TALRadio Telugu

PODCAST · arts

TALRadio Telugu

This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope.TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio.Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond.Tune in for positivity, purpose, and the power of human stories.

  1. 853

    థైరాయిడ్ సమస్యా ? ఆయుర్వేద పరిష్కారాలు ఇవిగో... | ఆయుర్వేదం ఆరోగ్యం - 100

    Thyroid ఈ మధ్య కాలం లో అందరి నోట వినిపిస్తున్న సమస్య .. ఆయుర్వేదం తో ఈ సమస్య కి ఈజీ గా చెక్ పెట్టేయవచ్చు.ఇది మన శరీరంలోని హార్మోన్స్ బ్యాలెన్స్‌ను చూసుకునే ఒక ముఖ్యమైన గ్రంధి. మన ఎనర్జీ, నిద్ర, బరువు, జీర్ణక్రియ… ఇలా శరీరం సరిగ్గా పనిచేయడంలో దీని పాత్ర చాలా ఉంటుంది. అందుకే థైరాయిడ్‌లో చిన్న సమస్య వచ్చినా… అలసట, హెయిర్ ఫాల్, బరువు పెరగడం లేదా తగ్గడం, నిద్ర సరిగ్గా లేకపోవడం, ఒత్తిడి వంటి సమస్యలు కనిపించొచ్చు.మరి థైరాయిడ్ ఎందుకు వస్తుంది? మొదట్లో కనిపించే లక్షణాలు ఏంటి? ఇది వచ్చిన తర్వాత ఆహారం, జీవనశైలిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే ఆయుర్వేదం ద్వారా దీన్ని ఎలా కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు? వంటి ఎన్నో ముఖ్యమైన విషయాలను డా. అనుపమ ఉప్పులూరి గారు ఈ పాడ్కాస్ట్ లో చాలా క్లియర్‌గా వివరించారు.కాబట్టి… తప్పకుండా వినండి… అస్సలు మిస్ అవ్వకండి!Thyroid has become one of the most commonly discussed health issues these days. The good news is that it can be managed effectively with the help of Ayurveda.The thyroid is an important gland that helps maintain the body’s hormonal balance. It plays a key role in regulating energy levels, sleep, weight, digestion, and overall body functions. Even a small imbalance in thyroid function can lead to issues like fatigue, hair fall, sudden weight gain or loss, sleep disturbances, stress, and mood changes.But why does thyroid imbalance occur? What are the early symptoms? What lifestyle and dietary precautions should be taken after diagnosis? And how can Ayurveda help in naturally managing and controlling thyroid-related problems?In this podcast, Dr. Anupama Uppuluri explains all these important topics in a very simple and clear manner.So don’t miss it… listen to the full podcast now!Host: Renu SreeGuest: Dr. Anupama UppuluriDr. Anupama Contact Details:Mobile / WhatsApp: 9100052961#TALRadioTelugu #Thyroid #ThyroidAwareness #ThyroidHealth #AyurvedicTreatment #ThyroidCare #HealthPodcast #DrAnupamaUppuluri #HormoneBalance #HealthyLifestyle #ThyroidSymptoms #HairFall #WeightLoss #WeightGain #StressManagement #AyurvedicTips #NaturalHealing #Wellness #HealthTips #TeluguPodcast #ThyroidHealth #AyurvedaForThyroid #TALRadio #TouchALifeFoundation

  2. 852

    అమ్మ కోసం... మా మనసులో మాట! | Mother's day Special Show

    ‘అమ్మ’ ఈ మాట వినగానే మనం ఒక్కసారిగా చిన్నపిల్లాడిలా మారిపోతాం.. కదా!చిన్నప్పుడు తినిపించిన గోరు ముద్దలు…బాలేనప్పుడు నిద్రపోకుండా చూసుకున్న రాత్రులు…మన కోసం తన ఇష్టాలను మౌనంగా వదులుకున్న క్షణాలు…ఇలా.. అమ్మ ప్రేమలో ప్రతి జ్ఞాపకం ఎంతో మధురంగా ఉంటుంది.అందుకే ఈ Mother’s Day సందర్భంగా…మా అందరి అమ్మల గురించి, వాళ్ల ప్రేమ గురించి, వాళ్లు చేసిన చిన్న చిన్న త్యాగాల గురించి మీతో పంచుకునే ఒక ప్రత్యేకమైన రేడియో షోతో మీ ముందుకు వచ్చేసాం.ఈ కార్యక్రమంలో…కొన్ని మాటలు మిమ్మల్ని నవ్విస్తాయి…కొన్ని జ్ఞాపకాలు కళ్లలో నీళ్లు తెప్పిస్తాయి…ప్రతి మాట మీ హృదయాన్ని మాత్రం తప్పకుండా తాకుతుంది.ఎందుకంటే…అమ్మ గురించి వినడం అంటే… ప్రేమను మళ్లీ అనుభవించడం లాంటిది!When we hear the word “Mother”… we instantly become little kids again, right?The food she lovingly fed us…The sleepless nights she spent taking care of us when we were sick…The many things she silently sacrificed for our happiness…Every memory of a mother’s love is truly special.That’s why, this Mother’s Day, we are coming to you with a special radio show where we share beautiful memories about our mothers, their love, and the little sacrifices they made for us.In this program…Some moments will make you smile…Some memories may bring tears to your eyes…But every word will definitely touch your heart.Because listening about a mother… feels like experiencing love all over again!#TALRadioTelugu #MothersDay #Amma #MotherLove #MothersSacrifice #LoveYouMom #EmotionalMoments #HeartTouching #MotherAndChild #FamilyBond #IndianMothers #MothersCare #EmotionalStory #MothersDaySpecial #Inspiration #TALRadio #TouchALifeFoundation

  3. 851

    "వల్లాల" గ్రామం నేర్పిన పాఠాలే నా విజయానికి మెట్లు | మా ఊరు - 71

    “మా నాన్నంటే నాకు చాలా ఇష్టం…అందుకే మా ఇంట్లో అందరి పేర్లు ఆయన పేరు వచ్చేలా పెట్టుకున్నాం…’ అంటూ తన తండ్రి మీద ఉన్న ప్రేమను మనతో పంచుకున్నారు… అలాగే తన బాల్యం గడిచిన వల్లాల గ్రామం గురించి ఎన్నో జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు.ఇది ఈ వారం “మా ఊరు” ఎపిసోడ్‌లో జగన్ చిట్టిప్రోలు గారి కథ…ప్రస్తుతం సియాటెల్‌లో నివసిస్తూ… C2S Technologies అనే సంస్థకు CEOగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.తన కెరీర్ గురించి మాట్లాడుతూ… మొదట టీచర్ అవ్వాలన్న కల ఎలా సాఫ్ట్‌వేర్ రంగం వైపు మళ్లిందో చెప్పారు.అలాగే తనకు వచ్చిన మొదటి జీతం… ఆ క్షణంలో కలిగిన ఆనందం… అన్నీ మనతో పంచుకున్నారు.చిన్న ఊరు నుంచి ప్రారంభమై… ఈరోజు సియాటెల్ వరకు చేరిన ఆయన ప్రయాణం నిజంగా ఒక ఇన్స్పిరేషన్.ప్రతి ఒక్కరూ వినాల్సిన ఒక కథ ఇది…!“My father means a lot to me…That’s why everyone in our family has his name as part of theirs…”With these heartfelt words, Jagan Chittiprolu shared his love for his father and also spoke about many memories from his childhood in Vallala village.This week’s “Maa Ooru” episode brings the inspiring story of Jagan Chittiprolu, who is currently living in Seattle and working as the CEO of C2S Technologies.Talking about his career journey, he shared how his dream of becoming a teacher slowly turned into a career in the software industry. He also spoke about his first salary and the happiness and pride he felt in that moment.From a small village to reaching Seattle, his journey is truly inspiring.A story everyone should listen to!Guest: Jagan ChittiproluHost: Usha#TALRadioTelugu #MaaOoruEpisode #JaganChittiprolu #InspiringJourney #FromVillageToWorld #C2STechnologies 

  4. 850

    HIV చిన్నారుల కోసం Desire Society ప్రయాణం | Special Interview

    Desire society గత 22 ఏళ్లకు పైగా HIV పిల్లల ఆరోగ్యం, ఆహారం సంరక్షణ బాధ్యతలు తీసుకుని వారికి మంచి భవిష్యత్తు ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఎన్నో వేలమంది పిల్లల జీవితాలని ప్రభావం చేసిన వీరి ప్రయత్నం, అందులో ఎదురైన సవాళ్లు, పిల్లల జీవితాల్లో వచ్చిన మార్పు వంటివి మనతో పంచుకుంటున్నారు DESIRE Society ఫౌండర్ రవిబాబు గారు. తప్పకుండా వినండి! మిస్ అవ్వకండి!For the past 22 years, DESIRE Society has been working towards the health, nutrition, and care of children living with HIV, striving to give them a better future.In this inspiring conversation, Ravi Babu shares the journey of impacting thousands of children’s lives, the challenges faced along the way, and the positive changes brought into these children’s futures.Don’t miss this heartfelt and powerful episode. Tune in now!Guest: Ravi BabuHost: Kalyani#TALRadioTelugu #DESIRESociety #HIVAwareness #SocialResponsibility #ChildCare #SupportHIVChildren #NGOIndia #HealthAwareness #HopeForChildren #TALRadio #TouchALifeFoundation

  5. 849

    సుఖోమాజ్రీ మళ్ళీ ఎలా సుఖవంతంగా మారింది? | Super Girls Series - 4

    ఆ గ్రామ ప్రజలు నీటి కష్టాలను ఎలా దాటారో తెలుసా?హర్యానా రాష్ట్రంలోని సుఖోమాజ్రీ గ్రామంలో తీవ్రమైన నీటి కరువు ఉండేది. ఆ ఊర్లో అసలు చెట్లే ఉండేవి కాదు. దీంతో ప్రజలు చాలా కష్టాలు పడేవారు. కానీ, ఆ గ్రామ ప్రజలంతా ఒకదగ్గర కలిసి ఆ సమస్యకు ఒక చక్కటి పరిష్కారం కనుక్కున్నారు…!అసలు వాళ్ళు కనుక్కున్న పరిష్కారం ఏంటి? ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆ ఊరిని వాళ్ళు ఎలా కాపాడుకున్నారు? మీకు కూడా తెలుసుకోవాలని ఉంది కదా! అయితే ఇంకెందుకు ఆలస్యం? పూర్తి కథ వినండి!పిల్లల కోసం రేడియో కథలు!Katha.org తో కలిసి TALRadio అందిస్తున్న “SuperGirls Series” లో నాలుగో కథ ఇది! ప్రతి శుక్రవారం ఉదయం 7:30 నిమిషాలకు… తిరిగి సాయంత్రం 7:30 నిమిషాలకు… మన TALRadioలో…!మీరూ వినండి… మీ పిల్లలకూ వినిపించండి!Do you know how the people of that village overcame their water problem?In Sukhomajri village in Haryana, there was a severe water shortage. The village had almost no trees, and people were struggling a lot because of it.But the villagers came together and found a smart solution to this problem!What was their solution? What happened after that? How did they save their village?You must be curious to know, right? Then don’t wait—listen to the full story!Children’s radio stories!This is the fourth story in the “SuperGirls Series” presented by TALRadio in collaboration with Katha.org.Every Friday at 7:30 AM and again at 7:30 PM on TALRadio!Listen and share it with your children too.#TALRadioTelugu #TeluguStories #RadioStories #StoryForKids #MoralStories #TeluguKids #StoryTime #SukhomajriVillage #EnvironmentalStory #WaterCrisisSolution #IndianVillageStory #InspirationalStory #RuralDevelopmentIndia #TreePlantation #EcoFriendlyVillage #KathaOrg #EducationalStoryForKids #WaterSavingTips #TALRadio  #TouchALifeFoundation

  6. 848

    పీరియడ్ ప్రాబ్లమ్స్ కి Cycle Syncing తో చెక్! | Special Interview

    ఆడవాళ్లలో మూడ్ స్వింగ్స్, ఎనర్జీ లెవెల్స్ తగ్గటం, క్రేవింగ్స్ వీటన్నిటి వెనక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో తెలుసా! దీనికి ప్రధాన కారణం.. మహిళల శరీరం ప్రతి నెలా హార్మోన్ల మార్పులతో కొనసాగడం. కానీ మనం చాలా సార్లు వాటిని గమనించం. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ స్థాయిల్లో వచ్చే హెచ్చుతగ్గుల వల్లే మూడ్ స్వింగ్స్, ఎనర్జీ లెవల్స్ తగ్గడం, ఫుడ్ క్రేవింగ్స్ వంటివి జరుగుతుంటాయి. ఈ మార్పులను సరిగ్గా అర్థం చేసుకుని, మన డైట్, వర్కౌట్, లైఫ్‌స్టైల్‌ను వాటికి అనుగుణంగా మలుచుకోవడం చాలా ముఖ్యం.దీని కోసమే 'సైకిల్ సింకింగ్' అనే పద్ధతిని పాటించాలి అంటున్నారు.. ప్రముఖ గైనకాలజిస్ట్ డా. అనూష గారు. అసలు ఈ సైకిల్ సింకింగ్ అంటే ఏంటి? దాన్ని ఎలా పాటించాలి? పిరియడ్ ప్రాబ్లమ్స్ ను తగ్గించడం లో ఈ సూత్రం ఎలా పని చేస్తుంది? వంటి ఎన్నో విషయాలు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు.. తప్పకుండా వినండి.. అస్సలు మిస్ అవ్వకండి!Do you know the real secret behind mood swings, low energy levels, and cravings in women?The main reason is the natural hormonal changes that happen in a woman’s body every month. Many times, we don’t really notice or understand these changes. Fluctuations in estrogen and progesterone levels are what lead to mood swings, tiredness, and sudden food cravings.Understanding these changes properly and adjusting our diet, workouts, and lifestyle accordingly is very important. This is where a method called “cycle syncing” comes in.In this podcast, renowned gynecologist Dr. Anusha explains what cycle syncing actually means, how to follow it in daily life, and how it can help in reducing period-related issues.Don’t miss this insightful conversation—listen till the end!Guest: Dr. Anusha EmaniHost: Kalyani#TALRadioTelugu #CycleSyncing #WomenHealth #HormoneBalance #MoodSwings #PeriodHealth #MenstrualHealth #WomensWellness #DrAnusha #Gynaecologist #PodcastClip #HealthAwareness #EnergyLevels #CravingsControl #TALRadio #TouchALifeFoundation

