugu Short Story By Kiran Vibhavari కాదేదీ కవితకనర్హం. కాదే కాకీ  ప్రేరణకనర్హం. ఎందులోనైనా మంచిని వెతుక్కోవచ్చు. స్ఫూర్తిని పొందవచ్చు  అని తెలియ చెప్పే ఈ కథను నవతరం రచయిత్రి కిరణ్ విభావరి గారు రచించారు. ఇక కథ ప్రారంభిద్దాం.

  15. 1132

    సీతారాములు|Seetharamulu|Telugu Short Story| Madduri Bindumadhavi

    https://www.manatelugukathalu.com/post/sitharamulu-telugu-story-658 సీతారాములు|Seetharamulu|Telugu Short Story| Madduri Bindumadhavi సమస్యను మనసులోనే దాచుకుంటే మరింత పెద్దది అవుతుంది.పరిష్కారానికి ప్రయత్నించాలి.విఫలమైతే మరో మార్గం ఆలోచించాలి. అప్పుడే పరిష్కారం లభిస్తుంది . ఈ విషయాన్నీ చాలా చక్కగా ఈ కథలో వివరించారు ప్రముఖ రచయిత్రి మద్దూరి బిందుమాధవి గారు. ఈ కథ manatelugukathalu.com లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.

  16. 1131

    ఇంతటి దుఃఖాన్ని తీర్చేదెవరు|Inthati Duhkhanni Tirchedevaru|Telugu Story By Neeraja Hari Prabhala

    https://www.manatelugukathalu.com/post/inthati-duhkhanni-tirchedevaru-telugu-story-657 ఇంతటి దుఃఖాన్ని తీర్చేదెవరు|Inthati Duhkhanni Tirchedevaru పిల్లల చదువుల కోసం భర్తతో సర్దుకుంది. తరువాత వారిపెళ్ళిళ్ల కోసం సర్దుకుంది. ఇప్పుడైనా భర్తను ఎదిరిద్దామనుకొని పిల్లల అభిప్రాయం అడిగింది. వారేమన్నారో ప్రముఖ రచయిత్రి నీరజ హరి ప్రభల గారి ఈకథలో తెలుసుకుందాం. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.

  17. 1130

    సార్థకత|Sarthakatha|Telugu Short Story By Kamala Parijatham

    https://www.manatelugukathalu.com/post/sartahakatha-telugu-story-656-kamala-parijatham సార్థకత|Sarthakatha|Telugu Short Story By Kamala Parijatham అమ్మాయి జీవితానికి పెళ్లే పరమావధి కాదు. ఒకవేళ అదే నిజం అయితే ఆ పెళ్లి ఆమె ఇష్టంతో జరగాలి. ఫైర్ బ్రాండ్ రచయిత్రి కమల పారిజాతం రచించిన ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్. ఇక కథ ప్రారంభిద్దాం.

  18. 1129

    బురిడీ-BURIDI-Telugu Story

    https://www.manatelugukathalu.com/post/buridi-telugu-story-654-vadlamannati-gangadhar 'Buridi' written by Vadlamannati Gangadhar రచన : వడ్లమన్నాటి గంగాధర్ Good story by Vadlamannati Gangadhar-Published in manatelugukathalu.com అతని పేరు మధు. అమ్మాయిలను ట్రాప్ చెయ్యడం, వాళ్ళ బంగారంతో ఉడాయించడం అతని అలవాటు. మరి ఈసారి అతను ఎప్పటిలానే సక్సెస్ అయ్యాడా లేదా అనేది వడ్లమన్నాటి గంగాధర్ గారు రచించిన ' బురిడీ' కథ చదివితే తెలుస్తుంది.

  19. 1128

    దారి తప్పిన మంద గొర్రె | Daari tappina Manda Gorre | Mana Telugu Kathalu - Telugu Short Stories

    https://www.manatelugukathalu.com/post/dari-thappina-manda-gorre-telugu-story-653-madduri-bindumadhavi దారి తప్పిన మంద గొర్రె | Daari tappina Manda Gorre is a Telugu short story, originally published in manatelugukathalu.com దారి తప్పిన మంద గొర్రె, Short Story by : మద్దూరి బిందుమాధవి స్పోర్ట్స్ లో మన దేశం ఎంతో వెనక పడిందని సగటు భారతీయుడి భావన. కానీ ప్రతి ఒక్కరూ తమ పిల్లలు మాత్రం చదువుకొని ఉద్యోగాలుచెయ్యాలని కోరుకుంటారు. తన మనవడికి స్పోర్ట్స్ పైన ఉన్న ఆసక్తిని గమనించిన ఒక తాత, అతన్ని సపోర్ట్ చేస్తాడు. ఆలోచింపజేసే ఈ కథను ప్రముఖ రచయిత్రి మద్దూరి బిందుమాధవి గారు రచించారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

  20. 1127

    ఆఖరి కోరిక | Aakhari Korika | Mana Telugu Kathalu - Telugu Stories

    https://www.manatelugukathalu.com/post/akhari-korika-telugu-story-653-jidigunta-srinivasa-rao ఆఖరి కోరిక | Aakhari Korika is a Telugu short story, originally published in manatelugukathalu.com కథ క్లుప్తంగా: 'కంది పచ్చడిలోకి నెయ్యి బాగా వేసుకొని తింటే స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉంటాము. ఇక అందులోకి అనుపానంగా పచ్చి పులుసు కూడా వుంటే ఆ బెత్తెడు దూరం కూడా ఉండదు.' అనేది కృష్ణమూర్తి ఫిలాసఫీ. కానీ అనుకోకుండా గుండె జబ్బు వచ్చిందతనికి. అప్పట్లో నెయ్యి తింటే గుండెకు మంచిది కాదనే అపప్రధ ఉండేది. దాంతో తనకిష్టమైన కంది పచ్చడి+నెయ్యి+పచ్చి పులుసు కాంబినేషన్ కు దూరం అయ్యాడతను. చివరి రోజుల్లో అయినా అతని కోరిక తీరిందేమో ప్రముఖ రచయిత జీడిగుంట శ్రీనివాసరావు గారు రచించిన 'ఆఖరి కోరిక' హాస్య కథ  వింటే  తెలుస్తుంది. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

  21. 1126

    స్వేచ్ఛ | Swecchha | Mana Telugu Kathalu - Telugu Stories

    https://www.manatelugukathalu.com/post/sweccha-telugu-story-649-sita-mandalika స్వేచ్ఛ | Swecchha is a Telugu short story, originally published in manatelugukathalu.com స్వేచ్ఛ, Short Story by : సీత మండలీక కథ క్లుప్తంగా : వృద్ధాప్యంలో పిల్లల దగ్గర ఉండకూడదనీ, ఆలా ఉంటే తమకు స్వేచ్ఛ ఉండదనీ అనుకున్నారు కరుణ, శ్రీరామ్   లు. కానీ స్వేచ్ఛ పేరుతో పిల్లల ప్రేమకు దూరంగా ఉండడమెందుకని అనిపించి , వాళ్ళతోనే కలిసి ఉండాలని   నిర్ణయించుకున్నారు. సీత మండలీక గారూ   రచించిన ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడింది

  22. 1125

    ముసుగు | Musugu | Mana Telugu Kathalu - Telugu Stories

    https://www.manatelugukathalu.com/post/musugu-telugu-story-648-kiran-vibhavari ముసుగు |   Musugu is a Telugu short story, originally published in manatelugukathalu.com ముసుగు, Short Story by : కిరణ్ విభావరి కథ   క్లుప్తంగా : తన స్టూడెంట్స్ ని కన్నా బిడ్డల్లా చూసుకొనే వ్యక్తి అయన. కానీ అతని మీద నింద వేసిందో అమ్మాయి. తట్టుకోలేక  పోయారాయన. తలెత్తుకొని తిరగలేక , తనువు చాలించారు. నవతరం అభ్యుదయ రచయిత్రి కిరణ్ విభావరి గారు రచించిన 'ముసుగు' కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడింది.