  7. 847

    Inflammation అంటే ఏంటి ? ఆయుర్వేద సలహాలు | ఆయుర్వేదం ఆరోగ్యం - 99

    Inflammation ఈ మధ్యకాలంలో చాలామంది దగ్గర వింటున్న మాట .. ఇది కేవలం ఏదైనా దెబ్బ తగిలినప్పుడు వచ్చే చిన్న వాపు మాత్రమే అనుకుంటే తప్పే ..   ఆ టైంలో మనకు తెలియకుండానే మన శరీరం లోపల కణాల స్థాయిలో మంట పెరుగుతుంటుంది. దీనినే డాక్టర్లు 'సైలెంట్ కిల్లర్' అంటారు!మరి దీనికి ఆయుర్వేదంలో పరిష్కారం ఉందా? అంటే.. ఖచ్చితంగా ఉందనే అంటున్నారు అనుపమ గారు! ఈ ఎపిసోడ్ లో అసలు  Inflammationఅంటే ఏంటి ? దానికి కారణాలేంటి ?అలాగే  ఆయుర్వేదం చెప్పే 'హోలిస్టిక్ లైఫ్‌స్టైల్' తో దీనిని ఎలా అదుపు చేయవచ్చో.. మన రోజువారీ అలవాట్లలో ఎలాంటి మార్పులు చేసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుందో డా. అనుపమ ఉప్పులూరి గారు  చాలా వివరంగా వివరించారు.కాబట్టి.. తప్పకుండా వినండి.. అస్సలు మిస్ అవ్వకండి!“Inflammation” is a term we hear a lot these days. But it’s not just a small swelling that happens when you get hurt. Without us even realizing it, inflammation can slowly increase inside our body at the cellular level. That’s why doctors often call it a “silent killer.”So, is there a solution for this in Ayurveda? Yes—definitely, says Dr. Anupama Uppuluri.In this episode, she clearly explains:What exactly inflammation is, what causes it, and how it can be managed through a holistic Ayurvedic lifestyle.She also shares simple changes we can make in our daily habits to stay healthy.So, don’t miss it—make sure you listen!Host: Renu SreeGuest: Dr. Anupama UppuluriDr. Anupama Contact Details:Mobile / WhatsApp: 9100052961#TALRadioTelugu #Inflammation #SilentKiller #AyurvedaHealing #HolisticHealth #HealthyLifestyle #DrAnupama #WellnessTips #DailyHabits #MindBodyBalance #PreventiveCare #StayHealthy #WellnessJourney #TALRadio #TouchALifeFoundation

  8. 846

    "ఆంధ్రా ప్యారిస్ మా ఊరే!" - Sreeram Patibandla | Part -2 | Maa Ooru - 70

    ఆంధ్రా ప్యారీస్ మా ఊరే… అంటూ శ్రీరామ్ పాటిబండ్ల గారు వారి ఊరి విశేషాలను మొదటి ఎపిసోడ్‌లో మనతో పంచుకున్నారు కదా.. ఈ రెండో ఎపిసోడ్‌లో తన అమెరికా జీవితం గురించి, అక్కడ సెటిల్ అయిన విషయాల గురించి ఎన్నో ఆసక్తికరమైన కబుర్లను మనతో పంచుకున్నారు!ఒక సాధారణ పల్లెటూరి వ్యక్తి, అమెరికాలో అజూర్ హార్డ్‌వేర్ క్వాలిటీ ఇంజనీర్‌గా ఎలా సెటిల్ అయ్యారు? అక్కడ ఎదురైన సవాళ్లు ఏంటి? మన మూలాలను మర్చిపోకుండా, చుట్టూ ఉన్న వారికి కూడా తెలుగు వారి సంస్కృతిని ఎలా పరిచయం చేస్తున్నారు? ఇలాంటి ఎన్నో స్ఫూర్తిదాయకమైన విషయాలతో పాటు, ఆయన ప్రొఫెషనల్ లైఫ్ విశేషాలను కూడా ఈ ఎపిసోడ్‌లో మనతో పంచుకున్నారు.మరింకెందుకు ఆలస్యం? వినేయండి ఆ ముచ్చట్లను!In the first episode, Sriram Patibandla shared stories about his hometown, saying “Andhra Paris is my village.”In this second episode, he talks about his life in the United States and how he settled there, sharing many interesting experiences.How did a simple village boy become an Azure Hardware Quality Engineer in the US? What challenges did he face? And how is he keeping his roots alive while also introducing Telugu culture to people around him?Along with these inspiring stories, he also shares insights from his professional life.So why wait? Listen to this engaging conversation now!Guest: Sriram PatibandlaHost: Usha#TALRadioTelugu #SriramPatibandla #TeluguNRI #LifeInUSA #IndianInAmerica #SuccessStory #VillageToUSA #InspiringJourney #TeluguPodcast #NRILife #AzureEngineer #TechCareer #InterviewSeries #Inspiration #SoftwareEngineer #USLife #TeluguInterview #ProfessionalJourney  #TALRadio #TouchALifeFoundation

  9. 845

    గిరిజనుల కలలకి రెక్కలందిస్తున్న Butterfly Charitable Trust | Special Interview

    "ఒక రెండేళ్ల గిరిజన పాప మొదటి సారి లైట్ ని చూసినప్పుడు తన కళ్ళలో చూసిన సంతోషం నా జీవితానికి చాలు అనిపించింది"పూలవాగు కొమ్మ అనే గిరిజన గ్రామంలో మొదటిసారిగా సోలార్ విద్యుత్ ని అందించినపుడు కలిగిన ఈ అనుభవాన్ని చెప్తూ "Butterfly charitable trust " ఫౌండర్ నీలేష్ గారు చెప్పిన మాటలివి..కనీస విద్యుత్ సౌకర్యం లేని మారుమూల గిరిజన గ్రామాలను గుర్తించి, సోలార్ పవర్ గ్రిడ్ల ద్వారా వెలుగులు నింపుతోంది ఈ సంస్థ.ఇప్పటివరకు వందలాది గ్రామాల్లో సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేయడమే కాకుండా, కరెంట్ లేక చదువుకోలేకపోతున్న ఎంతో మంది పిల్లల జీవితాలకు ఆసరాగా నిలుస్తుంది. మారుమూల ప్రాంతాల్లో సొంతంగా స్కూళ్లను ఏర్పాటు చేసి, పాఠాలు చెప్తూ.. మొబైల్ మెడికల్ యూనిట్ల ద్వారా ఉచిత వైద్య సేవలను ప్రజల వద్దకే చేరుస్తూ.. నిస్వార్థంగా సమాజ సేవ చేస్తూ, వేలాది గిరిజన కుటుంబాల లైఫ్ స్టైల్ ను బాగు చేస్తోంది.మరి ఇంకా ఈ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు ఏంటి? ఎంత మంది గిరిజన కుటుంబాలకు వీరు ఆసరాగా నిలుస్తున్నారు? ఇలాంటి ఎన్నో విషయాలను ఆ ట్రస్ట్ ఫౌండర్ నీలేష్ గారు ఈ ఇంటర్వ్యూలో మనతో పంచుకున్నారు… వినండి తప్పకుండా! మిస్ అవ్వకండి!“When a two-year-old tribal child saw electric light for the first time, the happiness in her eyes felt like everything to me.”These are the words of Neelesh, founder of Butterfly Charitable Trust, describing his experience when they first brought solar power to a remote tribal village called Poolavagu Komma.The organization identifies tribal villages that have no access to electricity and brings light into their lives through solar power grids.So far, they have installed solar systems in hundreds of villages. They are also supporting children who struggle to study without electricity. Beyond this, they set up schools in remote areas, provide education, and run mobile medical units to deliver free healthcare services directly to people.Through their selfless efforts, they are improving the lifestyle of thousands of tribal families.What more is this organization doing? How many families are they supporting?Listen to this interview with founder Neelesh to know more… Don’t miss it!Guest: NeeleshHost: Kalyani#TALRadioTelugu #ButterflyCharitableTrust #SolarForVillages #RuralDevelopment #TribalDevelopment #SolarEnergy #SustainableLiving #NGOIndia #SocialImpact #InspiringStories #TALRadio #TouchALifeFoundation

  10. 844

    ఐనూ దారి కనిపెట్టింది | Super Girls Series - 3

    పిల్లల కోసం రేడియో కథలు!బారీసుకు గ్రామానికి కొత్త రోడ్డు వచ్చిందని ఆ ఊరి ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు. కానీ, ఒకరోజు ఆ ఊరికి వచ్చిన వరదల వల్ల ప్రజలంతా చాలా భయపడ్డారు.. ఐనూ మాత్రం ఆ వరదల నుండి ప్రజలందరినీ కాపాడాలని ఎన్నో రకాలుగా ఆలోచిస్తుంది…తర్వాత ఏం జరిగిందో, ఐనూ అసలు ఆ ఊరిని ఎలా కాపాడిందో మీకు కూడా తెలుసుకోవాలని ఉంది కదా! అయితే ఇంకెందుకు ఆలస్యం? కథ మొత్తం వినండి!Katha.org తో కలిసి TALRadio అందిస్తున్న “SuperGirls Series” లో మూడో కథ ఇది! ప్రతి శుక్రవారం ఉదయం 7:30 నిమిషాలకు… తిరిగి సాయంత్రం 7:30 నిమిషాలకు… మన TALRadioలో…!మీరూ వినండి… మీ పిల్లలకూ వినిపించండి!Radio Stories for Kids!The people of Barisu village were very happy when a new road was built in their village. But one day, heavy floods hit the village, and everyone became very scared. At that time, Ainu starts thinking of different ways to save the people from the floods…What happens next? How does Ainu save the village? Curious to know? Then don’t wait—listen to the full story!This is the third story from the “SuperGirls Series” presented by TALRadio in collaboration with Katha.org.Tune in every Friday at 7:30 AM and again at 7:30 PM on TALRadio!Listen to yourself… and share it with your kids too!#TALRadioTelugu #KidsStories #RadioStories #StoryTime #SuperGirlsSeries #TALRadio #KathaOrg #ChildrenStories #MoralStories #KidsLearning #StoryForKids #AudioStories #Parenting #KidsEntertainment #Storytelling #FamilyTime #TALRadio #TouchALifeFoundation

  11. 843

    సమస్య ఏదైనా "చేయూత" అందిస్తాం - Ravi Kumar | Special Interview

    ఆకలి, పేదరికం, ఒంటరితనం, అవిద్య.. ఇలా సమస్య ఏదైనా సరే, ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడి 'నేనున్నాను' అని ధైర్యం చెప్తోంది… చేయూత స్వచ్చంధ సంస్థ!అనాథ పిల్లల ముఖాల్లో వెలుగులు నింపుతూ, యువతను నిరాశ నిస్పృహల నుండి బయటపడేసి వారిలో ధైర్యం, నైతిక విలువలను పెంచుతోంది ఈ సంస్థ. మనుషుల మధ్య సంబంధాలు తగ్గిపోతున్న ఈ రోజుల్లో, ఎదుటివారికి చేయూతనివ్వడం వెనుక ఉన్న ఆ తృప్తి ఏంటి? సామాజిక సేవలో యువత పాత్ర ఎలా ఉండాలి? ఇలాంటి ఎన్నో స్ఫూర్తిదాయక విషయాలను చేయూత ఫౌండర్ రవి కుమార్ గారు ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో మనతో పంచుకున్నారు.మనుషుల్లోని మంచితనాన్ని, మానవత్వాన్ని తట్టిలేపే ఈ ఇంటర్వ్యూని ప్రతి ఒక్కరూ తప్పకుండా వినండి.. అస్సలు మిస్ అవ్వకండి!Hunger, poverty, loneliness, illiteracy—no matter the struggle, Cheyutha is standing strong beside those in need, saying “We are here for you.”By bringing smiles to the faces of orphaned children and helping youth overcome despair, the organization is nurturing confidence and strong moral values. In a time when human connections are fading, what is the true joy behind helping others? What role should youth play in social service?In this special interview, Cheyutha founder Ravi Kumar shares many such inspiring insights. Don’t miss this powerful conversation that awakens humanity and goodness within us all.Guest: Ravi KumarHost: Kalani#TALRadioTelugu #Cheyutha #SocialService #HumanityFirst #StudentSupport #SocialImpact #ChangeMakers #MotivationTelugu #LifeSkills #PositiveVibes

  12. 842

    స్ట్రీట్ నుండి స్పాట్ లైట్ వరకు... డ్యాన్స్ తో మారిన తలరాతలు!

    డ్యాన్స్‌తో పేదరికాన్ని జయించొచ్చని మీకు తెలుసా?స్లమ్ ఏరియాల్లో ఉండే పిల్లలచే డ్యాన్స్ స్టెప్స్ వేయిస్తూ వారి భవిష్యత్తును మారుస్తున్నారు వినయ్ శర్మ! 2016లో ఢిల్లీలో ఆయన మొదలుపెట్టిన “Dance Out of Poverty” కేవలం ఒక డ్యాన్స్ క్లాస్ గా మాత్రమే కాకుండా, వేలాది మంది పిల్లల ఆత్మవిశ్వాసానికి ఒక కేరాఫ్ అడ్రస్ గా మారింది.చదువుతో పాటు ఆర్ట్ (Art) కూడా మనిషిని ఎలా ప్రభావితం చేస్తుంది? డ్యాన్స్ అనేది ఒక పేద పిల్లాడి లైఫ్ స్టైల్‌ని, మైండ్‌సెట్‌ని ఎలా రీసెట్ చేస్తుంది? వంటి విషయాలతో పాటు.. భయం నుంచి ధైర్యం వైపు, స్లమ్స్ నుంచి స్టేజ్ పర్ఫార్మెన్స్ వరకు సాగిన ఈ అమేజింగ్ జర్నీ గురించి మనం తప్పకుండా తెలుకోవాలి! అందుకే ఈ పాడ్కాస్ట్!పేదరికం అనేది టాలెంట్‌కి అడ్డుకాదని, సరైన స్కిల్ ఉంటే ఎవరైనా సూపర్ స్టార్స్ అవ్వొచ్చని నిరూపిస్తున్న ఈ రియల్ స్టోరీని అస్సలు మిస్ అవ్వకండి! ఇప్పుడే వినేయండి!Did you know that dance can help overcome poverty?Vinay Sharma is transforming the future of children living in slum areas by teaching them dance! What he started in 2016 as “Dance Out of Poverty” is not just a dance class anymore—it has become a beacon of confidence for thousands of children.How does art, along with education, shape a person’s life? How can dance reset the lifestyle and mindset of an underprivileged child? From fear to confidence, from slums to stage performances—this is an inspiring journey you don’t want to miss.This podcast dives into a real story that proves poverty is not a barrier to talent. With the right skills, anyone can become a star. Don’t miss it—listen now!Host: Geetha#TALRadioTelugu #WorldDanceDay #danceoutofpoverty #vinaysharma #danceforchange #artforsocialimpact #underprivilegedchildren #slumkidstalent #danceinspiration #skilldevelopment #confidencebuilding #inspiringstories #reallifetransformation #danceeducation #socialimpactindia #TALRadio #TouchALifeFoundation

  13. 841

    "మన బిడ్డ బాగుండాలంటే సమాజంలో ఉన్న ప్రతి బిడ్డ బాగుండాలి" - Chandana Maripalli

    మన పిల్లలు సంతోషంగా ఉండాలంటే… మన చుట్టూ ఉన్న అందరు పిల్లలు కూడా సంతోషంగా ఉండాలి అంటూ.. బాలల హక్కుల కోసం, తన జీవితాన్నే అంకితం చేశారు చందన మరిపల్లి గారు! ఒక పిల్లాడి రక్షణ వెనుక ఉండే సామాజిక బాధ్యతను ఎన్నో విధాలుగా వీరు సమాజంలోకి తీసుకెళ్తున్నారు. అసలు పిల్లల రక్షణ పరంగా సమాజంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి? ఇప్పుడిప్పుడు వస్తున్న కొత్త సమస్యలేంటి? వాటికి పరిష్కారాలేంటి? ఇలాంటి ఎన్నో విషయాలతో పాటు.. జువైనల్ జస్టిస్ కమిటీ మెంబర్‌గా ఆమె చూసిన ఎన్నో సంఘటనలను గురించి ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు!మరి మీరు కూడా మీ పిల్లల రక్షణ గురించి, వారి హక్కుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోడానికి ఆమె మాటల్లోనే వినండి! అస్సలు మిస్ అవ్వకండి!If our children are to be truly happy, then every child around us must also be happy — with this powerful belief, Chandana Maripalli has dedicated her life to protecting children's rights.She has been actively creating awareness in society about the shared responsibility behind every child’s safety and well-being.What are the major challenges society faces today when it comes to child protection? What new issues are emerging in recent times? And most importantly, what are the possible solutions?Along with these important topics, she also shares many real-life experiences from her role as a member of the Juvenile Justice Committee in this podcast.So, if you want to better understand your children’s safety, their rights, and how you can play a role in protecting them — listen to her words directly. Don’t miss it!Guest: Chandana MaripalliHost: Rama Iragavarapu#TALRadioTelugu #ChildRights #ChildProtection #SafeChildhood #ParentingTips #JuvenileJustice #SocialResponsibility #ChildSafety #ParentingAwareness #ChildWelfare #KidsSafety #SocialAwareness #ChildrenWellbeing #ParentingGuidance #AwarenessTalk #KidsFuture #TALRadio #TouchALifeFoundation

  14. 840

    "ఆంధ్రా ప్యారిస్ మా ఊరే" - Sriram Patibandla | మా ఊరు - 69

    మనం ఎన్ని దేశాలు తిరిగినా, ఎంతటి ఉన్నత పదవుల్లో ఉన్నా.. మన ఊరి మట్టి వాసన ఇచ్చే సంతృప్తి మరెక్కడా దొరకదు కదా!సియాటెల్ లో ఉంటున్న శ్రీరామ్ పాటిబండ్ల గారు, తన సొంత ఊరు తెనాలిని ' ప్యారిస్'గా పిలుస్తారని ఎంతో గర్వంగా చెప్తూ, అలా ఎందుకు పిలుస్తారో కారణాలు కూడా మనతో పంచుకున్నారు. ఇంకా, వాళ్ళ ఊరి సంస్కృతి గురించి, చిన్ననాటి జ్ఞాపకాల గురించి, తన మూలాల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఒక సాధారణ పల్లెటూరి వ్యక్తి అమెరికాలోని అజూర్ హార్డ్‌వేర్ క్వాలిటీ ఇంజనీర్‌గా ఎదిగిన తీరు, ఆ ప్రయాణంలో అతనికి తన ఊరు నేర్పిన పాఠాలు మనందరికీ ఇన్స్పిరేషన్!మరింకెందుకు ఆలస్యం ఈ ఎమోషనల్ జర్నీని అస్సలు మిస్ అవ్వకండి… తప్పకుండా వినండి!No matter how many countries we travel to or how high we rise in our careers, nothing matches the satisfaction of the smell of our hometown soil, right?Sriram Patibandla, who is currently living in Seattle, proudly says that his hometown Tenali is called the ‘Andhra Paris.’ He also shares the reasons behind this name. Along with that, he talks about his village culture, his childhood memories, and his strong connection to his roots.His journey from a simple village background to becoming an Azure Hardware Quality Engineer in the USA is truly inspiring. The values and lessons he learned from his hometown played a big role in shaping his success.So why wait? Don’t miss this emotional journey… do give it a listen!Guest: Sriram PatibandlaHost: Usha#TALRadioTelugu #MaaOoru #Tenali #AndhraParis #TeluguPride #HometownLove #RootsAndIdentity #VillageMemories #EmotionalJourney

  15. 839

    మఖీలాల్ అనే ఒక ఈగ కథ! | Super Girls Series - 2

    పిల్లల కోసం రేడియో కథలు!అనగనగా… మక్కీపురి అనే ఒక ఊరు! ఆ ఊర్లో మక్కీలాల్ అనే ఈగను దైవంగా పూజించేవారు. కానీ.. ఆ ఊర్లోకి వచ్చిన ఒక యువ డాక్టర్ కు మాత్రం ఈ పద్ధతి నచ్చక ఆ ఈగలన్నింటినీ తరిమేయాలని అనుకున్నాడు! అప్పుడు, ఆ ఊరి ప్రజలు మాత్రం వాటి శాపానికి గురౌతామేమో అని చాలా భయపడ్డారు…! తర్వాత ఏం జరిగిందో తెలుసా? తెలుసుకోడానికి TALRadio వినండి!Katha.org తో కలిసి TALRadio అందిస్తున్న “SuperGirls Series” లో రెండో కథ ఇది! ప్రతి శుక్రవారం ఉదయం 7:30 నిమిషాలకు… తిరిగి సాయంత్రం 7:30 నిమిషాలకు… మన TALRadioలో…!మీరూ వినండి… మీ పిల్లలకూ వినిపించండి!Radio stories for kids!Once upon a time, there was a village called Makkipuri. The people there worshipped a fly named Makkilal as their god. But when a young doctor came to the village, he didn’t like this practice and decided to drive all the flies away. The villagers, however, were very scared, thinking they might face a curse if they did that…!What happened next?To find out, listen to TALRadio!This is the second story from the “SuperGirls Series” presented by TALRadio in collaboration with Katha.org.Every Friday at 7:30 AM and again at 7:30 PM on TALRadio.Listen and share it with your kids too!#TeluguStories #RadioStories #StoryForKids #MoralStories #TeluguKids #StoryTime

  16. 838

    మనసు ఫౌండేషన్ తో అక్షరం పదిలం.. మూడు కోట్ల పేజీల డిజిటలైజేషన్ | Special Interview

    పుస్తకం ఇస్తే ఫ్రీగా డిజిటలైజ్ చేసి, సాఫ్ట్ కాపీ ఇస్తారట వీళ్ళు!సాధారణంగా ఎవరైనా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గుడులు కట్టించడమో.. అన్నదానాలు చేయడమో చేస్తుంటారు, కానీ అక్షరానికి ఆయుష్షు పోస్తూ, జ్ఞానాన్ని భద్రపరిచే ఒక వేదికను నిర్మిస్తున్న వీరి గురించి మీకు తెలుసా? అవును.. గత రెండు దశాబ్దాలుగా 'మనసు ఫౌండేషన్' వారు సుమారు 3 కోట్లకు పైగా అరుదైన పేజీలను డిజిటలైజ్ చేసి తెలుగు సాహిత్య సంపదను కాపాడుతున్నారు.పల్లెటూరి యువతకు ట్రైనింగ్ ఇచ్చి మరీ ఈ డిజిటల్ యజ్ఞం చేస్తుండటం, శాసనాల కోసం సొంతంగా మిషన్లు తయారు చేసి, వాటి కాపీలను భద్రపరచడం విశేషం. ముఖ్యంగా మన దగ్గర ఏదైనా అరుదైన పుస్తకం ఉంటే దాన్ని ఫ్రీగా స్కాన్ చేసి, మన పుస్తకంతో పాటు ఒక సాఫ్ట్ కాపీని కూడా తిరిగి ఇస్తారు. ఇంకా.. ఆ సంస్థ గురించి, వారు చేస్తున్న పనుల గురించి ఎన్నో విషయాలు ఫౌండర్ మన్నం వెంకటరాయుడు గారు ఈ ఇంటర్వ్యూలో మనతో పంచుకుంటున్నారు! వినండి… అస్సలు మిస్ అవ్వకండి!If you give them a book, they will digitize it for free and give you a soft copy too!Usually, people build temples or organize charity events in memory of their parents. But these people are doing something unique—they are preserving knowledge and giving life to letters.For the past two decades, Manasu Foundation has digitized over 3 crore rare pages, helping protect valuable Telugu literature.What’s even more inspiring is that they train rural youth for this work, create their own machines to scan ancient inscriptions, and carefully preserve digital copies.Most importantly, if you have any rare book, they will scan it for free and return both your original book and a digital copy.In this interview, founder Mannam Venkatarayudu shares many interesting insights about their journey and work. Don’t miss it!MaNaSu Foundation Website Link: https://www.manasufoundation.com/Guest: Mannam VenkatarayuduHost: Kalyani#TALRadioTelugu #DigitalLibrary #TeluguLiterature #BookDigitization #PreserveKnowledge #ManasuFoundation #IndianHeritage #SaveBooks #KnowledgeSharing #DigitalArchive #RareBooks #CulturalPreservation #TeluguCulture #FreeService #EducationForAll #RuralEmpowerment #InspiringStories #TALRadio #TouchALifeFoundation

  17. 837

    లివర్ సమస్యలా? ఆయుర్వేద పరిష్కారాలు ఇవే ! | ఆయుర్వేదం ఆరోగ్యం - 98

    లివర్ ఆరోగ్యంగా ఉంటేనే.. మన ఆరోగ్యం బాగుంటుంది! కానీ ఈ రోజుల్లో మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల వల్ల చాలామంది లివర్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.అసలు లివర్ ని ఆరోగ్యంగా గా ఉంచుకోవడం ఎలా? ఆయుర్వేదంలో దీనికి ఉన్న పరిష్కారాలేంటి? అందుకు మనం తీసుకోవాల్సిన ఆహారం ఏంటి? ఇలాంటి ఎన్నో విషయాల గురించి డా. అనుపమ ఉప్పులూరి గారు ఈ పాడ్కాస్ట్ లో చాలా క్లియర్ గా వివరించారు.తప్పకుండా వినండి.. అస్సలు మిస్ అవ్వకండి!A healthy liver is very important for our overall health. But nowadays, due to changing food habits, many people are facing liver problems.So, how can we keep our liver healthy? What solutions does Ayurveda offer? What kind of food should we eat?In this podcast, Dr. Anupama Uppuluri explains all these topics very clearly.Do listen to it… don’t miss it!Host: Renu SreeGuest: Dr. Anupama UppuluriDr. Anupama Contact Details:Mobile / WhatsApp: 9100052961#TALRadioTelugu #LiverHealth #HealthyLife #Ayurveda #NaturalHealing #HealthTips #HealthyEating #Wellness #LiverCare #AyurvedicTips