  23. 1124

    పరిధి | Paridhi | Mana Telugu Kathalu - Telugu Stories

    https://www.manatelugukathalu.com/post/paridhi-telugu-story-638-bhagavatula-bharathi పరిధి | Paridhi is a Telugu short story, originally published in manatelugukathalu.com పరిధి, Short Story by : భాగవతుల భారతి కథ క్లుప్తంగా : సంయమనం లేని మానవుడి ప్రయాణం రకరకాల పరిధులలో సాగుతుంది.చుట్టూ జరిగే తన అనుభవాలతోనే పరిధిని గీస్తాడు. విచక్షణా తలుపులు బిగించేసుకుని , ఊహల కిటికీలోంచే చూసి,కనిపించేదే నిజమని భ్రమసి,ఆనందపడీ, కొన్నాళ్ళకి ఛీ ఇదంతా   అబద్దం అని ఆ పరిధిని చెరిపేసి ,మళ్ళీ   వేరే పరిధిని గీసే ప్రయత్నం లో నిమగ్నమౌతాడు.నిరంతరమూ ఇదే జరుగుతూ ఉంటుంది.   గీసుకోటం,...చెరుపుకోటం,...మళ్లీ గీయటం

  24. 1123

    ఒక ఇల్లాలి కధ | Oka Illali Kadha | Mana Telugu Kathalu - Telugu Stories

    https://www.manatelugukathalu.com/post/oka-illali-katha-telugu-story-632-yasoda-puluurtha ఒక ఇల్లాలి కధ | Oka Illali Kadha is a Telugu short story, originally published in manatelugukathalu.com ఒక ఇల్లాలి కధ, Short Story by : యశోద పులుగుర్త కథ క్లుప్తంగా : సరదా సరదా గా సాగుతూ ఉంటుంది ఆంజనేయులు, మంగ తయారుల వైవాహిక   జీవితం.అంతలో పిడుగులాంటి వార్త,...కరోనా కాలంలో అతని ఉద్యోగం పోతుంది.ఆ సమయంలో అతనికి అండగా నిలుస్తుంది మంగ   తాయారు.ఇద్దరు కలిసి తమ కష్టాన్ని ఎలా అధిగమించారో ఈ కథలో చక్కగా వివరించారు   ప్రముఖ రచయిత్రి యశోద పులుగుర్త గారు.

  25. 1122

    కాలమహిమ | Kaala Mahima | Mana Telugu Kathalu - Telugu Stories

    https://www.manatelugukathalu.com/post/kalamahima-telugu-story-635-jidigunta-srinivasa-rao కాలమహిమ | Kaala Mahima is a Telugu short story, originally published in manatelugukathalu.com కాలమహిమ, Short Story by : శ్రీనివాసరావు జీడిగుంట కథ క్లుప్తంగా : అబ్బాయి పేరెంట్స్ అజమాయిషీ చేసే రోజులు పోయాయి. అమ్మాయి   తల్లితండ్రులు టర్మ్స్ డిక్టేట్ చేసే రోజులు వచ్చాయి. ఈ చక్కటి హాస్య కథను   ప్రముఖ రచయిత జీడిగుంట శ్రీనివాసరావు గారు రచించారు.

  26. 1121

    నాన్న కోసం | Nanna Kosam | Mana Telugu Kathalu - Telugu Stories

    https://www.manatelugukathalu.com/post/nanna-kosam-telugu-story-647-pandranki-subramani నాన్న కోసం   | Nanna Kosam is a Telugu short story, originally published in manatelugukathalu.com నాన్న కోసం, Short Story by : పాండ్రంకి సుబ్రమణి కథ క్లుప్తంగా :మురళీధర్ ఒక పేస్ బుక్ రచయిత. అతనికి తల్లంటే గౌరవమే.కానీ అందరూ   తల్లినే పొగిడి , తండ్రిని పట్టించుకోవడం లేదనేది అతడి ఆవేదన. ఈ కథను ప్రముఖ   రచయిత పాండ్రంకి సుబ్రమణి గారు రచించారు.

  27. 1120

    కడుపు నిండితే గారెలు చేదు | Kadupu Nindithey Gaarelu Chedu | Mana Telugu Kathalu - Telugu Stories

    https://www.manatelugukathalu.com/post/kadupu-nindithe-garelu-chedu-telugu-story-631-madduri-bindumadhavi కడుపు నిండితే గారెలు చేదు | Kadupu Nindithey Gaarelu Chedu is a Telugu short story, originally published in manatelugukathalu.com కడుపు నిండితే గారెలు చేదు, Short Story by : మద్దూరి బిందుమాధవి కథ క్లుప్తంగా : జీవితంలో పైకి ఎదగాలనుకోవడంలో తప్పులేదు. అది చాలా సహజం.కానీ తమ   ఎదుగుదలకు సహకరించిన వారినే ప్రశ్నించడం స్వార్థానికి పరాకాష్ట.అలంటి   స్వభావాన్ని ఎండగట్టే కథ "కడుపు నిండితే గారెలు చేదు".ప్రముఖ రచయిత్రి   మద్దూరి బిందుమాధవి గారు రచించిన ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప   బడింది.

  28. 1119

    పంచ పండులు | Pancha Pandulu | Mana Telugu Kathalu - Telugu Stories

    పంచ పండులు   | Pancha Pandulu is a Telugu short story, originally published in manatelugukathalu.com పంచ పండులు, Short Story by : M R V సత్యనారాయణ మూర్తి కథ క్లుప్తంగా : బాల్యం ఎంతో మధురమైంది.అప్పటి స్మృతులు జీవితాంతం తియ్యటి   జ్ఞాపకాలుగా ఉంటాయి.ఐదుగురు స్నేహితుల బాల్య స్మృతులను చక్కటి కథగా మలిచి మనకు అందించారు M R V సత్యనారాయణ మూర్తి గారు.ఈ కథ   మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

  29. 1118

    దైవం మానుష రూపేణా…. | Daivam Manusha Rupena | Mana Telugu Kathalu - Telugu Stories

    దైవం మానుష రూపేణా…. | Daivam Manusha Rupena is a Telugu short story, originally published in manatelugukathalu.com దైవం మానుష రూపేణా…., Short Story by:నీరజ హరి ప్రభల కథ క్లుప్తంగా :కాపాడాల్సిన భర్త నరకం చూపిస్తున్నాడు. అమ్మలా ఆదరించాల్సిన అత్త   అంతకన్నా టార్చర్ పెడుతోంది. ఆ సమయంలో... ఏ సంబంధం లేని పక్కింటి విశ్వనాధం గారు   ఆమెను తండ్రిలా ఆదుకున్నారు...ఆదరించారు. అలంటి వారినే 'మనిషి రూపంలో ఉన్న   దేవుడు' అంటారు. నీరజ హరి ప్రభల గారు రచించిన 'దైవం మానుష రూపేణా….' అనే ఈ కథ   మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడింది.