  18. 836

    "ఏ దేశమేగినా .. మాతృభాష ని మరవద్దు " - Aruna Gubba | Vijeta

    అమెరికాలో డేటా బేస్ అనలిస్ట్‌గా పనిచేస్తూ, అక్కడి తెలుగు వారిని ఒక దగ్గర కలుపుతూ మన సంస్కృతిని, మన భాషను కాపాడే ప్రయత్నం చేస్తున్న అరుణ గారి స్ఫూర్తిదాయక ప్రయాణం ఈ వారం 'విజేత' కార్యక్రమంలో! వృత్తిరీత్యా టెక్నాలజీ ప్రపంచంలో ఉన్నా, తెలుగు కల్చరల్ అసోసియేషన్ కో ఆర్డినేటర్ గా ఉంటూ మన సంస్కృతిని భావి తరాలకు అందించే ప్రయత్నం చేస్తున్నారు ఈమె. అసలు ఆమె చేస్తున్న కార్యక్రమాలేంటో, ఈ భాషా సేవ వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యమేంటో తెలుసుకోవడానికి… ఈ పాడ్కాస్ట్ ను అస్సలు మిస్ అవ్వకండి! తప్పకుండా వినండి!Aruna is working as a database analyst in the United States, and at the same time, she is bringing Telugu people together and working to preserve our culture and language.This week on the “Vijetha” program, we bring you her inspiring journey!Even though she is in the technology field professionally, she is also serving as a Telugu Cultural Association coordinator, making efforts to pass our culture on to future generations.What kind of activities is she doing? What is the real intention behind her service to the Telugu language?To find out more… don’t miss this podcast. Do listen!Guest: ArunaHost: Renu Sree#TALRadioTelugu #Vijetha #ArunaJourney #VijethaProgram #TeluguPodcast #TeluguPride #TeluguCulture #TeluguLanguage #IndianDiaspora #WomenInTech #InspiringWomen #CulturalPreservation #TeluguAbroad #NRIStories #TALRadio #TouchALifeFoundation

  19. 835

    కోకిల యొక్క అద్భుతమైన కుండ | Super Girls Series - 1

    పిల్లల కోసం రేడియో కథలు…!ఒక ఊర్లో కోకిల అనే అమ్మాయి ఉండేది. ఆమె ఒకరోజు ఒక అద్భుతమైన కుండను కొన్నది… ఆ కుండ ఇంటికి వచ్చినప్పటి నుండి ఆమె జీవితమే అద్భుతంగా మారిపోయింది. మరి అసలు ఆ కుండ చేసిన మాయలేంటి? కోకిల జీవితాన్ని ఆ కుండ ఎలా మార్చింది? ఆ కుండ నుండి మనమేం నేర్చుకోవచ్చు? ఇలాంటి ఎన్నో విషయాలు ఈ కథలో మనం తెలుసుకోవచ్చు… తప్పకుండా వినండి.. వినిపించండి.. అస్సలు మిస్ అవ్వకండి!Katha.org తో కలిసి TALRadio అందిస్తున్న “SuperGirls Series” లో మొదటి కథ ఇది! ప్రతి శుక్రవారం ఉదయం 7:30 నిమిషాలకు… తిరిగి సాయంత్రం 7:30 నిమిషాలకు… మన TALRadioలో…!మీరూ వినండి… మీ పిల్లలకూ వినిపించండి!Radio Stories for Kids…!In a village, there lived a girl named Kokila. One day, she bought a magical pot… and from the moment it came home, her life changed in amazing ways!What magic did the pot have? How did it change Kokila’s life? And what can we learn from it? You’ll find all these answers in this beautiful story… so don’t miss it—listen and share it with your kids!This is the first story in the “SuperGirls Series,” brought to you by TALRadio in collaboration with Katha.org.Tune in every Friday at 7:30 AM and again at 7:30 PM, only on TALRadio.Listen… and let your kids enjoy it too!#TALRadioTelugu #Katha.org #ChildrenStories #KidsLearning #BedtimeStories #StoryForKids #AudioStories #KidsEntertainment #MoralValues #Storytelling #LearnWithStories #FunLearning #IndianStories #KidsPodcast #ParentingTips #CreativeKids #ListenAndLearn #TALRadio #TouchALifeFoundation

  20. 834

    ఇది కేవలం Walkathon మాత్రమే కాదు... పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక వేదిక! | Special Interview With Rider Josh

    ఈ రోజుల్లో పిల్లలు కేవలం పుస్తకాలు, ఫోన్లు.. అంటూ నాలుగు గోడలకే పరిమితమైపోతున్నారు.. వారిలో శారీరక దృఢత్వం, వారి లక్ష్యం పట్ల సరైన అవగాహన తగ్గిపోతున్నాయనే ఆందోళన మనందరిలోనూ పెరిగిపోతుంది!కానీ, పిల్లల భవిష్యత్తు అంటే కేవలం చదువులు, మార్కులు మాత్రమే కాదని.. క్రమశిక్షణ, ఆరోగ్యం, సరైన మార్గదర్శకత్వం ఉన్నప్పుడే వారు అద్భుతాలు సాధించగలరని నమ్ముతోంది 'రైడర్ జోష్ ఫౌండేషన్'. అందుకే, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేయడం కోసం ఒక ప్రత్యేకమైన walkathon ను నిర్వహిస్తోంది. ఆర్మీ, డిఫెన్స్, మెడికల్.. ఇలా వివిధ రంగాల నిపుణులను ఒకే దగ్గరకు చేర్చి, పిల్లల సందేహాలను తీరుస్తూ వారి కలలకు ఒక మంచి మార్గాన్ని చూపిస్తున్నారు వీళ్ళు. మార్నింగ్ టైంలో సరదాగా నడిచే ఈ walkathon, పిల్లలకు క్రమశిక్షణను, టీమ్ స్పిరిట్‌ను అందించనుంది. మరి అసలు ఈ walkathon లక్ష్యం ఏంటి? ఎందుకు నిర్వహిస్తున్నారు? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ podcast లో రైడర్ జోష్ మనతో పంచుకుంటున్నారు. తప్పకుండా వినండి.. అస్సలు మిస్ అవ్వకండి!These days, children are mostly limited to books and mobile phones, staying within four walls. Because of this, there is growing concern that their physical fitness and clarity about their goals are decreasing.But the “Rider Josh Foundation” believes that a child’s future is not just about studies and marks. With discipline, good health, and proper guidance, children can achieve great things. That’s why they are organizing a special walkathon to build confidence and encourage a healthy lifestyle among kids.Experts from fields like the army, defense, and medical sectors will come together to interact with children, answer their questions, and guide them towards their dreams. This morning walkathon is designed to be fun while also teaching discipline and team spirit.So, what is the main goal of this walkathon? Why is it being organized? Rider Josh shares many interesting insights in this Podcast. Don’t miss it!Guest: Rider JoshHost: KalyaniWalkathon date and time: 19th april 2026, morning 6amPlace: Sanjeevaiah Children's park, Hyderabadమరిన్ని వివరాలకు: https://riderjoshfoundation.org/Home/walkathon#RiderJoshFoundation #Walkathon #KidsHealth #HealthyLifestyle #ChildDevelopment #FitnessForKids

  21. 833

    "కాన్సెప్ట్ అర్ధం చేసుకోవటమే అసలైన చదువు" - Raghava, Sravani | Special Interview

    చదువు అంటే కేవలం పరీక్షల కోసం బట్టీ పట్టడం, మార్కులు సాధించడం మాత్రమే కాదు.. విద్య మనలో ఒక మంచి మార్పు తీసుకురావాలి, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వాలి. మరి మన ప్రస్తుత విద్యా విధానంలో విద్యార్థులు వాటిని నేర్చుకుంటున్నారా? అన్న ప్రశ్న నుండే ఏర్పడింది… 'Ignis careers' సంస్థ! ప్రస్తుత రోజుల్లో విద్యార్థులు కోల్పోతున్న ఆ ‘లైఫ్ స్కిల్స్’ ఏంటి? గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించి వారిని గ్లోబల్ లెవల్‌లో ఎలా సిద్ధం చేయాలి? ఇలాంటి ఎన్నో కీలక విషయాలను ఆ సంస్థకు చెందిన రాఘవ మరియు శ్రావణి గారు ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో మనతో పంచుకున్నారు.రాబోయే రోజుల్లో టెక్నాలజీ సాయంతో మరో 22 లక్షల మంది విద్యార్థులకు చేరువవ్వాలనే వారి లక్ష్యం, సామాజిక అసమానతలను తొలగించే దిశగా వారు చేస్తున్న ప్రయత్నం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. విద్యార్థుల భవిష్యత్తును మార్చే ఈ ఇంట్రెస్టింగ్ విషయాలను అస్సలు మిస్ అవ్వకండి.. తప్పకుండా వినండి!Education is not just about memorizing for exams or scoring marks. It should bring a positive change in us and give us the confidence to face future challenges. But are students really learning these skills in today’s education system?This question led to the creation of Ignis Careers. What are the important life skills that students are missing today? How can children in rural areas learn communication skills and get ready for a global level?In this special interview, Raghav and Shravani from Ignis Careers share their insights on these important topics.Their goal is to reach 2.2 million students in the coming years using technology, and their efforts to reduce social inequality are truly inspiring.Don’t miss these powerful ideas that can shape students’ futures make sure to listen!Guests: Raghava, SravaniHost: Bharath#Education #LifeSkills #SkillBasedLearning #FutureEducation #StudentDevelopment #IgnisCareers

  22. 832

    ఒక చిన్న సాయం… ప్రపంచాన్ని మార్చగలదా? - Deepak Gumaledar | Special Interview

    మీరు ఎప్పుడైనా ఎవరికైనా చిన్న సహాయం చేసి, వాళ్ళ ముఖంలో కనిపించే ఆ చిరునవ్వుని చూసి ఆనందించారా? అయితే.. ఒక్కసారి మీరు Random Act of Kindness సంస్థ గురించి తెలుసుకోవాల్సిందే!Project Vidya, Project Kreeda, Project Grooming, Project Animals… ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా ఎన్నో విషయాల్లో తమ చుట్టూ ఉన్న సమాజానికి సహాయం చేస్తూ, సమాజం పట్ల తమకున్న బాధ్యతను చాటుకుంటున్నారు. సమాజం గురించి ఆలోచిస్తూ కూర్చోవడం కంటే, ఆ సమాజాన్ని బాగుచేసే పనిలో మనం కూడా భాగమైతే ఎంత బావుంటుందో కదా! సరిగ్గా దాన్నే నిజం చేసి చూపిస్తోంది ఈ సంస్థ!మరి మీకు కూడా సమాజానికి ఏదైనా చేయాలనే తపన ఉందా? ఒకరి జీవితంలో వెలుగులు నింపాలని ఉందా? అయితే Random Act of Kindness సంస్థ డైరెక్టర్ వారి సంస్థ గురించి చెప్పిన విషయాలను తప్పకుండా వినండి అస్సలు మిస్ అవ్వకండి!Have you ever helped someone in a small way and felt truly happy seeing the smile on their face? If yes, then you should definitely know about Random Acts of Kindness! Through initiatives like Project Vidya, Project Kreeda, Project Grooming, and Project Animals, this organization is making a meaningful difference across various areas and demonstrating a strong sense of responsibility towards society. Instead of just thinking about social issues, they actively work to create positive change and inspire others to do the same. If you also have the desire to give back to society and bring light into someone’s life, then don’t miss listening to what the director of Random Acts of Kindness has to share about their journey and impact. It's truly inspiring!Guest: Deepak GumaledarHost: Adarsh#TALRadioTelugu #RandomActsOfKindness #SpreadKindness #BeTheChange #SocialImpact #VolunteerLife #MakeADifference #KindnessMatters #ChangeMakers #PositiveImpact #NGOIndia #YouthForChange #ServeSociety #InspireOthers #TALRadio #TouchALifeFoundation