  30. 1117

    తీరం చేరిన కెరటం | Teeram Cherina Keratam | Mana Telugu Kathalu - Telugu Stories

    తీరం చేరిన కెరటం | Teeram Cherina Keratam is a Telugu short story, originally published in manatelugukathalu.com తీరం చేరిన కెరటం, Short Story by:పులుగుర్త యశోద కథ క్లుప్తంగా : భర్త అఖిల్ పట్ల విముఖత కలిగింది వినీతకి. అతనితో డివోర్స్ తీసుకోవాలనుకుంది. కానీ మాధవ్, నీలిమల అన్యోన్యత, మాధవ్ ను నీలిమ అర్థం చేసుకున్న తీరు చూసాక తన తప్పు తెలుసుకొని, భర్తను కలుసుకుంది వినీత. యశోద గారి ఈ చక్కటి కథ మనతెలుగుకథల్.కామ్ లో  ప్రచురింపబడింది.

  31. 1116

    మనిషి -మనసు |Manishi-Manasu | మనిషి -మనసు |Manishi-Manasu | Mana Telugu Kathalu - Telugu Stories

    మనిషి-మనసు |Manishi-Manasu | మనిషి -మనసు |Manishi-Manasu | is a Telugu short   story, originally published in manatelugukathalu.com మనిషి-మనసు |Manishi-Manasu, Short Story by:ఏ. అన్నపూర్ణ    కథ క్లుప్తంగా : విదేశీయురాలైన, పేద కుటుంబానికి చెందిన లీసాను ప్రేమించి, పెళ్లి   చేసుకున్నాడు ఆకాష్. కానీ ఎక్కడ తన పేరెంట్స్ దూరం అవుతాడో అని భయపడ్డాడు. అయితే ఆకాష్ పేరెంట్స్ ఎంతో పరిణితి కలవారు. కొడుకు చేసుకున్న దేశాంతర, మతాంతర   వివాహాన్ని ఆమోదించారు. ఆశీర్వదించారు.    ప్రఖ్యాత రచయిత్రి A. అన్నపూర్ణ గారు రచించిన ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో   ప్రచురింపబడింది.

  32. 1115

    మనుషులు మారాలి ఎపిసోడ్ - 10 | Manushulu Marali Episode 10 | Telugu Web Series | Yasoda Pulugurtha | manatelugukathalu.com

    'Manushulu' Marali Episode 9'  - New Telugu Web Series Written By Yasoda Pulugurtha Published In manatelugukathalu.com On 19/12/2023 'మనుషులు మారాలి ఎపిసోడ్ - 9' తెలుగు ధారావాహిక  (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)  రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ ఈ వయస్సులో చాలామంది ఆనందంగా తమ పిల్లలతో గడుపుతారు. మాకు ఆ అదృష్టం లేదు సరోజిని గారూ. ఒక్కడే కొడుకు మాకు. కోడలు వస్తుంది కదా, ప్రేమగా అభిమానంగా ఒక కూతురిలా చూసుకోవాలని ఉవ్విళ్లూరాను. నేను ఎంత ఆరాటపడినా ఆ అమ్మాయి మాకు దగ్గరవలేదు.  యాత్ర ముగిసిన తరువాత తిరిగి ఇంటికి రావాలని లేదు. కాశీలోనే ఉండిపోయి ఆ కాశీవిశ్వనాధుని సేవ చేసుకుంటూ ఆయన సన్నిధిలోనే తమ తనువులు చాలించాలని ఉందంటూ చెప్పేసరికి సరోజిని కళ్లు అశ్రుపూరితలైనాయి.  పోనీ వృధ్దాశ్రమానికి వెళ్లిపోతామురా అబ్బాయి అంటుంటే మా అబ్బాయి బాధపడుతున్నాడు. వాడి ముఖం చూసే మేము ఎక్కడకీ కదలలేక పోతున్నాం.  Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/9w2cndbIJJA

  33. 1114

    మనుషులు మారాలి ఎపిసోడ్ - 9 | Manushulu Marali Episode 9 | Telugu Web Series | Yasoda Pulugurtha | manatelugukathalu.com

    'Manushulu' Marali Episode 9'  - New Telugu Web Series Written By Yasoda Pulugurtha Published In manatelugukathalu.com On 15/12/2023 'మనుషులు మారాలి ఎపిసోడ్ - 9' తెలుగు ధారావాహిక  (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)  రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ సుప్రజ సరళ కు మంచి పట్టుచీర, రాఘవ్ కు పేంట్, షర్టూ, అలాగే పిల్లలకు, రాఘవ్ తల్లికి చీర కొని తెచ్చింది. సరళకు బొట్టు పెట్టి తాంబూలం పట్టు చీర చేతిలో పెట్టి సరళకూ రాఘవ్ కూ నమస్కరించింది. సుప్రజను ఆప్యాయంగా కౌగలించుకుంది సరళ.  “సుప్రజా, నిన్ను చూసి చాలా నేర్చుకున్నాను. నాలో మార్పుకి పరోక్షంగా నీవే కారణం. ఉద్యోగస్తురాలివైనా ఏమాత్రం గర్వం లేకుండా ఎంతో ఓర్పుగా సంసారం చక్కదిద్దుకునే తీరు నన్ను ముగ్ధురాలిని చేసింది. నిన్ను ఎన్నో మాటలు అనేదాన్ని. ఏనాడూ నన్ను పల్లెత్తు మాట అనేదానివి కాదు. భర్తను వదిలేసి పిల్లలతో పుట్టింట్లో ఉన్నా ఎంతో గౌరవంగా చూసుకున్నావు. నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు సుప్రజా.. నా కంటే చిన్నదానివైనా సంస్కారంలో నేను అందుకోలేనంత ఎత్తులో ఉన్నావు. నీవూ, మోహన్ హాయిగా సంతోషంగా ఉండాలి ఎప్పటికీ”.  “వదినా! కుటుంబాలలో సమస్యలు రావడం సహజం. మనిషి అన్న తరవాత రాగద్వేషాలు ఉండకుండా ఉండవు. మీలో ఒక మంచి మార్పు రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అది ఎవరివలన వచ్చిందోనని కాదు. నన్ను మీరు అంతలా ఎత్తేయనవసరం లేదు. నేనూ సాధారణమైన స్త్రీనే.  మీరు ఇలా హాయిగా ఆనందంగా మా రాఘవ్ అన్నయ్యతో కలసి కాపురం చేసుకోవడం కంటే కావలసిఉంది ఏముంది?”  Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/8sf-9v26OB4

  34. 1113

    మనుషులు మారాలి ఎపిసోడ్ - 8 | Manushulu Marali Episode 8 | Telugu Web Series | Yasoda Pulugurtha | manatelugukathalu.com