  23. 831

    "చిరంజీవి గారి డాన్స్ కి వీరాభిమాని ని... " - ఉదయ్ శంకర్ | Part-2 | మా ఊరు - 68

    మ్యూజికల్ ఫ్యామిలీ నుండి వచ్చి, ప్రస్తుతం సియాటెల్‌లో స్థిరపడిన ప్రముఖ కొరియోగ్రాఫర్ ఉదయ్ శంకర్ గారు, గత వారం “మా ఊరు” పాడ్కాస్ట్ లో తన చిన్ననాటి జ్ఞాపకాలను మనతో పంచుకున్న విషయం తెలిసిందే. ఈ వారం పాడ్కాస్ట్ లో ఆయన తన కాలేజీ రోజుల గురించి, పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయిన రోజుల గురించి, అలాగే కెరీర్‌లో స్థిరపడటానికి పడిన కష్టాలను గురించి ఎన్నో విషయాలను మనతో పంచుకున్నారు.ముఖ్యంగా, తనకు ఉద్యోగం రావడానికి తన తండ్రి పడిన తపనను గుర్తు చేసుకుంటూ, తన డ్యాన్స్ స్కూల్ జర్నీ గురించి కూడా ఎన్నో విషయాలు మనతో పంచుకున్నారు. మరి  సొంత ఊరి నుండి సియాటెల్ వరకు సాగిన ఈ ఎమోషనల్ అండ్ ఇన్‌స్పిరేషనల్ జర్నీని అస్సలు మిస్ అవ్వకండి. తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉండే ఆత్మీయ బంధాన్ని గుర్తుచేసే ఈ వారం పాడ్కాస్ట్ ను తప్పకుండా వినండి!Every journey has a rhythm and for Uday Shankar, it began in a musical home and led all the way to Seattle.In this “Maa Ooru” podcast, the well-known choreographer shares beautiful memories from his childhood and takes us deeper into his life in this latest episode. He opens up about his college days, the dedication he put into preparing for competitive exams, and the struggles he faced while building a stable career.He also fondly and emotionally recalls his father’s efforts in helping him secure a job, and shares how his dream of starting a dance school slowly turned into reality.From his hometown roots to an international journey, this story is both emotional and inspiring. More than anything, it highlights the powerful bond between parents and children making it a must-listen episode!Guest: Uday ShankarHost: Usha#TALRadioTelugu #MaaOoruPodcast #UdayShankar #ChoreographerLife #InspirationalPodcast #TeluguPodcast #EmotionalStory #SuccessJourney #FromVillageToSeattle #IndianChoreographer #DanceJourney #FatherSonBond #ParentingLove #CareerStruggles #TALRadio #TouchALifeFoundation

  24. 830

    "Autism పిల్లలున్న తల్లిదండ్రులకు మేము ట్రైనింగ్ ఇస్తాము" - శారద రామ్ | Special Interview

    పిల్లలు పిలిచినా పలకకపోయినా, అందరిలో కలవడానికి ఇబ్బంది పడుతున్నా.. అది వారి మొండితనం అనుకుంటుంటాం. కానీ, ఆ చిన్న చిన్న సంకేతాలే వారి భవిష్యత్తును నిర్ణయించే ఆటిజం లక్షణాలు కావచ్చు!అభివృద్ధి చెందుతున్న ఈరోజుల్లో ప్రతి 68 మందిలో ఒకరు ఆటిజం బారిన పడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అయితే, సరైన అవగాహన లేక చాలామంది దీనిని గుర్తించలేకపోతున్నారు. ఆటిజంతో ఉన్న పిల్లలకు చిన్నప్పుడే సరైన థెరపీ ఇస్తే, వారిలో మంచి మార్పు వస్తుందని నిరూపిస్తున్నారు 'ఆరంభ్ ఫౌండేషన్' వ్యవస్థాపకులు శారద రామ్ గారు. అంతే కాకుండా ఆటిజం ఉన్న పిల్లలను ఎలా పెంచాలనే దానిపై కూడా వారి తల్లిదండ్రులకు శిక్షణ ఇవ్వడం వీరి ప్రత్యేకత!అసలు ఆటిజం లక్షణాలను ఎలా గుర్తించాలి? వారి ప్రవర్తన వెనుక ఉన్న కారణాలేంటి? ఒక తల్లిగా, ఒక మార్గదర్శిగా శారద గారు చేస్తున్న ఈ గొప్ప కృషి ఎంతో మెచ్చుకోదగింది. పిల్లల పెంపకం పట్ల, ఆటిజం పట్ల మీకున్న ఆలోచనలను మార్చే ఈ మనసును హత్తుకునే పాడ్కాస్ట్ ఇంటర్వ్యూను అస్సలు మిస్ అవ్వకండి! తప్పకుండా వినండి!Even if children don’t respond when called or find it difficult to mingle with others, we often think it’s just stubborn behavior. But these small signs could actually be early indicators of autism that may shape their future.In today’s world, statistics say that 1 in every 68 children is affected by autism. However, due to lack of awareness, many people fail to recognize it. Experts like Sharada Ram, founder of Aarambh Foundation, have shown that with the right therapy at an early age, children with autism can make significant progress. Not only that, they also train parents on how to better understand and raise children with autism.So, how can we identify the signs of autism? What are the reasons behind their behavior? As a mother and a guide, Sharada Ram’s efforts are truly inspiring. Don’t miss this heart-touching podcast interview that can change the way you think about parenting and autism. Be sure to listen!Guest: Sharada RamHost: KalyaniWebsite: https://www.aarambhautism.org/Contact details: +91 96180 76870 , +91 94406 24126#TALRadioTelugu #AarambhFoundation #AutismAwareness #AutismSupport #EarlyIntervention #ParentingTips #SpecialNeeds #AutismIndia #ChildDevelopment #InclusiveSociety #AutismTherapy #InspiringStories #PodcastInterview #ListenNow #TALRadio #TouchALifeFoundation

  25. 829

    వాతావరణ మార్పుల వల్ల వచ్చే అలర్జీలు - ఆయుర్వేద పరిష్కారాలు | ఆయుర్వేదం ఆరోగ్యం - 97

    ప్రస్తుత కాలంలో వాతావరణం లో మార్పులు జరిగినప్పుడు ముఖ్యంగా కాలం మారుతున్నప్పుడు అందరూ ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య అలర్జీస్. గాలి, నీరు, ఆహారం ఇలా రకరకాల కారణాల వల్ల అలర్జీస్ వస్తుంటాయి. అసలు అలర్జీ అంటే ఏంటి? ఎలా వస్తాయి? ఆయుర్వేదంలో వీటికి పరిష్కారాలు ఏంటి? అలాగే అలర్జీస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ అనుపమ గారు ఈ వారం మన ఆయుర్వేదం ఆరోగ్యం పాడ్కాస్ట్ లో చక్కగా వివరించారు.. సో.. మిస్ అవ్వకుండా వినండి!In today’s changing climate, especially during seasonal shifts, one of the most common problems people face is allergies. These can be caused by air, water, food, and many other factors. But what exactly are allergies? How do they occur? What solutions does Ayurveda offer? And what precautions can we take to prevent them?Renowned Ayurvedic doctor Anupama explains all these topics clearly in this week’s Ayurveda Arogya podcast. So… don’t miss it, give it a listen!Host: Renu SreeGuest: Dr. Anupama UppuluriDr. Anupama Contact Details:Mobile / WhatsApp: 9100052961#TALRadioTelugu #Allergies #SeasonalAllergies #Ayurveda #AyurvedaHealth #Arogya #HealthPodcast #AyurvedicTips #NaturalHealing #HealthyLiving #ImmunityBoost #LifestyleTips #WellnessJourney #AirAllergy #FoodAllergy #WaterAllergy #PreventAllergies #HealthAwareness #PodcastTelugu #TeluguPodcast #TALRadio #TouchALifeFoundation

  26. 828

    "నా స్కూల్ స్నేహితులు చేసిన సాయం మరిచిపోలేనిది.." - Udaya Sankar - Part 1 | మా ఊరు - 67

    సొంత ఊరు అనగానే మనకు గుర్తొచ్చేవి.. పచ్చని పొలాలు, సందడి చేసే స్కూల్ రోజులు, ప్రాణస్నేహితులతో ఆడుకున్న ఆటలు! నిజానికి చిన్ననాటి స్నేహాలు చాలా బలంగా ఉంటాయి, అవి కాలం గడిచే కొద్దీ మన మనసులో అలాగే పదిలంగా నిలిచిపోతాయి.మ్యూజికల్ ఫ్యామిలీ నుండి వచ్చి, ప్రస్తుతం సియాటెల్‌లో ఉంటున్న ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఉదయ్ శంకర్ గారు, తన ఫ్యామిలీ గురించి, వారి స్కూల్ జ్ఞాపకాలను గురించి ఈ ఎపిసోడ్‌లో మనతో పంచుకున్నారు. సంగీతంతో పెనవేసుకున్న తన బాల్యాన్ని, అప్పట్లో స్నేహితులు అందించిన మరువలేని సహకారాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన చెప్పిన ముచ్చట్లు వింటే మనందరం ఒక్కసారి మన చిన్ననాటి రోజుల్లోకి వెళ్లడం ఖాయం. కాబట్టి, ఈ ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్ ను అస్సలు మిస్ అవ్వకండి! తప్పకుండా వినండి!మీకు కూడా చిన్నప్పటి ఫ్రెండ్స్ ఎవరైనా సహాయం చేసి ఉంటే కామెంట్లో మాతో పంచుకోండి!This podcast episode features renowned dance choreographer Udaya Sankar, who shares heartfelt memories of his childhood, school days, and strong friendships. Coming from a musical family and now based in Seattle, he reflects on how those early experiences shaped his journey.Host : UshaGuest : Udaya Sankar#TALRadioTelugu #ChildhoodMemories #FriendshipForever #PodcastHighlights #InspiringStories #DanceJourney #TouchALife #TALRadio

  27. 827

    "భూమి మీద ఉండే ప్రతి ప్రాణి ముఖ్యమయినదే " -Pradeep Parakuth,Founder | Animal Warriors Conservation Society

    ప్రకృతిలో జంతువులు లేకపోతే మనుషులు జీవించడం సాధ్యం కాదు. మరి అలాంటి మూగజీవాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అందుకే… జంతువుల రక్షణ కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు.. 'Animal Warriors Conservation Society' వాళ్ళు. ఆపదలో ఉన్న జంతువులను వారు ఎలా కాపాడుతున్నారు? వారు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? అసలు ప్రతి జీవి పట్ల మనం ఎందుకు ప్రేమతో ఉండాలి? అనే ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఆ సంస్థ ఫౌండర్ ప్రదీప్ గారు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటుంన్నారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా వినండి… అస్సలు మిస్ అవ్వకండి!Animals are essential for maintaining ecological balance, and human survival depends on them. Therefore, it is our collective responsibility to protect these voiceless creatures. The Animal Warriors Conservation Society is actively working toward animal protection through various initiatives.In this podcast, the founder, Pradeep, shares how they rescue animals in distress, the challenges they face, and why it is important for humans to show compassion toward all living beings. It’s an insightful and meaningful conversation that everyone should listen to.Host : Adarsh KumarGuest : Pradeep Parakuth, Foundar Animal Warriors Conservation SocietyAWCS Helpline Number : 9697887888Website :https://www.awcsindia.org/#TALRadioTelugu #AWCS #AnimalProtection #SaveAnimals #WildlifeConservation #BeKindToAnimals #AnimalRescue #TouchALife #TALRadio

  28. 826

    చెట్లకి పునర్జన్మ ఇస్తున్న Tree Man of India | Special interview

    అభివృద్ధి పేరుతో.. ఇళ్లు కట్టుకుంటూ.. రోడ్లు వేసుకుంటూ.. అడ్డువచ్చిన చెట్లన్నింటినీ తొలగించడం గురించి మనం వింటూనే ఉంటాం!కానీ, అభివృద్ధి అంటే వినాశనం కాకూడదని.. పచ్చని చెట్లకు ప్రాణదానం చేస్తూ, వాటిని ఒక చోటు నుండి మరో చోటుకి సురక్షితంగా తరలిస్తూ (Tree Translocation) పునర్జన్మ నిస్తున్నారు… 'ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియా' గా పేరుపొందిన వటా (VATA) ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఉదయ్ కృష్ణ గారు. పెద్ద పెద్ద వృక్షాలను సైతం కాపాడి, వాటిని వేరే చోట నాటి మళ్ళీ చిగురింపజేయడం వెనుక ఉన్న ఆ అద్భుతమైన కృషిని, వారు చేస్తున్న సేవా కార్యక్రమాలను గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు. పర్యావరణం పట్ల మన బాధ్యతను గుర్తు చేసే ఈ అద్భుతమైన విషయాలను తప్పకుండా వినండి.. అస్సలు మిస్ అవ్వకండి!In the name of development, we often hear about trees being cut down to build houses and roads.But development should not mean destruction. Proving this, Uday Krishna, founder of the VATA Foundation, is giving new life to green trees by safely shifting them from one place to another through a process called Tree Translocation.He is saving even large trees and replanting them so they can grow again. In this podcast, he shares many interesting insights about this amazing work and the efforts behind it.Don’t miss this inspiring story that reminds us of our responsibility towards the environment!Guest: Uday KrishnaHost: Bharath#TALRadioTelugu #TreeManOfIndia #UdayKrishna #VATAFoundation #TreeTranslocation #SaveTrees #GoGreen #EnvironmentProtection #GreenIndia #SustainableDevelopment #EcoFriendly #TALRadio #TouchALifeFoundation

  29. 825

    "మా ఊర్లో ఫ్లెమింగో ఫెస్టివల్ చాలా గ్రాండ్ గా జరుగుతుంది" - కీర్తి లక్ష్మి | మా ఊరు - 66