    'Manushulu' Marali Episode 8'  - New Telugu Web Series Written By Yasoda Pulugurtha Published In manatelugukathalu.com On 11/12/2023 'మనుషులు మారాలి ఎపిసోడ్ - 8' తెలుగు ధారావాహిక  (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)  రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ ఆ రోజు సుప్రజ ఆఫీస్ లో పని ఎక్కువ ఉన్న మూలాన సాయంత్రం ఇంటికొచ్చేసరికి బాగా లేట్ అయింది. సుప్రజ ను చూడగానే అత్తగారు “వచ్చావా సుప్రజా, తల పగిలిపోతోందమ్మా, కాస్త కాఫీ పెట్టి ఇస్తావా” అనే సరికి తెల్లబోయి చూసింది. మరో మాట మాట్లాడకుండా అత్తగారికి వేడి వేడి కాఫీ తో బాటు రెండు బిస్కట్లు కూడా ఇచ్చింది. అసలు కే సుగర్ పేషెంట్, నీరసంగా ఉన్న మూలాన గబ గబా బిస్కట్లు తిని కాఫీ తాగింది.  “ఆ రాక్షసి..” అంటూ అటూ ఇటూ చూస్తూ, “కాస్త కాఫీ పెట్టివ్వవే సరళా అంటే ‘ఇవాళ కాఫీ అంటావు, రేపు వంట చేయమంటావు. ఇంక నీ కోడలు మొత్తం పని నామీద అంటగట్టేసి టింగురంగ మంటూ ఆఫీసుకి వెళ్లిపోతుంది. వచ్చాక తన చేతే పెట్టించుకో’మంటూ పక్క వాళ్లింటికి పెత్తనానికి వెళ్లిపోయింది. చిన్న పిల్లవు, ఇంటి పనంతా చేసుకుంటూ అన్నీరెడీ చేసి ఆఫీసుకు వెళ్లి వస్తున్నావు. నిన్ను చూసైనా దానికి బుధ్దివస్తుందేమో అనుకుంటే ఆ ఆశ కూడా పోతోంది. భర్తతో హాయిగా సంసారం చేసుకోకుండా ఇదేమైనా బాగుందా సుప్రజా? నేను ఏదైనా గట్టిగా కోప్పడితే ఏ అఘాయిత్యం చేసుకుంటుందోనన్న భయం ఒకటి”.  “పోనీలెండి అత్తయ్యా, మీరేమీ అనద్దు. ఏదో ఒకనాటికి సరళ వదినలో మార్పు వస్తుంది లెండి. మీరు దిగులు పడితే బి. పి, సుగర్ ఎక్కువ అవుతుంది. అసలుకే గుండె వీక్ గా ఉందని సంతోషంగా ఉండమని డాక్టర్ చెప్పలేదా? వంట చేసేస్తాను, లేట్ అయిం”దంటూ చీర మార్చుకోడానికి తన గదిలోకి వెళ్లిపోయింది సుప్రజ.  Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/ItLc_EInCLM

  35. 1112

    మనుషులు మారాలి ఎపిసోడ్ - 7 | Manushulu Marali Episode 7 | Telugu Web Series | Yasoda Pulugurtha | manatelugukathalu.com

    'Manushulu' Marali Episode 7' - New Telugu Web Series Written By Yasoda Pulugurtha Published In manatelugukathalu.com On 05/12/2023 'మనుషులు మారాలి ఎపిసోడ్ - 7' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ ఇవి రహస్యంగా విన్న మాటలు కావురా. నీ మాటలు నాకూ మీ అమ్మకూ కూడా వినపడ్డాయి. కొనుక్కోండి, ఎన్నైనా కొనుక్కోవచ్చు. కానీ శైలూ కి ఒక ఏభై వేల రూపాయలు సర్దుబాటు చేయమంటే లేవన్నావు చూడు, ఆ మాటకి బాధ వేసింది. అదేమీ ఉరికే అడగలేదు నిన్ను. నీకు వెంటనే పంపిస్తానని మరీ మరీ నీకు చెప్పమంది. నీవు సంవత్సరం క్రితం ఫ్లాట్ కొనుక్కుంటున్నానని దానితో చెప్పినపుడు అది నీవు అడక్కుండానే రెండు లక్షలు పంపిందన్న విషయాన్ని మరిచిపోయావా?” “నేను శైలూ కి ఆ డబ్బు తరువాత ఇచ్చేయలేదా? నాకేమైనా బహుమతిగా ఇచ్చిందా ఏమిటి?” “ఓరి ఇడియట్, ఆడపిల్ల నుండి నీవు ఆశించావేమోగానీ అది ఎప్పుడూ నీ నుండి ఏమీ ఆశించలేదు. పైపెచ్చు అది దుబాయ్ నుండి వస్తూ నీకూ నీ భార్యకూ ఎన్నో విలువైన వస్తువులు తెచ్చి ఇచ్చింది. ఇప్పుడు బాగా అర్ధమైందిరా నీ కుత్సితపు బుధ్ది. నీ లాంటి కొడుకుని కన్నందుకు నేనూ మీ అమ్మా సిగ్గుపడాలి. నీవు మా మీద ప్రేమతో నీ దగ్గరకు పిలిపించుకుంటున్నావని అనుకున్నామే కానీ మీ అమ్మ ఒక ఆయాగా, నేనొక నౌకర్ గా పనికి వస్తామవ్న దురాశతో తీసుకెడుతున్నావని అనుకోలేదు. నిజంగా కన్న తల్లితండ్రులమన్న ప్రేమ ఉంటే నీవు ఆదరణగా మమ్మలని చూసి ఉంటే నీ ఇంట్లో మేము చాకిరీ చేస్తున్నామనే భావన వచ్చి ఉండేది కాదు. శేఖర్ పిల్లలనూ పెంచాం. కానీ మీ అన్నయ్య గానీ వదిన గానీ ఏనాడూ మమ్మలని నిర్లక్యం చేయలేదు. ఎంతో గౌరవంగా చూసుకున్నారు”. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/Oy4epDU6qos

  36. 1111

    మనుషులు మారాలి ఎపిసోడ్ - 6 | Manushulu Marali Episode 6 | Telugu Web Series | Yasoda Pulugurtha | manatelugukathalu.com

    'Manushulu' Marali Episode 6' - New Telugu Web Series Written By Yasoda Pulugurtha Published In manatelugukathalu.com On 25/11/2023 'మనుషులు మారాలి ఎపిసోడ్ - 6' తెలుగు ధారావాహిక రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ ప్రసూనాంబ, ప్రసాదరావులకు రెండో కొడుకు రమేశ్ ఇంటికి వచ్చిన కొన్ని రోజుల వరకు ఆనందంగానే గడిచిపోయింది. ప్రీతి, రమేశ్ వాళ్ళిద్దరినీ నెత్తిమీద పెట్టుకుని మరీ చూసారు. ప్రతీనెల అమ్మా నాన్నగారి మందులకు, ఖర్చులకు పదిహేను వేలు పంపమని రమేశ్ అడిగితే శేఖర్ సరే పంపుతానన్నాడు. ప్రీతి పొద్దుటే లేచి ఆఫీస్ కు వెళ్లిపోతోంది. పిల్లవాడిని చూసుకోవడం, ఇంట్లో వంటపని, మొత్తం పని అంతా ప్రసూనాంబ మీద పడింది. ఆవిడకు పెద్ద కోడలు తమింటికి వచ్చినప్పటి నుండి పని అంతా మాధవే చేస్తున్న మూలాన బొత్తిగా పని అలవాటు పోయింది. ప్రొద్దుట లేవగానే చేతికి వేడి వేడి కాఫీ అందించేది మాధవి. చక చకా టిఫిన్ తయారు చేసి డైనింగ్ టేబిల్ పెట్టేసేది. తరువాత స్నానం చేసి వంట పూర్తిచేసి పిల్లలను తయారు చేసేది స్కూళ్లకి. తాను టిఫిన్ తిని లంచ్ బాక్స్ సర్దుకుని అత్తగారిని మామగారిని కూడా సమయానికి టిఫిన్, భోజనం చేయమని ఒకటికి రెండుసార్లు చెప్పి ఆఫీస్ కు బయలు దేరేది. ఇక్కడ అలా కాదు, ప్రీతి ఆలస్యంగా లేవడమే కాదు, ఒక రోజు అత్తగారితో చెప్పేసింది కూడా. నేను ప్రొద్దుటే లేవలేను. బాబు రాత్రిళ్లు అస్తమానూ లేస్తాడు కాబట్టి. టిఫిన్, వంట మీరే చూసుకోండంటూ. ఏనాడూ కాఫీ తాగారా అన్న మాటగానీ, వేళకు భోజనం చేస్తున్నావా అని అడిగే దిక్కులేదు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