    మన ఊరి పేరు వినగానే మనలో ఏదో తెలియని ఒకరకమైన ఆనందం కలుగుతుంది కదా! చిన్నప్పటి ఫ్రెండ్స్‌తో ఆడుకున్న జ్ఞాపకాలు, స్కూల్‌కి వెళ్లిన రోజులు.. ఇవన్నీ ఒక్కసారిగా గుర్తొస్తాయి.అందుకే.. ప్రస్తుతం సియాటెల్ లో ఉంటున్నా, మన సంస్కృతిని మర్చిపోకుండా అక్కడి వారికి మన 'కోలాటం' నేర్పిస్తూ తెలుగుతనాన్ని చాటుతున్నారు Isha Dance Academy కి చెందిన కీర్తి లక్ష్మీ గారు.విదేశీ పక్షుల సందడితో కళకళలాడే పులికాట్ సరస్సు అందాల గురించి, తన సొంత ఊరైన నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో జరిగే 'ఫ్లెమింగో ఫెస్టివల్' విశిష్టత గురించి ఆమె ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను వివరిస్తున్న కీర్తి లక్ష్మీ గారి మాటలు వింటుంటే ప్రతి ఒక్కరూ తమ సొంత ఊరి స్మృతుల్లోకి వెళ్లడం ఖాయం! కాబట్టి, అస్సలు మిస్ అవ్వకండి.. తప్పకుండా వినండి!Just hearing the name of our hometown brings a special kind of happiness, right? Memories of playing with childhood friends and going to school come rushing back all at once.That’s why, even while living in Seattle, Keerthi Lakshmi from Isha Dance Academy is proudly keeping our culture alive by teaching ‘Kolatam’ to people there and showcasing the beauty of Telugu traditions.In this podcast, she also shares about the beauty of Pulicat Lake, filled with vibrant migratory birds, and the uniqueness of the ‘Flamingo Festival’ celebrated in her hometown, Sullurupeta in Nellore district. Listening to her childhood memories will surely take everyone back to their own roots.So don’t miss it do listen!Guest: Keerthi LaxmiHost: Usha#TALRadioTelugu #OurHometown #TeluguCulture #Kolatam #IndianCulture #TeluguTradition #Podcast #FlamingoFestival #PulicatLake #Nellore #Sullurupeta #TeluguAbroad #IndianTraditions #CulturalHeritage #ChildhoodMemories #Nostalgia #TeluguPride #RootsAndCulture #StoriesOfIndia #TALRadio #TouchALifeFoundation

  30. 824

    "అందరికీ హెల్మెట్ ప్రాధాన్యత గురించి చెప్పటమే మా లక్ష్యం" - కిషోర్ | Special interview

    బైక్ రైడింగ్ అంటే ఒక ప్లేస్ నుండి మరో ప్లేస్ కు వెళ్లడం మాత్రమే కాదు. ఎంత జాగ్రత్తగా వెళ్తున్నామో కూడా చాలా ఇంపార్టెంట్. మరి మనం బైక్ నడుపుతున్నపుడు ఒక ప్రొఫెషనల్ రైడర్‌గా హెల్మెట్ ఎంచుకునేటప్పుడు మనం చేసే పొరపాట్లు ఏంటి? అసలైన సేఫ్టీ హెల్మెట్ అంటే ఎలా ఉండాలి? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను 'వరల్డ్ హెడ్ ఇంజూరీ అవేర్నెస్ డే' సందర్భంగా 'బైకర్స్ ఆఫ్ హైదరాబాద్' క్లబ్ కెప్టెన్ కిశోర్ గారు ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో మనతో పంచుకున్నారు. అస్సలు మిస్ అవ్వకండి.. తప్పకుండా వినండి!Bike riding is not just about going from one place to another. It’s also very important to ride safely. When we ride a bike, choosing the right helmet like a professional rider is very important. What mistakes do we usually make while selecting a helmet? What does a truly safe helmet look like?On the occasion of World Head Injury Awareness Day, Kishore, the captain of the Bikers of Hyderabad club, shares many interesting and useful insights in this special interview. Don’t miss it, do listen!Guest: KishorHost: Kalyani#TALRadioTelugu #BikeSafety #HelmetSafety #RoadSafety #HeadInjuryAwareness #SafeRiding #MotorcycleSafety #TrafficSafety #SafeDriving #FullFaceHelmet #ISIHelmet #HelmetAwareness #BikeLife #RideSafe #TwoWheelerSafety #TALRadio #TouchALifeFoundation

  31. 823

    "ఒకే రాత్రిలో నిర్మించిన పెద్ద కోనేరు మా ఊరి ప్రత్యేకత" - అనీల కామసాని | మా ఊరు - 65

    మనం ఎన్ని దేశాలు తిరిగినా, ఎంతటి స్థాయిలో ఉన్నా పుట్టి పెరిగిన ఊరు ఇచ్చే ఆత్మీయత ఎక్కడా దొరకదు. పుంగనూరు గ్రామం గురించి, అక్కడి ప్యాలెస్ లో తాను చదువుకున్న రోజుల గురించి, తన చిన్ననాటి జ్ఞాపకాలను ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అనీల కామసాని గారు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు. ఆమె బాల్య స్మృతుల గురించి, ఆమె చెప్పిన మాటలు ప్రతి ఒక్కరినీ తమ సొంత ఊరి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తాయి. తప్పకుండా చూడండి! అస్సలు మిస్ అవ్వకండి!No matter how many countries we visit or how successful we become, the warmth of the village where we were born and raised is truly special and cannot be found anywhere else.In this podcast, popular social media influencer Aneela Kamasani shares about her hometown Punganuru, the days she studied in the palace there, and many beautiful memories from her childhood.Her words and memories will surely take everyone back to the sweet moments of their own hometown. Don’t miss it… make sure to watch!Guest: Aneela KamasaniHost: Usha#TALRadioTelugu #AneelaKamasani #Punganuru #HometownMemories #ChildhoodMemories #VillageLife #TeluguPodcast #NostalgicMemories #IndianVillage #LifeStories #InspiringStories #SocialMediaInfluencer #TeluguStories #RootsAndMemories #PodcastInterview #MaaOoru #TALRadio #TouchALifeFoundation

  32. 822

    కాలేజ్ నుండి కార్పొరేట్ ప్రపంచంలోకి... ఎలా సిద్ధమవ్వాలి? | Special Interview with Key Run

    క్యాంపస్ లైఫ్‌లో ఉన్న ఎంజాయ్‌మెంట్ నుంచి కెరీర్ అనే బాధ్యతాయుతమైన ప్రయాణంలోకి అడుగుపెట్టేటప్పుడు ప్రతి విద్యార్థిలోనూ ఎన్నో సందేహాలు, భయాలు ఉండటం సహజం. మరి స్టూడెంట్ నుంచి ఒక ప్రొఫెషనల్ ఎంప్లాయీగా మారే క్రమంలో మనలో ఎలాంటి మార్పులు రావాలి? కార్పొరేట్ ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి? ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలను ప్రముఖ కెరీర్ కోచ్ మరియు మోటివేషనల్ స్పీకర్ Key Run గారు ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ లో మనతో పంచుకుంటున్నారు. అస్సలు మిస్ అవ్వకండి… తప్పకుండా వినండి!Campus life is full of fun and enjoyment. But when students step into their careers, they enter a new journey filled with responsibility. At that stage, it is natural for every student to have many doubts and fears.So, what changes should happen within us when we move from being a student to becoming a professional employee? How can we face the challenges of the corporate world?In this special interview, well-known career coach and motivational speaker Key Run shares many valuable insights on these important topics. Don’t miss it… make sure you listen!Guest: Key RunHost: Bharath#TALRadioTelugu #CareerGuidance #StudentToProfessional #CareerTips #CorporateLife #StudentMotivation #CareerCoach #ProfessionalGrowth #CareerSuccess #YouthInspiration #MotivationalTalk #FreshersGuide #CareerDevelopment #WorkplaceSuccess #TALRadio #TouchALifeFoundation

  33. 821

    మొదటి 'నెలసరి' - శారీరక మార్పులు , ఆయుర్వేద సలహాలు | ఆయుర్వేదం ఆరోగ్యం - 96

    అమ్మాయిల జీవితంలో మొదటి నెలసరి అనేది ఒక ముఖ్యమైన మలుపు. ఈ సమయంలో శరీరంలో వచ్చే మార్పులు, హార్మోన్ల ప్రభావం వల్ల కలిగే ఇబ్బందులు పిల్లలను కొంత ఆందోళనకు గురిచేయడం సహజం.అసలు ఈ దశలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆయుర్వేదం సూచించే ఆహార నియమాలు ఏంటి? ఎదుగుతున్న అమ్మాయిలకు ఈ సమయంలో తోడుగా ఉంటూ, వారిని ఆరోగ్యంగా ఎలా ఉంచాలి? వంటి ఎన్నో సందేహాలకు డా. అనుపమ ఉప్పులూరి గారు ఈ పాడ్కాస్ట్ లో చక్కని పరిష్కారాలను చూపించారు.తప్పకుండా వినండి.. అస్సలు మిస్ అవ్వకండి!A girl’s first period is an important turning point in her life. During this time, the body goes through many changes, and hormonal shifts can sometimes make young girls feel confused or worried.So, what kind of care should be taken during this stage? What foods does Ayurveda recommend? How can we support growing girls and help them stay healthy during this time?In this podcast, Dr. Anupama Uppuluri shares simple and helpful answers to many such questions.Do listen… don’t miss it!Host: Renu SreeGuest: Dr. Anupama UppuluriDr. Anupama Contact Details:Mobile / WhatsApp: 9100052961#TALRadioTelugu #FirstPeriods #GirlsPuberty #MenstrualHealth #MenstrualHygiene #PubertyEducation #TeenageHealth #AyurvedaForHealth #AyurvedicDiet #HormonalChanges #GirlsHealthAwareness #WomenHealthIndia #TALRadio #TouchALifeFoundation

  34. 820

    "తండ్రి బాటలో నాణ్యత.. తన బాటలో నాయకత్వం…" - ప్రసాద్ అంగులూరి | మా ఊరు - 64 | Part - 2

    సొంత ఊరిలో చిల్లర కొట్టు నడుపుతూ, చిన్నప్పటి ఫ్రెండ్స్ తో కలిసి అల్లరి చేసిన రోజుల నుండి అమెరికాలోని బోతెల్ సిటీకి కౌన్సిల్ మెంబర్‌గా ఎదిగిన వరకు తన ఎన్నో జ్ఞాపకాలను ప్రసాద్ అంగులూరి గారు గత వారం మనతో పంచుకున్నారు కదా! ఈ వారం తన పెళ్లి కబుర్లు, అమెరికాకు వెళ్లిన నాటి ముచ్చట్లు వంటి విషయాలను పంచుకుంటున్నారు. తప్పకుండా వినండి “మా ఊరు” పాడ్కాస్ట్ ను.. అస్సలు మిస్ అవ్వకండి!From running a small shop in his hometown and spending fun days with childhood friends to becoming a City Council Member in Bothell, USA, Prasad Anguluri shared many memorable moments with us last week.This week, he talks about his marriage story and his early experiences after moving to the United States. Don’t miss this interesting conversation in the “Maa Ooru” podcast!Guest: Prasad AnguluriHost: Usha#TALRadio #PrasadAnguluri #MaaOoruPodcast #InspiringJourney #LifeStory #IndianAbroad #BothellCity #SuccessStory #TeluguPodcast #FromVillageToGlobal #MotivationalStory #PodcastEpisode #RealLifeJourney #TALRadioTelugu #TouchALifeFoundation

  35. 819

    వీధి పిల్లలకు విద్యా వెలుగులనిస్తున్న ఇద్దరు మహిళలు | Special Interview

    చదువు మాత్రమే మన పరిస్థితులను మార్చగలదు. మన కలలను నిజం చేయగలదు.. అని బలంగా నమ్మిన సంస్థ ‘చోటు కి ఎడ్యుకేషన్’. ఒక చిన్న వీధిలో అతి తక్కువ ఖర్చుతో ఓ గుడారాన్ని ఏర్పాటు చేసుకొని ప్రారంభమైన ఈ సంస్థ, ఇప్పుడు వంద మంది దాకా నిరుపేద పిల్లలకు పాఠాలు చెప్తోంది. మరి ఆ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు ఏంటి? భవిష్యత్తులో నిరుపేద పిల్లల కోసం ఇంకా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది? వంటి ఎన్నో విషయాలను ఆ సంస్థ కో - ఫౌండర్స్ యువనేశ్వరి, మాధవి గార్లు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటుంన్నారు.. తప్పకుండా వినండి! అస్సలు మిస్ అవ్వకండి!The organization “Chotuu Ki Education” strongly believes that education can change people’s lives and help them achieve their dreams. What started as a small initiative in a simple tent on a street with very little cost has now grown into a place where nearly 100 underprivileged children are being taught. In this podcast, the co-founders Yuvaneshwari and Madhavi share about the activities their organization is doing and the future plans they have to support more poor children through education. Don’t miss listening to this inspiring conversation!Guest: Yuvaneshwari K, Madhavi SankaraHost: Bharath#TALRadioTelugu #ChotuKiEducation #EducationForAll #UnderprivilegedChildren #FreeEducation #NGOIndia #SocialImpact #InspiringStories #ChangeThroughEducation #SupportEducation #EducationMatters #CommunitySupport #PodcastStory #SocialChange #HopeThroughEducation #TALRadio #TouchALifeFoundation