  37. 1110

    కొత్త కెరటం! ఎపిసోడ్ - 20 | Kottha Keratam Episode 20 | Telugu Web Series | Dinavahi Sathyavathi | manatelugukathalu.com

    'Kotha Keratam Episode 20' - New Telugu Web Series Written By Dinavahi Sathyavathi Published In manatelugukathalu.com On 26/11/2023 'కొత్త కెరటం! ఎపిసోడ్ - 20' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: దినవహి సత్యవతి కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ “సరదాకి అడిగాను తాతయ్యా. అంతే! అందుకోసం మీరు ఇంత శ్రమ పడతారని తెలిస్తే అసలు అడిగేవాడినే కాదు. అయినా ఇప్పటివరకూ ఎంతో ఇచ్చారు ఇకపై నేనే మీ అందరికీ అన్నీ ఇవ్వాలి” కవరులోంచి కాగితాలు తీసి చూసాడు...అవి అచ్యుతాపురంలో కట్టించిన జానకీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని భార్గవ పేరు మీద వ్రాయించిన గిఫ్ట్ డీడ్ తాలూకు లీగల్ డాక్యుమెంట్స్, ఆస్పత్రి ప్లాను వగైరా వివరాలతో కూడిన మరి కొన్ని కాగితాలు. “వావ్! నిజంగానా తాతగారూ ఆస్పత్రి కట్టించేసారా! ఓ! ఆస్పత్రికి నాన్నమ్మ పేరు పెట్టారే! గ్రేట్. మంచి పేరు మంచి పనీ కూడా తాతయ్యా. అయితే నాకు మాట మాత్రమైనా చెప్పనే లేదు. అమ్మ దొంగలూ అందరూ కలిసి సీక్రెట్ గా ఉంచారన్నమాట సర్ప్రైజ్ చేద్దామని. కానీ...” సందేహంగా ఆగిపోయిన భార్గవ వైపు ఏం చెప్తాడోనని భయంగా చూసారు మువ్వురూ! “ఇప్పుడు సందర్భం వచ్చింది కనుక మీకో మాట చెప్పాలి అదీ అదేంటంటే నేనీ ఆస్పత్రి చూసుకోలేను” “ఏం ఎందుకనీ?” ఉరిమినట్లే అడిగారు రాజేంద్ర, కళ్యాణి. రామయ్య గుండె గుభేలంది ‘కొంపదీసి వీడు తన ఆలోచనలు మార్చుకున్నాడా ఏమిటీ?’ అనుకున్నారు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/Le7PQWqeHxo

  38. 1109

    కొత్త కెరటం! ఎపిసోడ్ - 19 | Kottha Keratam Episode 19 | Telugu Web Series | Dinavahi Sathyavathi | manatelugukathalu.com

    'Kotha Keratam Episode 19' - New Telugu Web Series Written By Dinavahi Sathyavathi Published In manatelugukathalu.com On 19/11/2023 'కొత్త కెరటం! ఎపిసోడ్ - 19' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: దినవహి సత్యవతి కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ “అవును” అంది కళ్యాణి ఓ ప్రక్క ఎవరై ఉంటుందా ఆ అమ్మాయి అని ఆలోచిస్తూనే. “అబ్బో మీ అందరివీ చాలా అభ్యుదయ భావాలేనే?” మెచ్చుకోలుగా అన్నాడు. రాకరాక వచ్చారు భోజనం చేసి వెళితేగానీ వల్లకాదని అనడంతో భోజనానంతరం మరి కాసేపు కబుర్లతో కాలక్షేపం చేసి వెళ్ళిపోయారు మహేష్ దంపతులు. ఆ సాయంత్రం కాఫీల వద్ద “అబ్బాయ్! మరికొన్ని రోజుల్లో భార్గవ రాబోతున్నాడు. నీ మిత్రుడు అన్నట్లు ఆ అమ్మాయి గురించిన విషయం నిజమైతే వాడే చెప్తాడు. అంతే కానీ వచ్చీ రాగానే వాడ్ని లేనిపోని ప్రశ్నలతో ఇబ్బంది పెట్టకండి. ”“అవును మామయ్యా నేనూ అదే అనుకుంటున్నాను” “నేనూను” రాజేంద్ర కూడా వత్తాసు పలికాక ఆ సంభాషణ అంతటితో ముగిసింది. సెలవలివ్వగానే తదుపరి ఫ్లైట్ పట్టుకుని ఇంట్లో వాలాడు భార్గవ. రెండు రోజులు తృప్తిగా కంటినిండా నిద్రపోయాక మనుషుల్లో పడ్డాడు. మూడోరోజు ఫలహారాలవద్ద కబుర్లలో “మీకందరికీ ఒక విషయం చెప్పాలి?” ఉపోద్ఘాతంగా అన్నాడు. అప్పటిదాకా ఉగ్గబట్టుకున్న కళ్యాణి, తల్లి సహజమైన ఆత్రుతతో “నువ్వేం చెప్పబోతున్నావో మాకు తెలుసు. షాపింగ్ కాంప్లెక్స్ లో అమ్మాయి గురించేనా?” గబుక్కున అనేసి వెంటనే నాలుక కరుచుకుంది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/Bt_jnvrSoSQ

  39. 1108

    మనుషులు మారాలి ఎపిసోడ్ - 5 | Manushulu Marali Episode 5 | Telugu Web Series | Yasoda Pulugurtha | manatelugukathalu.com

    'Manushulu' Marali Episode 5' - New Telugu Web Series Written By Yasoda Pulugurtha Published In manatelugukathalu.com On 19/11/2023 'మనుషులు మారాలి ఎపిసోడ్ - 5' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)  రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ “మరి నీవే మాధవీ”? “ఏముందే సుప్రజా చెప్పడానికి. నాలుగు రోజుల క్రితమే మా మరిది ఫోన్ చేసాడుట మా వారికి. ‘వాళ్ల జీతాల్లో సగం భాగం అంతా ఇంటి లోన్ కే పోతోంది. అమ్మా నాన్న మందులకి ఖర్చులకు ప్రతీ నెల డబ్బు పంపించు అన్నయ్యా’ అంటూ. ఈ సారి ఒక పదివేలు ట్రాన్స్ ఫర్ చేయమన్నాడు. తల్లీ తండ్రినీ తను చూసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు మరి వాళ్లను తన దగ్గరే ఉంచుకుంటానని తీసుకు వెళ్లడం ఎందుకో నాకూ మా వారికి అర్ధం కాలేదు. మా అత్తగారూ మామగారూ మా దగ్గర ఉన్నప్పుడు వారిరువురి బాధ్యత మాదే అనుకుంటూ ఎంతో ప్రేమగా గౌరవంగా చూసుకున్నాం. మా మరిది ఎప్పుడో ఒకసారి వచ్చేవాడు తల్లీ తండ్రిని చూడడానికి. ఏనాడూ కనీసం పండ్లు కూడా తెచ్చేవాడు కాదు. ఒక్క వంద రూపాయలు కూడా ఉంచుకోండంటూ చేతిలో పెట్టేవాడు కాదు. ఇప్పుడు వాళ్ల పోషణకు మా నుండి డబ్బు అడగడం ఏమంత బాగుందే? భార్యా భర్తలిరువురూ బాగానే సంపాదించుకుంటున్నారు. కన్న తల్లీ తండ్రిని ఆ మాత్రం చూసుకోలేని దుస్థితి కాదు. మేమేదో లక్షలు సంపాందించుకుంటూ వెనకేసుకుంటున్నామన్న దుగ్ధ కూడా మా మరిది మాటల్లో ప్రస్ఫుటమౌతుంది. ఇంటికి పెద్దవాడిని, ఇవ్వలేనంటే ఏం బాగుంటుందంటారు మా వారు. ముందు మా మరిదికి పంపించాకా తరువాత మిగిలిన డబ్బుతో పిల్లలకు బట్టలు కొనాలని అనుకుంటున్నాం”. “మన మధ్య తరగతి జీవితాలు అంతేనే మాధవీ. ఒకరి కష్టాలు మరొకరం పంచుకోడానికే భగవంతుడు మన ముగ్గురినీ కలిపాడనుకుంటూ ఉంటాను ఎప్పుడూ. మీకు ఏ విషయంలో సహాయం కావలసి వచ్చినా నేను ఉన్నానే”. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/GKoClDyaA6A

  40. 1107

    తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 17 | Tholagina Nili Nidalu episode 17 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com

    'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 17' - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 17/11/2023 'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 17' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ ఒక కాబినెట్‌ మినిష్టర్‌ కొడుకుని ఆ విధంగా అదుపులోకి తీసుకుని రావడం ఏం బాగాలేదు, యాదిరెడ్డీ!.. రేపు సి. యం. ముందు, హోంమంత్రి ముందు నేను ఏం సమాధానం చెప్పాలి? ఈ సంగతి ప్రతిపక్షాలకు తెలిస్తే మంత్రిని రాజీనామా చెయ్యమని ఆందోళన చేస్తారు. ఇది పెద్ద సంచలనం అవుతుంది. ఆ మాత్రము నీకు తెలి యదా? అసలు ఒక అనామక కేసు విషయం లో నువ్వు ఇంత అత్యుత్సాహం ప్రదర్శించడం ఏమిటీ? ఆమె చనిపోవడం వల్ల ఒక కుటుంబం కానీ, ఎవరి కైనా నష్టం కలిగిందా ? ఇది మంచి పద్దతి కాదు. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. రేపు మీడియా ముందు దిలీప్‌ ను తీసుకు రాకు. మనం మంత్రి గారిని గౌరవించాలి. అక్కర లేని కేసులో ఉత్సాహం ప్రదర్శించవా, ప్రమోషన్‌ ఉండదు.. నీ కెరీర్‌ కు కూడా.... దిలీప్‌ ను వదిలెయ్‌”. నిజానికి ఇటువంటి బోధనలు వినవలసి వస్తుందని ముందే ఊహించుకున్నాడు. దిలీప్‌ ను పట్టుకున్న తరువాతనే ఐజీ లో కదలిక వచ్చింది. ఇప్పుడేం చెయ్యాలి.. దిలీప్‌ ను వదిలివెయ్యడమా ! లేక ఐజీ మాటను లెక్కచెయ్యక పోవడమా? ఐజీ మాట లెక్క చేయలేదని ట్రాన్స్‌పర్‌ చేస్తారా.. అది అసాధ్యం.. కేసు ఫైనల్‌ స్టేజిలో ఉంది. ఎలా చేస్తారు. చేస్తే ఐజీని కూడా కోర్టుకు లాగాలనుకున్నాడు. తలచుకుంటే లాయర్‌ రవిప్రకాశ్‌ ఇప్పటి కే కేసును బలంగా తయారు చేసుకున్నాడు. మొత్తం కూపీలన్నీ లాగాడు. మనోరమ బాడీకి పోస్ట్‌మార్టమ్ చేయించాడు. ఒంటి మీదున్న వేలిముద్రలతో సరి చూపించాడు. చంద్రం, యాదయ్య, మల్లమ్మ చెప్పిన సాక్ష్యాలు, మనోరమ శవంని పూడ్చిన జాగా యొక్క ఫోటోలు మొత్తం కోర్టులో సాక్ష్యాలుగా చూప బడ్డాయి. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/X_OaOJ2iW4E

  41. 1106

    రమణి రమణల కళ్యాణము | Ramani Ramanala Kalyanamu | Mana Telugu Kathalu - Telugu Stories

    రమణి రమణల కళ్యాణము | Ramani Ramanala Kalyanamu is a Telugu short story, originally published in manatelugukathalu.com రమణి రమణల కళ్యాణము, Short Story by : దాసు రాధిక కథ క్లుప్తంగా : విధి ఎవర్ని కలుపుతుందో , ఎవర్ని విడదీస్తుందో ఎవరికీ తెలియదు.  ఒక్కోసారి కథలోని పాత్రలను పోలిన వ్యక్తులు నిజ జీవితంలో తారస పడతారు. సహజ రచయిత్రి దాసు రాధికగారు అలవోకగా, అద్భుతంగా రాసిన కథ 'రమణి రమణల కళ్యాణము'   మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడింది.

  42. 1105

    లోకం తీరు.. పాపా ?? బాబా?? | Lokam Teeru….Paapaa??Baabaa?? | Mana Telugu Kathalu - Telugu Stories

    లోకం తీరు.. పాపా ?? బాబా?? | Lokam Teeru….Paapaa??Baabaa?? is a Telugu short story, originally published in manatelugukathalu.com లోకం తీరు.. పాపా ?? బాబా??, Short Story by: N. ధనలక్ష్మి కథ క్లుప్తంగా : అభినయ, సంజయ్ ల పెళ్లయి ఏడాదే అయింది. అప్పుడే ఇంకా పిల్లలు పుట్టలేదేమని అమ్మలక్కల ఆరాలు. ప్రెగ్నెంట్ అయ్యాక పాపా...బాబా అనే ప్రశ్నలు...లోకులు... పలుగాకులు అని ఊరికే అనలేదు. 'ఎవరో ఏదో అనుకుంటారని బాధ పడకుండా ధైర్యంగా ఉండాలి.' అని చెప్పే కథ 'లోకం తీరు.. పాపా ?? బాబా??'  ఈ కథను ఈ తరం   రచయిత్రి N. ధనలక్ష్మి గారు రచించారు.

  43. 1104

    వినాయక రావు వివాహం |Vinayakarao Vivaham | Mana Telugu Kathalu - Telugu Stories

    వినాయక రావు వివాహం |Vinayakarao Vivaham is a Telugu short story, originally published in manatelugukathalu.com వినాయక రావు వివాహం రచన : సీత మండలీక తన ఆకారం మీద తనకే నమ్మకం లేదు గణేష్ అనబడే వినాయక రావుకు. కానీ తెలివైన అమ్మాయిలు, అబ్బాయిల  ఆకారానికంటే వ్యక్తిత్వానికి ఎక్కువ విలువ ఇస్తారని అందాల అరవింద అతన్ని కోరి చేసుకున్నాక అతనికి తెలిసింది.      మండలీక సీత గారు రచించిన ఈ చక్కటి హాస్య కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.  