  36. 818

    మోనోపాజ్ పై అవగాహన ఆయుర్వేద సలహాలు | ఆయుర్వేదం ఆరోగ్యం - 95

    మోనోపాజ్.. ఇది ప్రతి మహిళ జీవితంలో వచ్చే ఒక సహజమైన మార్పు. కానీ, ఈ సమయంలో కలిగే శారీరక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు చాలామందిని అయోమయానికి గురిచేస్తాయి. అసలు ఈ దశను ఆరోగ్యంగా, ప్రశాంతంగా దాటడం ఎలా? ఆయుర్వేదం ఈ మోనోపాజ్ గురించి ఏం చెబుతోంది? మనం తీసుకునే ఆహారం, జీవనశైలిలో చేసుకునే చిన్న చిన్న మార్పులు ఈ హార్మోన్ల మార్పుల వల్ల కలిగే ఇబ్బందులను ఎలా తగ్గిస్తాయి? వంటి ఎన్నో విలువైన విషయాలను డా. అనుపమ ఉప్పులూరి గారు ఈ పాడ్కాస్ట్ లో వివరిస్తున్నారు. తప్పకుండా వినండి.. అస్సలు మిస్ అవ్వకండి! Menopause is a natural stage in every woman’s life. But during this time, many women experience physical discomfort, emotional stress, sleep problems, and confusion due to hormonal changes. So, how can we go through this phase in a healthy and peaceful way? What does Ayurveda say about menopause? How can simple changes in our diet and lifestyle help reduce these symptoms? In this podcast, Dr. Anupama Uppuluri explains many valuable insights about managing menopause naturally and effectively. Do listen to it… don’t miss it!Host: Renu SreeGuest: Dr. Anupama UppuluriDr. Anupama Contact Details:Mobile / WhatsApp: 9100052961#TALRadioTelugu #Menopause #WomenHealth #HormoneBalance #Ayurveda #NaturalHealing #WomenWellness #MidlifeHealth #HealthyLifestyle #MenopauseSupport #EmotionalWellbeing #SleepHealth #HolisticHealth #DrAnupamaUppuluri #TALRadio #SelfCareForWomen #TALRadio #TouchALifeFoundation

  37. 817

    "తండ్రి బాటలో నాణ్యత.. తన బాటలో నాయకత్వం…" - ప్రసాద్ అంగులూరి | మా ఊరు - 63

    సొంత ఊరిలో చిల్లర కొట్టు నడుపుతూ, చిన్నప్పటి ఫ్రెండ్స్ తో కలిసి అల్లరి చేసిన రోజుల నుండి అమెరికాలోని బోతెల్ సిటీకి కౌన్సిల్ మెంబర్‌గా ఎదిగిన వరకు తన జ్ఞాపకాలను ప్రసాద్ అంగులూరి గారు ఈ వారం "మా ఊరు" పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు. తప్పకుండా వినండి.. అస్సలు మిస్ అవ్వకండి!From running a small shop in his hometown and having fun with childhood friends to becoming a City Council Member in Bothell, USA Mr. Prasad Anguluri shares his inspiring memories with us in this week’s "Maa Ooru" podcast. Don’t forget to listen… don’t miss it!Guest: Prasad AnguluriHost: Usha#TALRadioTelugu #MaaOoru #PrasadAnguluri #InspiringJourney #FromVillageToUSA #BothellCity #TeluguVoices #LifeJourney #MotivationalStory #TeluguPodcast #MustListen #TALRadio #TouchALifeFoundation

  38. 816

    "అడుగు ముందుకేస్తే సేవ చేయాలనే తపన దానికదే పెరుగుతుంది" - మహేష్ తలారి | Special Interview

    ఈ రోజుల్లో సిటీలో అడుగు తీసి అడుగు వేయడానికి కూడా ఖాళీ స్థలం దొరకదు, అటువంటిది.. పెద్ద పెద్ద నగరాల్లో అతి తక్కువ స్థలంలోనే దట్టమైన అడవులను సృష్టించడం సాధ్యమేనా? అంటే కచ్చితంగా సాధ్యమనే అంటున్నారు.. మహేష్ తలారి గారు. ఒక మొక్క అడవిగా మారే కాలాన్ని పది రెట్లు వేగవంతం చేసే 'జపనీస్ రహస్యం' గురించి, 50,000కు పైగా మొక్కలు నాటి, మన దేశీ వృక్ష జాతులతో గ్రీన్ రివల్యూషన్ ను సృష్టించడం గురించి.. ఎన్నో కబుర్లను ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు… వినండి.. అస్సలు మిస్ అవ్వకండి!These days, it’s hard to find even a small empty space in cities. In such crowded urban areas, is it really possible to create dense forests in very little land? Mahesh Talari says it is absolutely possible. In this podcast, he shares the “Japanese secret” that can speed up the growth of a single plant into a forest up to ten times faster, and talks about creating a green revolution by planting over 50,000 native trees. Listen now, don't miss it!Guest: Mahesh TalariHost: Bharath#TALRadioTelugu #UrbanForest #MiyawakiMethod #GreenRevolution #NativeTrees #Afforestation #SustainableCities #EcoPodcast #ClimateAction #GoGreen #MaheshTalari #TALRadio #TouchALifeFoundation

  39. 815

    పరుగెత్తే ప్రతి అడుగు బాలికల చదువుకి భరోసా

    బాలికలకు నాణ్యమైన విద్య, వైద్యం, ప్రోత్సాహం అందిస్తే.. సమాజంలో గొప్పగా రాణించగలరని భావించి.. వారికి అండగా నిలబడడానికి సేవా భారతి సంస్థ ప్రతి సంవత్సరం “Run For A Girl Child” ను నిర్వహిస్తుందని మనందరికీ తెలుసు. ఈ సంవత్సరం కూడా మార్చ్ 1st న గచ్చిబౌలిలో జరిగే కార్యక్రమాన్ని గురించి, సేవా భారతి తెలంగాణ స్టేట్ జాయింట్ సెక్రటరీ జయప్రద దేవి గారు, వాలంటీర్ శిరీష గారు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు..! అలాగే.. వారు బాలికల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ‘కిశోరి’ అనే కార్యక్రమాన్ని గురించి కూడా వివరిస్తున్నారు.. తప్పకుండా వినండి.. అస్సలు మిస్ అవ్వకండి! ఈ ఈవెంట్ లో మీరూ భాగస్వాములు కండి!When girls are provided with quality education, healthcare, and encouragement, they can achieve great success in society. With this belief, Seva Bharati organizes the “Run For A Girl Child” event every year to support and empower girls. This year, the event will be held on March 1st at Gachibowli. In this podcast, Seva Bharati Telangana State Joint Secretary Jayaprada Devi and volunteer Sirisha share complete details about the event and also explain the special ‘Kishori’ program conducted for the welfare of girl children. Do listen, don't miss it, and be a part of this meaningful event!Guests: Jayaprada Devi, ShireeshaHost: Bharath#TALRadioTelugu #RunForAGirlChild #SevaBharati #SupportGirlChild #KishoriProgram #EmpowerGirls #GirlChildEducation #WomenEmpowerment #SaveTheGirlChild #GachibowliEvent #SocialImpact #PodcastAlert #BeTheChange #TALRadio #TouchALifeFoundation

  40. 814

    స్క్రీన్ టైమ్ వల్ల వచ్చే దుష్ప్రభావాలు, డిజిటల్ డీటాక్స్ తో ప్రయోజనాలు | Ayurvedam - Arogyam - 94

    పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మన కళ్లు స్క్రీన్‌ లకే పరిమితమైపోతున్నాయి. దీనివల్ల కలిగే ఒత్తిడి, నిద్రలేమి మనల్ని మెల్లగా అనారోగ్యం వైపు నెట్టేస్తున్నాయి. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఈ డిజిటల్ ప్రపంచం నుండి కాస్త బ్రేక్ తీసుకుంటే.. అంటే 'డిజిటల్ డీటాక్స్' పాటిస్తే మన లైఫ్ ఎంత బాగుంటుంది? అసలు దీన్ని ఎలా మొదలుపెట్టాలి? మన రోజువారీ పనుల్లో మనం చేసుకునే చిన్న చిన్న మార్పులు మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడతాయి? వంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను డాక్టర్ అనుపమ ఉప్పులూరి గారు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు. తప్పకుండా వినండి.. అస్సలు మిస్ అవ్వకండి!From the moment we wake up in the morning until we go to bed at night, our eyes are constantly fixed on screens. The stress and sleep problems caused by this are slowly pushing us toward poor health. So, what is the solution? What happens if we take a short break from this digital world in other words, follow a “digital detox”? How can we start it? And how can small changes in our daily routine protect our health?Dr. Anupama Uppuluri shares many such interesting insights in this podcast. Do listen… don’t miss it!Host: Renu SreeGuest: Dr. Anupama UppuluriDr.Anupama Contact Details:Mobile / WhatsApp: 9100052961#TALRadioTelugu #DigitalDetox #ScreenFreeLife #HealthyHabits #StressFreeLife #MindfulLiving #TechBreak #WellnessTips #DrAnupamaUppuluri #TALRadio #HealthAwareness #LifestyleChange #MentalWellbeing #ListenNow #TALRadio #TouchALifeFoundation

  41. 813

    "పిల్లల భద్రత అందరి బాధ్యత" - పడాల సూర్యప్రసాద్ | Special Interview

    పిల్లలకు సరైన వయసు లో ,సరైన విషయాలను , సరైన విధంగా , చెప్పాలి అంటున్నారు పడాల ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పడాల సూర్య ప్రసాద్ గారు..ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని గ్రామీణ మరియు మారుమూల గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల జీవితాలను మార్చాలనే లక్ష్యంతో పని చేస్తున్న సంస్థ పడాల ఛారిటబుల్ ట్రస్ట్ .. ఇవాళ మన టాల్ రేడియో లో పడాల సూర్య ప్రసాద్ గారు పిల్లల భద్రత గురించి , వారికి వారి శరీరం గురించి, సమాజం గురించి తెలిజేయాల్సిన విషయాలు.. అలాగే పిల్లల భద్రత కోసం వారి సంస్థ చేస్తున్న అవగాహన కార్యక్రమాల గురించి ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు .. మిస్ కాకుండా వినండి ...Children should be taught the right things at the right age and in the right way, says Padala Surya Prasad, founder of Padala Charitable Trust.Padala Charitable Trust is working with the goal of improving the lives of students in government schools, especially in rural and remote villages of Andhra Pradesh and Telangana.Today on TALRadio, Padala Surya Prasad shares important insights about child safety, how children should be educated about their bodies, and how they should understand society. He also talks about the awareness programs his organization is conducting to protect children.Don’t miss this podcast.Guest: Padala Surya PrasadHost: Bharath#TALRadioTelugu #PadalaSuryaPrasad #PadalaCharitableTrust #ChildSafety #ChildAwareness #ProtectChildren #RuralEducation #GovernmentSchools #AndhraPradesh #Telangana #Podcast #SocialImpact #CommunityAwareness #SafeChildhood #TALRadio #TouchALifeFoundation

  42. 812

    Holistic Lifestyle అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత, ప్రయోజనాలు | ఆయుర్వేదం ఆరోగ్యం - 93

    మనం తినే ఆహారం, మన ఆలోచనలు, మన నిద్ర.. ఇవన్నీ కలిస్తేనే 'హోలిస్టిక్ లైఫ్‌స్టైల్'. కానీ, చాలామందికి అసలు ఈ సంపూర్ణ జీవనశైలిని ఎలా మొదలుపెట్టాలో తెలియదు. అందుకే, అసలు ఆయుర్వేదం ఈ హోలిస్టిక్ లైఫ్‌స్టైల్ గురించి ఏం చెబుతుంది? దీనివల్ల మనకి కలిగే లాభాలేంటి? రోజువారీ పనుల్లో మనం చేసుకునే చిన్న చిన్న మార్పులు మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? వంటి ఎన్నో విషయాలను డా. అనుపమ ఉప్పులూరి గారు ఈ ఎపిసోడ్‌లో వివరిస్తున్నారు… తప్పకుండా వినండి అస్సలు మిస్ అవ్వకండి!The food we eat, our thoughts, and our sleep all these together make a holistic lifestyle. But many people don’t know how to actually begin living this kind of balanced life.So, what does Ayurveda say about a holistic lifestyle? What are the benefits of following it? How can small daily changes in our routine improve our overall health?In this podcast, Dr. Anupama Uppuluri explains all these important topics in a simple and clear way. Don’t miss it make sure you listen!Host: Renu SreeGuest: Dr. Anupama UppuluriDr.Anupama Contact Details:Mobile / WhatsApp: 9100052961#TALRadio #HolisticLifestyle #AyurvedaWisdom #HealthyLiving #MindBodyBalance #WellnessJourney #DailyHabits #NaturalHealing #SleepHealth #FoodAsMedicine #MentalWellbeing #AyurvedicLife #HealthAwareness #TALRadioTelugu #TouchALifeFoundation

  43. 811

    "కొత్త టెక్నాలజీతో ఎలాంటి క్యాన్సర్ అయినా నయమవుతుంది" - డా. మల్లిక్ సింగరాజు | Special Interview

    క్యాన్సర్... ఈ పేరు వినగానే ఒక తెలియని భయం, ఆందోళన మనల్ని చుట్టుముడతాయి. కానీ సరైన సమయంలో గుర్తించి, సరైన ట్రీట్మెంట్ అందిస్తే దాన్ని ఎదుర్కోవడం పెద్ద విషయమేమీ కాదు! సమాజంలో క్యాన్సర్ పట్ల ఉన్న అపోహలను తొలగించి, అవగాహన కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.. ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ సింగరాజు గారు. ఒకవైపు సీనియర్ కన్సల్టెంట్‌గా బిజీగా ఉంటూనే, మరోవైపు 'సింగరాజు క్యాన్సర్ ఫౌండేషన్' ద్వారా వేలాది మంది పేదలకు ఉచిత స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహిస్తూ, వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. మరి ఈ 'వరల్డ్ క్యాన్సర్ డే' సందర్భంగా, క్యాన్సర్ లక్షణాలను ముందే గుర్తించడం ఎలా? అందుబాటులోకి వచ్చిన అధునాతన చికిత్సలు ఏంటి? అలాగే పేదలకు వైద్యం అందించడంలో ఫౌండేషన్ పాత్ర ఏంటి? వంటి మరెన్నో కీలక విషయాలను ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు. తప్పకుండా వినండి… అస్సలు మిస్ అవ్వకండి!Cancer often brings fear the moment we hear the word. But with early detection and timely treatment, it is no longer something we cannot fight. Dedicated to spreading awareness and clearing misconceptions, leading oncologist Dr. Singaraju continues to make a real difference beyond his clinical work. Through the Singaraju Cancer Foundation, he has been reaching thousands from underserved communities with free screening camps and access to care. This World Cancer Day, he joins our podcast to speak about early warning signs, modern treatment options, and how the foundation is helping make cancer care reachable for those who need it most. A conversation worth listening to don’t miss it.Guest: Dr. Mallik SingarajuHost: Bharath#TALRadioTelugu #WorldCancerDay #CancerAwareness #EarlyDetection #FightCancer #CancerCare #HealthAwareness #Oncology #CancerScreening #HopeAgainstCancer #SingarajuCancerFoundation #HealthcareForAll #TALRadio #TouchALifeFoundation