  44. 1103

    కొత్త కెరటం! ఎపిసోడ్ - 18 | Kottha Keratam Episode 18 | Telugu Web Series | Dinavahi Sathyavathi | manatelugukathalu.com

    'Kotha Keratam Episode 18' - New Telugu Web Series Written By Dinavahi Sathyavathi Published In manatelugukathalu.com On 14/11/2023 'కొత్త కెరటం! ఎపిసోడ్ - 18' తెలుగు ధారావాహిక రచన: దినవహి సత్యవతి కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ తొంభై ఎనిమిది శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు భార్గవ. డాక్టర్ చదువుకోసం లండన్ వెళ్ళబోయే ముందర తన పద్ధెనిమిదవ పుట్టినరోజు ఫ్రెండ్స్ తో కలిసి, ఇంట్లోనే ఘనంగా జరుపుకోవాలని నిశ్చయించుకున్నాడు భార్గవ. పార్టీ ఏర్పాట్లన్నీ చకచకా జరుగుతున్నాయి. ఇంకో రెండ్రోజుల్లో పుట్టినరోజు. ఉదయం ఫలహారాలయ్యాక అందరూ ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉండగా ఉదయం సుమారు పది గంటలకి ఫోన్ మ్రోగింది. హాల్లోనే కూర్చున్న భార్గవ ఫోన్ ఎత్తి “హలో నమస్తే. ఎవరు కావాలండీ?” అన్నాడు. “రాజేంద్రగారితో మాట్లాడాలి. పిలుస్తారా?” “ఇప్పుడే బయటకి వెళ్ళారండీ. రాగానే చెప్తాను. ఇంతకీ మీరెవరూ?” “నువ్వు భార్గవ కదూ” “అవునండీ నా పేరు మీకెలా తెలుసు?” ఆశ్చర్యపోయాడు. “నేను నీకు తెలియదు కానీ నువ్వు నాకు బాగా తెలుసు బాబూ. నా పేరు సూరజ్ ” “ఓ అలాగా! ఇదిగో నాన్న వచ్చారు ఇస్తానుండండి” అని “ఎవరో సూరజ్ గారట” చెప్పాడు రిసీవర్ అందిస్తూ. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/qbhBPNgjWrE

  45. 1102

    విజ్ఞత |Vijnatha | Mana Telugu Kathalu - Telugu Stories

    విజ్ఞత |Vijnatha is a Telugu short story, originally published in manatelugukathalu.com విజ్ఞత రచన :  ఏ.అన్నపూర్ణ. వయసు ప్రభావంతో తప్పు దారిలో నడవబోయింది రజని. కానీ ఆమె తల్లి రేవతి కూతుర్ని సరైన దారిలో నడిపించింది. ప్రఖ్యాత రచయిత్రి ఏ. అన్నపూర్ణ గారు రచించిన ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడింది. స్తుంది. 

  46. 1101

    చెప్పాలనుకున్నది చెప్పలేనప్పుడు… | Cheppalanukunnadi Cheppalenappudu | Mana Telugu Kathalu - Telugu Stories

    చెప్పాలనుకున్నది చెప్పలేనప్పుడు… | Cheppalanukunnadi Cheppalenappudu is a Telugu short story, originally published in manatelugukathalu.com బాల సుబ్రహ్మణ్యానికి సౌమ్య  అంటే  ఎంతో ఇష్టం. కానీ బయటికి చెప్పలేక పోయాడు. ఆమెకు దూరం అయ్యాడు. తిరిగి కాలం ఆ ఇద్దర్నీ ఎలా కలిపిందో ప్రముఖ సీనియర్ రచయిత పాండ్రంకి సుబ్రమణి గారి 'చెప్పాలనుకున్నది చెప్పలేనప్పుడు…' కథ వింటే తెలుస్తుంది. 

  47. 1100

    మనుషులు మారాలి ఎపిసోడ్ - 4 | Manushulu Marali Episode 4 | Telugu Web Series | Yasoda Pulugurtha | manatelugukathalu.com

    'Manushulu' Marali Episode 4' - New Telugu Web Series Written By Yasoda Pulugurtha Published In manatelugukathalu.com On 13/11/2023 'మనుషులు మారాలి ఎపిసోడ్ - 4' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ మాధవి మరిది రమేశ్ చాలా తెలివైనవాడు, లౌక్యం బాగా తెలుసున్నవాడు. “అన్నయ్య ఇంట్లో ఎన్నాళ్లు చాకిరీ చేస్తూ కూర్చుంటావమ్మా, ప్రీతి కూడా మరీ మరీ చెప్పి పంపించింది, అత్తయ్యగారిని మామయ్యగారిని మన దగ్గర పెట్టుకుందాం, వాళ్లకు ఏ కష్టమూ రాకుండా చూసుకుందామని చెపితే వచ్చాను. మీ బట్టలూ అవీ సర్దుకోండి. అన్నయ్యకూ వదినకూ నేను నచ్చ చెపుతా”నని వాళ్లతో చెప్పి అన్నగారితో మాట్లాడదామని హాల్ లోకి వచ్చాడు. “ఏరా రమేశ్, ప్రీతి, బాబు ఎలా ఉన్నా”రంటూ శేఖర్ తమ్ముడిని ఆప్యాయంగా పలకరించాడు. “బాగానే ఉన్నారన్నయ్యా. అమ్మా నాన్నగారిని నా దగ్గరకు తీసుకువెడదామని వచ్చాను. వాళ్లకి ఎన్నాళ్లు నా దగ్గర ఉండాలనిపిస్తే అన్నాళ్లూ ఉంటారు. పాపం ఇంతకాలం నీవు వదినా వాళ్లను బాధ్యతగా చూస్తూ వచ్చారు. నాకు కూడా వాళ్లను దగ్గర పెట్టుకుని చూసుకోవాలనిపిస్తుంది కదా”. “అదేమిటి రమేశ్? ఎందుకనిపించదు? అసలు నీవు ప్రీతీ, బాబూ మనం అందరం ఒకే చోట కలసి ఉందామని నీతో ఎన్నో సార్లు చెప్పాను. ప్రీతి ఆఫీస్ కు ఇక్కడ నుండి వెళ్లడం కష్టం అవుతుందనేసరికి అదీ నిజమే అనుకున్నాను. అమ్మా నాన్నగారు ఎక్కడ ఉంటేనేమి? నీవు ప్రీతి బాబుతో కలసి ఎప్పుడు చూడాలని పించినా ఇక్కడకు రావచ్చు ఉండచ్చు”. ఈ లోగా ప్రసూనాంబ అక్కడకు వచ్చి శేఖర్ వైపు చూస్తూ “కొన్నాళ్లు వెళ్లి రమేశ్ దహ్గర ఉంటామురా. వాడూ పాపం మా కోసం అల్లాడిపోతున్నాడు. ప్రీతి కూడా పదే పదే చెప్పి పంపించిందిట. మేము కొన్నాళ్లు రమేష్ దగ్గర ఉంటే పాపం మాధవి కి కూడా రెస్ట్ గా ఉంటుంది కదా”. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/enGXa_xfxSY

  48. 1099

    తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 16 | Tholagina Nili Nidalu episode 16 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com

    'Tholagina Neeli Needalu Episode 16' - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 12/11/2023 'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 16' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ తనను చూడడానికి వచ్చిన వెన్నెలను చూసి ఆశ్చర్యపోయాడు చంద్రం. ఇలా ఆమె వస్తుందని అతను కలలో కూడా ఊహింలేదు. పైగా ఈ పరిస్థితులలో ఆమె పోలీస్‌ స్టేషన్‌ రావడం అతడు నమ్మలేక పోయాడు. ఆమె కేసి నేరుగా చూడలేకపోయాడు. చూసే ధైర్యం అతడికి లేకపోయింది. ఇద్దరూ ఎదురెగురుగా నిలుచున్నారు. వాళ్ళకి కాస్త ఎడంగా యమున నిలుచుంది. ముందు ఎవరు మాట్లాడాలి? ఏమని మాట్లాడాలి ? ఇద్దరి లోనూ సంధిగ్ధత.. కాసేపు.. వెన్నెలకి సంజ్ఞ చేసింది యమున. మాట్లాడమని. అప్పటికే వెన్నెల కళ్ళు బాగా చెమర్చాయి. భర్తని అలా చూసే సరికి. బాగా గడ్డం పెరిగింది. మనిషి బాగా కృంగి, కృషించిపోయినట్లున్నాడు. ముఖంలో కళ తప్పింది. " సారీ. ".. అంది వెన్నెల. చంద్రం తలూపాడు. ఎందుకు ఊపాడో అతడికి తెలీదు. ఆమె అన్న మాటకి చంద్రం తలూపాడు. అసలు తల ఎందుకు ఊపాడో అతనికి తెలీదు. వెన్నెల అన్న మాటకి ప్రతిస్పందనగా తల ఊపాడు అంతే. ఎప్పుడో జమానా లో భానుమతి పాడిన పాట " ఆలుమగలు విడిపోయినంతనే, అనురాగాలే మారునా, అనురాగాలే మారునా----- అన్నట్లుగా ఉంది వాళ్ళ పరి స్థితి. సందర్భానికి తగ్గట్లుగా ఉంది కదా! “సారీ నువ్వు కాదు తెప్పాల్సింది.. నేను.. నేను.. చెప్పాలి” అన్నాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/0oGphDOd5eI

  49. 1098

    కొత్త కెరటం! ఎపిసోడ్ - 17 | Kottha Keratam Episode 17 | Telugu Web Series | Dinavahi Sathyavathi | manatelugukathalu.com

    'Kotha Keratam Episode 17' - New Telugu Web Series Written By Dinavahi Sathyavathi Published In manatelugukathalu.com On 09/11/2023 'కొత్త కెరటం! ఎపిసోడ్ - 17' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)  రచన: దినవహి సత్యవతి కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ “భార్గవని చిన్నప్పటినుంచీ చూస్తున్నారు కదా! వాడు ఏకసంథాగ్రాహి. మీరన్నట్లు మార్కులు కొలబద్దలే అయినా కచ్చితమైన ప్రామాణికాలు మాత్రం కాదు. మార్కులతో పాటు విషయ పరిజ్ఞానమూ ముఖ్యమే. అది భార్గవకి కావల్సినంత ఉంది. కాస్త అర్థం చేసుకుని వాడి మానాన వాడ్ని వదిలేస్తే చక్కగా చదువుకుంటాడు. అందుకు మనం సంపూర్ణ సహకారం అందిస్తే చాలు. ఇదే నేను మీకు చెప్పదలుచుకున్నది” “సారీ మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాము” ఇరువురూ ముక్తకంఠంతో పలికారు. “మనలో మనకి మన్నింపులేమిటర్రా. మనకి కావల్సింది భార్గవ అభివృద్ది. అందుకు పరస్పరం సహకరించుకుంటూ ముందుకు వెళ్దాము. అదిగో మాటల్లోనే భార్గవ వచ్చేసాడు. ఆకలేస్తోంది భోజనానికి ఏర్పాట్లు చెయ్యమ్మా” కోడలికి చెప్పి లేచారు. “ఇదిగో అయిదు నిమిషాల్లో వడ్డించేస్తాను మామయ్యా” వంటింట్లోకి వెళ్ళింది కళ్యాణి. “హాయ్ భార్గవా స్పెషల్ క్లాస్ ఎలా జరిగిందిరా?” చేతిలో స్కూల్ బ్యాగ్ అందుకుంటూ ఆప్యాయంగా అడిగిన తండ్రిని చూసి ఆశ్చర్యానందాలకి లోనయ్యాడు భార్గవ. తమ మధ్యన ఈ ప్రేమానురాగాలు కలకాలం ఇలాగే ఉండేలా ఆశీర్వదించమని మనసులోనే దైవాన్ని వేడుకున్నారు రామయ్య. &&& దగ్గరుండి మనవడిచేత పదవతరగతి పరీక్షలు దిగ్విజయంగా వ్రాయించి స్వగ్రామంలో పనులు చక్కబెట్టుకుందుకు అచ్యుతాపురం బయలుదేరారు. వెళ్ళేముందు మనవడిని తనతో రమ్మని అడిగారు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

  50. 1097

    మనుషులు మారాలి ఎపిసోడ్ - 3 | Manushulu Marali Episode 3 | Telugu Web Series | Yasoda Pulugurtha | manatelugukathalu.com

    'Manushulu' Marali Episode 3' - New Telugu Web Series Written By Yasoda Pulugurtha Published In manatelugukathalu.com On 07/11/2023 'మనుషులు మారాలి ఎపిసోడ్ - 3' తెలుగు ధారావాహిక రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ ఆ పరిస్తితిలో ఉన్న ఏ మగాడు మాత్రం ఏ నిర్ణయం తీసుకోగడు? కన్న తల్లిని ఎక్కడకు పంపేయగలడు? ఉన్న ఒక్క చెల్లెలు భర్తతో సింగ్ పూర్ లో ఉంది. అక్కకు ఆర్ధికపరంగా ఏలోటూ లేదు. బావగారు మంచి ఉద్యోగంలో ఉన్నారు. సొంత ఇల్లు. బాధ్యతలు లేవు. డభై అయిదేళ్లు దాటిన అత్తగారితో తగువులు పెట్టుకుంటుంది. భర్త ఏదో ఆలోచిస్తూ మౌనంగా బట్టలు మార్చుకుంటుంటే ఏమిటీ రోజులా లేరు, అదోలా ఉన్నారేంటంటూ సుప్రజ ప్రశ్నించింది. “మా అక్క గురించే సుప్రజా. సాయంత్రం బావగారిని కలిసాను. అక్క పోట్లాట పెట్టుకుని ఇక్కడకు వచ్చేసిందని చాలా బాధపడుతున్నాడు. మీ అమ్మగాని నేను గాని ఎవరో ఒకరే ఉండాలి మీతో. ఆలోచించుకోండంటూ వచ్చేసిందిట. ప్రతీసారీ బ్రతిమాలి నచ్చ చెప్పి ఇంటికి తీసుకువెళ్లడంతో నన్ను లెక్క చేయడంలేదు మీ అక్క. ఈసారి ఏదో నిర్ణయం తీసుకున్న తరువాతే మీ అక్కను కలుస్తానన్నాడు బావ”. “అవునండీ పాపం అన్నయ్యగారి తప్పేమీ లేదు”. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/HyBMjYhVgQg

Type above to search every episode's transcript for a word or phrase. Matches are scoped to this podcast.

Searching…

No matches for "" in this podcast's transcripts.

Showing of matches

No topics indexed yet for this podcast.

Loading reviews...

ABOUT THIS SHOW

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the worldమన తెలుగు కథలు - మంచి కథల సమాహారం

HOSTED BY

Mana Telugu Kathalu

CATEGORIES

URL copied to clipboard!