  44. 810

    ఆధునిక సమాజం లో ఆయుర్వేదం పై ఉన్న అపోహలు, నిజానిజాలు | ఆయుర్వేదం ఆరోగ్యం - 92

    ఆయుర్వేదం అనగానే మనం ఎన్నో విధాలుగా ఆలోచిస్తూ ఉంటాం. మన మైండ్‌లో ఎన్నో ప్రశ్నలు, మరెన్నో అపోహలు వస్తూ ఉంటాయి. అసలు ఈ మోడ్రన్ బిజీ లైఫ్‌కి ఆయుర్వేదం సెట్ అవుతుందా లేదా? అనే అంశంపై చర్చిస్తూ ఆయుర్వేదం ఉపయోగాల గురించి, ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డా. అనుపమ ఉప్పులూరి గారు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు. మిస్ అవ్వకండి.. ఇప్పుడే వినేయండి!When we hear the word Ayurveda, many questions and misconceptions come to mind, especially about whether it fits into today’s busy modern lifestyle. In this podcast, renowned Ayurveda expert Dr. Anupama Uppuloori shares her insights on how Ayurveda can be practical and beneficial even in our fast-paced lives. Don’t miss this interesting conversation, listen now!Host: Renu SreeGuest: Dr. Anupama UppuluriDr.Anupama Contact Details:Mobile / WhatsApp: 9100052961#TALRadioTelugu #Ayurveda #AyurvedaPodcast #AyurvedaForModernLife #HolisticHealth #NaturalHealing #AncientWisdom #ModernLifestyle #HealthTalk #WellnessPodcast #MindBodyHealth #DrAnupamaUppuloori #IndianHealthcare #HealthyLiving #TALRadio #TouchALifeFoundation

  45. 809

    "పర్యావరణ రక్షణే.. మానవ మనుగడకు సురక్ష" - ప్రసాద్ జాలాది | Special Interview

    పర్యావరణ పరిరక్షణ గురించి మనం రోజూ ఎన్నో మాటలు వింటూ ఉంటాం.. కానీ ప్రకృతిని కాపాడుకోవడాన్ని ఒక బాధ్యతగా తీసుకుని, మంచి భవిష్యత్తు కోసం అడుగులు వేస్తోంది సురక్ష ఫౌండేషన్. ఈ సంస్థ వ్యవస్థాపకుడు, చీఫ్ ఫెసిలిటేటర్ ప్రసాద్ జాలాది గారు, ఒక సోషల్ ఎంట్రప్రెన్యూర్‌గా ఆయన ప్రయాణం, పర్యావరణ పరిరక్షణలో తీసుకొస్తున్న మార్పులు,'సురక్ష' ద్వారా చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు. రేపటి తరం కోసం మనం చేయాల్సిన కృషిని గుర్తుచేసే ఈ విశేషాలను తప్పకుండా వినండి! అస్సలు మిస్ అవ్వకండి!We often hear many talks about protecting the environment. But Suraksha Foundation is turning these words into action and working responsibly for a better future. In this podcast, the founder and Chief Facilitator Prasad Jaladi shares his journey as a social entrepreneur, the positive changes he is bringing to environmental protection, and the various initiatives taken up through Suraksha. These insights remind us of the efforts we must make for the next generation. Do listen, don’t miss it!Host: Renu SreeGuest: Prasad Jaladi#TALRadioTelugu #SocialEntrepreneur #GreenFuture #SaveNature #SustainableLiving #ClimateAction #EcoResponsibility #ForNextGeneration #EnvironmentalAwareness #ChangeMakers #InspiringStories #TALRadio #TouchALifeFoundation

  46. 808

    "మా ఊరి గంగమ్మ జాతర ఇప్పుడు వరల్డ్ ఫేమస్" - భార్గవి రెడ్డి

    ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా వారం వారం తిరుమల కొండను ఎక్కిన ఆ అనుభూతులు, ఊరి గుడుల మధ్య గడిపిన తీపి జ్ఞాపకాలు, మనసులో నిలిచిపోయిన మరెన్నో ముచ్చట్లు... వీటన్నింటితో పాటు తిరుపతి లో అత్యంత వైభవంగా జరిగే 'తాతయ్యగుంట గంగమ్మ జాతర' విశేషాలను ఈ ‘మా ఊరు’ ఎపిసోడ్ లో మనతో పంచుకుంటున్నారు తిరుపతికి చెందిన భార్గవి రెడ్డి గారు! ఆ జాతర వెనుక ఉన్న కథ ఏంటి, అక్కడి సంప్రదాయాలు ఎలా ఉంటాయి, తన ఊరితో తనకున్న అనుబంధం ఏంటి.. వంటి ఎన్నో విషయాలను పంచుకున్న ఈ ఎపిసోడ్ ను అస్సలు మిస్ అవ్వకండి! తప్పకుండా వినండి...!In this “Ma Ooru” episode, Bhargavi Reddy garu from Tirupati shares her sweet childhood memories, her deep connection with her hometown, and the joy of climbing Tirumala with friends, while also explaining the story, traditions, and cultural importance of the grand Tataiyyagunta Gangamma Jatara celebrated in Tirupati.Guest: Bhargavi ReddyHost: Usha#TALRadioTelugu #MaOoru #Tirupati #GangammaJatara #TirupatiStories #CultureAndTradition #PodcastEpisode #LocalVoices #OurRoots #TALRadio #TouchALifeFoundation

  47. 807

    "మాట్లాడటం మొదలు పెడదాం" - అనూష భరద్వాజ్ | స్ఫూర్తి కిరణాలు

    ప్రతి అమ్మాయి తన కలలను నిజం చేసుకునే ధైర్యాన్ని, నాయకత్వ లక్షణాలను సాధించాలనే గొప్ప లక్ష్యంతో వేలాది మంది గ్రామీణ బాలికల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నారు 'VOICE 4 Girls' ఫౌండర్ అనూష గారు. గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలను అడ్డుకుంటూ, లైంగిక ఆరోగ్యం మరియు లైఫ్ స్కిల్స్‌పై అవగాహన కల్పిస్తూ వారు చేస్తున్న ఎన్నో పనుల గురించి, బాలికా సాధికారత కోసం ఆ సంస్థ సాగిస్తున్న అద్భుత ప్రయాణం గురించి ఈ నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు. రేపటి తరాన్ని ప్రభావితం చేసే ఈ విశేషాలను అస్సలు మిస్ అవ్వకండి.. తప్పకుండా వినండి!Anusha, the founder of VOICE 4 Girls, is bringing new hope into the lives of thousands of rural girls with the vision of helping every girl build confidence, leadership skills, and the courage to achieve her dreams. By preventing child marriages and creating awareness about sexual health and life skills in rural areas, her organization is making a powerful impact. On this National Girl Child Day, she shares the inspiring journey of VOICE 4 Girls and its mission for girl empowerment in this podcast. Don’t miss it, do listen.Guest: Anusha BharadvajHost: Rama Iragavarapu#TALRadioTelulgu #Voice4Girls #GirlChildDay #GirlsEmpowerment #RuralEducation #WomenLeadership #InspiringStories #SocialImpact #PodcastRecommendation #TALRadio #TouchALifeFoundation

  48. 806

    "వైకల్యం ఉన్న పిల్లలకు సానుభూతి కాదు సపోర్ట్ ఇవ్వాలి" - మాధవీలత | Special Interview

    గత 25 ఏళ్లుగా ఎంతో మంది దివ్యాంగ పిల్లలకు అమ్మగా మారి అండగా నిలుస్తూ, కొత్త జీవితాన్ని ఇస్తున్నారు ఆశాజ్యోతి డైరెక్టర్ మాధవిలత గారు. కేవలం ఆశ్రయం మాత్రమే కాకుండా, వారికి ఫిజియోథెరపీ, వొకేషనల్ ట్రైనింగ్ ఇస్తూ సమాజంలో గౌరవంగా బతికేలా ఆమె ఎంతో కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సంస్థ చేస్తున్న ఈ సేవలు, పిల్లల విజయగాథల గురించి మాధవిలత గారు ఈ పాడ్కాస్ట్ లో పంచుకుంటున్నారు. తప్పకుండా వినండి!For the past 25 years, Madhavilatha Garu, Director of Ashajyothi, has been a mother and strong support to many children with disabilities, giving them a new life. Her organization not only provides shelter, but also offers physiotherapy and vocational training, helping the children live with dignity and confidence in society. In this podcast, Madhavilatha Garu shares the inspiring work of the institution and the success stories of these children. Do listen!#TALRadioTelugu #AshaJyothi #MadhaviLatha #DivyangChildren #SpecialChildren #InclusiveSociety #DisabilitySupport #ChildCare #Physiotherapy #VocationalTraining #Empowerment #SocialService #WomenWhoInspire #LifeChangingStories #TALRadio #TouchALifeFoundation

  49. 805

    నేటి యువత ఆయుర్వేదం వైపు ఎందుకు మొగ్గు చూపుతోంది? | Ayurvedam Arogyam - 91

    ప్రస్తుత కాలంలో టెక్నాలజీ ఎంతగా పెరిగినా, దాన్ని ఆదరిస్తూనే… ఆధునిక జీవనశైలి వల్ల వచ్చే సమస్యలకు సహజ సిద్ధమైన పరిష్కారాలను వెతుక్కుంటూ యువత ఆయుర్వేదం వైపు ఆసక్తి చూపుతోంది. అసలు ఆయుర్వేదంలో యువతను అంతగా ఆకర్షిస్తున్న అంశాలు ఏమిటి? రోజూ వారి జీవితంలో ఆయుర్వేదాన్ని పాటించడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వొచ్చు? వంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ ప్రత్యేక పాడ్కాస్ట్ లో ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డా. అనుపమ ఉప్పులూరి గారు వివరిస్తున్నారు. తప్పక వినండి. అస్సలు మిస్ అవ్వకండి!Despite rapid technological growth, many young people are turning to Ayurveda to find natural ways to deal with modern lifestyle problems. In this special podcast, renowned Ayurvedic doctor Dr. Anupama Uppuluri talks about why Ayurveda appeals to today’s youth and shares easy tips to include it in daily life. It’s an informative and engaging discussion you shouldn’t miss.#TALRadioTelugu #Ayurveda #YouthAndWellness #NaturalHealing #HealthyLifestyle #PodcastRecommendation #MindBodyBalance #AncientWisdom #ModernLife #TALRadio #TouchALifeFoundation

  50. 804

    "సమస్య ఉన్న ప్రతి మహిళకి నేను తోడుంటా" - విజయలక్ష్మి | Special Interview

    ఎల్లప్పుడూ మహిళల ఆరోగ్యం కోసం, వారి సంక్షేమం కోసం ఆలోచిస్తూ.. మహిళల కోసమే జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి విజయలక్ష్మి గారు. చదువు ఒక్కటే సమాజాన్ని మార్చగలదని, సమస్యలను తీర్చగలదని నమ్మి, పెళ్లి అయినా తర్వాత LLB చదివి లాయర్ పట్టా పొందారు. ప్రస్తుతం ఉమెన్ అండ్ చైల్డ్ డెవెలప్మెంట్ డిపార్ట్మెంట్ లో వృత్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈమె.. మహిళలు వారి జీవితంలో ఎదుర్కొనే సమస్యల గురించి, వాటి పరిష్కారాల గురించి ఎన్నో విషయాలను ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు… తప్పకుండా వినండి. అస్సలు మిస్ అవ్వకండి!Ms. Vijayalakshmi has devoted her life to improving women’s health and overall well-being. She believes that education is the key to creating positive change in society. After getting married, she continued her studies, completed her LLB, and became a lawyer. She is currently serving in the Women and Child Development Department. In this podcast, she openly talks about the real-life problems women face and shares meaningful guidance and solutions. This is a must-listen podcast. Don’t miss it.#TALRadioTelugu #WomensHealth #WomenEmpowerment #EducationForChange #InspiringWomen #WomenAndChildDevelopment #SocialImpact #WomenWelfare #RealLifeHeroes #TALRadio #TouchALifeFoundation

Type above to search every episode's transcript for a word or phrase. Matches are scoped to this podcast.

Searching…

No matches for "" in this podcast's transcripts.

Showing of matches

No topics indexed yet for this podcast.

Loading reviews...

ABOUT THIS SHOW

This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope.TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio.Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond.Tune in for positivity, purpose, and the power of human stories.

HOSTED BY

Touch A Life Foundation

CATEGORIES

URL copied to clipboard!